Tuesday, February 28, 2017

మానసిక సర్వే

*"పెళ్ళాల"పై ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించిన మానసిక సర్వేలో వెలుగు చూసిన భయంకరమైన నిజాలు..*
ప్రపంచంలో అందరికన్నా మంచివాడు - వాళ్ళ *నాన్న*
ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ వ్రేమించే మనిషి - వాళ్ళ *అమ్మ*
ప్రపంచంలో అందరికన్నా తెలివైనది - *తనే*
ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ కష్టాలు పడేవాడు - తన *తమ్ముడు*
ప్రపంచంలో అందరికన్నా కిరాతకమైనది - తన *ఆడపడుచు*
ప్రపంచంలో అందరికన్నా అందమైన అబ్బాయి - తన *కొడుకు*
ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ విజయం సాధించేది - తన *చెల్లి మొగుడు*
ప్రపంచంలో అందరికన్నా చెడ్డవాడు, అబద్ధాలు చెప్పేవాడు, స్వార్దపరుడు, పనికిరాని వాడు, - *తన భర్త*
.......................................................
ఈ జన్మకు ఇంతే...........
నవ్వండి, ఇంతకు మించి ఏమి చేయలేము...

సమాధి

ఒక మహిళా తన భర్త సమాధి వద్దకు వెళ్లి బిగ్గరగా రోదిస్తూ ఇలా అంది..
ఏవండీ బాబు స్కూలుకెళ్లడానికి కొత్త బూట్లు కావాలంటున్నాడండి ఇప్పుడు నేనేం చెయ్యాలి ?
పాపకు మొబైల్ కావాలంట ఇప్పుడెక్కడినుండి తీసుకురాను ...?
నేను కట్టుకునే చీరలు చినిగిపోయే స్థితి లో వున్నాయి కొత్తయి కావాలి ఇప్పుడెలాగండీ ?
అప్పుడు సమాధిలోనుండి చిన్నగా కోపంతో మాటలు  వినిపించాయి  ఏమని అంటే ...
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
..
.
..
.
.
.
..
...
.
.
..
.
..
.
.
.
.
.
..
...
ఒసేయ్ నేను సచ్చిపోయానే....  సౌదీ పోలేదే....
😆😆😝 Good night...

