Tuesday, August 5, 2014

రాందేవ్ గారి inspiration


Sunday, August 3, 2014

ఇంజన్

టీచర్ : ఒరేయ్ ముకుందం, ఇంజన్ ఎలా start అవుతుందో చెప్పు? 
ముకుందం : ఓ, నాకు తెలుసు టీచర్. ఇంజను తుర్ తుర్ తుర్ తుర్ .... తుర్ తుర్.. .
టీచర్ : ఒరేయ్, ఒరేయ్ ఆపు ఆపు ఆపరా
ముకుందం : తుర్ టుక్ టుక్ టుం.  

Friday, August 1, 2014

పోలిక

ఎనిమిదేళ్ళ కూతురు తన మొఖం దీనంగా పెట్టడం చూసి తల్లి ఇలా అడుగుతుంది. 

తల్లి : ఏమైందమ్మా? ఎందుకంత డల్ గా ఉన్నావు? 
కూతురు : అమ్మా నేను పిచ్చిదానిలా ఉంటానా? 
తల్లి : లేదే!
కూతురు : నా ముక్కు చింతపిక్కలా ఉంటుందా? 
తల్లి : లేదు..
కూతురు : నేను బండలా ఊరినట్టు కనిపిస్తానా ? 
తల్లి: లేదమ్మా..
కూతురు : నేను ఓదురు కప్పలా ఉంటానా? 
తల్లి : లేదే, ఇంతకీ ఎవరేమన్నారు నిన్ను? 
కూతురు : మరి అందరూ నన్ను మీ అమ్మలా ఉన్నావంటారెందుకు ? 
Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version