Monday, September 14, 2015

Sorry

కుర్రాడు : నాన్నా, నేను పెళ్ళి చేసుకుంటాను.
తండ్రి : First, Sorry చెప్పు.
కుర్రాడు : ఎందుకు?
తండ్రి : నువ్వు Sorry చెప్పు ముందు.
కుర్రాడు : అదేంటి నేనేమీ తప్పు చెయ్యకుండా Sorry  ఎందుకు చెప్పాలి?
తండ్రి : ముందు Sorry చెప్పు.
కుర్రాడు : సరే Sorry.
తండ్రి : Good. ఇప్పుడు నువ్వు పెళ్ళికి అర్హుడివి. ఎప్పుడైతే నీ తప్పు లేకుండా Sorry చెప్తావో అప్పుడు నువ్వు పెళ్ళికి సిద్దం కావచ్చన్నమాట.   

Sunday, September 13, 2015

హాప్పీ


అబ్బి గాడు: ఈ రోడ్డు మీద బంగారం దొరికితే బాగుండు!!
సుబ్బి గాడు: ఎవరిని కొరుకుంటున్నావ్? దేవుడినేన!!
అబ్బి గాడు: అవును రా!! దొరికితే చాలా బాగుండు!
సుబ్బి గాడు: దొరికితే ఎం చేస్తావ్?
అబ్బి గాడు: అమ్మితే డబ్బులు వస్తాయ్, హాయిగ ఖర్చు పెట్టుకోవచ్చు.
సుబ్బి గాడు: ఎలాగు దేవుడినే కదా కొరుకునేది..అదేదొ డబ్బులే దొరకాలి అని కొరుకోవచ్చు కద..
అబ్బి గాడు: అవును రా.. నువ్వు చెప్పిందే కరెక్ట్, ఇప్పుడు బంగారం దొరికి దాన్ని అమ్మడం..! ఇదంత టైం వేస్ట్... నాకు డబ్బు దొరకాలి.
సుబ్బి గాడు: ఎంత?
అబ్బి గాడు: ఒక 100 కొట్లు.
సుబ్బి గాడు: ఎలాగు దేవుడినే కదా కొరుకునేది..అదేదొ లక్ష కోట్లు కొరుకోవచ్చు కద.
.
అబ్బి గాడు:అవును లె...ఎలాగు దేవుడే కదా.. సరే లక్ష కొట్లు.
సుబ్బి గాడు: ఎం చెస్తావేంటి, లక్ష కోట్లతొ?
అబ్బి గాడు: బిల్డింగులు, కార్లు కొంటాను!
సుబ్బి గాడు: పిచ్చోడ! డైరెక్ట్ గా అవే కోరుకోవచ్చు కద! సరే అవన్ని కొంటే??
?
అబ్బి గాడు: ఇంకేముంది హాప్పీ గా ఉండొచ్చు
సుబ్బి గాడు: వెధవ! అదేదొ డైరెక్ట్ గా హాప్పీ గా ఉండాలని కోరుకోవచ్చు కదా..??
అబ్బి గాడు: అరెయ్! నాకు ఏమి వద్దు రా నీకు.దండం రా బాబు

Tuesday, September 8, 2015

రాజకీయం

ఒకరోజు ఒక Florist, haircut కోసం ఒక బార్బర్ షాపుకి వెళ్తాడు. Haircut అయిపోయిన తర్వాత బిల్ అడిగితే అందుకా బార్బర్ 'ఈ వారం నేను Community Service చేస్తున్నాను, డబ్బులు తీసుకోలేను అంటాడు. తర్వాతరోజు బార్బర్ షాపు తెరవగానే అక్కడ పది గులాబి పువ్వులతో పాటు Thank You నోట్ రాసి ఉంటుంది. 

తర్వాత రోజు ఒక పోలిస్ haircut కోసం ఒక బార్బర్ షాపుకి వెళ్తాడు. Haircut అయిపోయిన తర్వాత బిల్ అడిగితే అందుకా బార్బర్ 'ఈ వారం నేను Community Service చేస్తున్నాను, డబ్బులు తీసుకోలేను అంటాడు. తర్వాతరోజు బార్బర్ షాపు తెరవగానే అక్కడ పది చాక్లెట్ బాక్సులతో పాటు Thank You నోట్ రాసి ఉంటుంది.   

మరుసటి రోజు ఒక రాజకీయ నాయకుడు haircut కోసం ఒక బార్బర్ షాపుకి వెళ్తాడు. Haircut అయిపోయిన తర్వాత బిల్ అడిగితే అందుకా బార్బర్ 'ఈ వారం నేను Community Service చేస్తున్నాను, డబ్బులు తీసుకోలేను అంటాడు. తర్వాతరోజు బార్బర్ షాపు తెరవగానే అక్కడ మరొక పదిమంది రాజకీయ నాయకులు Haircut చేయించుకోవడానికి బార్బర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు.  

Monday, September 7, 2015

చావు

జంభులింగం : ఏంట్రా మనం ఎంత చదివినా అస్సలు పాస్ అవ్వడంలేదు. 
శంభులింగం : అవున్రా.... ఐతే చచ్చిపోదామా? 
జంభులింగం : వద్దురా బాబు, మళ్ళీ పుడితే LKG నుండి చదవాలి, నావాల్ల కాదు!!! 

Sunday, September 6, 2015

పరీక్ష

టీచర్ : 'నారు పోసినవాడే నీరు పోస్తాడు. ' ఇలాంటి సామెత ఇంకోటి చెప్పరా! 
విద్యార్థి : 'పాఠం చెప్పినవాడే పరీక్ష రాయాలి
Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version