Monday, February 27, 2017

దీరోదాత్తుడు

పెళ్లాన్ని కొట్టిన ఒక ధీరోదాత్తుడి ని కోర్టులో ప్రవేశ పెట్టారు.
జడ్జి అతడిని .....  ఈర్షగా చూస్తుండగా .......... 
లాయర్ : " ముద్దాయి సచ్చిలుడు , ఇదో క్షణిక ఆవేశం లో బార్య మీద చెయ్యి చేసుకున్నాడు .మొదటి తప్పుగా క్షమించి వదిలెయ్యవలసినదిగా కోర్టుకి విన్నవించుకుంటున్నాను."
జడ్జి గారు (తాను చేయలేని పని చేసిన అతడిని  ... మనసు లోపల మెచ్చుకుని) : " కోర్టు వారు అతడిని ...  మొదటి తప్పిదం గా భావించి మందలించి వదిలేస్తున్నారు " అని తీర్పునిచ్చారు.
మూడో రోజు .....  అదే దీరోదాత్తుడిని ....  అదే కారణంతో  ....  అదే జడ్జి ముందు ప్రవేశపెట్టారు.
ఈసారి జడ్జి గారు అతడిని ... ఉపేక్షించ దలుచు కోలేదు.
అతడి కి శిక్ష విదించే లోపు
ముద్దాయి : " అయ్యా నేను ఏమయినా కోర్టుకి చెప్పు కోవచ్చా అని అడిగాడు "
జడ్జి గారు తన నల్ల కళ్ళజోడు లోంచి చూస్తూ " సరే ... ఏమన్నా చెప్పదలచుకుంటే ...‌ సూటిగా చెప్పండి "
ముద్దాయి : "అయ్యా .. మొన్న మీరు వదిలేశారా ఆ ఆనందం తో కొద్దిగా ఒక్క బాటిల్ కొనుక్కుని ... ఒకే ఒక్క పెగ్గు తాగుదామని ...  తాగాను. కానీ, దానివల్ల పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. అందుకని రెగ్యులర్ గా తీసుకునే మోతాదు తాగి ఇంటికి జాగ్రత్తగా వెళ్ళా  .... "
జడ్జి శ్రద్దగా వినడం గమనించిన దీరోదాత్తుడు రెట్టించిన ఉత్సాహంతో  "  ..... వాకిట్లోనే అందుకుందండి. బండగొంతు వేసుకుని .... 'వచ్చావా ? మళ్ళీ తాగొచ్చావా? ఆ పనికి మాలిన తాగుడు మానవు గదా?' అని గదమాయించినా ...   నేనేమీ మాట్లాడకుండా ... గమ్మున లోపలికి వెళ్ళాను.. అలా ఇంటి లోపలికి వెళ్లానోలేదో  మళ్లీ అందుకుందండీ ...‌ "పనికి మాలిన వెదవ, పని లేదు పాడు లేదు తాగటం , తిరగటం , సిగ్గా శరమా , దున్నపోతు మీద వాన కురిస్తే ఏమి? కుడితి పోస్తే ఏమి?'
అయినా కూడా నేను ఏమీ అనకుండా మెల్లకున్నానండి.
అప్పటికీ నేను ఏమి అనలేదు అయ్యా .. నా గదిలోకి పోతున్నాను ..‌... మళ్లా బొంగురు గొంతేసుకొని వీదిలో అందరికీ వినిపించేలా .... ' ఆ జడ్గి గాడు ఒక పనికి మాలిన ఏబ్రాసి, సన్నాసి. వాడు సరయినోడు అయితే ఈ పాటికి నువ్వు జైల్లో వు‌ండాల్సినోడివి.. ఇత్తడి చెంబుకు జనప నార అతికించినట్లు వాడు వాడి మొఖం. ఎంగిలి బీడీలు ఎరుకుని తాగే యదవ, అసలు ఎలా అయ్యాడు జడ్జి ... , పెంటమీద చిత్తుకాగితాలు ఏరుకునే అంట వెధవా వాడూనూ ............. "
జడ్జి .... అతడిని మధ్యలోనే .... ఆపి " ఇక నువ్వు వెళ్ళోచ్చు"
.
పోలీస్ వైపు తిరిగి "ఈ సారి మర్డర్ చేసినా ..... ఇతని మీద కేసు పెట్టకండి"

కంట్రోల్లో ఉండేవారు

ఒక సారి దేవుడు స్వర్గలోకంలో ఉన్న భార్య,భర్తలందరిని పిలచి ఒక మీటింగ్ ఏర్పాటు చేసాడు
దేవుడు: భర్తలందరూ రెండు లైన్ లలో నించోండి.
*ఒకటో లైన్లో భార్య కంట్రోల్లో ఉండేవారు*
*రెండో లైన్లో భార్యను కంట్రోల్లో పెట్టేవారు*
అందరూ ఒకటో లైన్ లోకి వెళ్ళి పోయారు
ఒక్కడు మాత్రం రెండో లైన్లో ఉన్నాడు
దేవుడు: ఆశ్చర్యంగా నువ్వు ఒక్కడివన్నమాట భార్యను కంట్రోల్లో ఉంచేది.
భర్త : ఊరుకోండి సార్..
*మా ఆవిడే చెప్పింది నన్ను ఇక్కడ నుంచోమని
😋😝😛😜

Sunday, February 26, 2017

రూపాయి నాణెం

ముగ్గురు కాలేజీ కుర్రాళ్ళు ఆ రాత్రికి ఏం చేయాలా అన్న ఆలోచనలో పడ్డారు.
అందులో ఓ కుర్రాడికి బ్రహ్మాండమైన అయిడియా వచ్చింది.
మనం ఓ రూపాయి నాణెం ఎగరేద్దాం.
బొమ్మపడితే సినిమాకెళదాం.
బొరుసు పడితే కాబరేడాన్స్‌కెళదాం.
ఒకవేళ అది అంచుమీద నిలబడితే "చదువుకుందాం".

