Sunday, April 30, 2017

మే డే

పగలనక, రాత్రనక
"వాట్సాప్", "ఫేస్ బుక్" లలో కష్టపడుతున్న శ్రామికులందరికీ
"మే డే" (May Day) శుభాకాంక్షలు....!

Thursday, April 27, 2017

బాహుబ‌లి

సెల‌వు ప‌త్ర‌ము

తేదీ 27.04.2017

గౌర‌వ‌నీయులైన సీఈవో గారికి,

విష‌యం : విడుదల రోజు  బాహుబ‌లి-2 సినిమా  చూడ‌డానికి శుక్రవారం సెల‌వు  గురించి.

నేను మీ కంపెనీలో ప‌నిచేసే స‌గ‌టు ఉద్యోగిని. నాకు ఈ శుక్ర‌వారం సెలవు కావాలి. ఎందుకంటే నా ఫ్యామిలీకి బాహుబ‌లి సినిమా చూపించ‌డం కోసం. సినిమా చూడ‌డానికి సెల‌వెందుకు అని మీర‌డ‌గ‌వ‌చ్చు. కానీ ఈ సినిమా చూపించ‌క‌పోతే  నా ఫ్యామిలీ నాకు  ద‌క్కేట్టు లేదు.

•నా కొడుకు గ‌డికోసారి నేనెవ‌ర్నీ…. నేనెవ‌ర్నీ… అని అరుస్తున్నాడు.
•నా కూతురు జై మాయుష్మ‌తీ అంటూ నిద్ర‌లో క‌ల‌వ‌రిస్తుంది.
•నా భార్య అయితే మాటిమాటికీ మాయిష్మ‌తికి మ‌కిలి ప‌ట్టిందీ…. ర‌క్తంతో క‌డిగేయ్‌… అంటూ దిక్కులు పెక్క‌టిల్లేలా అరుస్తుంది.
• నాకేమో భల్లాల దేవ కల్లోకి వస్తున్నాడు… అప్పుడప్పుడు అవంతిక  డ్రీమ్స్ లోకి  వచ్చి టెంప్ట్ చేస్తుందనుకోండి (ఇది పర్సనల్)
•నిన్న రాత్రి మా ముసలామె యాక్షన్, కెమెరా అంటూ  ఆగమాగం చేసింది. ఓసేయ్ ముసలి ఏమయ్యిందే నీకు అంటే …అరెేయ్ నన్ను డిస్టర్బ్ జేయకు నేను రాజమౌళి ని అంటూ మల్లీ యాక్షన్, కెమెరా, స్టార్ట్ అంటుంది.
•సినిమా చూడగానే ప్రతి ఒక్కడు వచ్చి “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో చెప్పేస్తుంటారు..” అది విని నేను సహించలేను. సో..నేనే తెలుసుకుంటా!
•దేవసేన మహారాణి (అనుష్క) ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది (ఇది పర్సనల్)

సార్ ఇక నా వల్ల కాదు….ఆ మోషన్ పిక్చర్ చూపించ‌క‌పోతే మావాళ్లు నాకు మోష‌న్స్ తెప్పించేలా ఉన్నారు. మూడు సంవ‌త్స‌రాలు సినిమా షూటింగ్ అయ్యేదాకా ఆగారు. కానీ సినిమా రిలీజ్ డేట్ ప్ర‌క‌టించాక మూడు నిమిషాలు కూడా ఆగేలా లేరు నా ఫ్యామిలీ మెంబర్స్.

కాబ‌ట్టి పై విష‌యాల‌ను దృష్టిలో ఉంచుకుని నాకు శుక్రవారం  సెల‌వు ఇవ్వ‌గ‌ల‌ర‌ని నా మ‌న‌వి.

                                                                                                                                         కృత‌జ్ఞతాభినంద‌న‌ల‌తో…
మీ విధేయుడు అమ‌రేంద్ర బాహుబ‌లి
సారీ… స‌ర్సినిమా సీను

Wednesday, April 26, 2017

సాఫ్ట్వెర్ క్షాత్రపరీక్ష

ఏమంటివి!!...
ఏమంటివి!!...

బగ్గు నెపమున ఈ మృదుపరికరణ నిపుణుని (software professional) కి ఇందు పని చేయుటకు అర్హత లేదందువా?

