Friday, December 11, 2015

Secret

ఒక old man ని ఒక విలేఖరి ఇలా అడుగుతాడు. 
విలేఖరి : మీకు 70 సంవత్సరాలు, ఇంకా మీరు మీ భార్యని Darling, Honey, అని పిలుస్తున్నారంటే చాలా great. మీ Secret చెప్తారా? 
Old Man : నేను దాని పేరు మర్చిపోయా, అడగాలంటే భయమేసి అలా పిలుస్తాను. 

Thursday, December 10, 2015

పైకి తీసుకొచ్చిన బుక్

ఒక బుక్ సెల్లర్ నిర్వహించిన సర్వేలో ఒక మహిళను ఇలా అడుగుతాడు.
బుక్ సెల్లర్ : మిమ్మల్ని జీవితంలో బాగా పైకి తీసుకొచ్చిన బుక్ ఏది?
మహిళ : మా వారి చెక్ బుక్. 

Sunday, December 6, 2015

ముసలావిడ

హైదరాబాద్ బస్టాండ్ లో ఒక ముసలావిడ వైజాగ్ వెళ్ళే బస్ ఎక్కింది. ఎక్కగానే డ్రైవర్ తో 'బాబు, నేను నిద్రపోతానేమో, విజయవాడలో నన్ను లేపుతావా' అనడుగుతుంది. దానికా డ్రైవర్ సరే అంటాడు. ఆ ముసలావిడ ఆ డ్రైవర్ మాటమీద నమ్మకం లేక తోటి ప్రయాణికులకు అందరికీ కూడా చెప్తుంది. అందరూ సరే అంటారు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆ ముసలావిడ నిద్ర నుంచి లేస్తుంది. 
ముసలావిడ : విజయవాడ ఇంకారాలేదా బాబు? 
డ్రైవర్ : అయ్యయ్యో మర్చిపోయాను, విజయవాడ దాటేసి 100 km వచ్చేసాం బామ్మగారు. 
దానికా ముసలావిడ ఏడుపందుకుంటుంది. తోటి ప్రయాణికులు ఆమె అవస్థ చూడలేక, బస్ వెనక్కు తిప్పమని అడుగుతారు. 
డ్రైవర్ బస్ వెనక్కు తిప్పి విజయవాడ తీసుకు వెళ్ళి దిగమని చెప్తాడు. అంతలో ఆ ముసలావిడ, తన బాగ్ లోనుండి రెండు మందు బిళ్ళలు తీసి నోట్లో వేసుకుని, నీళ్ళు తాగి, డ్రైవర్ తో ఇలా అంటుంది. 
'ఏమీ లేదు బిడ్డా, నాకు బి.పి. ఉంది. మా మనవడు, విజయవాడ వెళ్ళగానే ఈ రెండు టాబ్లెట్స్ వేసుకోమన్నాడు. నేనూ కూడాఅ వైజాగే వెళ్ళాలి, ఇప్పుడు వైజాగ్ పోనివ్వు '   

Saturday, December 5, 2015

లవర్

వాలెంటైన్స్ డే నాడు లవర్ లేదని బాధ పడకూడదు. 
ఎయిడ్స్ డే నాడు ఎయిడ్స్ లేదని బాధ పడతామా? 

Wednesday, November 25, 2015

యాలుక్కాయల షాపు

జంభులింగం : ఒరేయ్ శంభూ, మొన్న పది కాసుల బంగారం కొన్నారా, యాలుక్కాయల షాపులొ. 
శంభులింగం : అది యాలుక్కాయల షాపు కాదురా జోయ్ అలూకాస్

Monday, September 14, 2015

Sorry

కుర్రాడు : నాన్నా, నేను పెళ్ళి చేసుకుంటాను.
తండ్రి : First, Sorry చెప్పు.
కుర్రాడు : ఎందుకు?
తండ్రి : నువ్వు Sorry చెప్పు ముందు.
కుర్రాడు : అదేంటి నేనేమీ తప్పు చెయ్యకుండా Sorry  ఎందుకు చెప్పాలి?
తండ్రి : ముందు Sorry చెప్పు.
కుర్రాడు : సరే Sorry.
తండ్రి : Good. ఇప్పుడు నువ్వు పెళ్ళికి అర్హుడివి. ఎప్పుడైతే నీ తప్పు లేకుండా Sorry చెప్తావో అప్పుడు నువ్వు పెళ్ళికి సిద్దం కావచ్చన్నమాట.   