Thursday, February 23, 2017

తాగుబోతు

ఓ తాగుబోతు ... ఫ్రెండ్స్ కోసం పార్టీ ని బయట ఏర్పాటు చేసి.  .ఇంట్లో వున్నా మేకని ... ఎవరికీ తెలీకుండా ... ఎత్తుకెళ్లి పార్టీ చేసాడు.

రాత్రి అంతా .....  పార్టీ లో బాగా మస్త్ మజా చేసాడు ఫ్రెండ్స్ తో...... చాలా ఎంజాయ్ చేసారు అందరూ

ఉదయన్నే హుషారుగా ... సంత్రుప్తిగా ఇంటికెళ్లాడు...

ఆరుబయటే  నిలబడి పోయాడు ఆశ్ఛర్యo తో... ఇంటిముందర గుంజకి కట్టి వున్న మేకని చూసి ....

లోపలికె వెళ్ళి .... భార్య తో

భర్త : " మేక ఎక్కడ నుండి వచ్చింది ? "

భార్య : " మేక సంగతి తరువాత .... రాత్రి నుండీ ... మన కుక్క కనిపించడం లేదు. ముందు ఆ సంగతి చూడండి "

😂😂😂😂😂😂

Tuesday, February 21, 2017

సెల్బంధ విమోచన వ్రతం

సెల్బంధ విమోచన వ్రతం

కావల్సిన పదార్థాలు : ఖరీదైన ఆండ్రాయిడ్ సెల్, ఇంటర్నెట్ ప్లాన్

ఆచరించ దగిన రోజులు : 365 రోజులలో ఏ రోజైనా సరే

ఆచరించదగిన వారు : మొబైల్ బాధితులు ఆడా, మగ ఎవరైనా చేయవచ్చు.

వ్రత ఆచారం : ఉదయమునే స్నానాధికములు ముగించుకొని ఖరీదైన ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్‌ని తీసుకొని ఒక బంగారు లేదా వెండి లేదా ఇత్తడి అథమం మట్టి పళ్లెమందు ఉంచాలి.

1. సెల్లాయనమః , 2. బిల్లుతో జేబు చిల్లాయనమః 
3. ఇల్లు గుల్లాయనమః , 4. కొంప కొల్లేరాయనమః
5. సమయ చోరాయనమః, 6. సంసార ధ్వంసినేనమః..

ఇత్యాది అష్టోత్తర శతనామ మంత్రములతో చక్కగా పూజించి, ఆ సెల్‌ని, సెల్ కొనుక్కోలేని ఒక పేద వానికి, సెల్ నెత్తిన సత్తు రూపాయొకటుంచి, పళ్లెముతో సహా దానమీయవలెను.

వ్రత కథ : పూర్వం ద్వాపరయుగాంతమై కలియుగ ప్రారంభకాలమున మొబైలుష్మతీ రాజ్యమును సెల్భంజనుడు అను రాజు ప్రజానురంజకుడై పాలించుచుండెను. ఆ రాజ్యమందు కలి, తన కలి ప్రభావమును చూపనెంచినవాడై సెల్ఫోనురూపుడై ఉద్భవించెను. తొలుత ఆ సెల్లును జనులు కేవలం సంభాషణకు మాత్రమే ఉపయోగించుచుండిరి. ఇట్లు మాత్రమే ఉపయోగించిన, తన కలి ప్రభావం కనపడకయుండుట గమనించిన కలి పురుషుడు తన దుష్టాంశలైన ఇంటర్నెట్, ఆండ్రాయిడ్‌లను మొబైల్‌నందు ప్రవేశపెట్టి వాని జడలగు యాప్‌లను లెక్కకు మిక్కిలిగా విస్తరింపచేసెను. అట్టి యాప్‌లలో వాట్సప్, ఫేస్‌బుక్‌లాంటి వాటికి వ్యసనపరులై జనులు నిస్తేజస్కులైరి. ఈ సమాజ తిరోగమనమునకు కారణమైన కలినెట్లు నిలువరించవలెనని మిక్కిలి దుఃఖితుడైనాడు. లోక కల్యాణ కాంక్షా తత్పరుడైన నారదమునీంద్రులు ఏతెంచి ఆ రాజు చింతాక్రాంతుడగుటకు కారణమును తెలిసికొనినవాడై సెల్లు కలి నిర్మూలనము దుఃస్సాధ్యమనియు, సెల్లును నిలువరించుటకు ఆచరింపదగు ఏకైక, సెల్బంధ విమోచన వ్రతంగూర్చి నొక్కినొక్కి వక్కాణించెను. ఈ వ్రతమాచరించిన జాతి వికాసమును పొందునని ఆశీర్వదించి మరలిపోయెను.

