Friday, August 31, 2012

గ్రూప్‌స్టడీ

 మొదటి విద్యార్థి: ఎక్కడికి వెళదాం? బీచ్‌కా? సినిమాకా?
రెండవ విద్యార్థి: గ్రూప్‌స్టడీకి వెళదాం. చదువు ముఖ్యం కదా?
మొదటి విద్యార్థి: అలాగా! సరే, ఇలా చేద్దాంమరి. నాణెం టాస్ వేసి చూద్దాం. బొమ్మ పడితే బీచ్; బొరుసైతే సినిమా. నాణెం అలాగే నిలబడితే గ్రూప్‌స్టడీకి వెళదాం!

ఫర్నిచర్ వ్యాపారం

"మీ డాడీ ఏం చేస్తుంటాడోయ్" పంతులమ్మ చింటూను అడిగింది.
"ఫర్నిచర్ అమ్మే పని టీచర్" చెప్పాడు చింటూ
"వ్యాపారం బాగా సాగుతోందా మరి"
"మాబాగా సాగుతోంది టీచర్.. ప్రస్తుతం ఇంట్లో మంచం మాత్రమే మిగిలింది." తాపీగా చెప్పాడు చింటూ.

Thursday, August 30, 2012

Salesman

సార్.... ఈ షర్టు గుడ్డ తీసుకోడి. అస్సలు చినగదు" తాను చూపుతూ అన్నాడు Salesman.
"గుడ్డ చాలా బాగుంది. కానీ వద్దులే" అన్నాడు అప్పారావు.
"అదేం సార్.. పెద్ద ఖరీదేం కాదు"
"ఖరీదు సంగతి కాదు. నాకు రెండు మీటర్లు చాలు. కానీ చినగదంటున్నావు కదా! ఎలా చించిస్తావు?" అడిగాడు అప్పారావు.

అమ్మ కొట్టింది

డాడి: ఎందుకు ఏడుస్తున్నావ్?
చంటి: మమ్మీ! అరటి పండు మీద కాలేసి జారింది.
డాడి: మమ్మీ పడితే నువ్వెందుకు ఏడవడం?
చంటి: పడినప్పుడు చూసి నవ్వానని అమ్మ కొట్టింది. అందుకే!

Wednesday, August 29, 2012

దోమలు

జంబులింగం ని దోమలు కరుస్తుంటాయి.
జంబులింగంకి చాలా చిరాకేస్తుంది.
జంబులింగం విషం తాగి పడుకుని," ఇప్పుడు కరవండే... విషంతో అంతా చస్తారు".

Tuesday, August 28, 2012

అతి చిన్న పదవీ విరమణ లేఖ

డియర్ బాస్...
"ఐ లవ్ యువర్ వైఫ్"

ఆడవాళ్ళు

హైదరాబాదులొ ఈ మధ్య ఒక కొత్త mall తెరిచారు. ఇచ్చట పెళ్ళి కొడుకులు కూడా అమ్మబడును అని ప్రకటనలు ఇచ్చారు (అవును సరిగ్గా పెళ్ళైన కొత్తలో సినిమాలో లాగానే). కాకపోతే కొన్ని షరతులు పెట్టారు, అవి ఏమిటంటే:
  • అమ్మాయిలు మా mallకి ఒక్కసారి మాత్రమే అనుమతింప బడుతారు
  • పెళ్ళి కొడుకులని వారి వారి హోదా, రుచులు, అభిరుచులకు తగ్గట్లు వివిధ అంతస్థులలో వర్గీకరించబడ్డారు. ఏ అంతస్థులో పెళ్ళి కొడుకునైనా మీరు ఎన్నుకోవచ్చును. ఆ అంతస్థులో నచ్చకపోతే మీరు మరో అంతస్థుకి వెళ్ళవచ్చు. కాకపోతే మీరు వెనక్కి తిరిగి రావటానికి అస్కారము లేదు, చివరి అంతస్థు నుంచి బయటకు పోవడం తప్ప.
ఇదేదో బావుందే చూద్దామని ఒక అమ్మాయి mallకి వస్తుంది. అంతస్థులవారీగా ఈ విధంగా సూచనలు ఉన్నాయి.
మెదటి అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు.
రెండవ అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు , పిల్లలను ప్రేమిస్తారు.
మూడవ అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు , పిల్లలను ప్రేమిస్తారు. మరియు వీళ్ళు చాలా అందగాళ్ళు.
అద్భుతం!! అని అనుకుంటూ ఇంకా పైకి వెళ్తే ఎలా ఉంటుందో అనుకుంటూ వెళ్ళింది ఆ అమ్మాయి.
నాలుగవ అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు , పిల్లలను ప్రేమిస్తారు. మరియు వీళ్ళు చాలా అందగాళ్ళు. ఇంటి పని, వంట పనిలో కూడా సహాయ పడతారు.
"ఆహా !! ఈ mall చాలా బావుందే. ఈ అంతస్థులో నాకు కావలసిన వరుడు దొరుకుతాడు అని అనుకున్నది. అలా అనుకున్న మరు క్షణమే ఇంకా పైకి వెళ్తే ఎలాంటి వాళ్ళు ఉంటారబ్బా!! అని అనుకొని తరువాతి అంతస్థుకి వెళ్తుంది".
అక్కడి సూచన ఇది:
"మీతో కలిపి ఈ అంతస్థుకి చేరుకున్నవారి సంఖ్య : 61,397. ఈ అంతస్థులో పెళ్ళికొడుకులు లేరు. ఆడవాళ్ళని మెప్పించడం అసాధ్యం."

