Thursday, July 31, 2014

HOEL

టీచర్ : ఒరేయ్ రవీ, హోటెల్ స్పెల్లింగ్ చెప్పరా? 
రవి : HOEL 
టీచర్ : T ఏమైందిరా? 
రవి : T తాగేసాను టీచర్. 

Tuesday, July 29, 2014

సరికొత్త నియమాలు

సరికొత్త నియమాలు 
-------------
సమతుల్య నియమం : 
భార్య ఐదునిమిషాలలో రెడీ అయ్యొస్తానని చెప్పిన సమయం ఖచ్చితంగా భర్త ఐదునిమిషాలలో కాల్ చేస్తానన్న సమయానికి సమానం. 

క్యూ నియమం : 
మీరు నిలబడిన క్యూ మారిస్తే మీరు వదిలేసిన క్యూ ఎప్పుడు తొందరగా కదులుతుంది. 

టెలిఫోన్ నియమం : 
రాంగ్ నంబరుకి కాల్ చేసినప్పుడు ఎప్పుడూ బిజీ ఉండదు. 

యంత్రతత్వ నియమం : 
మీ చేతులు గ్రీజు తో బాగా మురికిగా ఉన్నప్పుడు ముక్కు దురద పెట్టడం. 

సంభావ్యతా నియమం : 
మీరు మీ గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు మీకు తెలిసినవారు చూసే సంభావ్యత ఎక్కువగా ఉండటం. 

ప్రతిపాదనా నియమం : 
ఎవరినా మిమ్మల్ని ఒప్పుకున్న వెంటనే వేరొకరు మీకు మెరుగ్గా కనపడటం 

టీ కాఫీ నియమం : 
మీరు టీ తెచ్చుకొని తాగుతున్నప్పుడే మీ బాస్ మిమ్మల్ని ఏదో సాల్వ్ చెయ్యమని అడగటం, ఆ సమస్య కూడా సరిగ్గా టీ చల్లారినప్పుడే పరిష్కారమవ్వడం 



Sunday, July 27, 2014

కుక్క

భర్త : ఈ మధ్య అందరూ నన్ను కుక్కలా చూస్తున్నారు. 
భార్య : అదేం మాటలు. అలా మిమ్మల్ని మీరు తక్కువగా భావించకూడదు. 
భర్త : తక్కువకాదు, మన చంటి గాడు కూడా నన్ను అలానే చూస్తున్నాడు, నాకు చచ్చిపోవాలని అనిపిస్తూ ఉంటుంది. 
భార్య : అబ్బా, ఊరికే అలా మొరక్కండి, నలుగురూ వింటారు. 

Thursday, July 24, 2014

జుట్టు

భర్త : రజనీ డార్లింగ్, నీ సుకుమారమైన నీ జుట్టుని జాగ్రత్తగా చూసుకోవచ్చుగా...
భార్య : (సిగ్గు పడుతూ) మీరలా అంటుంటే నాకు సిగ్గేస్తోంది
భర్త  :అమ్మతోడు, మళ్ళీ ఇంకోసారి అన్నంలో నీ తల జుట్టు రావాలి, 'రజని 'ని 'గజని ' చేసేస్తా.  

Wednesday, July 23, 2014

టైం వేస్ట్

ఒక ఫాక్టరీలో ఒక వ్యక్తి ఎటువంటి బాధ్యతలేకుండా నేలవైపు చూస్తూ అనాలోచితంగా ఉంటాడు. 
అటుగా వెళ్ళే ఆ ఫాక్టరీ CEO ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి నీ జీతం ఎంత అని అడుగుతాడు.
వ్యక్తి : ఆరు వేలు సార్. 
CEO : నేను వర్కర్లకు జీతం ఇచ్చేది పని చెయ్యడానికి, టైం వేస్ట్ చెయ్యడానికి కాదు, ఇదిగో 18000, మూడు నెలల జీతం, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు.
ఆ వ్యక్తి డబ్బులు తీసుకొని అక్కడినుండి వెళతాడు,  అప్పుడు ఆ CEO మిగతా వర్కర్లను అడుగుతాడు ఎవరా వ్యక్తి అని, 
ఇంతలో వర్కర్లు చెబుతారు 'పిజ్జా బాయ్ సార్ ' 