ఎంత మాటా!!...
ఎంత మాటా!!...

ఇది యూనిట్ టెస్టింగే (Unit Testing) ఏ కానీ యూజరాక్సెప్టన్స్ (Useracceptance Testing) కాదే..!!
కాదూ కాకూడదూ,
ఇందు బగ్స్ రాకూడదూ అందువా....??

అయిన ఈ ప్రాజెక్ట్ లీడ్ కోడింగ్ ఎట్టిది?
అతి జుగుప్సాకరమైన
నీ కోడింగ్ ఎట్టిది?
గూగుల్ లో కాపీ కొట్టితివి కదా హా..హా..హా
నీది ఏమి కోడింగు??

అంత ఏల మన కంపెనీ పితామహుడు , సాఫ్ట్ వేర్ లో కురువృధ్ధుడు అయిన మన సిఈఓ(CEO) బగ్గు ఫిక్సు చెయ్యలేక పాత కంపెనీ నుండి పారిపోయి రాలేదా?? ఆయనదే కోడింగు..??

నాతో చెప్పింతువేమయ్యా..!!
ఈ కోడింగు మొదలుపెట్టిన నువ్వు...
వర్షన్ 1.1 ని...
దాన్ని రివ్యూ చేసిన నీ టియల్ (TL) వర్షన్ 1.2 ని....
అందులో బగ్గు ఫిక్స్ చేసిన నీ పియల్(PL) వర్షన్ 1.3 ని.... తయారు చెయ్యలేదా...??

సందర్భావసరాల బట్టి .. కాస్టు కటింగు (Cost Cutting) ప్రాధాన్యంతో.. తయారయిన మన కోడ్ ఏనాడో బగ్సుపరమైనది.
కాగా నేడు బగ్గు.. బగ్గు.. అని ఈ వ్యర్ధవాదనెందులకు?

Tuesday, April 25, 2017

సుసు

ఒకటో తరగతి విద్యార్ది పరీక్ష హాల్ లో సుసు (#1) పోసాడు.
టీచర్ : ఇదేంటి ఇలా చేసావు?
విద్యార్ది : మా అమ్మ చెప్పింది టీచర్, లెక్కల పేపర్ చూసిన తరువాత నీకు మొదట ఏది వస్తే అది చేసేయ్ అని......

Thursday, April 20, 2017

తెంగ్లీష్

Okay Tea ... :)
Rain Do
Move Do
Null go
I Do
Are You?
Yeah Do!
Enemy The
Tom me the
Paddy
..
.
....
...
..
.
Confused
ఏం లేదండి.. చెంచు లక్ష్మీ ఒకటి నుంచి 10 వరకు అంకెలు లెక్కిస్తోంది..

కావాలంటే మరోసారి చదవండి.

