Monday, September 17, 2012

Push - Pull - Lift


Saturday, September 15, 2012

Men - Women

ఒకావిడ రాత్రంతా ఇంటికి రాకుండా తెల్లారి వస్తుంది. భర్త రాత్రంతా ఎక్కడికెళ్ళావని అడుగుతాడు. తన ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉన్నానని చెబుతుంది. తరువాత భర్త తన భార్యకు close friends అయిన ఓ పది మందికి call చేసి ఆడుగుతాడు. ఆ పదిమంది ఆ రాత్రి తమదగ్గర లేదని చెబుతారు.

ఈసారి భర్త late వస్తాడు. భార్య అడిగితే friend దగ్గర ఉన్నానని అంటాడు. తరువాత భార్య తన భర్తకు close friends అయిన ఓ పదిమందికి phone చేస్తుంది. పదిమందిలో 5గురు రాత్రి తమవద్దనే ఉన్నాడని చెబుతారు. మిగతా ఐదుగురు ఇంకా తమతోనే ఉన్నాడని అంటారు. 
Moral: Men are the best friends

చెవినొప్పి

"చుక్కలమందు పనిచెయ్యడం లేదని మూడు రోజుల క్రితం మీ దగ్గరకు వస్తే...చుక్కలమందుకు బదులు మాత్రలు వాడమని చెప్పారు కదా...! అవి వాడాక చెవినొప్పి ఎక్కువైంది డాక్టర్...!" చెప్పాడు పేషెంట్."అలా జరగడానికి వీల్లేదే.. రోజుకు ఎన్ని మాత్రలు వాడావు...?" అడిగాడు డాక్టర్"రెండే సరే. ఈ చెవిలో ఒకటి, ఆ చెవిలో ఒకటి వేసుకున్నా" అంతే డాక్టర్...!!!

Friday, September 14, 2012

సినిమా యాడ్స్‌

టీచర్: ఏంట్రా రవీ! తలనొప్పి, రొంప, దగ్గు అని బడి ఎగ్గొట్టి సినిమాకు వెళ్ళావట?
గోపీ : అవునండీ. సినిమా యాడ్స్‌లో ఏ మందు వేసుకోవాలో చూపిస్తారని.

ఇంటి కుక్క

టీచర్: నేను నీకు రెండు కుక్కలు, మరి రెండు కుక్కలు మళ్ళీ రెండు కుక్కలు ఇచ్చాననుకో. నీ దగ్గర మొత్తం ఎన్ని కుక్కలు ఉంటాయి?
సంతోష్: ఏడు.
టీచర్: కాదు. ఇప్పుడు చెప్పు. నీకు నేను మొదట రెండు నారింజపళ్ళు, మరి రెండు నారింజపళ్ళు, మళ్ళీ రెండు నారింజపళ్ళు ఇచ్చాననుకో. మొత్తం నీ దగ్గర ఎన్ని నారింజపళ్ళుంటాయి?
సంతోష్: ఆరు!
టీచర్: గుడ్. ఇప్పుడు చెప్పు. నేను నీకు రెండు కుక్కలు, మరి రెండు కుక్కలు, ఇంకా రెండు కుక్కలు ఇచ్చాననుకో. మొత్తం నీ దగ్గర ఎన్ని కుక్కలు ఉంటాయి?
సంతోష్: ఏడు.
టీచర్: రెండేసి కుక్కలు మూడు ఒకటిగా కలిపితే ఏడెలా అవుతాయి బాబూ?
సంతోష్: ఇప్పటికే ఇంటిదగ్గర నాకు ఒక కుక్క ఉంది కదా టీచర్!

Thursday, September 13, 2012

కారు

నా కారు keys ఖచ్చితంగా కార్లోనే మర్చిపోయుంటాను. అనుమానంగా parking lot వైపుకు అడుగువేశాను. మా ఆయన  ఎప్పుడూ నన్ను కార్లో keys మరచిపోతుంటానని తిడుతూ ఉంటారు. నా లెక్క ప్రకారం కారు ఇంజన్ on లో ఉన్నప్పుడు కారెవ్వరూ దొంగిలించలేరని, కానీ మా వారి లెక్కప్రకారం అలా ఇంజన్ ఆన్ చేసినప్పుడే కారు దొంగిలించే అవకాశం ఎక్కువ అని. చివరికి మావారి లెక్కే నిజమయింది. పార్కింగ్ లాట్ ఖాళీగా ఉంది.
నేను వెంటనే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి నా అడ్రస్ చెప్పి కారు వివరాలతో కంప్లైంట్ ఇచ్చాను.
ఆఖరుగా బాధతో మా వారికి కాల్ చేశాను. "రాజేష్ ఈ! తాళాలు కార్లో మర్చిపోయాను, మన కారెవరో ఎత్తుకెళ్ళారు .!!!"
కొంచెం సేపు మౌనం , తను కాల్ కట్ చేసుంటాడనుకున్నా. కాని వెంటనే తన voice వినబడింది, " Idiot, నిన్ను drop చేసింది నేనే.
ఇప్పుడు మౌనం నా వంతయింది. ఓ నిజమా! Thank God, వచ్చి నన్ను pick-up చేసుకో...
"ఓ ఖచ్చితంగా... ఈ కారు నాదేనని ఈ పోలీస్ వాళ్ళని  convince చెయ్యగానే వచ్చేస్తాను.
Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version