Thursday, June 30, 2016

భార్యలు

ఈ భార్యలు మన మనసులో విషయం ఎలా కనిపెట్టేస్తారో కదా....

భర్త: ఏమోయ్.... బయట వర్షం పడుతుంది....

భార్య: ఇంట్లో శనగపిండి లేదు. ఉల్లి ధర కొండెక్కి కూర్చుంది.. పనమ్మాయ్ రాలేదు...గిన్నెలన్నీ అలానే ఉన్నాయ్..అసలు ఇప్పుడు పకోడీ చేసే ఓపికే లేదు....

భర్త: హూ... సరేలే....

భార్య: ఇంకో విషయం... ఐస్ ఇవ్వమని అస్సలు అడగద్దు... పిల్లలు పెద్దాళ్ళు అయ్యారు.. ఈ మందు తాగడం లాంటివన్ని ఇంట్లో పెట్టారంటే ఒప్పుకునేదే లేదు...
భర్త: అలానె...దేవుడా.. అసలు మన మనసులో మాట వీళ్ళు ఎలా కనిపెట్టేస్తారో ఏమో...

Sunday, June 26, 2016

దెయ్యాలు

ఒక ఆక్సిడెంట్ లో భార్యా భర్తా ఇద్దరూ చనిపోయి దెయ్యాలయిపోయారు. చాలా కాలం తర్వాత అటూ ఇటూ తిరుగుతూ ఇద్దరూ కలుసుకున్నారు.

భార్య: అయ్యో చాలా కాలం తర్వాత కనిపించారే. పూర్తిగా మారిపోయారు. దయ్యం లా మారిపోయి ఇలా తిరుగుతున్నారు. హహ్హ...😈

భర్త: నువ్వు అస్సలు మారలేదు సుమీ. అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడూ అలానే ఉన్నావ్

Thursday, June 23, 2016

లెక్క

ఉదయం:మంత్రి గారు వచ్చారు, మొక్కను నాటారు

మధ్యాహ్నం:మేక వచ్చింది, మొక్కను తినేసింది

రాత్రి: మంత్రి గారు వచ్చారు, మేకను తిన్నారు


పర్యావరణదినం ముగిసింది, లెక్క సరిపోయింది

లావు

"లావు తగ్గాలని డైటీషియన్‌ని కలిసాడు సంజీవ్. ఆ డాక్టర్ అదో టైపు. 
.
సంజీవ్ :- సన్నబడాలంటే మాంసం తగ్గించి, ఆకు కూరలు, ధాన్యాలు బాగా తినాలంటారు .. నిజమేనా?
.
డాక్టర్:- ఏమక్కరలేదు, మేకలు, గొర్రెలు తినేదేమిటి. ఆకులు, గడ్డే కదా. కోళ్ళకు దాణానే కదా వేస్తున్నాం. మాంసం తింటున్నామంటే పరోక్షంగా ఆకుకూరలు, ధాన్యాలు తింటున్నట్లే !!
.
సంజీవ్:- వేపుళ్ళు మంచివి కావంటుంటారు..
.
డాక్టర్:- ఎందుక్కావు? నూనె ఎక్కడినుండి వచ్చింది?
.
సంజీవ్:- వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు.
.
డాక్టర్:- అంటే ధాన్యాల నుంచే కదా, మరి నీ ఒంటికి అవి ఎందుకు మంచివి కావో చెప్పు?

సంజీవ్:- పోనీ మద్యం మానేయాలంటారా?
డాక్టర్:- ఎవరయ్యా నీ బుర్ర పాడు చేసింది? వైన్ వచ్చేది పళ్ళ నుంచి కాదా ? బీరు బార్లీ నుంచే కదా! దర్జాగా తాగు. పళ్ళు తిన్నంత ఆరోగ్యం.

సంజీవ్:- మరి ఐస్‌క్రీమ్‌స్, చాక్‌లెట్లు..
డాక్టర్:- లాభం లేదయ్యా! నేను చెప్పేది నీకు అర్ధం కావట్ళేదు. అవీ పాలు, కూరగాయల బై ప్రోడక్ట్సే కదా!