Friday, April 14, 2017

గారెల రాజ్యం


గారెల రాజ్యంలో పులిహోర పురం రాజధానిగా, దద్దోజనం చక్రవర్తి , చక్రపొంగలి  రాణితో ,మలై కాజా మహా మంత్రి సలహాలతో ,సమోసా సైన్యధిపతిగా, పరిపాలిస్తుండగా, అతడి తమ్ముడు అప్పాలు ,వంకాయ బజ్జీ వంకర మాటలువిని, వేడి వేడి పకోడీల్లా వేరుపడి.......
.కుడుముల రాజ్యం చేసుకుని, రవ్వ లడ్డు రాజధానిగా , మిరపకాయ బజ్జీ మంత్రిగా, సేమ్యాపాయసం సేనానిగా రాజ్యపాలన చేయాలని నిప్పంట్టంత నీల్గి ,నీరుల్లి వడలా వగ పడ్డాడు.
మడత కాజా లెవల్లోని లేఖకునితో అన్నకు కట్లెట్ భాషలో కమ్మగా వ్రాసి కలాకండతో కబురంపాడు.  లడ్డు బుట్టలో లేఖ పట్టుకుని, మిర్ఛి బజ్జీ బండిలో, తీపి గారెల కబుర్లు వింటూ,
కలాకండ వెళుతుండగా, ఇది వేసవి కాలం కావటాన.... 
వేరుశనగ ఉండల్లా  వడదెబ్బతగిలి , పరమాన్నపురంలో , సున్నుండల సలహాతో,
ఇడ్లీ ఇంట విశ్రమించి , మినపట్టు మెడికల్ సేవలతో, మొక్క జొన్న వడల మందేసుకుని,
టమాట జామ్ తో సేదతీరి, పాయసం ఫలహారం చేసి, మసాలా పకోడితో మంచం దిగి, బ్రెడ్ హల్వా బండిలో , కరివేప వడ కళ్ళెం పట్టుకోగా , పాలకోవా బాట చూపగా,  పుణుగులు కట్టిన బండి పరుగెత్తసాగింది.
.
వెజిటబుల్ వడ వెంట వస్తుండగా, బర్ఫీ బిగువుతో , సున్ని ఉండల కొండలూ, కజ్జికాయల కోనలూ, పూతరేకుల పర్వతాలూ, సగ్గుబియ్యపాయస సముద్రాలూ,  ఖర్జూరం హల్వా  కోనేరునూ, కొబ్బరి పాయసపు కొలనునూ, జాంగ్రీల  జాగీరు నూ దాటుకుని  , ఆలూ వడ అరణ్యంలో ప్రవేసించగా, బూరెల దొంగలూ, కట్లెట్ కర్రలతో, అడ్డుకోగా , రవ్వ కజ్జి కాయల రక్షకులు ,బూందీ లడ్డు బూరలూది , కాజాల జాగిలాలను రప్పించి, సేమ్యా హల్వా శూలాలతో ,  బొబ్బట్లు బొబ్బల తో  భయపెట్టగా , తొక్కుడు లడ్డు దొంగలంతా , ఆవడల అరణ్యంలోకి పారిపోయారు.
.
రాజభక్తి గల రవ్వ కేసరి , వడియాల వేగులూ , బఠానీ వడబంట్రోతులు , చెర్రి జామ్  చారులూ, కలాకండ కారణం లేని రాక తెల్సుకుని, అన్నం పరవాన్నం పారించి, ఉల్లిపాయ పకోడి, అరటికాయ బజ్జీలూ దారికడ్డం వేసి ,అరిసెలు బండి అడ్డంపెట్టి , ఊతప్పం తో వళ్ళంతా వాతలేసి, గవ్వలతో గవదలూడ గొట్టి, పాలకోవా బిళ్ళలతో పళ్ళు పీకి, బాదం కేకుతో బాది, కొబ్బరి ఖీర్ కొరడాతో కొట్టి, గులాబ్ జామ్లతో గుచ్చి గుచ్చి , ఉల్లిపాయ వడియపు తాళ్లతో కట్టేసి, పాయసం తో పనిష్ చేసి, బొంగుమిఠాయ్ తో బొమికెలు విరగ్గొట్టి  ,అదిరి పోయే అల్లం ,బెల్లం పచ్చడి- మిర్చి బజ్జీతో మిక్స్ చేసి పట్టించి, ఖర్జూరం హల్వా ఖైదులో వేశారు.
.