ఫలశ్రుతి : ఈ కథ విన్నను, చదివిననూ సెల్ వ్యామోహం నుంచి ముక్తి కలిగి బ్రహ్మమును నెరుంగుదురు.

Sunday, February 19, 2017

గాడిద

స్కూలు లో వెరైటీ ప్రాక్టీకల్స్ ద్వారా నేర్పించాలని టీచర్ ఓ రెండు బకెట్ లు తెచ్చి ఒకదానిలో సారాయి మరొక దానిలో మంచినీళ్లు పోయించి ఒక గాడిదను వాటి ఎదురుగా ఉంచాడు .
గాడిద సారాయి బకెట్ వదిలేసి నీళ్ల బకెట్ వద్దకు పోయి నీళ్ళు తాగేసింది .
టీచర్ : పిల్లలూ ..దీన్నిబట్టి మీకర్ధమైందేమిటి ??
పిల్లలు:సారాయి తాగనోడు ..గాడిద .!

Saturday, February 18, 2017

మిస్‌డ్ కాల్

బిచ్చగాడు : అమ్మా.. అన్నం ఉంటే పెట్టమ్మా ఆకలేస్తుంది.
గృహిణి : ఇంకా వండలేదు. తర్వాత రా..
బిచ్చగాడు : ఇది నా సెల్ నంబర్. అన్నం అవగానే
మిస్‌డ్ కాల్ ఇవ్వమ్మా. బిచ్చగాడు రాక్.. గృహిణి షాక్.
గృహిణి : మిస్‌డ్ కాల్ ఎందుకులే, అన్నం అవ్వగానే
వాట్సప్‌లో అప్‌లోడ్ చేస్తా డౌన్‌లోడ్ చేసుకుని తిను.
ఇప్పుడు గృహిణి రాక్.. బిచ్చగాడు షాక్.

పొరపాటు

శశికళ అమ్మ స్తోత్రం పఠించడంలో ఏదో పొరపాటు జరిగి వుంటుంది...
జయలలిత... జయలలిత... జయలలిత .... అని కాకుండా
జైలెల్తా.... జైలెల్తా... జైలెల్తా అని పఠించడం వల్ల అమ్మ ...ఈ భక్తురాలిని కరుణించి  ఉండవచ్చు ....
😊😜😜😉🤔🤔

పక్షవాతం

అమ్మ: ఒరేయ్ త్వరగా ఇంటికి రా ...కోడలికి పక్షవాతం వచ్చినట్టుంది...మెడ వాలి పోయి, మూతి వంకరగా, కళ్ళు పైకి తేలేసి పిచ్చి చూపులు చూస్తోంది రా..😳
కొడుకు: అమ్మా నువ్వు కంగారు పడకు...అది  ఫోన్ లో సెల్ఫీ తీసుకొంటోంది..😎

Friday, February 17, 2017

ఇండియా వాళ్ళు


*వెదవది..*
*ఈ ఇండియా వాళ్ళున్నారు చూశారు*

*నలుగురెక్కే ఆటోలో*
*పదిమందిని కుక్కుతారు.*

*నలభైమంది ఎక్కే బస్సులో*
*వందమందిని లాగిస్తారు.*

*వంద మంది పట్టే*
*రైలు డబ్బాలో వేయిమందిని ఎక్కిస్తారు.*

*తస్సా చెక్కా..*
*చివరికి రాకెట్లో కూడా* *వందకు పైగా శాటిలైట్లని కుక్కి పంపించారు గదరా*
*మీ అసాధ్యం గూలా*

                  
                 _ట్రంప్_
                 _USA_

Thursday, February 16, 2017

జాలిగుండె

"ఈ బస్సు నడిపే డ్రైవర్‌కి అస్సలు జాలిగుండనేది లేదు.." అంది సుజాత .