Sunday, September 13, 2015

హాప్పీ


అబ్బి గాడు: ఈ రోడ్డు మీద బంగారం దొరికితే బాగుండు!!
సుబ్బి గాడు: ఎవరిని కొరుకుంటున్నావ్? దేవుడినేన!!
అబ్బి గాడు: అవును రా!! దొరికితే చాలా బాగుండు!
సుబ్బి గాడు: దొరికితే ఎం చేస్తావ్?
అబ్బి గాడు: అమ్మితే డబ్బులు వస్తాయ్, హాయిగ ఖర్చు పెట్టుకోవచ్చు.
సుబ్బి గాడు: ఎలాగు దేవుడినే కదా కొరుకునేది..అదేదొ డబ్బులే దొరకాలి అని కొరుకోవచ్చు కద..
అబ్బి గాడు: అవును రా.. నువ్వు చెప్పిందే కరెక్ట్, ఇప్పుడు బంగారం దొరికి దాన్ని అమ్మడం..! ఇదంత టైం వేస్ట్... నాకు డబ్బు దొరకాలి.
సుబ్బి గాడు: ఎంత?
అబ్బి గాడు: ఒక 100 కొట్లు.
సుబ్బి గాడు: ఎలాగు దేవుడినే కదా కొరుకునేది..అదేదొ లక్ష కోట్లు కొరుకోవచ్చు కద.
.
అబ్బి గాడు:అవును లె...ఎలాగు దేవుడే కదా.. సరే లక్ష కొట్లు.
సుబ్బి గాడు: ఎం చెస్తావేంటి, లక్ష కోట్లతొ?
అబ్బి గాడు: బిల్డింగులు, కార్లు కొంటాను!
సుబ్బి గాడు: పిచ్చోడ! డైరెక్ట్ గా అవే కోరుకోవచ్చు కద! సరే అవన్ని కొంటే??
?
అబ్బి గాడు: ఇంకేముంది హాప్పీ గా ఉండొచ్చు
సుబ్బి గాడు: వెధవ! అదేదొ డైరెక్ట్ గా హాప్పీ గా ఉండాలని కోరుకోవచ్చు కదా..??
అబ్బి గాడు: అరెయ్! నాకు ఏమి వద్దు రా నీకు.దండం రా బాబు

Tuesday, September 8, 2015

రాజకీయం

ఒకరోజు ఒక Florist, haircut కోసం ఒక బార్బర్ షాపుకి వెళ్తాడు. Haircut అయిపోయిన తర్వాత బిల్ అడిగితే అందుకా బార్బర్ 'ఈ వారం నేను Community Service చేస్తున్నాను, డబ్బులు తీసుకోలేను అంటాడు. తర్వాతరోజు బార్బర్ షాపు తెరవగానే అక్కడ పది గులాబి పువ్వులతో పాటు Thank You నోట్ రాసి ఉంటుంది. 

తర్వాత రోజు ఒక పోలిస్ haircut కోసం ఒక బార్బర్ షాపుకి వెళ్తాడు. Haircut అయిపోయిన తర్వాత బిల్ అడిగితే అందుకా బార్బర్ 'ఈ వారం నేను Community Service చేస్తున్నాను, డబ్బులు తీసుకోలేను అంటాడు. తర్వాతరోజు బార్బర్ షాపు తెరవగానే అక్కడ పది చాక్లెట్ బాక్సులతో పాటు Thank You నోట్ రాసి ఉంటుంది.   

మరుసటి రోజు ఒక రాజకీయ నాయకుడు haircut కోసం ఒక బార్బర్ షాపుకి వెళ్తాడు. Haircut అయిపోయిన తర్వాత బిల్ అడిగితే అందుకా బార్బర్ 'ఈ వారం నేను Community Service చేస్తున్నాను, డబ్బులు తీసుకోలేను అంటాడు. తర్వాతరోజు బార్బర్ షాపు తెరవగానే అక్కడ మరొక పదిమంది రాజకీయ నాయకులు Haircut చేయించుకోవడానికి బార్బర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు.  

Monday, September 7, 2015

చావు

జంభులింగం : ఏంట్రా మనం ఎంత చదివినా అస్సలు పాస్ అవ్వడంలేదు. 
శంభులింగం : అవున్రా.... ఐతే చచ్చిపోదామా? 
జంభులింగం : వద్దురా బాబు, మళ్ళీ పుడితే LKG నుండి చదవాలి, నావాల్ల కాదు!!! 

Sunday, September 6, 2015

పరీక్ష

టీచర్ : 'నారు పోసినవాడే నీరు పోస్తాడు. ' ఇలాంటి సామెత ఇంకోటి చెప్పరా! 
విద్యార్థి : 'పాఠం చెప్పినవాడే పరీక్ష రాయాలి

Monday, August 17, 2015

విలువ

"రెండు ప్లేట్లు వేడి వేడి గారెలు పట్రావోయ్" ఆర్డరేశాడు బ్రహ్మానందం.
"చిత్తం సార్" వెళ్ళి రెండు నిమిషాల్లో తెచ్చాడు సర్వర్.
"ఆహా... కమ్మగా ఉన్నాయ్... ఉప్పు చక్కగా సరిపోయింది. పిండి రోట్లో రుబ్బారా?" తింటూ అడిగాడు బ్రహ్మానందం.
"అవును సార్"
"ఎంతైనా గ్రైండర్లో రుబ్బితే ఇంత రుచి రాదు. చాలా బాగున్నాయి. మరో నాలుగు పట్రా"
"థ్యాంక్యూ సార్. మీరైనా ‘చెమట’ విలువ గ్రహించారు" వెళ్ళాడు సర్వర్.

Monday, July 27, 2015

కుడుములు

భార్య : ఏమండి మీ కోసం కుడుములు చేసాను తినండి. 
భర్త : అమ్మో నువ్వు చేసిన కుడుములు తింటే సగం పళ్ళూడిపోతాయి, నేను తినను. 
భార్య : తినకపోతే మొత్తం పళ్ళు రాలిపోతాయ్, మర్యాదగా తినండి. 