చిమ్మిరుండల చారులూ, సజ్జప్పాల సమాచరకులూ, వెనిల్లా వేగులూ ,అప్పచ్చుల ఆత్మీయులూ అదించిన ఈ సమాచారం విని , బూంది బాబాయ్  పెట్టిన భయంతో , కొబ్బరి వడలా వణికిపోయి, మిర్ఛి బజ్జీ మైత్రితో, పెసరట్టు దొంగ ప్రేమతో, మైసూరుపాక్ మైత్రితో , జీళ్ళ జాయింట్లు జారిపోయి ,చిలకడ దుంపల లడ్డులా చింతించి, సజ్జ బూరెల్లా స్వాంతనపడి,  పెసర అప్పడాల్లా పశ్చాత్తాపపడి, ఖర్జూరం హల్వాలా కుళ్ళికుళ్ళీ ఏడ్వగా,కరుణగల క్యారట్ పాయసపుదేవుని  కారుణ్యంతో, మైసూరు బజ్జీ బుజ్జగింపులతో మనసుమారి, మినప్పిండి అప్పడాల్లా  ముసిరిన ఆలోచనలు వదిలి, నువ్వుండల నయ వంచకత్వం , చెగోడీల  చెప్పుడు మాటలూ, బీరకాయ బజ్జీ బీరాలూ ,జిలేబీల జాడ్యాలూ అంటించినవి  వదలుకుని , అప్పాల్లా ఆగి ఆగి, క్యారట్ కేక్ లా కేకలేసి, ఉండ్రాళ్ళ లాపొర్లి పొర్లి, హల్వా లా అరచి అరచి, బొబ్బట్ల లా బొబ్బలేసి, వేరుశనగ ఉండలా వేరుపడాలన్న తన చెడు చింతనకు , పూర్ణం లా పూర్తిగా మారిపోయి, బాదం ఐస్ క్రీం లా పశ్చాత్తాపపడి, బాస్మతి బియ్యపు పరవాన్నంలో  , స్పాంజ్ కేక్ తోస్నానం, చేసి , సగ్గుబియ్యం  వడియంలా శుధ్ధిపడి, బ్రెడ్ హల్వాకేకుతో భయంతీరి, జీడిపప్పు మైసూరుపాక్ లాంటి "అన్నప్రేమ " తల్చుకుని,  మైమరచి, ఐస్ క్రీం లాంటి అన్నతనను క్షమించే లా చేయమని , ఉప్మా తో దేవుని ఉపాసించి , పైనాపిల్ కేక్ లా ఫ్రండ్సును పక్కకు నెట్టి , తనకు జీడిపప్పు అచ్చు జాడ్యం వదలి నందుకు , పిండి వడియంలా  పరవసించి, అప్పడాల వంటి అన్నను చూడాలని, పకోడి పళ్ళెం పట్టుకుని, బూరెల బ్యాగ్ భుజానికి తగిలించుకుని, కొబ్బరి బొబ్బట్లు కొన్ని తీసుకుని,  ప్రియమైన వదిన కోసం పెసరపిండి వడియాలు , స్నేహితుల కోసం  సొరకాయ వడియాలు, మరికొందరి కోసం కొబ్బరి క్యాబేజి వడలు, ప్రేక్షకుల కోసం పాన్ కేక్సూ , కొలువులోవారి కోసం  కొబ్బరి ఉండలు  , సేవకుల కోసం సగ్గు బియ్యం పాయసం,తీసుకుని  అన్నపు పాయసం లాంటి అన్నను చేరి, , కొబ్బరి హల్వా  పాయసం వంటి పాదాలు పట్టుకుని , కోకోనట్ కేక్ లా కేక లేసి ఏడ్వగా , అన్న ఆల్మండ్ చాకొలెట్‌ బార్  లా కౌగలించుకుని , తీపికాజా లాంటి తమ్ముడ్ని, ఆవడలా ఆలింగనం చేసుకుని , బూడిద గుమ్మడి వడియాలవంటి బుగ్గలు ముద్దాడి,  బిడియ పడవద్దని బియ్యం పిండి వడియాల విందిచ్చాడు. రవ్వ లడ్డు లాంటి  వారి లవ్వుకు శాండ్ విచ్ వంటి సభికులంతా  ఆవపెట్టిన  పనసపొట్టు కూరలా ఆనందించారు 😁
.
#నోట్:: ఏమైనా మన తెలుగు రాష్త్రాల్లో లభించే మన తెలుగు ఫుడ్ ఐటమ్స్ ని మర్చిపోయుంటే గుర్తుచేయగలరు.