"ఎలా చెప్పగలవు?" అడిగింది సుమిత్ర

"కండక్టర్ జనాన్ని చూసి లేచి తన సీటు ఇస్తున్నాడు. కాని డ్రైవర్ మాత్రం తన సీటివ్వట్లేదు..!" చెప్పింది సుజాత.

పూర్తిగా ఆరలేదు

������������☎
కానిస్టేబుల్ తన ఎస్సై గారికి కాల్ చేశాడు..
కానిస్టేబుల్ :
అయ్యా, ఇక్కడ ఒకావిడ తన మొగుడ్ని కత్తితో పొడిచి చంపేసింది..
ఎస్సై:
ఎందుకని...?
కానిస్టేబుల్:
ఏం లేదు సార్, ఆవిడ ఇల్లు తుడుస్తుండగా,
ఆయన వచ్చి మట్టి కాళ్ళతో తొక్కేశాడంట...
ఎస్సై:
మరి ఆవిడని అరెస్ట్ చేశావా?
కానిస్టేబుల్:
*లేదు సార్..*
*ఇంకా ఇల్లు పూర్తిగా ఆరలేదు...*
��������������������

Tuesday, February 14, 2017

క్లియరెన్స్ సేల్

క్లియరెన్స్ సేల్ అని బోర్డు పెట్టినా సేల్స్ కావట్లేదు..'' బాధగా చెప్పాడు రవి  
''అలానా? ఇంతకీ ఏం బిజినెస్ చేస్తున్నా వేమిటి?'' అడిగాడు సుందర్  
''హోటల్ బిజినెస్..!" టక్కున చెప్పాడు రవి.

తొక్క

బిజినెస్స్ వొమన్ !!
నేనూ మా అత్తగారు బజారుకెళ్లాము, అరటి పళ్లు కొందామని.
"ఎంత బాబూ అరటి పండు ?" అన్నాను.
"రూపాయి కి ఒకటి" అన్నాడు. మా అత్తగారు వుండగా, బేరం చెయ్యకుండా కొంటే అంతే సంగతులు.
"60 పైసల కి ఇస్తావా?" అన్నాను, మొహమాట పడుతూనే !!
"60 పైసలకి తొక్క వస్తుంది" అన్నాడు చికాకుగా
" ఇదిగో అబ్బాయ్ ...ఈ 40 పైసలు తీసుకుని మాకు పండు ఇవ్వు...తొక్క నువ్వే వుంచుకో !!" అంది మా అత్తగారు!! ��నేను నోరెళ్ళబెడిితిని..

Sunday, February 12, 2017

వాలెంటైన్స్ డే

వాలెంటైన్స్ డే నాడు భర్త భార్యకి
*తెల్లగులాబీ* ఇచ్చాడు
అదేంటి గత సంవత్సరం ఎర్రగులాబీ ఇచ్చారు, ఇప్పుడు తెల్లగులాబీ ఇస్తున్నారేంటి
అప్పుడు ప్రేమ కావాలని ఎర్రగులాబీ ఇచ్చాను.
ఇప్పుడు శాంతి కావాలని తెల్లగులాబీ ఇస్తున్నాను అర్ధంచేసుకోవాలి మరి............

కాల మహిమ


ఫ్లాష్ బాక్ :

చిన్నప్పుడు 'నిజాయితీ' పై ఒక కథ చదువుకున్నాము -

ఒక పేదవాడు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లి కట్టెలు కొడుతుండగా..

గొడ్డలి జారి నదిలో పడిపోయింది.

అప్పుడు అతడు దీనంగా నది ఒడ్డున కూర్చోనుంటాడు.

అతనికి దేవుడు ప్రత్యక్షమై - "ఎందుకు భాద పడుతున్నావ"ని అడుగుగా...

"స్వామీ, నా గొడ్డలి పోయి నాకు బతుకు తెరువు లేకుండా పోయింది" అని చెప్పాడు.

అప్పుడు దేవుడు అతనికి బంగారు గొడ్డలి ఇవ్వగా ...