Monday, July 13, 2015

నిమ్మకాయలు

భార్య :ఏమండి మనింటికి చుట్టాలు వచ్చారు కదా
చల్లగా లెమన్ జూసు
ఇద్దాం అంటే నిమ్మకాయలు లేవండి ఇప్పుడెలా
.
:
: :
:
భర్త : ఎందుకె అంత టెన్సన్ పడుతున్నావ్ కొత్త
విమ్ బార్ లో 100
నిమ్మకాయల శక్తి ఉందిగా దాన్ని కలిపి ఇచ్చేy

Tuesday, June 16, 2015

చలి

శంభులింగం : ఒరేయ్ జంభూ, అంత చలిగా ఉంటే స్విమ్మింగ్ పూల్ లో ఎలా స్నానం చేస్తున్నావ్ రా?
జంభులింగం : అందుకే స్వెట్టర్ వేసుకొని చేస్తున్నారా శంభూ

Sunday, June 14, 2015

కరెంట్

ఒకసారి జంభులింగం కొడుకు సందేహాల్రావు ఇలా అడుగుతాడు.
సందేహాల్రావు : డాడీ, నీటి నుండి కరెంట్ ఎందుకు తీస్తారు ?
జంభులింగం : మనం స్నానం చేసేటప్పుడు షాక్ కొడుతుంది కదా, అందుకు.

Saturday, June 13, 2015

తలనొప్పి

శంభులింగం : అదేంటి జంభూ, తలక్రిందులుగా ఎందుకున్నావు?
జంభులింగం : తలనొప్పిగా ఉందిరా.
శంభులింగం : మరి టాబ్లెట్ వేసుకోవచ్చుగా?
జంభులింగం : వేసుకున్నారా, కానీ అది గొంతులోనుండి కడుపులోకి వెళ్ళింది. అందుకే అది తలలోకి వెళ్ళాలనే ఇలా తలక్రిందులుగా వేళ్ళాడుతున్నా.

Thursday, June 11, 2015

ఫోన్

శంభులింగం : అదేంటి జంభూ, మాటి మాటికి తిరుగుతూ ఫోన్ చేస్తున్నావ్, ఎందుకు?
జంభులింగం : నేను ఒకడికి కాల్ చేస్తే మాటి మాటికి తిరిగి ప్రయత్నించమంటుందిరా ఎవరో అమ్మాయి.

Wednesday, June 10, 2015

I am going

జంభులింగం : ఒరేయ్ శంభూ 'I am going' అంటే ఏంటిరా?
శంభులింగం : 'నేను వెళ్తున్నా'
జంభులింగం : బాబ్బాబు, నీకు పుణ్యముంటది. దీనికి ఆన్సర్ చెప్పి వెళ్ళరా

Tuesday, June 9, 2015

కుక్కతోక

జంభులింగం ఒకసారి కుక్కతోకని పైప్ లో పెడుతూ కష్టపడుతుంటాడు .
శంభులింగం : ఒరేయ్ జంభూ నీకు తెలీదారా, కుక్క తోక వంకరని. అదెప్పుడు తిన్నగా రాదు.
జంభులింగం : ఓరి తింగరోడా, ఆ విషయం నాకు  తెలుసురా,నేను పైపుని వంకర చేస్తున్నా.

Friday, June 5, 2015

సంతకం

జంభులింగం చెక్ బుక్ పోగొట్టుకుంటాడు.
బాంక్ మేనేజర్ : జాగ్రత్త. ఎవరైనా నీ సంతకం పెట్టేయగలరు.
జంభులింగం : ఆ కంగారేం లేదులెండి. ఆల్రెడీ అన్నిటిమీదా నేనూ సంతకం పెట్టేశాగా..

Wednesday, June 3, 2015

వేల పాత్రలు

జంభులింగం : ఈ పుస్తకం నే చదవలేకపోతున్నా
లైబ్రేరియన్ : ఎందుకని? 
జంభులింగం : ఇందులో వేల పాత్రలున్నాయి, అస్సలు అర్ధం కావట్లేదు, 
లైబ్రేరియన్ : ఓహో ఐతే నిన్న ఫోన్ డైరెక్టరీ తీసుకెళ్ళింది నువ్వేన్నమాట 

Tuesday, June 2, 2015

నెంబర్ ప్లీజ్'

భర్తకోసం ఆఫీసుకు ఫోన్ చేసి వాళ్ళయని పిలవమని ఆపరేటర్ని అడిగింది మంగతాయారు. 
ఇంతలో ఆపరేటర్, 'నెంబర్ ప్లీజ్' అనడిగింది. 
మంగతాయారికి చిర్రెత్తి, నంబరేంటి, నీ బొంద, నాకేమన్న పదిమంది మొగుళ్ళున్నారనుకున్నావా? అంటూ కయ్యిమంటుంది. 

Monday, June 1, 2015

కుక్క బిస్కెట్లు

ఆ షాపు వాడు చూశాడాండీ? కుక్క బిస్కెట్లు ఉన్నాయ అంటే ఇక్కడే తింటారా, పార్సిల్ కట్టించమంటారా అనడుగుతున్నాడు. 

Sunday, May 31, 2015

గొడవ

మీ ఆవిడా, మీ అమ్మా గొడవపడినప్పుడు, నువ్వు ఏ పక్కన నుంచుంటావ్?
జంభులింగం : గోడపక్క

Thursday, May 28, 2015

యాద్గిరీ

టీచర్ : ఒరేయ్ యాద్గిరీ ,  Fast, Faster, Fastest ని తెలుగులో చెప్పు.
యాద్గిరీ : ఒహో , ఇది చాలా ఈజీ టీచర్. ఉర్కు, జల్దీ ఉర్కు , దీంతల్లి  ఉర్కు  

Monday, May 25, 2015

బెదిరింపు కాల్స్


జంభులింగం పోలిస్ స్టేషన్ కి వెళ్ళి
జంభులింగం : సార్, నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.
యస్సై : ఏమని?
జంభులింగం : రీచార్జ్ చేయించుకోపోతే కనెక్షన్ కట్ చేస్తామని

Sunday, May 24, 2015

సైకిల్ రేస్

జంభులింగం ఒకసారి సైకిల్ రేస్ లో పాల్గొంటాడు... బాగా తొక్కాడు గానీ ఓడిపోయాడు.
శంభులింగం : అంతబాగా తొక్కితే ఎలా ఓడిపోయావ్ రా?
జంభులింగం : ఎవడో సైకిల్ కి స్టాండ్ వేశాడ్రా.

