Thursday, June 29, 2017

ప్రమాదం

"బాస్! పెళ్ళి చేసుకున్నాను.
జీతం పెంచండి."
అని అడిగాడు
యువ కార్మికుడు.

"ఫాక్టరీ బయట జరిగిన ప్రమాదాలకు కంపెనీకి భాద్యతలేదు."

తేల్ఛేశాడు బాస్.
😆😆😜😜🤣🤣

దురదృష్టవశాత్తు

ఆడవాళ్లంతా కలిసి ఒక tour కి వెళ్లారు..
దురదృష్టవశాత్తూ..
బస్సు నదిలో పడి..
అందరూ పోయారు..
భర్తల రోదన మిన్నంటింది.
దాదాపు వారం పాటు
అంతా ఏకబిగిన ఏడ్చారు..
క్రమంగా పరిస్థితి మామూలు
స్థితికి వచ్చింది కానీ..
ఒక భర్త పదిహేను రోజులైనా కోలుకోలేదు..
కుమిలి కుమిలి ఏడ్వసాగాడు..
అతని వాలకం చూసి ఒకతను అడిగాడు..
"మీరు మీ భార్యను
బాగా మిస్సవుతున్నారా?" అని.
భర్త సమాధానం..
"లేదు.. ఆరోజు నా భార్యకు
బస్సు మిస్సయ్యింది.."
మళ్ళీ భోరుమన్నాడా భర్త.

Monday, June 26, 2017

బాయ్ ఫ్రెండ్

ఒక రోజు కొత్తగా పెళ్ళైన జంట తీరికగా కూర్చొని ఉన్నారు. ఇంతలో
భర్త : మన పెళ్ళికి ముందు నీకు ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు.
భార్య : ఇంట్లో నుంచి ఒక కవర్ తెచ్చి ఇచ్చింది.
భర్త : ఇదేమిటి ఇందులో ఏడు బియ్యం గింజలు రెండు వందలు రూపాయల ఉన్నాయి.
భార్య: నాకు బాయ్ ఫ్రెండ్ మారినప్పుడు ఒక బియ్యం గింజ వేసేదాన్ని.
భర్త : ఈకాలంలో ఇంత మంది పరావాలేదు. మరి ఈ రెండు వందలు రూపాయలో.
భార్య : అలా వేసిన బియ్యం ఐదు కేజీలు అయితే అమ్మగా వచ్చిన డబ్బులు.
భర్త : 🤔😇🤑😂😭😭😷

Sunday, June 25, 2017

అయోమయం

"ఏరా అయోమయం, నువ్వు కారులో హైదరాబాద్ వెళ్లడానికి 2 గంటలు పట్టింది , రావడానికి 7 గంటలు పట్టింది ..ఇదేమిటీ !!" అడిగాడు ''మాలోకం"

"ఎదవ కారు !!....వెళ్లడానికి 4 గేర్లు ఇచ్చాడు , వెనక్కి రావడానికి ఒక్క గేరే  ఇచ్చాడు , యదవ సన్నాసి" అన్నాడు "అయోమయం"!!

Saturday, June 24, 2017

ధనవంతుడు

మనిషికి వృద్దాప్యం సమీపిస్తుంటే అతడు ధనవంతుడు అవుతున్నట్లే!

జుట్టులో "వెండి"

పళ్లలో "బంగారం"

రక్తంలో "చక్కర"

కిడ్నీల్లో అమూల్యమైన రాళ్లు

మరియు కడుపులో అనంతమైన గ్యాస్ ... 😜😂

Friday, June 23, 2017

యోగా డే


#1.Yoga tip

మీ బార్య ఏం మాట్లాడినా  సరే ...తలను పైకీ కిందికి  ఊపాలి...
ఈ యోగా  ప్రక్రియ వల్ల, మానసిక ప్రశాంతత  చేకూరితుంది ...అంతేకాకుండా BP control వుంటుంది .heart attack.రాదు...అన్ని చికాకులు  దూరం అవుతాయి...
Note:..ఎట్టి పరిస్థితుల్లో తలను పక్కలకు  ఊపకూడదు  దీనివల్ల అన్ని సమస్యలు  మొదలవుతాయి😎