అతను అది నాది కాదంటాడు.

అలాగే  వెండి ,ఇత్తడి , రాగి గొడ్డల్లు ఇవ్వజూపగా...

అవి తనవి కాదంటాడు.

ఇనుప గొడ్డలి ఇవ్వగా అది తనదే అంటాడు.

అతని 'నిజాయితీ'కి మెచ్చి దేవుడు అన్ని గొడ్డల్లు అతనికి ఇచ్చి వెళతాడు.  అది పాత కథ ...

ప్రస్తుతం:

అదే బీదవాడు ఇటీవల తన భార్యను తీసుకొని కట్టెలు కొట్టడానికి తిరిగి అడవికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు అతని భార్య నదిలోపడిపోయింది ...

అతను దీనంగా...
ఒడ్డున కూర్చోనుండగా ...
తిరిగి దేవుడు ప్రత్యక్షమై "ఏమైంద"ని అడుగుగా...

"నా భార్య నదిలో పడిపోయింది" అనగా...

దేవుడు 'అనుష్క'ను తెచ్చి, "ఈమేనా నీ భార్య?" అని అడుగుగా...

"అవును స్వామీ! ఈమే నా భార్య" అంటాడు.

ఆశ్చర్యపోయిన దేవుడు ...

"అప్పుడు నిజాయితీగా ఉండేవాడివి ...

ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యావు?" అని అడుగుగా...

"స్వామీ !  మీరు 'అనుష్క'నుచూపెట్టారు.  నేను నా భార్య కాదంటాను ...

తర్వాత మీరు 'తమన్నా', 'కాజోల్', 'సమంతా'ను చూపెడతారు...
నేను వాళ్ళను కూడా కాదంటాను ...

అప్పుడు నా భార్యను  చూపెడతారు...

నేను అవునంటాను...

అప్పుడు మీరు అందరిని నాకు ఇచ్చి వెళతారు ...

అయ్యో స్వామీ! ఈ కాలంలో ఒక్కరితోనే చాలా కష్టంగా ఉంది ...

ఇంత మంది అయితే...!!
నావల్ల కాదు...!!!

అందుకే ..."                  

రెండు కళ్లు

అత్త: దేవుడు నీకు రెండు కళ్లు ఇచ్చాడు... బియ్యంలో రాళ్లు ఏరి, వండాలని తెలియదా...
కోడలు: భగవంతుడు నీకు 32 దంతాలు ఇచ్చాడు.. ఆ మాత్రం నమిలి మింగలేవా...

Saturday, February 11, 2017

వంటవాడ

" అమ్మా ! కొత్త వంటవాడిని తెచ్చుకుందాం. రోజూఒకటే వంట తిని బోరు కొడుతోంది " తల్లి పక్కన చేరి అడిగింది కూతురు .
తల్లి ఆనందం తో అరిచింది ,
" ఏమండీ ! మనమ్మాయి పెళ్లి కి ఒప్పుకుంది. ఆ చేత్తోనే మైసూరు పాక్ కూడా కలియ బెట్టండి " 🤑🤑🤑

Friday, February 10, 2017

స్ప్రైట్

😊😊😊
👩🏻భార్య :
నువ్వు 🍸వోడ్కా తాగి వచ్చినప్పుడు నన్ను 😍"జానూ" అనేవాడివి,
🍺బీర్ తాగి వస్తే 😘"డార్లింగ్" అని పిలిచేవాడినవి..
మరి యిప్పుడు 😈దెయ్యం అంటున్నావ్..?
ఏం తాగి వచ్చావ్..?
భర్త :
స్ప్రైట్ (Sprite) తాగి వచ్చాను,
అందుకే *సూటిగా మాట్లాడుతున్నా.. సుత్తి లేకుండా..* ఇది క్లియర్.😂😂😂