windows 7

ఒకమ్మాయి తన వాట్సప్ గ్రూప్ లో స్నేహితులందరికీ ఇలా మెసేజ్ చేస్తుంది. 
'guys నేను windows 7 - 32 bit install రెండుసార్లు install చేస్తే 64bit అవుతుందా?'
దానికి అదే గ్రూపులోని ఇంకో అమ్మాయి 'నో యార్, అది windows 14 అవుతుంది.' 
All guys left the group 

Tuesday, July 22, 2014

బాధ్యత

ఒక వ్యక్తి హాస్పటల్ బెడ్ మీద చావు బ్రతుకుల మధ్య తన భార్యని పిలిచి ఇలా చెబుతాడు. 
'నువ్వు కూకట్ పల్లి లో ఉన్న పది అపార్ట్ మెంట్స్ తీసుకో',
పెద్దకొడుకుని పిలిచి 'నువ్వు దిల్ షుఖ్ నగర్ లోని మూడు షాపింగ్ మాల్స్, ఒక గుడి తీసుకో',
రెండో కొడుకుతో 'నువ్వు మెహదీ పట్నంలోని రెండు టెంపుల్స్ తీసుకో '
చిన్నోడిని పిలిచి 'ఒరేయ్ నువ్వు లకడికపూల్ లోని రెండు కాలనీలు తీసుకో',
కూతుర్ని పిలిచి 'నువ్వు శ్రీ నగర్ లోని రెండు స్వీట్ షాప్స్  తీసుకో' అని చెప్పి చనిపోతాడు. 
ఇంతలో ఇవన్నీ పక్కనే ఉండి వింటున్న నర్స్ అంటుంది 'మీ వారు చాలా గొప్పవారు కదా, పోతూ పోతూ బోలెడు ఆస్తి సంపాదించడమే కాకుండా 
బాధ్యతగా పంచిపెట్టి మరీ పోయారు ', 
'ఆస్తా పాడా మాది పాల వ్యాపారం, పాల ఖాతాలు అప్పచెప్పి పోయాడు సచ్చినోడు ' అని వాపోతుంది.  

Sunday, July 20, 2014

సంఘీ భావం

ఒకావిడ తన బాబుతో బస్ ఎక్కుతుంది. ఆ బాబుని చూసిన బస్ డ్రైవర్ ' మీ బాబు ఇంత ఛంఢాలంగా ఉన్నాడేంటి. ఇంత ఛంఢాలమైన బాబుని మొట్టమొదటిసారి చూస్తున్నా! ' అని అంటాడు
దానికావిడ  తన బాబుని పట్టుకొని రుసరుసలాడుతూ చివరి సీట్ లో కూర్చుని పక్కనున్న పెద్దాయనతో ఈ బస్ డ్రైవర్ తనతో అసభ్యంగా మాట్లాడాడని బోరుమంటుంది. . దానికా పెద్దాయన ' అవునా. వెళ్ళి బస్ ఆపి డ్రైవర్ని ఎడా పెడా వాయించి పడేయండి. కావాలంటే మీ కోతిపిల్లను నే పట్టుకుంటా' నంటాడు సంఘీ భావంతో.  

Friday, July 18, 2014

సోమవారం

భార్య : ఈ శనివారం, ఆదివారం ఎంజాయ్ చేద్దామా? 
భర్త : సరే మరి సోమవారం కలుద్దాం పద...