Monday, August 27, 2012

బెండకాయ కూర

"ఈ రోజు మీ ఇంట్లో బెండకాయ కూర చేశారు కదూ వదినా?"
"అరె! అంత కరెక్టుగా ఎలా చెప్పగలిగారు?"
"రాత్రి మా దొడ్లో బెండకాయలు ఎవరో దొంగవెధవలు కోసుకెళ్ళార్లే"

Sunday, August 26, 2012

పెళ్ళికొడుకు

"మనమ్మాయికి మంచి అందగాడిని, తెలివితేటలు గలవాడిని, ఆస్తిపరుడిని వరుడిగా తేవాలనుకుంటున్నాను" భార్యతో చెప్పాడు రామబ్రహ్మం.
"నిజం చెప్పారండీ ఈ విషయంలో మాత్రం మా నాన్నలా మనం తొందరపడకూడదు" చెప్పింది భార్య.

సియం కి జై!

ఒక పేదవాడు చెరువులో ఒక చేపను పట్టి తన ఇంటికి తెచ్చి చేపను వండమని తన భార్యకిస్తాడు.
భార్య: గ్యాస్ లేదు, కిరోసిన్ లేదు, కరెంటు లేదు, నూనె లేదు ఎలా వండేది.?
రైతు చేపను తీసుకెళ్ళి మళ్ళీ చెరువులోనే చేపను వదిలేస్తాడు.
చేప నీటి ఉపరితలానికి వచ్చిన చేప గట్టిగా అరుస్తుంది.

సియం కి జై!!సియం కి జై!! సియం కి జై!! ( జస్ట్ ఫర్ ఫన్)

Saturday, August 25, 2012

లేడీస్ సీట్

లేడీస్ సీట్లో కూర్చొన్న రాము, రాధ రాగానే లేచి సీటు ఇవ్వబోయాడు,
"ఫర్వాలేదు కూర్చొండి. నేను నిలబడతాను" చెప్పింది రాధ. 
మళ్ళీ ఇంకో స్టాప్ రాగానే రాము లేవబోగా..."వద్దొద్దు కూర్చోండి" మళ్ళీ అంది రాధ.
ఇంకో స్టేజి రాగానే... రాధతో..."మేడమ్... దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. ఇప్పటికే నేను దిగాల్సిన స్టేజికంటే చాలా దూరం వచ్చేశాను" బాధగా చెప్పాడు రాము.

అవమానం

ఒకావిడ తన పిల్లాడితో బస్ ఎక్కుతుంది.
"నా జీవితంలో ఇంత చండాలమైన పిల్లాడిని ఎక్కడా చూడలేదు" అంటాడు డ్రైవర్ .
ఆవిడ కోపంతో ఊగిపోతూ వెనక సీట్లో కూర్చొని పక్కనామెతో అంటుంది,"ఆ డ్రైవర్ నన్ను అవమానించాడు"
వెంటనే ఆ పక్కనున్నావిడ "వెళ్ళి బుద్ది చెప్పు. ఆ కోతిపిల్లను నేను పట్టుకుంటాలే"  

విహారయాత్ర

ఒకసారి జంబులింగం, శంభులింగం వికారాబాదు అడవులలోకి విహారయాత్రకు వెళతారు. ఆక్కడ శంభులింగం అకస్మాత్తుగా క్రింద పడిపోతాడు. గాలి పీల్చుకోవడంకూడా కష్టంగా ఉంటుంది. తన ముఖం మొత్తం పాలిపోతుంది.ఉలకడు, పలకడు.  వెంటనే జంబులింగం emergency కి కాల్ చేసి ఆయాసంతో "హెల్లో! ఇక్కడ మా friend చనిపోయాడు. ఇప్పుడేం చెయ్యాలి"
ఆపరేటర్: టేకిట్ ఈజీ. మీరు cool గా ఉండండి. మొదట తను చనిపోయాడో లేదో confirm చేసుకుందాం.
అంతలో చిన్న నిశ్శబ్ధం. వెనువెంటనే ఏదో చప్పుడు.
జంబులింగ: హా. తరువాతేంచెయ్యాలి?

Friday, August 24, 2012

మంచిపని

భార్య : నేను చచ్చిపోతా....
భర్త : ఇదిగో Cadbury Dairy Milk తీసుకో....
భార్య : ఇప్పుడు ఇది ఎందుకు...?
భర్త : ఏదైనా మంచిపని చేసేముందు నోరు తీపి చేసుకోవాలి....

జాలి

"భర్త చనిపోయాడని ఆవిడ చూడు ఎలా ఏడుస్తుందో పాపం.." అన్నాడు జాలిగా సుమన్"ఛాల్లేండి సానుభూతి... మీరుపోతే నేను అంతకంటే పెద్దగానే ఏడుస్తాను" ఉడుక్కుంటూ అంది సుమిత్ర.