Friday, May 22, 2015

పెట్రోల్ కారు

జంభులింగం : ఒరేయ్ శంభూ నీ కారు పేరేంటి?
శంభులింగం : అదేంటోరా, సరిగ్గా గుర్తులేదు, ఏదో 'T' తో స్టార్తౌతుంది.
జంబులింగం : వావ్, టీ తోనా , నువ్వు లక్కీరా, నా కారు పెట్రోల్ తో స్టార్తౌతుంది.

ధర్మ సందేహం

బాపూగారి బొమ్మలా అందంగా ఉండీ,  తెలివైనదై ఉండీ, చాలా చురుకైనదై ఉండీ, భర్తతో ఎప్పుడూ పోట్లాడని స్త్రీని ఏమంటారు స్వామీ"? అని శిష్యుడు అడిగాడు

'భ్రమ' అంటారు నాయనా అని గురూజీ బదులిచ్చాడు.

Wednesday, May 20, 2015

చిల్లు

జంభులింగం : డాక్టరుగారూ,డాక్టర్ గారూ, కొంచెం ఈ బకెట్ కి చిల్లు పడింది, కొంచెం రిపేర్ చేస్తారా? 
డాక్టర్ : స్టుపిడ్, బకెట్ కి చిల్లు పూడ్చాలా, నేనెవరో తెలుసా? 
జంభులింగం : భలేవారే, నాకెందుకు తెలీదు, మీరు పేరు పొందిన ప్లాస్టిక్ సర్జన్ కదా. 

Monday, May 18, 2015

గర్ల్ ఫ్రెండ్

బిక్షగాడు : అయ్యా, పది రూపాయలుంటే దానం చెయ్యండయ్యా, టీ తాగాలి. 
అవతలి వ్యక్తి : పది రూపాయల, ఐనా టీ తాగడానికి 5 రూపాయలే కదా? 
బిక్షగాడు : అవునయ్యా, కానీ టీ నాకు నా గర్ల్ ఫ్రెండ్ కూ ..
అవతలి వ్యక్తి : బిక్షగాడికి గర్ల్ ఫ్రెండా . 
బిక్షగాడు : లేదయ్యా, గర్ల్ ఫ్రెండ్ వచ్చాకే బిక్షగాడినయ్యా 

Sunday, May 10, 2015

అప్పిగాడు

హెల్లో ఫ్రెండ్స్, నేను మార్కెట్లోకి వచ్చిన అసలు సిసలైన అంధ్రా అప్పడాన్ని. తెలుగు హాస్యాన్ని మరింత మధురం చేయడానికి మా ఫ్యామిలీతో పాటు వస్తున్నా. నన్ను స్వాగతిస్తారనే ఆశతో ముందుకు సాగుతున్నా. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ, అప్పిగాడు.

Like me here :  

Thursday, May 7, 2015

Salary increment

ఉద్యోగి : సార్, నాకు Salary increment కావాలి. మూడు కంపనీలు నా వెంట పడుతున్నాయి తెలుసా.
యజమాని : మూడు కంపనీలా, ఏంటవి?
ఉద్యోగి : Electricity, mobil and Credit Card. 

Wednesday, May 6, 2015

కార్పోరేట్ ఆఫీస్

ఒక కార్పోరేట్ ఆఫీస్ లో బాస్ ఒక జోక్ చెప్తాడు. తన క్రింది ఉద్యోగులందరూ నవ్వుతారు. ఒకతను మాత్రం నవ్వకుండా చూస్తూ ఉంటాడు. అప్పుడాయజమాని ఇల అడుగుతాడు. 
యజమాని : ఏం, నీకు నవ్వు రాలేదా? 
ఉద్యోగి : లేదు సార్, నాకు వేరే కంపెనీ లో confirm అయింది. 

Tuesday, April 28, 2015

అబద్దం

చింటు: అమ్మా, నాతో అబద్దం ఎందుకు చెప్పావు? 
అమ్మ  : I have already told you, whenever you speak, speak in English. 
చింటు  : Ok mom, why did you lie to me? 
అమ్మ  : When my son?
చింటు : You said, my younger sister is an angel. 
అమ్మ  : Yes, she is.
చింటు : Then, why didn't she fly when I threw her from our balcony. 
అమ్మ  : ఒరేయ్ దున్నపోతా, సచ్చినోడా తలకుమాసిన వెధవ, ఎక్కడ పడేసావురా దాన్ని. నెల తక్కువ వెధవ. 
చింటు: Mom, speak in English please.  

Monday, April 27, 2015

పులికి మేకకీ తేడా

టీచర్ : రాజూ, పులికి మేకకీ తేడా ఏంటి? 
రాజు : ఒకటి క్రూర జంతువు, మరొకటి కూర జంతువు. 