బిజినస్ మాన్

ఒకసారి ఒక పేద్ద బిజినస్ మాన్ కార్ లో వెళ్తూ వెళ్తూ ఒక ఫామిలీ రోడ్డు పక్కన గడ్డి తింటూ ఉండటం చూసి కార్ ఆపి వాళ్ళని ఇలా అడుగుతాడు 
బిజినెస్ మాన్ : 'మీరిలా గడ్డెందుకు తింటున్నారు?'
పేద యజమాని : మేము బాగా పేదోళ్ళమండి, తినడానికి తిండి లేక ఈ గడ్డి తింటున్నాం. 
అంతలో బిజినెస్ మాన్ కొంతసేపు దీర్ఘంగా ఆలోచించి వాళ్ళింటికి రమ్మని కారెక్కమంటాడు. 
పేద యజమాని: అయ్య మా తమ్ముడు వాళ్ళ కుటుంబం కూడా ఉంది రమ్మంటారా ? 
బిజినెస్ మాన్ : తీసుకురా, మీ కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకురా. 

వాళ్ళందరినీ ఇంటికి తీసుకెళ్ళాక, తన పెరడులోకి తీసుకెళ్ళీ బాగ ఏపుగా పెరిగిన గడ్డి చూపిస్తూ ఇలా చెప్తాడు 
' ఈ గడ్డంతా మీరు ఉచితంగా తినచ్చు, ఎవర్నడిగినా బాగా కూలి అడుగుతున్నారు '  

వినాశనం

ఒక బాస్ తన ఆఫీస్ లో ఉన్న ఉద్యోగులందరికీ ఇలా ప్రభోదం ఇస్తాడు
'ఒక రోజు వస్తుంది, ఆ రోజు తినడానికి తిండి దొరకదు, త్రాగడానికి మంచినీళ్ళు దొరకవు, 
పెట్రోల్, డీజిల్, కరెంట్ అన్నీ అంతం అవుతాయి. జనాలు ఒకర్నొకరు కొట్టుకు చస్తారు, ప్రపంచం సర్వ నాశనం అవుతుంది. '
ఇంతలో ఒక ఉద్యోగి ' సార్ , ఆ రోజు కూడా ఆఫీస్ కి రావాలా సార్ !' అని అడుగుతాడు అమాయకంగా 

Thursday, July 17, 2014

బిల్లెంత

ఒక కాలేజ్ అమ్మాయి సూపర్ మార్కెట్ కి వెళ్ళి ఇలా అడుగుతుంది
అమ్మాయి: పదిరూపాయల మాగి పాకెట్ ఒకటివ్వండి
షాప్ కీపర్ : ఇదిగో, ఇంకేంకావాలి. 
అమ్మాయి : ఇంకేం వద్దు. బిల్లెంతయ్యిందో చెప్పండి
షాప్ కీపర్ : ఆ 

Wednesday, July 16, 2014

టు వీలర్

నలుగురు కుర్రాళ్ళు ఒక మోటార్ సైకిల్ మీద పార్టీకి బయలుదేరుతారు. వాళ్ళూ రావడం చూసి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళని ఆపి ఇలా ఆడుగుతాడు
ట్రాఫిక్ పోలీస్ : టు వీలర్ మీద ముగ్గురు రావడమే నేరం అటువంటిది మీరు నలుగురు వస్తున్నారు, పదండి స్టేషన్ కి
ఇంతలో మోటార్ సైకిల్ నడుపుతున్న కుర్రాడు హఠాత్తుగా వెనక్కు చూసి
'వార్నీ, ఐదో వాడెక్కడ పడిపోయాడ్రా! ఇవ్వాళ పార్టీకి బిల్ కట్టాల్సింది వాడే '  

Tuesday, July 15, 2014

అశ్రద్ధ

డాక్టర్ : ఎంటి ప్రాబ్లం?
పేషంట్ : డాక్టర్, ఈ మధ్య నన్నెవరూ పట్టించుకోవట్లేదు. అందరూ అశ్రద్ద చేస్తున్నారు.
డాక్టర్ : అలాగా! next....