సెలెక్షన్

"అల్లుడు గారు...
రేపు మీ బావమరిది కి ...
అమ్మాయిని చూడటానికి వెళుతున్నాము...
మీరు కూడా వచ్చి చుస్తే బాగుంటుందేమో!!" అన్నాడు "మాంగారు"
"వద్దులెండి...
మీరే చూసిరండి...
నా సెలెక్షన్ అంత బాగోదు,
మీకు తెలిసిందేగా ,మరి!!" అన్నాడు.....😀

Thursday, June 22, 2017

తేడా

💁 భార్య: ఇంగ్లీష్ నేర్చుకుంటూ Complete కి Finish కి తేడా ఏమిటని భర్తను అడుగుతుంది.

🙅‍♂ భర్త: నేను నీకు లభించడంతో నీ జీవితం Complete అయింది.

🙆‍♂ నీవు నాకు లభించడంతో నా జీవితం Finish అయింది.

ఝలక్

కొత్త కోడలు భీకరంగా ఏడుపు మొదలుపెట్టింది ..చూళ్ళేని అత్తగారు అనునయంగా అడిగింది "ఏమయింది తల్లీ ..?"

కోడలు : నేను దయ్యంలా కనిపిస్తున్నానా ??

అత్త : లేదే .

కోడలు :నా కళ్లు కప్ప కళ్ళులా ఉన్నాయా ??

అత్త : అస్సలు లేదు .

కోడలు :నా ముక్కు పకోడీ లా ఉందా .?

అత్త : లేదమ్మా ..

కోడలు : నేను గేదెలా నల్లగా లావుగా ఉన్నానా .?

అత్త : అబ్బబ్బా ..అలాలేవు గానీ ఇవన్ని ఎవరన్నారు నీకు ..?

కోడలు : మన ఇరుగు పొరుగువాళ్ళు ..నువ్ అచ్చంగా మీ అత్తగారిలా ఉన్నావంటున్నారు ..వా ..వాఁ

అత్తగారు కోడలి ఝలక్ కి ఇప్పట్లో తేరుకోలేని కోమాలో ఉన్నారు ..!!!

😝😝😁😁😍😍🤑🤑
🤑🤑😁😁😜😜😀😀😝😝

Wednesday, June 21, 2017

సేవ్

గర్ల్ ఫ్రెండ్:                                              నువ్వు మంత్లీ ఎన్ని సార్లు    షేవ్ చేస్తావ్.

బాయ్ ఫ్రెండ్: మంత్లీ కాదు రోజుకి 30 నుండి 40 సార్లు చేస్తాను.

గర్ల్ ఫ్రెండ్: మెంట్లోడివా ?

బాయ్ ఫ్రెండ్ :
              కాదు మంగలోడిని... 

😆😄😄😃😜😜😜😝

కాఫీ

" అన్నా కాఫీ ఎంత అన్నా... "

" పది రూపాయలు అబ్బాయ్.. "

" ఎదురు షాపులో రూపాయిన్నర అని రాసుంది.. "

" అరేయ్ దరిద్రుడా.. అది జెరాక్స్ షాప్ రా.. అయినా అది కాఫీ కాదు కాపీ.. సదువుకున్నోడివా లేక సదువుకొన్నోడివా...?

గౌరవం

అమ్మ కు ఎంత గౌరవమిస్తున్నారో భార్యకు కూడా అంతే ఇవ్వండి.......!!

ఎందుకంటే
*ఒకళ్ళు చందమామ చూపిస్తారు.*

మరొకరు చుక్కలు చూపిస్తారు.......

😊😜😀

Friday, June 16, 2017

కార్డు

డెబిట్ కార్డ్ - ఫ్రెండ్ షిప్ లాంటిది "ఉన్నదాంతో సర్దుకుందాం మావా" అంటుంది.

క్రెడిట్ కార్డ్ - గర్ల్ ఫ్రెండ్ లాంటిది "స్థాయికి మించి ఖర్చు పెట్టాలనిపిస్తుంది"

పాన్ కార్డ్ - పెళ్ళాం లాంటిది "సంపాందిచే ప్రతి రూపాయీ తెలియాలనుకుంటుంది"

......