Thursday, August 23, 2012

Are you relaxing

జంబులింగం బీచ్ లో కూర్చుని ఉంటాడు.. అటుగా వెళ్తున్న ఇంగ్లీష్ వాళ్ళు జంబులింగాన్ని అడుగుతారు
ఇంగ్లీష్- are you relaxing?
జంబులింగం -లేదు నేను జంబులింగంని
మరో ఇంగ్లీష్ వా-are you relaxing?
జంబులింగం - అరె! నేను జంబులింగం ని.
(జంబులింగం లేచి నడుస్తుంటాడు. అతనికి మరో వ్యక్తి కనపడతాడు)
జంబులింగం - are you relaxing.
2వ్యక్తి- yes, I am relaxing.
జంబులింగం -అరె నువ్వు ఇక్కడు కూర్చున్నావా. అక్కడ అంతానీ గురించి వెతుకుతున్నారు.

కాలేజ్ స్టూడెంట్స్

నలుగురు కాలేజ్ స్టూడెంట్స్ అర్ద రాత్రి వరకు ఆడుకొని పరీక్షకు prepare అవకుండా పడుకుని తెల్లారి ఒక ఉపాయం ఆలోచిస్తారు.
తమ బట్టలకు బాగా దుమ్ము, గ్రీజు అంటించుకొని ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తారు. రాత్రి ఒక పెళ్ళికి వెళ్ళి వస్తూండగా కారు పంక్చరైంది దాన్ని తోసుకుని హాస్టల్ కి వచ్చేసరికి తెల్లారింది. అందుకే చదవలేకపోయామని చెప్తారు.

ప్రిన్సిపాల్ సరే అని మూడు రోజుల తర్వాత వాళ్ళకి మళ్ళీ పరీక్ష పెడతానంటాడు. మూడురోజుల తర్వాత ఆ నలుగురిని తలా ఒక గదిలో కూర్చోబెట్టి వాళ్ళకు Test పేపర్ ఇస్తారు.

ప్రశ్నా పత్రం
పరీక్ష ప్రశ్నా పత్రంలో వందమార్కులకు రెండు సమాధానాలు వ్రాయలి.

Q.1. నీ పేరు......................... (2 MARKS)

Q.2. కారు ఏ టైరు పంక్చరైంది? (98 మార్కులు)

a) Front Left b) Front Right
c) Back Left d) Back Right.....!!!

Wednesday, August 22, 2012

టెండర్

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రాంగణంలో ఒక చోట కంచెను మరమ్మత్తు చేయడానికి టెండర్లను ఆహ్వానించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చివరికి ముగ్గురిని ఎంపిక చేశారు. ఒకరు బంగ్లాదేశ్, మరొకరు చైనా, మూడో వ్యక్తి భారతదేశానికి చెందిన వాడు.
ముగ్గురూ వైట్‌హౌస్ అధికార ప్రతినిథితో కలిసి కంచెను పరీక్షించడానికి వెళ్ళారు. బంగ్లాదేశీయుడు బ్యాగ్ లోఉన్న టేప్ తీసుకుని స్థలాన్ని, కొలిచి కొన్ని లెక్కలు వేసి చివరికి 900 డాలర్లు ఖర్చవుతుందని తేల్చాడు. 400 డాలర్లు సామగ్రికి, 400 డాలర్లు  పనివాళ్ళకు, 100 డాలర్లు  అతనికి లాభం.
తరువాత చైనీయుడి వంతు వచ్చింది. అతను కూడా ఏవో కొన్ని లెక్కలు వేసి 700 డాలర్లు లెక్క తేల్చాడు. 300డాలర్లు సామాగ్రికి, 300 పనివాళ్ళకు, 100 డాలర్లు లాభం.
చివరగా భారతీయుడి వంతు వచ్చింది. కొలతలు వేసే కార్యక్రమాలేమీ పెట్టుకోకుండా అధికార ప్రతినిథిని దగ్గరగా పిలిచి చెవిలో “2700 డాలర్లవుతుంది” అన్నాడు.
“నువ్వు వాళ్ళలాగా కనీసం కొలత కూడా వేయలేదు. అంత పెద్ద సంఖ్య ఎలా చెప్పావు?”
“1000 డాలర్లు నీకు , 1000 డాలర్లు నాకు, ఆ చైనా వాణ్ణి మనం పనిలో పెట్టుకుందాం. ఏమంటావ్?”
“Done”.

Tuesday, August 21, 2012

మూడు ప్రశ్నలు

ఒకతనికి లాయరు సహాయం అవసరమయి ఒక లాయరు దగ్గరకు వెళతాడు. ఆ లాయరు కొంచెం డబ్బు ఎక్కువగా గుంజుతాడని ముందే తెలుసుకొని ముందు జాగ్రత్తకోసం ఇలా అడుగుతాడు. "మీరు ఫీజు ఎంత తీసుకుంటారండి?"
లాయర్: మూడు ప్రశ్నలకు మూడు వేలు .
"మూడు వేలా! చాలా ఎక్కువ అనిపించడంలేదా?"
లాయర్: అవును. కొంచెం ఎక్కువే! ఇంక నీ మూడో ప్రశ్నేంటి? 