Monday, July 14, 2014

ఫిషింగ్ బాక్స్

ఒకసారి భర్త తన ఆఫీస్ నుండి తన భార్యకు కాల్ చేసి,
'డార్లింగ్ మా బాస్ ఒక వారం పాటు చైనాలో చేపలు పట్టడానికి రమ్మని తీసుకు వెళ్తున్నాడు, నన్ను కూడా రమ్మన్నాడు. నా ప్రమోషన్ గురించి అడగడానికి ఇడే మంచి సమయం. అట్టే సమయం లేదు, కొంచెం నా బట్టలు, ఫిషింగ్ బాక్స్ సర్దు. అటునుండి అతే తిన్నగా ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాలి, అన్నట్టు మర్చిపోయ బ్లూ షార్ట్ పెట్టడం మర్చిపోకు ' అంటాడు.
భార్యకి కొంత అనుమానంగానే ఉంటుంది. అయినా సరే అని సర్ది పెడుతుంది.  ఒక వారం అయిన తరువాత తిరిగొచ్చిన భర్తని చేపలెలా పట్టడం ఎలా అయిందని అడుగుతుంది. అప్పుడు ఆ భర్త ' చాలా బాగా జరిగింది. మేము బోలెడు చేపలు పట్టాం. బాగా ఎంజాయ్ చేశాం. ఇంతకీ బ్లూ షార్ట్ పెట్టలేదేం ' అని అడుగుతాడు.
అప్పుడా ఇల్లాలు 'ఓ పెట్టానుగా, అ ఫిషింగ్ బాక్స్ లో ' అంటుంది, భర్త వంక  గుర్రు గుర్రుగా చూస్తూ

ఇతరులు

జాన్ : నాన్నా, ఇతరులకు సహాయం చేయడానికే మనం ఇక్కడ ఉన్నామని ఫాదర్ మాథ్యూ చెప్పారు
నాన్న: నిజంగా మనం అందుకోసమే ఉన్నాం జాన్
జాన్: మరి ఇతరులు ఇక్కడ ఎందుకున్నట్లో?

Sunday, July 13, 2014

ఒక మార్వాడి,చైనీస్ ట్రైన్ లో ప్రయాణిస్తూఉంటారు. 
ఇంతలో హఠాత్తుగా ఒక బొద్దింక కంపార్ట్ మెంట్ లోకి వస్తుంది. చైనీస్ దాన్ని పట్టి గుటుక్కున మింగేస్తాడు. 
కొద్దిసేపటితరువాత అటుగా ఇంకో బొద్దింక వస్తుంది. ఈ సారి మార్వాడి అతను ఆ బొద్దింకను గబుక్కున పట్టేసుకొని చైనీస్ అతనికి చూపిస్తూ ఇలా అంటాడు : 
"కొంటావా? "  

సోషల్ నెట్ వర్కింగ్ ప్రభావం


జంబులింగం సోషల్ నెట్ వర్కింగ్ ప్రభావంవల్ల నిజ జీవితంలో కూడా అన్నింటినీ అలా పోల్చుకోవడం మొదలు పెడతాడు. 
- ఈమె నా భార్య గూగుల్ రాణి - ఒక్క మాట అడిగితే పది చెబుతుంది
- వీడు నా కొడుకు ఫేస్ బుక్ కుమార్ - ఇంట్లో విషయాలన్నీ మొత్తం కాలనీకి అందజేస్తాడు 
- ఈమె నా కూతురు  ట్విట్టెర్ కుమారి - కాలనీ మొత్తం దీన్ని ఫాలో అవుతుంది
- ఈమె మా అమ్మాజి వాట్సప్ మాత - రోజు మొత్తం బుడ్ బుడ్ అని చప్పుడు చేస్తూనే ఉంటుంది. 
- ఇంకా నేను ఆర్కుట్ లింగం - నేనొక బోడిలింగాన్ని. నన్నెవడూ పట్టించుకోడు  