Thursday, April 23, 2015

బర్డ్ ఫ్లూ నివారణ


లైట్

కుర్రాడు : మమ్మీ, నిన్న రాత్రి టాయిలెట్ కని తలుపు తీస్తే లైట్ దానికదే ఆన్ అయింది. 
మమ్మీ : ఓరి వెధవా, నీకెన్ని సార్లు చెప్పాను, ఫ్రిజ్ లో టాయిలెట్ వెళ్ళొద్దని. 

Sunday, April 19, 2015

కష్టమర్ కేర్

హలో కష్టమర్ కేరా? 
అవును చెప్పండి సార్, నేను మీకెలాగ ఉపయోగపడగలను?
సార్! మావాడు SIM కార్డ్ మింగేశాడండీ...
అయ్యో! కానీ దానికి నేనేం చేయగలనండీ...
ఆ SIM కార్డులో వంద రూపాయలు బాలన్స్ ఉంది. 
ఐతే నేనేం చేయగలనో చెప్పండి సార్
ఏం లేదు, వాడు మాట్లాడుతుంటే బాలన్స్ కట్ అవుతుందా? 
????

Saturday, April 18, 2015

అఖిల భారత తాగుబోతుల సంఘం

డిమాండ్లు
1. వికలాంగులకు భేషరుతుగా ఇంటికే మందు  పంపించాలి
2. తెల్ల రేషన్ కార్డ్ ఉన్న వాల్లకు సగం ధరకే  మందు అందించాలి
3. తాగి పడిపోయిన తాగుబోతులను ప్రభుత్వ  అంబులెన్స్ ద్వారా ఇంటికి చేర్చాలి
4. తాగుబోతులకు సమాజం లో తగిన గౌరవం ఇవ్వాలి   ఇంట్లో భార్యలు తన్నకుండా చూడాలి
5. వైన్ షాప్ ల్లో  క్వాటర్ కొంటే   గ్లాసులు  నీల్లు    చెనిగపప్పు పొట్లాలు ప్రీగా  ఇవ్వాలి
6. మా డబ్బుతోనే ప్రభుత్వం నడుస్తుంది గనుక   మాకు తాగి బండ్లు నడుపుకునే  అవకాశం  ఇవ్వాలి 
7. తాగి  తాగి  ఎవడైన చని పోతే ప్రభుత్వమే బాధ్యత వహించి  వారి దశదిన ఖర్మకు   తగిన మందు ఉచితంగా సప్లయిచేయాలి
8. మద్యం పైన ఏ రాష్ట్రమైనా నిషేదం విదించాలన్నా ముందు  మాతో సంప్రదింపులు జరుపాలి

జై తాగుబోతు సంఘం
జై జై  తాగుబోతు సంఘం  

Friday, April 17, 2015

జంధ్యాల కవిత

నువ్వులేని ఈ జీవితం ఎందుకు నేస్తం,
గడ్డం గీసుకోడానికా?
గోర్లు కొరుక్కోవడానికా?
పిప్పరమెంట్లు చప్పరించడానికా?
పాడె మీద పేలాలు ఏరుకోడానికా?
పెంట మీద చెత్త తియ్యడానికా?
ఎంగిలి ఆకులు ఎత్తుకోడానికా?
ఒకే ఒక్క కారణం చెప్పు నేను ఒప్పుకుంటాను ,
నేస్తం ఓ నా ప్రియ నేస్తం

Thursday, April 16, 2015

దేశం బాగుపడుతుంది

మమతా, మాయా, జయలలిత మరియు సోనియా (నలుగురు అమ్మలు) విమానంలో ప్రయాణిస్తున్నారు.

మమత : 100 నోటు క్రిందకు విసిరేసి "ఈ నోటు దొరికినవాడు ఆనందపడతాడు..నా ఈ పని వలన ఒక్కడైన సంతోషపడతాడు.."

మయావతి : రెండు 50 నోట్లు క్రిందకి వేసి "ఈ రెండూ నోట్లూ దొరికినవారు ఆనందపడతారు..నా ఈ పని వలన ఒక్కరు కాదు ఇద్దరు సంతోషపడతారు.."

జయలలిత : పది 10 నోట్లు క్రిందకి వేసి "ఈ పది నోట్లూ దొరికినవారు ఆనందపడతారు..నా ఈ పని వలన పది మంది సంతోషపడతారు.."

సోనియా : వంద 1రూ. బిళ్ళలు క్రిందకి వేసి "ఈ బిళ్ళలు దొరికినవారు ఆనందపడతారు..నా ఈ పని వలన చాలా మంది సంతోషపడతారు.."

పైలెట్ : నేను చేసే పని వలన మొత్తం భారత దేశం సంతోష పడుతుంది... అంటూ ప్యారాచుట్ కట్టుకొని క్రిందకి దూకేసాడు... 

ఆడాళ్ళ మజాకా

బిచ్చగత్తె : బాబు, అన్నం తిని మూడు రోజులైంది. ఒక రూపాయ్ ఉంతే దానం చెయ్యి బాబు. 
జంభులింగం : మూడు రోజులనుండి తిన్లేదంటున్నావ్. ఒక రూపాయ్ తో ఏమొస్తుందేంటి. 
బిచ్చగత్తె : Weight చూసుకుంట అయ్య, ఎంత తగ్గానో ఏమో. 
జంభులింగం : ఆ( ఆడాళ్ళ మజాకా 

Wednesday, April 15, 2015

భయం

ఒక క్రూరుడైన కోళ్ళ ఫారం యజమాని ఒకరోజు ఆ కోళ్ళని యిలా హెచ్చరించాడు. 
'రేపొద్దుటికల్లా తలా రెండు గుడ్లు పెట్టకపోతే మిమ్మల్ని కోసుకుతింటా' అని. 
తర్వాతిరోజు అన్నీ రెండు రెండు గుడ్లు పెట్టాయి, ఒకటి మాత్రం ఒకటే పెట్టింది. 
యజమాని కోపంతో గుర్రుగా చూస్తూ 'ఏమే ఒకటే గుడ్డు పెట్టావేం ' అని గద్దిస్తాడు. 