Thursday, June 15, 2017

ప్రభుత్వం

ఒక స్కూల్లో గ్రూప్ ఫోటో తీయడానికి ఫొటో గ్రాఫర్ని పిలిచారు.
1)ఫోటో గ్రాఫర్; ఒకరికి Rs.20/-అవుతుంది అన్నాడు.
2)హెడ్ మాస్టర్;మా స్కూలు పిల్లలు చాల బీదవారు Rs.10/-ఇస్తారు అన్నాడు.

దానికి ఫోటో గ్రాఫర్ సరే అన్నాడు.

3)హెడ్ మాస్టర్; టీచర్స్ ని పిలిచి పిల్లల దగ్గర ఒక్కొక్కరి దగ్గర Rs.30/-తీసుకోండి అని చెప్పాడు.

4)టీచర్లు పిల్లల దగ్గరికి వెళ్లి ఫోటో తీయడానికి ఒక్కొక్కరు  Rs.50/- తీసుకొనిరండి అనిచెప్పారు.

5)పిల్లలు; వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఫోటో తీయడానికి టీచర్లు Rs.100/- అడిగారు అని చెప్పారు.

వంద రూపాయలు అడిగారా అయితే ఉండు మీ నాన్న దగ్గర అడిగి తీసుకోస్తా

6)అమ్మ;ఏమండి స్కూల్లో ఫొటో తీయడానికి Rs.200/- అడిగారు.

;ఇది మన ప్రభుత్వ పరిస్థితి

రాశిఫలం

ICU లో ఉన్నవాడు  తన రాశి  ఫలం  చూస్తే ఇలా ఉంది: "ఈరోజు మీకు శుభదినం ,
సుదూర ప్రయణం,తక్కువ కర్చు , పాత మిత్రులు, బంధువులు  కలుస్తారు,ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగదు" శుభం .

Sunday, June 11, 2017

ఒకే ఒక్కమాట

నేను నా జీవితంలో..
ఎన్ని సార్లు పడ్డానో లెక్కేలేదు..
ఎన్ని దెబ్బలు తగిలాయో కూడా లెక్కేలేదు.

ఈ ప్రపంచం నన్ను కనీసం..
పూచిక పుల్లలాగా కూడా చూడలేదు.
నన్నసలు లెక్కించలేదు.

పడిన ప్రతిసారీ పకపకా నవ్వింది..
వీడి పని అయిపోయిందని గేలి చేసింది..

అయినా..
ప్రతిసారీ  నన్ను నేను నిభాయించుకుని..
అతికష్టం మీద నా అంతట నేనే లేచి..
నా కాళ్ళమీద నేను నిలబడ్డాను...
నిలదొక్కుకుని..

అందరూ విస్తుపోయేలా...
ఈ ప్రపంచం దిమ్మ తిరిగేలా..
చాలా స్పష్టంగా..
ఒకే ఒక్కమాట అనేవాడిని..
...
...
....
....
....
"వెయిటర్..!! ఇంకో పెగ్గు తీసుకురా..!!".. అని.
😇😇😇

Saturday, June 10, 2017

గిఫ్ట్

ఈరోజు నా శ్రీమతి పుట్టినరోజు తెలుసా...?" సంతోషంగా చెప్పాడు రాము

"ఆహా.. అలాగా..! మరి గిఫ్ట్ ఏమిస్తున్నావు...?" అడిగాడు సుందర్

"ఏం కావాలో కోరుకోమని ఆమెనే అడిగితే... మీరేదైనా కొనండి, కానీ అందులో డైమండ్ తప్పనిసరిగా ఉండాలని కోరిందిరా"

"భలే కోరిక కోరిందిలే.. ఇంతకీ ఏమి కొనిచ్చావు...?"