లేడీస్ ఫస్ట్

టీచర్: ఈ వాక్యం సరిచేయి " ఎద్దూ, ఆవూ పరస్పరం తోసులాడుకుంటున్నాయి.
గిరీష్:  ఆవూ, ఎద్దూ పరస్పరం తోసులాడుకుంటున్నాయి.
టీచర్: దీంట్లో నువ్వు చేసిన మార్పు ఏమిటి?
గిరీష్: లేడీస్ ఫస్ట్

Saturday, July 12, 2014

బతికింఛడం కష్టం

ఒక భార్య తన భర్త ఆరోగ్యం బాగోలేదని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తుంది. 
డాక్టర్ ఈ విధంగా సలహా ఇస్తాడు
 - ఆరోగ్యవంతమైన ఆహారం మూడు పూటలూ ఇవ్వాలి
 - ఎప్పుడూ ఉత్సాహంగా ప్రశాంతంగా ఉండాలి 
 - రుచికరమైన ఆహారం వండిపెట్టాలి 
 - మీ కుటుంబ సమస్యలని చర్చించకుండా ఉండాలి 
 - ఫేస్ బుక్, వాట్సప్, టివి చూడనివ్వకూడదు 
 - నగలు ఆభరణాలు డిమాండ్ చెయ్యకూడదు 
ఈ విధంగా ఒక సంవత్సరం పాటు చేసినట్లైతే మీ వారు మీకు దక్కుతారు. 

తిరిగి ఇంటికి వెళ్ళేదారిలో భర్త భార్యని ఇలా అడుగుతాడు. 
భర్త : డాక్టరుగారు ఏమన్నారు? 
భార్య : బతికింఛడం కష్టం అన్నారు. 

Thursday, July 10, 2014

నిద్ర మత్తు

భర్త : నాకు ఎందుకో నిద్ర పట్టడం లేదే
భార్య : ఐతే వెళ్ళి బట్టలుతుకు పో
భర్త : అబ్బే, నిద్ర మత్తులో చెప్పానంతే

పోయేకాలం

పిల్లలనుండి సమాధానాలు రాబట్టాలనుకున్నాడు.
మాష్టారు: సూర్యుడు పడమట అస్తమించాడు. రాహుల్‌ ఇదేం కాలం చెప్పు?
రాహుల్‌: సాయంకాలం సార్‌..
మాస్టారు: అది కాదు బాబు బాగా ఆలోచించి చెప్పు.
రాహుల్‌:
 మరో ప్రశ్న అడగండి సార్‌.
మాస్టార్‌: శ్రీకృష్ణుడు కంసుడ్ని సంహరించెను. ఇదేం కాలం.
రాహుల్‌ : వాడికి పోయేకాలం సార్‌.!

Wednesday, July 9, 2014

అభిమాన రచయిత

టీచర్: మీ అభిమాన రచయిత ఎవరు?
పిల్లలు: జార్జి వాషింగ్టన్ టీచర్.
టీచర్: అలాగా.. జార్జి వాషింగ్టన్ ఏ పుస్తకమూ రాయలేదే?
పిల్లలు: అందుకే ఆయనంటే చెప్పలేనంత ఇష్టం టీచర్...

Tuesday, July 8, 2014

ఇండియన్ క్రికెట్

ఒక విలేఖరి జకోవిచ్ ని ఇలా అడుగుతాడు
రిపోర్టర్ : మీకు జోగీందర్ శర్మ తెలుసా?
జకోవిచ్ : హా తెలుసు, వన్ మాచ్ వండర్ బాయ్,
రిపోర్టర్ : వావ్, మీరు ఇండియన్ క్రికెట్ ఫాలో అవుతారా? 
జకోవిచ్ : ఫాలోనా పాడా, మొన్న మీరు షరపోవా కి చేసిన రచ్చకి ఇండియన్ క్రికెట్ మొత్తం హిస్టరీ చదివి చచ్చా, మిమ్మల్ని మీ మీడియాని తగలెయ్యా.   