దానికా కోడి భయంతో వణుకుతూ 
'ఒరేయ్, అదికూడా కోసుకొని తింటావని పెట్టా, నేనసలు పుంజున్రా!' అని వాపోతుంది. 

Thursday, April 9, 2015

మిక్సీ సాక్ష్యం

భార్య : ఎక్కడున్నావ్? 
భర్త : ఇంట్లోనే డార్లింగ్
భార్య : Are you sure?
భర్త : హా, Sure. 
భార్య : మిక్సీ ఆన్ చెయ్.  
భర్త : (మిక్సీ ఆన్ చేస్తాడు). డుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్......
భార్య : Ok, డియర్, Love you, bye .

ఇంకో రోజు...
భార్య : ఎక్కడున్నావ్? 
భర్త : ఇంట్లోనే డార్లింగ్
భార్య : Are you sure?
భర్త : హా, Sure. 
భార్య : మిక్సీ ఆన్ చెయ్.   
భర్త : (మిక్సీ ఆన్ చేస్తాడు). డుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్......
భార్య : Ok, డియర్, Love you, bye .

తరువాత రోజు, భార్య ఫోన్ చెయ్యకుండా Direct గా ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళబ్బాయి ఒంటరిగా ఆడుకుంటుంటే ఇలా అడుగుతుంది " చిన్నూ, డాడీ ఎక్కడ?"

కొడుకు : "ఏమో మమ్మీ, పొద్దునే మిక్సీ పట్టుకొని బయటకెళ్ళాడు"    

Wednesday, April 8, 2015

అసలు విషయం

MMTS లో ఒక ముసలావిడ రోజూ ఒక కాలేజ్ కుర్రాడికి రోజూ 4-5 Dry fruits ఇస్తూ ఉంటుంది. ఆ కుర్రాడుకూడా వాటిని తింటూ ఎంజాయ్ చేస్తూ Travel చేసేవాడు. 

ఒక రోజు ఆ కుర్రాడికి బాగా ఉత్సుకత పెరిగి, రోజూ ఇలా Dry Fruits ఎందుకిస్తున్నావని ఆ ముసలావిడని అడిగాడు. 

అందుకావిడ కొంచెం ఎమోషనల్ గా మొహం పెట్టి
'నాకు Cadbury Dry fruits చాక్లెట్స్ అంటే బాగా ఇష్టం కానీ వాటిని నమలాలంటే  నాకేమో పళ్ళన్నీ ఊడిపోయాయి. అందుకే చాక్లెట్ చీకేసి నీకు Dry fruits ఇస్తాను ' అంటూ చల్లగా అసలు విషయం బయట పెట్టింది.  

Wednesday, April 1, 2015

Bad News - Worse News

డాక్టర్ పేషంట్ తో
డాక్టర్ : నీకొక Bad news, ఒక Worse news చెప్పాలి. 
పేషంట్ : Bad news ఏంటి? 
డాక్టర్ : నువ్వింకా 24 గంటలే బ్రతుకుతావ్. 
పేషంట్ :  Oh my God, ఇంతకన్నా Worse news ఏముంటుంది డాక్టర్  
డాక్టర్ : నీకీ విషయం చెప్పాలని నిన్నటినుండి నీకోసం వెతుకుతున్నా. 

Monday, March 30, 2015

సూపర్ మాన్

ఒకసారి తమిళనాడు నుండి AnanthaRaman Subbaramanyam అమెరికా వెళ్ళడానికి airportలో clearance కోసం wait చేస్తూ ఉంటాడు. ఎంతకీ తన పేరు రాకపోయేసరికి కౌంటర్ దగ్గరకి వెళ్ళి 'నా పేరు ఇంకా పిలవడం లేదెందుకని 'అడుగుతాడు . 
దానికా ఆఫీసర్ , చాలా సేపటినుంచి మీ పేరు పిలుస్తున్నాం, ఎక్కడికెళ్ళారు మీరు అనడుగుతాడు. ఇంతలో ఎనౌన్స్ మెంట్ వస్తుందిలా 
'final call for Mr. 'Anotherman Superman' please board the plane.

Sunday, March 29, 2015

ప్రశ్న

 టీచర్ : నా తరువాతి ప్రశ్నకు ఎవరైతే సమాధానం చెబుతారో వాళ్ళు ఇంటికి వెళ్ళచ్చు. 
(ఇంతలో ఒక కుర్రాడు కిటికీ నుండి బాగ్ ని బయటకు విసిరేస్తాడు.)
టీచర్ : ఎవర్రా అది, బాగ్ విసిరేసింది. 
కుర్రాడు : నేనే టీచర్. నేను ఇక ఇంటికి బయలుదేరుతున్నా 

Saturday, March 28, 2015

108

జంభులింగం, శంభులింగం ఒకరోజు వేటకు వెళ్తారు. అక్కడ శంభులింగం అకస్మాత్తుగా క్రింద పడిపోతాడు. జంభులింగం శ్వాస చూస్తాడు, ఊపిరి కూడా ఆడకపోయేసరికి కంగారుపడి 108 కి కాల్ చేస్తాడు. 
జంభులింగం : హెల్లో, మా ఫ్రెండ్ చనిపోయాడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి? 
ఆపరేటర్ : కంగారు పడకండి. calm down. First, మీ ఫ్రెండ్ నిజంగా చనిపోయాడో లేదో confirm చేసుకుందాం. 
(ఇంతలో కొంత నిశ్శబ్దం. అవతలినుంచి ఏదో గన్ షాట్ వినబడింది.)
జంబులింగం : హా, తరువాత?  