*"ప్లేయింగ్ కార్డ్స్...!!"*

😀😜😝😛

అడ్మిషన్

🐢కుందేలు, తాబేలు ఓ ఎగ్జామ్ రాశాయి. 📝 🐢 అందులో తాబేలు  80%, 🐰 కుందేలు 81% మార్కులు సాధించాయి. రెండూ కలిసి ఓ ఇంజనీరింగ్ కాలేజ్ లో అడ్మిషన్ కోసం వెళ్లాయి. కానీ అక్కడ 85%కి కటాఫ్ పెట్టారు 😱😨
😾దాంతో కుందేలుకు అక్కడ అడ్మిషన్ రాలేదు కానీ తాబేలుకు మాత్రం అడ్మిషన్ దొరికింది. 🙀అదెలా అంటే?🙊

.
.
.
.
.
.
.
.

..
..
😦గుర్తుందా చిన్నప్పుడు కుందేలు, తాబేలు పోటీ. అందులో తాబేలు గెలిచింది. ఆ లెక్కన 😂Sports quotaలో  5% ఎక్స్ ట్రా మార్కులు వచ్చాయి.  😜😃😈
తాబేలు rocks 😎....కుందేలు shocks! 😌...

Friday, June 9, 2017

సన్యాసి

భక్తుడు: స్వామీ..! మీరు సన్యాసిగా ఎలా మారారు?
సన్యాసి: చీరల షాప్ లో పనిచేసే నేను అక్కడ ఆడవాళ్ళు మాట్లాడిన రెండే రెండు మాటలకి సన్యాసిగా మారాను.
.
ఏంటి స్వామి ఆ మాటలు?
" 1. ఈ Design లో వేరే కలర్ చూపించు...
2. ఈ కలర్ లో వేరే design చూపించు.... "

తెలివితక్కువ వాళ్ళు

ఒకానొక రాజ్యంలో, రాజుగారు తన మహామంత్రిని పిలిపించాడు.

రాజు:

 " మన రాజ్యంలో
మహా తెలివైనవారు వున్నట్లే, 
మహా తెలివితక్కువ వాళ్లూ వుంటారు కదా ?"

మంత్రి (సంశయిస్తూనే):

"అవును వుంటారు ప్రభూ!"

రాజు:

 " ఐతే, మన రాజ్యం అంతా గాలించి, అందరిలోకి అతి  తెలివితక్కువ వాళ్లను ఐదుగురిని వెదికి పట్టుకొని, ఇక్కడ సభలో హాజరు పరచండి" అని ఆదేశించాడు.

మంత్రి:

"చిత్తం ప్రభూ" అని సభనుండి నిష్క్రమించాడే కానీ మనసంతా ఎలా అన్న ఆలోచనలతోనే మస్తిష్కమంతా నిండిపోయింది.

ఎవడికైనా కొన్ని పరీక్షలు పెట్టో, ప్రశ్నలు అడిగో
వాడు తెలివయిన వాడో, కాదో తెలుసుకోవచ్చు.
మరి, తెలివితక్కువ వాడినెలా గుర్తించాలి?
ఈ సందిగ్దావస్త నుండి బయటపడటమెలాగో అర్ధం కావటంలేదు మంత్రిగారికి. ఒప్పుకున్నాక తప్పదుగా! రాజాజ్ఞమరి.

ఒక నెల రోజులపాటు రాజ్యమంతా తిరిగి ఇద్దరిని పట్టుకుని సభలో హాజరు పరిచాడు.

రాజు:

 " మహామంత్రీ! మీరు పొరబడినట్లున్నారా లేక లెక్క తప్పారా?
మేము ఐదుగురిని ప్రవేశపెట్టమన్నాము. కానీ తమరు ఇద్దరిని మాత్రమే వెంట తీసుకొనివచ్చారు"?

మంత్రి:

 " మహా ప్రభూ! తమరు నేను చెప్పేది కొంచెం ఆలకించండి"

రాజు:

" సరే! సెలవియ్యండి"

మంత్రి:

" నేను రాజ్యమంతా తిరిగాడుచుండగా...
 ఇతను ఒక ఎడ్లబండి మీద కూర్చొని తలపై ఒక పెద్దమూటను పెట్టుకొని వెళుతూ కనిపించాడు. అలా ఎందుకు అని అడుగగా, తలపైనున్న మూట, బండి మీద పెడితే ఎడ్లకు భారమవుతుంది అని సమాధానమిచ్చాడు. అందుకే అతనిని ఐదవ తెలివితక్కువ వాడిగా తీసుకొచ్చాను".