(Note : ఈ మధ్యన షరపోవా సచిన్ తెలియదంటూ చేసిన వివాదాస్పద సంఘటనుద్దేశించి)

Monday, July 7, 2014

పట్టుదల

"పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్" అన్నాడు నరసింహం
"అలాగా.... అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం" ఎదురన్నాడు కుర్రాడు.

Saturday, July 5, 2014

ధనవంతులు

అబ్బాయి: నాన్నా! మనం అతి త్వరలో లంధనవంతు కాబోతున్నాం.
తండ్రి: ఎలా నాన్నా?
అబ్బాయి: రేపటిక్లాసులో మా లెక్కల టీచర్ నయాపైసల్ని రూపాయిగా మార్చడం ఎలాగో చెబుతారు మరి.

Friday, July 4, 2014

ఆదివారం సెలవు

తండ్రిః ఓ వ్యక్తి రోజుకు పదికిలోమీటర్ల చొప్పున నడిస్తే వారం రోజుల్లో 60 కిలోమీటర్లు ముందుకుపోతాడా? ఇదేం లెక్కరా?!
కుమారుడుః ఆదివారం సెలవు కాబట్టి ఆ రోజు నడవకుండా జాలీగా గడిపేసుంటాడని అలా చెప్పా డాడీ!!!

Thursday, July 3, 2014

Largest Number


మొదటిరోజు

మొట్టమొదటిసారి బడికెళ్ళొచ్చిన ఐదేళ్ళ శ్రావణిని వాళ్ళమ్మ అడుగుతుంది...
"బడి మొదటిరోజు ఎలా జరిగిందే? "
శ్రావణి: అదేంటమ్మా! మొదటిరోజంటున్నావు... మళ్ళీ వెళ్ళాలా?

దొంగనోటు

ఒకసారి ఒక వెంగళప్ప బాంకులో డబ్బులెయ్యడానికి వెల్తాడు.
క్యాషియర్ : మీ నోటు దొంగనోటు, వేరేది ఉంటే ఇవ్వండి.
వెంగళప్ప : నా ఖాతాలోనే కదా జమ చేసేది, అది దొంగ నోటైతే నీకేంటి, మంచినోటైతే నీకేంటి, మూసుకొని జమ చెయ్
క్యాషియర్ : ఆ !!!

Wednesday, July 2, 2014

చిల్లర

శంభులింగం : ఏంటి జంబూ క్షవరం అంత చిన్నగా చేయించావు?
జంభులింగం : ఎంలేదు శంభూ, ఆ మంగలాయన దగ్గర 4 రూపాయలు చిల్లర లేదన్నాడు, ఆ నాలుగు రూపాయలకి సరిపడా కత్తిరించమన్నా

టోటల్

టీచర్ : మీ అబ్బాయి పరీక్షల్లో తప్పాడండీ , చూడండి ప్రోగ్రెస్ రిపోర్టు, మాథ్స్ లో 15, ఇంగ్లీషులో 20, హిందీలో 18, ఫిజిక్స్ 13, కెమిస్త్రీ15, సోషల్ 13, టోటల్ 98
వెంగళప్ప : ఈ టోటల్ లో భీభత్సం సృషించేశాడు, ఇంతకీ ఈ subject కి టిచర్ ఎవరండీ?

Tuesday, July 1, 2014

బాంబులు

శంభులింగం, జంభులింగం రోడ్డుమీద వెల్తుండగా రెండు బాంబులు దొరుకుతాయి.
జంభులింగం : పదరా పోలిస్ స్టేషన్ కి తీసుకువెళ్ళి రిపోర్ట్ ఇద్దాం.
శంభులింగం : ఉండరా, ఒకవేళ ఏదైనా బాంబు దారి మధ్యలోనే పేలిపోతే?
జంభులింగం : దాందేముందిరా, ఒకటే దొరికిందని చెబితే సరి.
Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version