Wednesday, February 8, 2017

సేవ

భార్యకు సేవ చేస్తే జైలు లో పెడతారా ?
గురునాధ్ : అరె ఎందుకు రా నిన్ను జైలు లో పెట్టారు ఏ నేరం చేసావురా
రఘునాధ్ : నేను ఏ నేరం చేయలేదు రా!ప్రెమతో నా భార్య కు సేవ చేసినందుకు జైలు లో వేశారురా
గురునాధ్ : అసలు ఎం చేశావో చెప్పురా !
రఘునాధ్ :నా భార్య కాళ్ళు నెప్పులు అంటే జండూబామ్ రాసి నోక్కానురా ,నడుము నొప్పి అంటే మూవ్ రాసి నొక్కనురా ఆ తరువాతా గొంతు చూపించింది రా ! నొప్పిగా ఉందనుకొని బలం గా నొక్కనురా అలా సేవ చేసుకొన్నానురా .....
గురునాధ్ : అవకాశం వచ్చింది వాడుకున్నావ్ అంతేలేరా ఏమైనా చెబుతావ్😆😆😆😆😆😆

బర్త్ డే

భార్య.... ఏమండీ, నా బర్త్ డే కూడా మరిచిపోయారు కదూ...?
భర్త.... ఏంటి డార్లింగ్... ఎలా గుర్తుంటుంది చెప్పు..? నిన్ను చూస్తుంటే అసలు నీ వయసు కొంచెమైనా పెరిగినట్టు అనిపిస్తే కదా...
భార్య.... అవునా..? మీకు కాస్త పాయసం తెస్తానుండండి....

ఒక పావురం ఒక కార్ కి డాష్ అయి స్పృహ తప్పి పడిపోయింది.
అ కార్ ఓనర్ దానికి ట్రీట్మెంట్ bv ఇప్పించి ఇంటికి తిసుకోచ్చి ఒక పంజరం లో పెట్టాడు.
తర్వాత కొ౦త సేపటికి పావురం కి స్పృహ వచ్చి చుట్టూ చూసి ఇలా అనుకునది.......
కార్ ఓనర్ చచ్చాడా ఏంటి ... నన్ను జైలు లో పెట్టేసారు ..??.����������

Monday, February 6, 2017

తలనొప్పి మాత్రలు

ఒక మందుల షాపతను కష్టమర్ తో గొడవ పడుతున్నాడు..

ఇంతలో అక్కడకి ఓనర్ వచ్చాడు..

ఓనర్: అరేయ్, కష్టమర్స్ తో అలా గొడవపడకూడదు.. ఆయనకి ఇంతకీ ఏం కావాలంట?

షాపతను: తలనొప్పి మాత్రలు కావలంటే,
డాక్టర్ సర్టిఫికెట్ కావాలయ్యా అని చెబుతుంటే,
తన మారేజ్ సర్టిఫికేట్ చూపించి ఇది చాలదా అని గొడవ పడుతున్నాడు సర్...

ఓనర్: ఒరేయ్.. మీ పెళ్ళి కాని వాళ్ళకేం తెలుసురా మా బాధ?..
పాపం ఆయనకి ఆ బిళ్ళలేవో ఫ్రీగా ఇచ్చి పంపు...!

Friday, February 3, 2017

సెల్

������
ఈ ప్రపంచమే ఒక పెద్ద కన్ఫ్యూషన్ ..

మీరే చూడండి ..

బయాలజీ మేడం చెప్పింది 'సెల్ ' అంటే కణం అని .

ఫిజిక్స్ సారు సెల్ అంటే ..బ్యాటరీ అంటాడు ..!

ఎకనామిక్స్ టీచరైతే  సెల్ అంటే అమ్మకం అంటాడు ..!

హిస్టరీ మేడం మరీ ఘోరం ..సెల్ అంటే జైలు గది అంటారు ...!!

ఇంగ్లీష్ సారు సెల్ అంటే మొబైల్ ఫోన్ అని చెప్తున్నారు ..!

ఒట్టు ..స్కూలు కి వెళ్లడమే మానేసాను ...ఒకే స్కూలు లో మేష్టర్లకే ఇంత కన్ఫ్యూషన్ ఉంటే ఇక స్టూడెంట్స్ కి ఎం నేర్పిస్తారు .

వీళ్లకన్నా మా మమ్మీయే బెటర్ ..సెల్ అంటే ..మాల్స్ లో చీరలకిచ్చే డిస్కౌంట్
అని చెప్పింది ..

����������

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version