సంజీవ్:- వ్యాయామం చేస్తే ఎక్కువకాలం బ్రతుకుతారంటారు. నిజమేనా?
డాక్టర్:-ఎవరు నీకు చెప్పింది? కసరత్తు చేస్తే గుండె వేగం పెరుగుతుంది. వేగం పెరిగితే ఆయుస్షు ఎలాపెరుగుతుందయ్యా.ఇదెలా ఉందంటే, వేగంగా నడిపితే కారు మన్నిక ఎక్కువ కాలం ఉంటుందన్నట్లుంది !!

సంజీవ్:- అది కాదు. సిట్ అప్స్ చేస్తే, పొట్ట తగ్గుతుందంటారు ..
డాక్టర్:- చూడు.. వ్యాయామం చేయిస్తే చేతికండరాలు పెరుగుతాయి కదా. అలాంటాప్పుడు సిట్ అప్స్ చేస్తే పొట్ట పెరగదా? కోరి కోరి లావు అవుతానంటావేమయ్యా!

సంజీవ్:- పోనీ మంచి ఫిగర్ కోసం ఈత కొట్టొచ్చా?
.
డాక్టర్:- ఈత కొడితే నాజూగ్గా అవుతారనేది తప్పుడు ప్రచారం. అదే నిజమైతే తిమింగలాలు ఎందుకు అంత సైజున్నాయో చెప్పు?
.
సంజీవ్:- మరి బాడీకి ఓ షేప్ ఎలా వస్తుందో చెప్పండి?
.
డాక్టర్:- రౌండుగా ఉండడం మాత్రం షేపు కాదా? ఎవరా మాట అన్నది?

Wednesday, June 22, 2016

హెడ్ & షోల్డర్స్

ఒక రోజున జంభులింగం తలస్నానం చేస్తూ షాంపూను తలతో పాటు భుజాలకు కూడా రాస్కుంటున్నాడు, అది చూసిన అతని భార్య : "ఏమండీ షాంపూను తలకే రాస్కోవాలి ఒంటికి కాదు"
జంభులింగం :"ఒసేయ్ తింగరిదానా మీ ఆడవారకి మెదడు మోకాలిలో ఉంటుంది. మీ మట్టి బుర్రలకి ఏదీ చెప్తే గానీ అర్థం కాదు. ఇది ఏమైనా మామూలు షాంపూ అనుకున్నవా, ఇది హెడ్ & షోల్డర్స్  

గాడిద

ఇద్దరు టెర్రరిస్టులు ..... ఒక బార్లో ....  మందుకొడుతూ మెల్లగా  మాట్లాడుకుంటున్నారు

టెర్రరిస్టు : "  మేము పద్నాలుగు వేల మందిని ఇంకా  వాళ్లతోపాటూ ఒక గాడిదని కూడా .... చంపడానికి ప్లానింగ్ చేస్తున్నాము ...   "

వీళ్లు అతి మెల్లగా మాట్లాడుకోవటం చూసి .... ఒక వెయిటర్ ... కుతూహలంతో ... వీరి మాటలను దూరంనుండి  వింటున్నాడు ........ వీళ్లు మనుషులతొ పాటూ గాడిదను ఎందుకు చంపాలనుకుంటున్నారో ? ఆత్రుత ఆపుకోలేక.....

వెయిటర్ : " గాడిదనెందుకు చంపాలనుకుంటున్నారు ? "

టెర్రరిస్ట్ (వేరే వాడితో ): " నేను ముందే చెప్పానా‌! పద్నాలుగు వేల మందిని చంపినా కూడా .....  ఎవడూ పట్టించుకోరని "

Friday, June 17, 2016

చిల్లర

బస్సు కండక్టరుకు చిర్రొత్తుకొచ్చేదెప్పుడు? 
బస్సు నీళ్ళలో పడిపోయినప్పుడు, ప్రయాణికుడు, ఈదుకుంటూ వచ్చి చిల్లర ఆడిగినప్పుడు .

Thursday, June 16, 2016

గొడవ

మొగుడు పెళ్ళాలకు గొడవైంది. భర్త సాయంత్రం ఆఫీస్ నుండి పోన్ చేసి ఆడుగుతాడు. 
భర్త : వంటేం చేసావు? 
భార్య : గన్నేరు పప్పు
భర్త : సరే, నాకు లేట్ అవుతుంది గానీ, నువ్వు తినేసి పడుకో. 