Saturday, August 18, 2012

అదృష్టం

మోహన్: అదృష్టం కొద్దీ నాకివ్వాళ వందరూపాయలు దొరికింది నాన్నా
తండ్రి: ఆహా. పండుగ చేసుకో.. ఇంతకీ ఎక్కడ దొరికిందో అది?
మోహన్:
 ఇంట్లోనే.. మీ చొక్కా జేబులోనే నాన్నా.

Friday, August 17, 2012

స్నేహితుడు

పున్నారావు తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉన్నాడు. బంధువులంతా చుట్టూ చేరారు. పక్కనే ఉన్న స్నేహితుడికి సైగ చేసి ఒక పెన్నూ పేపర్ తెమ్మన్నాడు. సరే ఏదో చివరి కోరిక నోటితో చెప్పలేక రాసి చూపిస్తాడని తెచ్చి ఇచ్చారు. అతి కష్టమ్మీద రెండు వాక్యాలు రాసి ప్రాణాలు విడిచాడు పున్నారావు.
సరే చనిపోయిన వెంటనే దాన్ని చదవడం ఎందుకని మడిచి జేబులో పెట్టుకున్నాడా స్నేహితుడు. దహన కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత ఆయన ఇంటికొచ్చి అందులో ఏం రాశాడో చదవాలని కుతూహలం కలిగింది. మడత విప్పి చూశాడు. అందులో
“నా తల దగ్గర కూర్చున్నాయన నా ఆక్సిజన్ ట్యూబ్ పై కూర్చున్నాడు. నాకు ఊపిరి ఆడటం లేదు” అని రాసి ఉంది.

Thursday, August 16, 2012

అబద్ధాలను కనిపెట్టే మిషన్

ఒక గొప్ప శాస్త్రజ్ఞుడు ఓ మహిళల సభలో పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు. స్టేజి దిగిపోయాక చాలా మంది స్త్రీలు అతని చుట్టూ మూగి, కుతూహలంగా ఎవేవో ప్రశ్నలడగసాగారు.
ఓ స్త్రీ అందరిని తోసుకుంటూ ముందుకు వచ్చి అడిగింది..." అబద్ధాలను కనిపెట్టే మిషన్లను కనిపెట్టానుంటున్నారు. మీరు దాన్ని చూశారా? "
"చూడాటమేంటి నా తలకాయ! ఒక దాన్ని పెళ్ళి చేసుకున్నాను కూడా!" అన్నాడా సైంటిస్ట్ బాధగా

ఆత్మహుతి

జంబులింగం ఆత్మాహుతి దళంలో చేరతాడు. అతని పై అదికారి జంబులింగం కి చాలా మారణాయుధాలు ఒక సెల్ ఫోన్ ఇచ్చి శత్రువుల క్యాంప్ లో కి పంపుతాడు. జంబులింగం శత్రువుల క్యాంప్ నుండి ఆఫీసర్ కి ఫోన్ చేస్తాడు.
జంబులింగం- సర్, ఇక్కడ ఇద్దరు శత్రు సైనికులు ఉన్నారు. నేను ఆత్మార్పణ చేసుకుంటా.
ఆఫీసర్- వద్దు. ఇంకా కొందరు సైనికులు వచ్చేదాకా చూడు.
(కాసేపడి తర్వాత)
జంబులింగం- సర్ 25 మంది సైనికులు ఉన్నారు. ఆత్మార్పణ చేస్తా..
ఆఫీసర్- వద్దు. ఇంకా వెయిట్ చెయ్యి.
(కాసేపడి తర్వాత)
జంబులింగం- సర్, 100మంది సైనికులు ఉన్నారు. ఇప్పుడు చేయనా...
ఆఫీసర్- సరే. నీ కుంటుంబం గూర్చి బాధ పడకు. నువ్ దేశం కోసం ప్రాణాలర్పిస్తున్నావ్. కానియ్...
జంబులింగం కత్తితో తనను తాను పొడుచుకొని ఆత్మహుతి చేసుకుంటాడు.

పైలట్ శిక్షకుడు

ఒక విలేఖరికి అడవిలో చెలరేగిన దావానలం ఫోటోలు తీయమని వర్తమానం అందింది. ఆ మంటలు దగ్గరికెళితే ఫోటోలు తీయడానికి వీలు లేనంతగా దట్టంగా పొగ కమ్ముకుని ఉంది. వెంటనే ప్రధాన కార్యాలయానికి ఫోన్ చేసి ఒక ప్రైవేటు విమానాన్ని అద్దెకు తీసుకోమన్నాడు.
“అలాగే! నువ్వెళ్ళే సరికి ఒక విమానం రెడీ గా ఉంటుంది” అభయమిచ్చాడా సంపాదకుడు.
ఆయనన్నట్లుగానే దగ్గర్లో ఉండే విమానాశ్రయానికి వెళ్ళగానే ఒక విమానం అప్పుడే ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది. పరిగెత్తుకుంటూ తన సామాగ్రిని లోపల పడేసి “తొందరగా పోనీ” అన్నాడు. వెంటనే విమానం గాల్లోకి లేచింది.
“ఆ ఫైర్ కి పక్కనే ఉత్తరం వైపుగా పోనీ! రెండు మూడు సార్లు తక్కువ ఎత్తులో పోనియ్యి.” అన్నాడు
“ఎందుకు?” అడిగాడు పైలట్.
“ఎందుకేంటయ్యా! నేను ఫోటో గ్రాఫర్ని. ఫోటోలు తీయాలి కదా” అన్నాడు విసుగ్గా.
చాలాసేపు మౌనంగా ఉన్న తర్వాత పైలట్   “అంటే మీరు పైలట్ శిక్షకుడు కాదా?” అని అడిగాడు.