బెంజిసర్కిల్

అన్నా, బెంజిసర్కిల్ కి ఎలా వెళ్లాలి?
తమ్ముడు: బుడమేరు వంతెన దిగాక "శ్రీదేవి బార్" వస్తుంది..
అది దాటాక.. బీఆర్టీయస్ రోడ్ లో "కీర్తివైన్స్" రైట్ సైడ్ రోడ్ లో నేరుగా వెళ్లాక చుట్టుగుంట వద్ద "ధర్మతేజ బార్" మీదుగా వెళితే మెగల్రాజపురం "నైస్ బార్" వస్తుంది..
అక్కడి నుండి రైట్ సైడ్ రోడ్ లో చివరికి వెళితే "డింపుల్ బార్"  వస్తుంది..
అక్కడి నుండి లెఫ్ట్ రోడ్ స్ట్రైట్ గా వెళితే "సిటి సెంట్రల్ బార్" మీదుగా "బెంజివైన్స్" దగ్గర ఆగు..
అదే బెంజిసర్కిల్!!

Wednesday, April 12, 2017

ఈనాటి లాలి పాట

_లాలీ...లాలీ...లాలి లాలి_
_లాలీ...లాలీ...లాలి లాలి_

_వటపత్రశాయికి WhatsApp లాలి_
_రాజీవ నేత్రునికి Redmi లాలి_
_మురిపాల కృష్ణునికి Microsoft లాలి_
_జగమేలు స్వామికి Java లాలి_

_కల్యాణరామునికి Candy Crush లాలి_
_యదువింశ విభునికి YouTube లాలి_
_కరిరాజ ముఖునికి Talking Tom లాలి_
_పరమాంశభవునికి Paytm లాలి_

_అలమేలు పతికి Amazon లాలి_
_కోదండరామునికి Cricbuzz లాలి_
_శ్యామలాంగునికి SHAREit లాలి_
_ఆగమనుతినికి Android లాలి_

_లాలీ...లాలీ...లాలి లాలి_
_లాలీ...లాలీ...లాలి లాలి_

Tuesday, April 11, 2017

రావణుడు

రావణుడి బొమ్మ తగలబెట్టడానికి వచ్చిన ప్రజలకు బొమ్మలో నుండి రావణుడి గొంతు వినిపించింది...
'నన్నెందుకు కాలుస్తారు. నేను మీ భార్యలనేమైనా ఎత్తుకెళ్లానా?'
ఇంతలో గుంపులో నుండి ఎవరో సమాధానమిచ్చారు.
'లేదు. అందుకే తగలబెడుతున్నాం'

Saturday, April 8, 2017

పెళ్లి

ఓ రోజు భర్త తన బెస్ట్ ఫ్రెండ్ ని భోజనానికని ఇంటికి తీసుకొచ్చాడు. వాళ్ళు ఇంటి కొచ్చాక గాని తెలీదు భార్యకీ విషయం..

దాంతో గట్టిగా అరిచింది భర్త పై "ఎవరి నైనా డిన్నర్ కి పిలిస్తే నాకు ముందుగా చెప్పాలి గదా, నన్ను చుడండి నైటీ లో పనిమనిషిలా వున్నాను, ఇల్లంతా చిందర వందరగా బాయ్స్ హాస్టల్ రూంలా వుంది, కూరలు లేవు, అసలు మీకు బుద్దున్దా అని అడుగుతున్నాను"

దానికి భర్త తాపీగా "వాడికి వచ్చే వారమే పెళ్లి, ఇవన్నీ తెలుసు కుంటాడనే పిలిచానే, నువ్వేం కంగారుపడకు, ఉప్మా చేసి పడేయ్ తెలిసొస్తుంది వెదవకి పెళ్లంటే ఏంటో"l

Thursday, April 6, 2017

మాట

తల్లితో ప్రేమగా మాట్లాడాలి...!
తండ్రితో మర్యాదగా మాట్లాడాలి...!
అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళతో అభిమానంగా మాట్లాడాలి...!
గురువులతో గౌరవంగా మాట్లాడాలి...!
మిత్రులతో మనస్ఫూర్తిగా మాట్లాడాలి...!
బావా, బామర్దులతో వెటకారంగా మాట్లాడాలి...!
మరి భార్యతో...
.
.
.
.
.
అంత సినిమా లేదు గాని... నోరు మూస్కుని ఆవిడ చెప్పింది "వినాలి"...!

Wednesday, April 5, 2017

చెవుడు

భిక్షగాడు : అమ్మా తల్లీ......ధర్మం చేయండమ్మా......
నేను మూగవాణ్ణి ...
కాస్త దయచూపండమ్మా...
గృహిణి : పక్క ఇంట్లో అడుక్కో బాబూ...
నాకు చెవుడు ....వినిపించదు.....

ఎగ్జాం

పూజ: నేను ఎగ్జాం లో పాస్ అయినందుకు మా నాన్న నాకు 3500 పెట్టి కొత్త డ్రెస్ కొనిపెట్టాడు తెలుసా?
దిలీప్: ఓస్ అంతేనా? నేను ఫెయిల్ అయితే మా నాన్న 3,50,000 పెట్తి కొత్త బండి కొనిపెట్టాడు తెలుసా?
పూజ: అవునా? ఓహ్.. సూపర్...
దిలీప్: ఎంటి సూపరు? కొత్త ' ట్రాక్టర్ ' కొని, రేపటి నుండి పొలం దున్నడం మొదలెట్టమన్నాడు...😆😆😆😆

Tuesday, April 4, 2017

సుఖం

కట్టుకున్నదాన్ని సుఖపెట్టు అని చెప్పాడు గురువుగారు..

