ఒక బుక్ సెల్లర్ నిర్వహించిన సర్వేలో ఒక మహిళను ఇలా అడుగుతాడు.
బుక్ సెల్లర్ : మిమ్మల్ని జీవితంలో బాగా పైకి తీసుకొచ్చిన బుక్ ఏది?
మహిళ : మా వారి చెక్ బుక్.
హైదరాబాద్ బస్టాండ్ లో ఒక ముసలావిడ వైజాగ్ వెళ్ళే బస్ ఎక్కింది. ఎక్కగానే డ్రైవర్ తో 'బాబు, నేను నిద్రపోతానేమో, విజయవాడలో నన్ను లేపుతావా' అనడుగుతుంది. దానికా డ్రైవర్ సరే అంటాడు. ఆ ముసలావిడ ఆ డ్రైవర్ మాటమీద నమ్మకం లేక తోటి ప్రయాణికులకు అందరికీ కూడా చెప్తుంది. అందరూ సరే అంటారు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆ ముసలావిడ నిద్ర నుంచి లేస్తుంది. ముసలావిడ : విజయవాడ ఇంకారాలేదా బాబు? డ్రైవర్ : అయ్యయ్యో మర్చిపోయాను, విజయవాడ దాటేసి 100 km వచ్చేసాం బామ్మగారు. దానికా ముసలావిడ ఏడుపందుకుంటుంది. తోటి ప్రయాణికులు ఆమె అవస్థ చూడలేక, బస్ వెనక్కు తిప్పమని అడుగుతారు.
డ్రైవర్ బస్ వెనక్కు తిప్పి విజయవాడ తీసుకు వెళ్ళి దిగమని చెప్తాడు. అంతలో ఆ ముసలావిడ, తన బాగ్ లోనుండి రెండు మందు బిళ్ళలు తీసి నోట్లో వేసుకుని, నీళ్ళు తాగి, డ్రైవర్ తో ఇలా అంటుంది.
'ఏమీ లేదు బిడ్డా, నాకు బి.పి. ఉంది. మా మనవడు, విజయవాడ వెళ్ళగానే ఈ రెండు టాబ్లెట్స్ వేసుకోమన్నాడు. నేనూ కూడాఅ వైజాగే వెళ్ళాలి, ఇప్పుడు వైజాగ్ పోనివ్వు '
కుర్రాడు : నాన్నా, నేను పెళ్ళి చేసుకుంటాను.
తండ్రి : First, Sorry చెప్పు.
కుర్రాడు : ఎందుకు?
తండ్రి : నువ్వు Sorry చెప్పు ముందు.
కుర్రాడు : అదేంటి నేనేమీ తప్పు చెయ్యకుండా Sorry ఎందుకు చెప్పాలి?
తండ్రి : ముందు Sorry చెప్పు.
కుర్రాడు : సరే Sorry.
తండ్రి : Good. ఇప్పుడు నువ్వు పెళ్ళికి అర్హుడివి. ఎప్పుడైతే నీ తప్పు లేకుండా Sorry చెప్తావో అప్పుడు నువ్వు పెళ్ళికి సిద్దం కావచ్చన్నమాట.