కొరడా దెబ్బలు

ఒక భారతీయుడు, ఒక అమెరికన్, ఒక పాకిస్థానీయుడు సౌదీ అరేబియాకు చెందిన విమానంలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డారు. వారు చేసిన నేరానికి శిక్షగా ఒక్కొక్కరికీ 20 కొరడా దెబ్బలు శిక్ష విధించారు అధికారులు. వారు ముగ్గురూ శిక్షకు సిద్ధపడుతుండగా శిక్షను అమలుపరిచే షేక్ వచ్చి ఇలా ప్రకటించాడు. “ఇవాళ నా ప్రియమైన మొదటి భార్య పుట్టిన రోజు. కాబట్టి మీకు శిక్ష విధించబేయే ముందుగా మిమ్మల్ని ఒక కోరిక కోరుకోమంది” అన్నాడు
మొదటగా అమెరికన్ వంతు వచ్చింది. అతను కొద్ది సేపు ఆలోచించి  తన వీపుకు ఒక దిండును కట్టమన్నాడు. కానీ దురదృష్టవశాత్తూ అది పది దెబ్బలకే చినిగిపోయింది. మిగతా పది దెబ్బలూ భరించే సరికి రక్తం కారే గాయాలైపోయాయి.
తరువాత పాకిస్థానీ వంతు వచ్చింది. తనకు రెండు దిండ్లు కట్టమన్నాడు. అతని దురదృష్టం కొద్దీ అది పదిహేను దెబ్బలకే తట్టుకోగలిగింది. తరువాత భారతీయుడి వంతు వచ్చింది. అతను ఏమీ అనకముందే షేక్ “నువ్వు మంచి సంస్కృతి గల దేశం నుంచి వచ్చావు. మీ దేశం అంటే నాకు ఎంతో ఇష్టం. కాబట్టి నువ్వు రెండు కోరికలు కోరుకోవచ్చు” అన్నాడు.
“మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. నా మొదటి కోరిక ఏంటంటే నాకు ఇరవై కాదు నూరు కొరడా దెబ్బలు కావాలి”
“చూస్తుంటే నువ్వు మంచి ధైర్యవంతుడిలాగా కనిపిస్తున్నావు. సరే నీ రెండో కోరిక ఏమిటి?”
“ఆ పాకిస్థాన్ వాణ్ణి నా వెనక కట్టేయండి.”

బామ్మ - కుక్కపిల్ల

ఆఫీసు పనిమీద నెలరోజులు క్యాంపుకెళ్ళిన జంబులింగానికి ఫోన్ చేశాడు కొడుకు సోమలింగం
"అందరూ బాగున్నారు కదా!" అడిగాడు తండ్రి జంబులింగం
"మన కుక్కపిల్ల చనిపోయింది నాన్నా" చెప్పాడు కొడుకు.
షాక్ తిన్నాడు జంబులింగం. మెల్లిగా తేరుకొని " ఇలాంటి వార్తలను ఒక్కసారిగా చెప్పకూడదు. ముందు కుక్కపిల్ల గోడెక్కింది అని చెప్పాలి. తరువాత అక్కడినుండి పడింది.. కాలు విరిగింది.. హాస్పిటల్ కి తీసుకెళ్ళాం.. లాభం లేకపోయింది.. అని మెల్లగా చెప్పాలి. సర్లే ఏం చేస్తాం.. ఇంతకీ బామ్మ ఎలా ఉంది.."  అడిగాడు జంబులింగం.
ఒక్క క్షణం ఆలోచించి -
"బామ్మ గోడెక్కింది నాన్నా.."  చెప్పాడు సోమలింగం.

స్పేస్ షిప్

నాసా శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన స్పేస్ షిప్ ని తయారు చేశారు. కానీ అంతరిక్షంలోకి పంపేందుకు ఆటంకం వచ్చింది. ఎంత ప్రయత్నించినా షటిల్ స్టార్ట్ అవ్వడంలేదు..
ఆఖరికి అక్కడ పనిచేస్తున్న జంబులింగం గారి పెద్దబ్బాయి సోమలింగం గారిని సహాయం చెయ్యమని అడిగారు.
సమస్యంతా విన్న సోమలింగం " షటిల్ ని 45 డిగ్రీల కోణంలో వంచి ప్రయోగించి చూడండి." అని సలహా ఇచ్చాడు.
శాస్త్రవేత్తలు అలానే చేశారు.. అంతే రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్ళిపోయింది. సైంటిస్టులు ఆనందం పట్టలేకపోయారు.
"మీకు ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చింది." అని అడిగారు సోమలింగాన్ని .
"ఆ .. ఏముందీ.. మాదేశంలో స్కూటర్లు స్టార్ట్ కాకుంటే.. మావాళ్ళంతా చేసేది అదే కదా..!!" అసలు రహస్యం చెప్పాడు సోమలింగం. 