👉లుంగీని ఉతక్కుండా మడతపెట్టి బీరువాలో పెట్టాడు శిష్యుడు..

Monday, April 3, 2017

జీవన సత్యం


Pen✒  😔 పోతే ☝ కొత్త ✒ pen 💰కొనుక్కోవచ్చు
కానీ ☝ దాని  cap🔌
పోతే 😔కొత్త  cap✒  కొనలేము👎అందుకే మిత్రులారా..
☝ జీవితం లో ✨ ఒక్క
👆విషయం 😴 ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి,👬 👭
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
పెన్ను ✒ ఎప్పుడూ ☝
" టిక్కు-టిక్కు " కొట్టుకునేది తీసుకోండి !
😉 😂 😆

Sunday, April 2, 2017

దేవుడి బొమ్మ

"దేవుడి బొమ్మ"
టీచర్ : పిల్లలు ! దేవుడి బొమ్మ గీసి చూపించండి.
చింటు : ఇదిగో టీచర్ !
టీచర్ : కనిపించడం లేదే...
చింటు : దేవుడు కంటికి కనిపించదని మీరే చెప్పారుగా టీచర్ !!
టీచర్ : ఆ ఆ ...??????

Saturday, April 1, 2017

నిత్య సత్యాలు


బంధువు భోజనానికి లొంగుతాడు! స్నేహితుడు సీసాకి లొంగుతాడు.!
####
ఒక సందేశాన్ని అత్యంత వేగంగా చేరవేయాలంటే "ఈమైయిల్" అయినా ఉండాలి లేదా "ఫీమేల్" అయినా ఉండాలి. రెండవది మరింత వేగంగా చేరవేస్తుంది.!
####
భార్య సంతోషంగా ఉన్నపుడు భర్తచొక్కాను ఉతుకుతుంది!
కోపంగా ఉన్నపుడు వంటిమీద చొక్కాను ఉతుకుతుంది.!
###
ఆడవాళ్లు పికాసో చిత్రం లాంటివారు. అర్ధంకారు గానీ అందంగా ఉంటారు.!
####
ఈరోజుల్లో వాస్తు కలరాలాగా వ్యాపించింది. కొత్త ఇంటిలో కుడికాలు పెట్టటం వరకు బాగానేవుంది. కానీ కొత్త డ్రాయరులో కూడా కుడికాలు పెడుతున్నారు.!
####
Arranged Marriage అంటే దారిలో వెళుతున్నపుడు పాము అనుకోకుండా వచ్చి కాటు వేయటం. Love Marriage అంటే పుట్ట దగ్గరకువెళ్లి కాటు వేయించుకోవటం.!
####
వందమంది తలచుకుంటే ఒకడిని పిచ్చివాడిగా చేయటం చాలాఈజీ. అదేపిచ్చివాడు తలచుకుంటే స్వామీజీ అవతారమెత్తి కోటిమందిని పిచ్చివాళ్లుగా మార్చటం ఇంకాఈజీ.!
☺☺😁😁

సంస్కారం

😊😊😊
పెళ్లి మండపంలో వంచిన తల ఎత్తకుండా అరగంట నుండి కూర్చున్న పెళ్ళి కూతుర్ని చూసి ముగ్దురాలైన కాంతం..
"ఏమండీ ..అమ్మాయిని చూసారా .ఏమి సంస్కారం ..ఏమి ఒద్దిక ,పొందిక .ఈకాలంలో కూడా ఇలా గంటల తరబడి తలొంచుకుని కూర్చునే ఆడపిల్ల దొరకడం అదృష్టమే " అంది భర్తతో .
"సంస్కారమా మునక్కాయా ..జాగ్రత్తగా చూడు .పెళ్లికూతురు నెట్ ఆన్ చేస్కుని   ఫేస్ బుక్ ,వాట్సాఅప్ లో చాటింగ్ చేస్తూ బిజీగా ఉంది ." కనకారావు .
Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version