భర్త:... 😒
ఎప్పుడూ వేపుడేనా పచ్చడి చేయవా
భార్య... 😠
ఇప్పుడు తినకపోతే చేసేది అదే
షాప్ కీపర్ : " ఎం కావాలి సర్ ? "
కష్టమర్ : " నాకు ఆత్మవిశ్వాసం కావాలి. ఈ ప్రపంచాన్ని ఎదుర్కోడానికి గుండెధైర్యం. ఎదురులేని జీవితానికి కావల్సినంత బలం. ఈ కౄరమైన ప్రపంచాన్ని బరించేంత సహనం, ఓర్పూ, సత్తువా కావాలి."
షాప్ కీపర్ : " అరే రామూ !! ఇతనికి ... ఒక క్వార్టర్ ఓల్డ్ మాంక్ .... ఒక వేరుసెనగ పప్పు పేకెట్ ఇవ్వూ " 😜
హతవిధీ!!
"ఏవండి మూర్తిగారు! మీ ఇంట్లో విచిత్రంగా ఎలకని చూసి, పిల్లి భయపడి పరిగెడుతున్నాది?"
"పిల్లిని నేను పెంచాను. ఎలకని మా ఆవిడి పెంచింది. అంతే!"
🤣🤣🤣🤣🤣🤣
●అంబాని: నేను ఉదయాన్నే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే నా ఎస్టేట్ సగం దాటేటప్పటికే చీకటిపడుతుంది...
●విశ్వనాథం: నాకు కూడా ఇంతకు ముందు అలాంటి పనికిమాలిన కారే ఉండేది.. అమ్మేసా..😜
ఒక ఇంటిలో పెళ్ళిచూపులవుతున్నాయి ..
అమ్మాయి తండ్రి : - మా అమ్మాయి " ఇంకా చదువుకుంటాను " అంటూంది..
పెళ్ళికొడుకు : - పర్వాలేదు చదువుకోమనండి .. మేం ఒక గంట తరువాత వస్తాం.😜😝
పెళ్లి జరిగిపోయింది..
అప్పగింతలు జరుగుతున్నాయి..
అమ్మాయిని సాగనంపుతూ అందరూ మూడీగా ఉన్న సమయంలో..
పెళ్ళికూతురు ... పెళ్ళికొడుకు చేయి విడిపించుకుని
తండ్రి దగ్గరకు వచ్చి ... కౌగలించుకుని ... ప్రేమగా ... ఒక ముద్దు పెట్టింది ...
ఆ దృశ్యాన్ని చూసినా అక్కడున్న వారందరి హృదయాలూ ... ఆర్తితో బరువెక్కాయి. కళ్లు చెమర్చాయి.
ఎమిటీ .. ఈ చిత్ర విచిత్ర భవభందాలూ అనుకునేంతలో .....
పెళ్ళికూతురు ... తండ్రి చేతిలో ఒక వస్తువు పెట్టి ...
కళ్ళు తుడుచుకుంటూ ... " ఇక దీని భాద్యత నీదే డాడీ !! దీని అవసరం ... నాకిక లేదు"
అని చెపుతూ వెనుతిరిగింది
చెమర్చిన కళ్ళతో..
ఈ దృశ్యాన్ని చూస్తున్న బంధువులు..
తండ్రికేమిచ్చిందా అని ఆసక్తిగా చూసారు..
తండ్రి కూడా కుతూహలంగా తన గుప్పెట చూసుకుని ...
మరుక్షణం ఎంతో సంతోషంగా ...
తండ్రి : " "ఇది నా జీవితంలో ఆనందకరమైన రోజు .. నా కూతురు ... వెళ్ళిపోతూ నేను మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది ... ఇరవై రెండేళ్లుగా నేను కనీసం కంటితో చూడలేకపోయిన నా వస్తువును, ఇక ఎన్నటికీ నాకు దక్కదు అనుకున్న దాన్ని ... నాకు తిరిగిచ్చేసింది."
చాలా కుతూహలంగా, ఉత్సుకతతో వింటున్నారు .... అందరూ
తండ్రి : " ఇంతకీ అదేంటో తెలుసా..! నా క్రెడిట్ కార్డు..!!"
అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు..
ఒక్క బిక్క మొహం పెళ్ళికొడుకు తప్ప ...
🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄
వెంకట్రావ్ : ఏంటి మీ ఇంట్లో అందరూ కార్టూన్ చానల్స్ మాత్రమే చూస్తున్నారు ? వేరే చానల్స్ రావా ?
సుబ్బారావు : అదేం కాదు...ఈ కార్టూన్ చానల్స్ లో మాత్రమే ఆ లలిత జ్యూయలర్స్ గుండుగాడు రాడు అందుకని !