రాజు:

 " భేష్! తరువాత?"

మంత్రి:

" ఈ రెండో అతను తన ఇంటి పైకప్పు మీద పెరిగిన గడ్డిని తినిపించడానికి, తన  గేదెను ఇంటి పైకప్పు మీదకు లాగుతూ కనిపించాడు.

" కావున ఇతన్ని నాల్గవ తెలివితక్కువ వాడిగా ప్రవేశపెట్టాను".

రాజు:

 " బహు బేషుగ్గా వుంది. తరువాత?"

మంత్రి :

" రాజ్యంలో చాలా సమస్యలుండగా,  వాటినన్నింటినీ ప్రక్కనపెట్టి,  తెలివితక్కువ వాళ్లను వెతకటంలో నెల రోజుల పాటు సమయం వృధాచేసాను.  కాబట్టి నేను మూడవ తెలివితక్కువ వాడిని."

రాజు ( గట్టిగా నవ్వుతూ ) " తరువాత ?

మంత్రి :

" పరిష్కరించాల్సిన సమస్యలుండగా, భాద్యతలన్నీ విస్మరించి, తెలివితక్కువ వాళ్ల కోసం వెదుకులాడుతున్న తమరు రెండో వారు".

అది విన్న సభలొని వారంతా నిశ్చేష్టులై భయభ్రాంతులై  చూస్తుండిపోయారు.
నిశ్శబ్దం ఆవరించింది సభలో.

రాజుగారు తేరుకుని కుతూహలం తో  " మంత్రి గారు సందేహం లేదు. మీరు సెలవిచ్చినదాంట్లో వాస్తవానికి దగ్గరగానూ నిశ్సందేహంగా నిజాయితో కూడిన నిజముంది.
మరి మీరు మెదటి తెలివితక్కువ వారెవరో  తెలియచెప్పండి"

మంత్రి:

చిత్తం మహా ప్రభో!
చెయ్యవలసిన పనులన్నీ మానేసి,
నెట్ ఆన్ చేసుకుని ఈ  మెసెజ్  ని చదువుతున్నవాడే...
"ఆ మొదటివాడు.

Thursday, June 8, 2017

హెల్మెట్

ఓ పిచ్చోడు ఓ గేదె మీద వెళుతున్నాడు.
దీన్ని గమనించిన మరోపిచ్చోడు ఇలా అన్నాడు
ఒరేయ్.. నిన్ను పోలీసులు పట్టుకుంటారు
మొదటి పిచ్చోడు: ఎందుకురా?

రెండో పిచ్చోడు: నీకు హెల్మెట్ లేదు కాబట్టి
మొదటి పిచ్చోడు: పిచ్చోడు.. కింద చూడు ఇది ఫోర్ వీలర్😳🤣😳🤣

Monday, June 5, 2017

వయసు

. 😂😂😂

కోమలి కి  సర్జరీ జరుగుతుంది..

డాక్టర్: మీ వయసు ఎంత?

కోమలి: 23

డాక్టర్: నిజం చెప్పండి మీ వయసుని బట్టే మీకు ఇవ్వాల్సిన injection డోసు ఉంటుంది...
తేడా జరిగితే మీకే ప్రాబ్లెం..

కోమలి: 32

డాక్టర్: వయసు తేడా చెబితే ఆ injection ప్రభావం వలన మీ కిడ్నీలు దెబ్బ తినొచ్చు..

కోమలి:38

డాక్టర్: ఇంకోసారి ఆలోచించుకోండి.. సర్జరీ మధ్య లో మీకు మెలుకువ రావచ్చు.  వయసు తక్కువ చెబితే అంత ప్రమాదం...

కోమలి: 48... ఇది ఫైనల్ operation theatre
నుండి నా శవం బయటకి వచ్చినా సరే..
ఇంతకంటే ఒక్క సం. కూడా పెంచను.. ఫో!!!!