Wednesday, August 15, 2012

ఆదర్శ దంపతులు

సుబ్బారావు : నమస్తే మాస్టారూ ! రేపు స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా మీ దంపతులిద్దరికీ సన్మానం చేద్దామనుకుంటున్నామండీ. మీరు కాదనగూడదుమరి.
మాస్టారు : మాకు సన్మానమా? ఎందుకండీ?
సుబ్బారావు : మరి మన అపార్టుమెంటులో ఎప్పుడూ ఆనందంగా , అన్యోన్యంగా ,ఆదర్శంగా ఉండేది మీరే. మీరూ, మీయావిడా ఎప్పుడూ నవ్వుకుంటూ ఉంటారుగదా .అందుకని.
మాస్టారు : నవ్వుకోవడవా! మరేంలేదండీ, మాయావిడ నాపైకి గ్లాసులూ, గంటెలూ విసురుతూంటుంది. అవి నాకూ తగలలేదనుకోండి – అప్పుడు నేను నవ్వుతాను , తగిలిందనుకోండి మాయావిడ నవ్వుతుంది. అంతే.
సుబ్బారావు : ఆఁ..........

డ్రమ్స్

చంటి పుట్టినరోజుకు వాళ్ల నాన్న స్నేహితుడు రవి డ్రమ్స్ బహుమతిగా ఇచ్చాడు.
నెలరోజుల తరవాత చంటి వాళ్ళింటికి వచ్చాడు రవి.
'ఏరా చంటి.....డ్రమ్స్ నచ్చాయా? నేర్చుకుంటున్నావా?' అడిగాడు రవి.
'ఆరోజు నాకు వచ్చిన బహుమతులన్నింటిలోకీ నాకు బాగా నచ్చింది అదే అంకుల్' హుషారుగా చెప్పాడు చంటి.
'ఎందుకని?'
'పొద్దున్నే దాన్ని వాయించకుండా ఉండటానికి నాకు అయిదు రూపాయలిస్తున్నారు నాన్న. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికొచ్చాక కూడా దాన్ని వాయించకుండా ఉండటానికి అమ్మ మరో రెండు రూపాయలిస్తోంది' చెప్పాడు చంటి.

Sunday, August 12, 2012

చెవుడు

ఒక ఊళ్ళో ఓ భార్యా భర్త ఉన్నారు. ఒకసారి భర్తకి తన భార్యకి చెవుడు వచ్చిందేమో అని అనుమానం వచ్చింది. అది ఆమెతో నేరుగా మాట్లాడటం ఇష్టం లేక సలహా కోసం ఓ వైద్యుడి దగ్గరికెళ్ళాడు.
“దానికో చిన్న పరీక్ష ఉంది. దాన్ని ప్రయాగిస్తే మీ ఆవిడకు చెవుడు ఏ మాత్రం ఉందో తెలుస్తుంది” అన్నాడా డాక్టర్.
“నేను చెప్పినట్లు చేయండి. మొదట 40 అడుగుల దూరంలో నిల్చుని మీరు మామూలుగా మాట్లాడుతున్నట్లు మాట్లాడండి. వినిపిస్తుందేమో చూడండి. ఒకవేళ వినిపించకపోతే పది అడుగులు దగ్గరకు వెళ్ళి అదే విధంగా చేసి చూడండి. అలా ఆమెకు వినిపించేదాకా చేసి ఈ పరీక్ష ద్వారా మీరేం గమనించారో నాకొచ్చి చెబితే నేను దానికి తగ్గట్లు వైద్యం సిఫారసు చేస్తాను” అన్నాడు.
ఆ రోజు సాయంత్రం అతను ఇంటికెళ్ళేసరికి భార్య వంట చేస్తూ ఉంది. అతను వైద్యుడు చెప్పినట్లుగా ముందుగా 40 అడుగుల దూరంలో నిలబడి “ఏఁవోయ్ ఈ రోజు ఏం కూర చేశావ్?” అని అడిగాడు. ఏం సమాధానం వినిపించలేదు.
మళ్ళీ కొంచెం దగ్గరకొచ్చి అదే ప్రశ్న అడిగాడు. ఉఁహూ సమాధానం లేదు.
అలాగే వంటగదిలోకి వెళ్ళి “ఏఁవోయ్! ఇవాళ ఏం కూర చేశావ్?” అడిగాడు గట్టిగా మళ్ళీ. లాభం లేదు.
ఈ సారి సరాసరి ఆమె వెనకాలే వెళ్ళి నిల్చుని “ఏఁవోయ్ ఇవాళ ఏం కూర చేశావని అడిగితే సమాధానం చెప్పవేఁ!!” అన్నాడు విసుగ్గా…
ఆమె కోపంగా “మీకిది ఐదోసారి చెప్పడం, చికెన్ చేశాననీ!!!” అనింది.

Friday, August 10, 2012

నమ్మకం

రాము... మా నాన్నకు నా మీద బొత్తిగా నమ్మకం లేదని తేలిపోయిందిరా...!సూరి... ఏమయ్యందేంటి...? ఎందుకలా అంటున్నావు..?రాము... ఏం లేదురా... పొద్దునే మూర్ఛ వచ్చినట్లు . దగ్గనాటకమాడానుర్లో బీరువా తాళం ఉన్నప్పటికీ ఇల్లంతా వెతికి ఓ పనికిరాని ఇనుపముక్క తెచ్చి నా చేతిలో పెట్టాడురా...?!