Thursday, March 26, 2015

నిజం

పిల్లాడు : అమ్మా, గాంధీ తాత తలమీద వెంట్రుకలుండవు ఎందుకని?
అమ్మ : ఎందుకంటే అతను ఎప్పుడూ నిజమే మాట్లాడుతాడు గనుక.
పిల్లాడు : ఒహో, ఇప్పుడర్ధమైంది. ఆడాళ్ళందరి జుట్టు ఎందుకంత పెద్దగా ఉంటుందో.

Monday, March 16, 2015

దేవత

ఒక భర్త తన భార్యకు ఇలా SMS చేశాడు
నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినందుకు, నా జీవితంలో ఒక భాగమైనందుకు నీకు కృతజ్ఞతలు. ఇప్పుడు నేనీస్థితిలో ఉన్నానంటే దానికి నువ్వే కారణం.  నువ్వు నా దేవతవి.
 నా జీవితంలోకి వచ్చినందుకు చాలా థాంక్స్. 
నువ్వు చాలా మంచిదానివి 

భర్త SMS చదివి భార్య ఇలా reply ఇచ్చింది
తాగడం అయిందా, 
ఇంక SMSలు ఆపు, 
నోరుమూసుకొని ఇంటికి రా. 
భయపడకు నిన్నేమీ అనను. 

ఇది చదివిన భర్త : 
థాంక్స్, నేను ఇంటి బయటే ఉన్న. 
దయచేసి తలుపు తియ్. 

Sunday, March 15, 2015

పేరు

ఒక పిల్ల కోడి తల్లికోడితో ఇలా అంటుంది. 
పిల్ల కోడి : అమ్మా, మనుషులు పుట్టగానే పేరు పెట్టుకుంటారు కదా, మరి మనకెందుకు పుట్టగానే పేర్లుండవు? 
తల్లి కోడి : మనక్కూడా ఉంటాయే కాకపోతే మనుషులకు పుట్టగానే ఉంటాయి, మనకు చచ్చిపోయాక ఉంటాయి, చికెన్ టిక్క, చికెన్ చిల్లీ, చికెన్ తందూరి, చికెన్ మలై , చికెన్ కడాయి etc...  

Monday, March 9, 2015

మైక్రోసాఫ్ట్

టీచర్ : రాజూ! మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు కొన్ని చెప్పు. 
రాజు : MS Excel, MS word, MS powerpoint 
టీచర్ : జంభూ నువ్వు కొన్ని చెప్పు. 
జంభులింగం : (తీవ్రంగా ఆలోచించి) MS DHONI టీచర్.  

Sunday, March 8, 2015

తెల్లెంట్రుకలు

పిల్లాడు : నాన్నా! ఎందుకు నీకు తెల్లెంట్రుకలు వస్తున్నాయి.
నాన్న: నువ్వు ఒక్కో తప్పు చేసినప్పుడల్లా ఒక్కో తెల్లెంట్రుక వస్తుంది.
పిల్లాడు కొద్దిసేపు దీర్ఘంగా ఆలోచించి.
"ఒహో ఇప్పుడర్ధమైంది, తాతయ్య తలంతా తెల్లెంట్రులుంటాయో."

Saturday, March 7, 2015

Desiginer peace.

ఒక భార్యా, భర్తా వాకింగ్ కని అలా వెళ్తుంటారు. ఇంతలో అకస్మాత్తుగా భర్త కాలికి రాయి తగిలి రక్తం వస్తుంది. వెంటనే తను తన భార్య పైట వైపు చూస్తుంటాడు, తను పైట చించి కట్టు కడుతుందేమోనని. అప్పుడామె 'కల్లోకూడా ఆ ఆలోచన రానీకండి. ఇది Desiginer peace. 

Friday, March 6, 2015

దేవుడు చూస్తున్నాడు

నర్సరీ స్కూల్ కాంటీన్ లో ఒకచోట యాపిల్ బుట్టతో పాటు ఇలా రాసి ఉంటుంది. 
"ఒక యాపిల్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు. దేవుడు చూస్తున్నాడు". 

పక్కనే ఇంకో కౌంటర్ దగ్గర చాక్లెట్స్ బాక్స్ ఉంటుంది. అది చూసి ఒక పిల్లాడు ఇలా రాస్తాడు. 
"మీకు కావల్సినన్ని చాక్లెట్స్ తీసుకోండి. దేవుడు యాపిల్స్ చూడటంలో బిజీగా ఉన్నాడు."  

Thursday, March 5, 2015

తమాషా

భార్య : నాకు ఒంట్లో బాగోలేదండీ!
భర్త : అయ్యో, నేను నిన్ను షాపింగ్ కి తీసుకెళ్దామనుకున్నానే!
భార్య: అరె, నేను తమాషాకి చెప్పానండీ
భర్త : నేనూ తమషాకే చెప్పా. ఇక లేచి వంట చెయ్యి.