Wednesday, June 15, 2016

లెక్క

ఉదయం:మంత్రి గారు వచ్చారు, మొక్కను నాటారు

మధ్యాహ్నం:మేక వచ్చింది, మొక్కను తినేసింది

రాత్రి: మంత్రి గారు వచ్చారు, మేకను తిన్నారు


పర్యావరణదినం ముగిసింది, లెక్క సరిపోయింది

Thursday, June 9, 2016

అప్పు

సుబ్బు హోటల్ లోకి వెళ్ళాడు.ఎడమవైపు వెజ్,కుడివైపు 
నాన్ వెజ్ బోర్డులు చూసి కుడివైపు తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు. అక్కడ మళ్ళీ రెండు బోర్డులున్నాయి.
ఒకటి సర్వింగ్, రెండోది బఫే అని.
బఫే బాగుంటుందని ఆ సెక్షన్ లోకి అడుగుపెడితే అక్కడ ఒక తలుపుమీద'క్యాష్', మరో తలుపుమీద 'అప్పు'అని రాసివుంది. ఇదేదో బాగుందని అప్పు అని రాసున్న తలుపు తీసుకుని వెళ్ళిచూస్తే హోటల్ లోనుండి బయట రోడ్డు మీదకి చేరాడు

Saturday, June 4, 2016

మెసేజ్

ఒకబ్బాయి ప్రేమలో పడ్డాడు ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పడానికి అతనికి ధైర్యం చాల్లేదు. 

ఒకరోజు ధైర్యం చేసి, I Love You అని టైప్ చేసి reply కోసం Wait చేస్తున్నాను అని రాసి మెసేజ్ పెట్టాడు. 

వెంటనే మొబైల్ కి మెసేజ్ వచ్చింది. 

ఆ అబ్బాయి మెసేజ్ చూడ్డానికి చాల Tension పడ్డాడు. ఈ Tensionలో ఇప్పుడు చూడ్డం ఎందుకు, పొద్దున్నే లేచి చూద్దామని పడుకున్నాడు. 

పొద్దున్నే లేచాడు, స్నానం చేసి, టిఫిన్ తిన్నాడు, కాఫీ తాగాడు. దేవున్ని ప్రార్ధించాడు. message తనకు అనుకూలంగా ఉండాలని కోరుకున్నాడు. ఫోన్ తీసి మెసేజ్ చదివాడు. 

అ మెసేజ్ ఇలా ఉంది. 'Dear Customer you have insufficient balance to send this message. Please recharge your account and try again'  

Wednesday, June 1, 2016

అత్త

ఓఅత్త కి ముగ్గురు అల్లుళ్ళు...... వాళ్ళలో ఏ అల్లుడు మంచోడో తెలుసుకోవాలి అనుకుంది.....
మొదటి రోజు పెద్ద అల్లుడు ను తీసుకుని సముద్రం కి వెళ్లింది....
అక్కడ అత్త సముద్రంలో పడిపోయింది...
పెద్ద అల్లుడు కాపాడతాడు....
అత్త నా అల్లుడు చాలా మంచి వాడు అని కార్ కొని ఇచ్చింది.....
రెండో రోజు రెండో అల్లుడును అదే చోటుకు తీసుకెళ్ళి మళ్లి సముద్రంలో పడింది­...
రెండో అల్లుడు కూడా కాపాడతాడు.....
అత్త రెండో అల్లుడు కూడా మంచోడు అని బైక్ కొని ఇచ్చింది.....
మూడో ...రోజు మూడో అల్లుడి నీ తీసుకెళ్ళింది.. ­...
అత్త మళ్ళి సముద్రం లో పడిపోయింది..... ­.
మూడో అల్లుడు బాగాఆలోచించాడు.....
మొదటి అల్లుడి కీ కార్ ఇచ్చింది...
రెండో వాడికి బైక్ ఇచ్చింది.......
ఇక మిగిలింది కేవలం సైకిల్ మాత్రమే...ఇప్పుడు అత్తను రక్షిస్తే అదే ఇస్తుంది ....అది నేను ఏం చేసుకుంటాను అని అత్తను సముద్రంలోవదిలేసాడు.....
ఇంటికి వచ్చేసాడు......
ఆశ్చర్యం......తర్వాత రోజు చూస్తే ఇంటి ముందు BMW కారు .......కానుకగావచ్చింది....
ఎలా....???
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
వాళ్ళ మామ ఇచ్చాడు
Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version