Thursday, August 9, 2012

మందుబాబులు

ఇద్దరు స్నేహితులు బాగా మందుకొట్టి కార్లో తిరిగి వెళ్తున్నారు.ఒకతనికి బాగా
ఎక్కువైంది. రెండో అతను ఓ మాదిరిగా ఉన్నాడు. కారు దూసుకుపోతోంది.
ఇంతలో శశాంక్ అరవడం మొదలు పెట్టాడు.’చూడు స్తంభం...ముందు చూసుకో
స్తంభం...జాగ్రత్త రేయ్...బండి తిప్పు... తిప్పరా! ఒకటే అరిచాడు. అయినా కారు
స్తంభానికి గుద్దుకుంది. శశాంక్ ఆసుపత్రి పాలయ్యాడు.తెల్లారి స్నేహితుడు పళ్ళు
తీసుకుని శశాంక్‍ను పలకరించడానికి వచ్చాడు.

’నేను చెబుతూనే ఉన్నానా... కారు తిప్పమని’ కోప్పడ్డాడు శశాంక్.
’నేనెలా తిప్పనురా...నువ్వు డ్రైవ్ చేస్తుంటే’ విసుగ్గా అన్నాడు మిత్రుడు.

Sunday, August 5, 2012

చేతి రాత

రవి: మా స్కూల్‌లో ఎవరూ చేయలేని పని నేను చేయగలను నాన్నా. చివరకు మా టీచర్ కూడా చేయలేడు తెలుసా?
నాన్న: ఆహా. అలాగా? ఏంటో ఆపని చెప్పు మరి
రవి: నా చేతి రాతను చదవడం నాన్నా..

అప్పు

"ఒరేయ్ రామూ, నేను మీ నాన్నగారికి రెండు వేల రూపాయలు అప్పు ఇచ్చి నెలకు రెండు వందలు చొప్పున తీర్చమన్నాననుకో అప్పుడు ఎన్ని నెలలలో నేను ఇచ్చిన అప్పు తీరుతుంది ?" అడిగింది లెక్కల టీచర్.
"అసలు తీరదు మేడం" అన్నాడు రాము.
" ఇంత చెప్పీనా నీ బుర్రకు ఏమీ ఎక్కడం లేదు.నీకు లెక్క అసలు అర్ధమవుతున్నాయా లేవా ? కోపంగా అడిగింది టీచర్.
" మీకే మా నాన్న తత్వం అర్ధం కాదు మేడం. అప్పు చేయడమే గాని తీర్చే బుద్ధి మా నాన్నగారికి అసలు లేదు" అసలు సంగతి చల్లగా చెప్పాడు రాము.

weighing machine

ఏమిటి పిన్నిగారు అంతకోపంగా ఉన్నారు?" శ్రామలమ్మను అదిగింది వరమ్మ.
"ఇవాళ ముచ్చటపడి  RTC Bus standలో weighing machine ఎక్కి రూపాయి నాణెం వేస్తే.......
ఒక్కసారే ఇద్దరు ఎక్కకూడదు అని వచ్చింది" కోపంగా అంది శ్యామలమ్మ.

ప్లానింగ్

అప్పారావు: (ఆఫీసర్ తో) ఈమె నా భార్య సార్.....మంచి ప్లానింగ్ వుంది. ఇవాల్టి పనిని నిన్ననే చేసేస్తుంది.
సుబ్బారావు:(ఆఫీసర్) వెరీగుడ్............భోజనం చాలా బాగుందమ్మా.
అప్పారావు: వంట కూడా అంతే సార్. ఇవాళ మిమ్మల్ని పిలిచానని చెప్పగానే నిన్నే చేసేసింది.!

నిప్పు

ఇంటర్వ్యూ చేసే వ్యక్తి:మీరు మూడో ఫ్లోర్లో ఉన్నారని ఊహించు కోండి .అప్పుడు   అకస్మాత్తుగా ఆ ఫ్లోర్ కు నిప్పంటుకున్దనుకోండి.అక్కడనుంచి ఎలా తప్పించుకుంటారు?
అభ్యర్ధి:ఏముంది?సింపుల్ .ఊహించుకోవటం మానేస్తాను

బైక్

తండ్రి: రౌహిత్, నువ్వు పరీక్షల్లో పాసయినా, ఫెయిలయినా ఈ సారి బైక్ మాత్రం కొనిస్తా.
రోహిత్: (ఆనందంగా) థ్యాంక్యూ డేడీ.
తండ్రి: ఒకవేళ పాసయితే స్ప్లెండర్, ఫెయిల్ అయ్యావనుకో రాజదూత్. పాలమ్ముకోవడానికి అది చాలు కదా..