😝😆😝😆😝

సజీవ సమాధి

ఒక సారి 15 - 20 మంది సాధువులు కలిసి, హిమాలయాలకు వెళ్తున్నారు...
ఇంతలో ఒక పత్రికా విలేఖరి వాళ్ళని కలిసి అడిగాడు...
" బాబా అందరూ ఎక్కడకి వెళ్తున్నారు?"
" అందరం కలిసి సజీవ సమాధి అవుదాం అని వెళ్తున్నాం..."
" అవునా? ఎందుకలా?"
" ఎప్పుడైతే ఈ ఫేస్ బుక్, వాట్సాప్ మొదలైనాయో .. ప్రతి ఒక్కడూ జ్ఞాన బోధ చేసేస్తున్నాడు.. ఇహ ఈ ప్రపంచానికి మా అవసరం లేకుండా పోయింది నాయనా!!!!

Saturday, June 3, 2017

పానీపురి

ఎంతటి కోటీశ్వరుడ్ని అయినా చేతిలో చిప్ప పెట్టి వరసలో నిల్చోబెట్టగల సామర్ధ్యం ఒక్క పానీపూరి  బండి వాడికే  ఉంది ....

Friday, June 2, 2017

వేలిముద్ర

"తల్లి తండ్రులు" కష్ట పడి చదివించారు!!
నేను కూడా కష్టపడి..సిన్సియర్ గా చదివాను!!!
వున్నత విద్య అభ్యసించాను!!!!!!!!!
కానీ....
కానీ...
ఎం లాభం?!
కళ్ళ లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి!!
అమ్మ నాన్న పడిన కష్టాన్ని తలుచుకుని!!!
ఎం సాధించాను....
ఈ రోజుకి కూడా ...
ఆఫీస్ లోకి వెళ్లాలంటే....
"వేలిముద్ర " వెయ్యాల్సొస్తోంది, మరి!!!
అదేదో "బయోమెట్రిక్ అంట!!

తెగులు

మొన్నామద్య సాయంత్రం వేళ సరిగ్గా ఒక స్కూల్ గేటు ముందే బైక్ పంచర్ అయింది. పరిక్షించి చూడగా మేకు దిగబడి ఉంది ఎలాగూ ట్యూబ్ పనికిరాదని గుర్తించి ట్యూబ్ తోసహా రమ్మని మెకానిక్ కి ఫోన్ చేసి అక్కడే నిల్చున్నాను ....ఆ స్కూల్ వాచ్మెన్ ఒకప్పుడు మా ఫ్రెండ్ దగ్గర పనిచేసాట్ట . నన్ను చూసి గుర్తుపట్టి కూర్చోమన్నాడు.

అప్పటికే స్కూల్ వదిలేసారు లోపల కొద్ది మంది పిల్లలు ఉన్నారు పేరెంట్స్ కోసం వేచి చూస్తూ..!

పక్కనే ఒంటరిగా బెంచ్ మీద కూర్చున్న నాలుగేళ్ల బుడ్డోడు నన్ను ఆకర్షించాడు ..... వెళ్లి పక్కన కూర్చుని " ఏమ్మా ఇంకా అమ్మ రాలేదా తీసుకెళ్ళడానికి "? అని అడిగ🙏ాను ...

" అమ్మలేదు " అన్నాడు అదోలా... నాకు మనసు చివుక్కుమంది.. 😟

" ఓహ్ నాన్న వస్తారా అయితే నిన్ను తీసుకెళ్ళడానికి " అనడిగా..
" నాన్న లేడు" అన్నాడు అదే భావంతో ... 😟😟

నా మనసనే కడలి కల్లోలమై కన్నీరు కెరటాల్లా రాబోతుండగా .." మరి ఎవరు తీస్కేల్తారు "అని అడిగా .....

బేలగా చూస్తూ " మమ్మీ గానీ డాడీ గానీ వస్తారు" అన్నాడు వాడు టక్కున.

థు  జీవితం  తెలుగు కు ఇంత దరిద్రం పట్టిందా అనుకున్నా...

Thursday, June 1, 2017

రాక్షసి

భార్య:
ఏవండీ, మీ ఫ్రెండ్ చేసుకోబోయే అమ్మాయి రాక్షసి. పెళ్ళి ఆపండి

భర్త:
నేనెందుకు ఆపుతాను? వాడేమైనా నాపెళ్ళి ఆపేడా?
😜🤣😂😀😆😜

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version