Wednesday, March 4, 2015

Beautiful

అర్దరాత్రి Beep Sound విని మెలుకువవచ్చిన మొగుడు తన భార్య మొబైల్ చెక్ చేసి కోపంతో తన భార్యను లేపాడు. భర్త : (కోపంతో) ఎవడు వీడు నీకు ఈ టైమ్ లోBEAUTIFUL అని మెసేజ్ చేశాడు (ఒక్కసారి గా గాబరపడిన భార్య మొబైల్ చూసి మొగుడి ని మింగేసేల కోపంతో చూస్తూ) . . . . . . భార్య: మొదట మీరు మీ కంటిఅద్దాలు పెట్టుకుని చావండి అది BEAUTYFUL కాదు BATTERYFULL .

Sunday, March 1, 2015

సంతోషం

జంభులింగం : సార్! మా ఆవిడ తప్పిపోయింది. 
Postman : ఇది Post office, Police station కాదు. 
జంభులింగం : దీనమ్మ జీవితం. సంతోషంలో ఎక్కడికెళ్ళాలో కూడా తెలియట్లేదు. 

Tuesday, February 24, 2015

ఫ్రిజ్

ఓ కొంటె కుర్రోడు ఒక unknown నంబరుకి కాల్ చేస్తాడు. 
కుర్రోడు: హెల్లో, ఇంట్లో ఫ్రిజ్ ఉందా? 
reply: హా ఉంది. 
కుర్రోడు : నడుస్తుందా? 
reply : హా నడుస్తుంది. 
కుర్రోడు: గట్టిగా పట్టుకోండి, లేకపోతే పారి పోతుంది. 
ఫోన్ పెట్టేస్తాడు.  కొంతసేపయ్యాక మళ్ళీ ఫోన్ చేసి
కుర్రోడు : హెల్లో, ఇంట్లో ఫ్రిజ్ ఉందా? 
reply : లేదు (కొంచెం కోపంగా)
కుర్రోడు : ఇందాకే చెప్పా కద పట్టుకోమని. చెబితే వింటే కదా. 

పెళ్ళిభయం

కొడుకు : నాన్నా, నేను పెళ్ళి చేసుకోను. నాకు ఆడోళ్ళంటే చాలా భయం. 
నాన్న : పెళ్ళీ చేసుకో నాయనా. అప్పుడు ఒక్క ఆడదంటేనే భయమేస్తుంది. మిగతావారంతా మంచిగా కనిపిస్తారు. 

Monday, February 23, 2015

హనుమాన్ చాలీసా

భార్య : ఏమండీ, నేనెప్పుడైనా మీ కల్లోకి వస్తానా? 
భర్త : లేదే
భార్య : ఏమి? 
భర్త : నేను పడుకునేటప్పుడు హనుమాన్ చాలీసా చదువుకొని పడుకుంటా. 

Saturday, February 21, 2015

Doctor shocks, Engineer rocks

ఒక ఇంజనీర్ కి ఉద్యోగం దొరక్క ఒక క్లినిక్ మొదలుపెడతాడు. జనాల్ని attract చెయ్యడానికి బయట ఈ విధంగా బోర్డ్ పెడతాడు.
'ట్రీట్ మెంట్ ఫీ : 300, బాగవ్వగపోతే 1000 వాపస్ '.
ఒక కుర్ర డాక్టరు ఈ బోర్డు చూసి తనకు 1000 రూపాయలు సంపాదించే అవకాశం వచ్చిందని సంబరపడుతూ ఆ క్లినిక్ లోకి వెళతాడు.
పేషంట్(డాక్టర్) : నా నాలుక రుచి కోల్పోయింది .
ఇంజనీర్ : Nurse, box no 22 లో medicine తీసుకొచ్చి మూడు చుక్కలు పేషంట్ నోట్లో వెయ్యి.
పేషంట్(డాక్టర్) :  చీ ఇది పెట్రోల్ కదా
ఇంజనీర్ : కంగ్రాట్స్. నీ నాలుకకు రుచి తెలుస్తుంది. 300 ఫీ ఇచ్చి వెళ్ళూ.
డాక్టర్ కి కోపం వస్తుంది. 300 ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
కొన్నిరోజులకి తను పోగొట్టుకున్న డబ్బులు తిరిగి సంపాదించుకుందామని మళ్ళీ వెళతాడు. ఈ సారి
పేషంట్(డాక్టర్) : నాకు ఏదీ గుర్తుండటంలేదు .
ఇంజనీర్ : Nurse, box no 22 లో medicine తీసుకొచ్చి మూడు చుక్కలు పేషంట్ నోట్లో వెయ్యి.
పేషంట్(డాక్టర్) : అది నాలుకకి రుచి తెప్పించే medicine కదా?
ఇంజనీర్ : కంగ్రాట్స్. నీ మతిమరుపు పోయింది. 300 ఇచ్చి కదులు.
డాక్టర్ కి మరింత పట్టుదల పెరిగి కొన్ని రోజుల తరువాత మళ్ళీ వస్తాడు.
పేషంట్(డాక్టర్) : నా కళ్ళు కనపడటం లేదు.
ఇంజనీర్ : hmm , నా దగ్గర దీనికి medicine లేదు. ఈ 1000 రూపాయలు తీసుకో.
పేషంట్(డాక్టర్) : కానీ ఇది 100 రూపాయల నోట్ కదా.
ఇంజనీర్ : వావ్. కంగ్రాట్స్. నీ చూపు తిరిగొచ్చింది. 300 ఇచ్చి కదులు.

Doctor shocks, Engineer rocks


Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version