స్టెప్పు స్టెప్పుకు మార్కులు

క్లాసులో వార్షిక లెక్కల పరీక్ష జరుగుతోంది. రమేష్ మాటిమాటికి కూర్చున్న చోటినుంచి లేచి స్టెప్పులేసి
 కూర్చోవడం, ఏదో రాసి మళ్లీ లేచి స్టెప్స్ వేయడం తిరిగి కూర్చుని రాయడం చేస్తున్నాడు. ఇది గమనించిన
పరిశీలకుడు రమేష్‌ను లేపి మరీ ఎందుకలా గంతులేస్తున్నావు అని అడిగాడు.
'స్టెప్పు స్టెప్పుకు మార్కులుంటాయని ప్రశ్నాపత్రంలో ఇచ్చారు కద సార్' రొప్పుతూ అన్నాడు రమేష్

పెళ్ళాం కావాలి

ఓ అతి తెలివి గడుగ్గాయి పెళ్ళీ చేసుకుందామని పేపర్లో ప్రకటన ఇవ్వాలనుకున్నాడు. అందరూ వధువు కావాలని ప్రకటన ఇవ్వడం చూసి విసికి కాస్త వెరైటీగా ఉంటుందని "పెళ్ళాం కావాలి" అని ప్రకటన ఇచ్చాడు. అంతే మర్నాడు వేలకొద్దీ ఉత్తరాలు వచ్చి పడ్డాయి. అన్నిటి సారాంశం ఒకటే "ఆలశ్యం చేయకుండా వచ్చి మా ఆవిడని తీసుకువెళ్ళొచ్చు!" అని

గవర్నమెంటు ఉద్యోగి


పరాత్పరరావు ఆత్మ

నాగరాజు ఓ emusement park కి వెళ్ళాడు. అక్కడ ఓ బోర్డు ముందు నిలబడి జూదం ఆడబోతుంటే ఓ గొంతు అతని చెవిలో వినబడింది.
"ఓరేయ్! నాగరాజు, నేను నీ ఫ్రెండ్ పరాత్పరరావ్ ని. నువ్వు ఓ వందరూపాయలు ఆ పచ్చరంగు మీద ఆడు." అందాగొంతు.
నాగరాజు వంద రూపాయలు కాశాడు. దాంతో వెయ్యి రూపాయలు వచ్చిందతనికి.
"ఈసారి ఎరుపు రంగు మీద ఆడు" అంది ఆత్మ.
దాంతో పదివేలొచ్చిందతనికి.
"ఈసారి బ్లూ రంగు మీద కాసెయ్" అందా గొంతు.
లక్ష రూపాయలొచ్చింది నాగరాజు కి
"ఇప్పుడు దేనిమీద కాయమంటావ్" అడిగాడు నాగరాజు
"తెలుపు" అంది ఆ గొంతు
అంతే!.. అంతా మట్టిగొట్టుకు పోయింది.
"అరరే !! నాకూ ఇలాగే ఆఖర్లో తంతేనే.. వళ్ళు మండి ఆత్మహత్య చేసుకున్నాను.." అంది గొంతు.

జర్నలిస్ట్


Saturday, August 4, 2012

మరణ ధృవపత్రం


కారు


పెద్దమనిషి


జూ గుఱ్ఱం

హైదరాబాదు జూ లో కొత్తగా ఒక గుర్రాన్ని తెచ్చి ఉంచారు. ఎవరైనా చిరుతిళ్ళు పెడతారేమో అని అధికారులు ఒక బోర్డు పెట్టారు. " దయచేసి ఈ గుర్రానికి చిరుతిళ్ళు పెట్టవద్దు... ఇట్లు జూ యాజమాన్యం" అని
మర్నాడు చూస్తే దానికింద మరో బోర్డు ఉంది "పైనున్న నోటీసుని ఎవరు పట్టించుకోనవసరం లేదు. ఇట్లు గుర్రం"

పాట


చిన్నచేప - పెద్దచేప



పోలీస్


పేకాట పాపారావు


సంసారం

"నువ్వు మీ ఆవిడతో తగువులాడ్డం మానెయ్యాలి. సంసారమనే రథానికి భార్యా భర్తలిద్దరూ రెండు చక్రాల్లాంటివారు తెలుసా!!" చెప్పబోయాడు జడ్జి
"నిజమే కావచ్చు ...కానీ ఒకటి సైకిలు చక్రం మరొకటి ట్రాక్టరు చక్రం అయితే ఎలా ఉంటుందో మీరే చెప్పండి" అన్నాడు భర్త దీనంగా.

మరొక హాస్య సంగ్రామం మళ్ళీ మొదలైంది

http://telugujok.blogspot.in/ కి స్వాగతం. ఏంటి తెలుగులో ఇప్పటికే బోలెడు బ్లాగులున్నాయి కదా మళ్ళీ నీ గొడవ ఏంటిబాబు అనుకుంటున్నారా!. ఈ జోకులు నాకు నచ్చిన నేను మెచ్చిన జోకులండి . సమస్యలతో సతమతమవుతున్న మన ఈ బిజీ lifeలో ఆరోగ్యవంతమైన హాస్యానికి ఎంత సమయం కేటాయించినా పర్లేదు. ఏమంటారు!!! ఒప్పుకోమంటారా సర్లెండి... "శతకోటి బ్లాగుల్లో బోడి బ్లాగు" అనుకొని ఓ లుక్కేయండి. మరీ విసుకేస్తె మన favorite close button ఉండనే ఉంది. మరి ఈ రోజుకి ఈ బ్లాగుతో సెలవా :-)
Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version