ఒకసారి జంభులింగం కొడుకు సందేహాల్రావు ఇలా అడుగుతాడు. సందేహాల్రావు : డాడీ, నీటి నుండి కరెంట్ ఎందుకు తీస్తారు ? జంభులింగం : మనం స్నానం చేసేటప్పుడు షాక్ కొడుతుంది కదా, అందుకు.
శంభులింగం : అదేంటి జంభూ, తలక్రిందులుగా ఎందుకున్నావు? జంభులింగం : తలనొప్పిగా ఉందిరా. శంభులింగం : మరి టాబ్లెట్ వేసుకోవచ్చుగా? జంభులింగం : వేసుకున్నారా, కానీ అది గొంతులోనుండి కడుపులోకి వెళ్ళింది. అందుకే అది తలలోకి వెళ్ళాలనే ఇలా తలక్రిందులుగా వేళ్ళాడుతున్నా.
శంభులింగం : అదేంటి జంభూ, మాటి మాటికి తిరుగుతూ ఫోన్ చేస్తున్నావ్, ఎందుకు?
జంభులింగం : నేను ఒకడికి కాల్ చేస్తే మాటి మాటికి తిరిగి ప్రయత్నించమంటుందిరా ఎవరో అమ్మాయి.
జంభులింగం ఒకసారి కుక్కతోకని పైప్ లో పెడుతూ కష్టపడుతుంటాడు . శంభులింగం : ఒరేయ్ జంభూ నీకు తెలీదారా, కుక్క తోక వంకరని. అదెప్పుడు తిన్నగా రాదు. జంభులింగం : ఓరి తింగరోడా, ఆ విషయం నాకు తెలుసురా,నేను పైపుని వంకర చేస్తున్నా.
జంభులింగం చెక్ బుక్ పోగొట్టుకుంటాడు.
బాంక్ మేనేజర్ : జాగ్రత్త. ఎవరైనా నీ సంతకం పెట్టేయగలరు.
జంభులింగం : ఆ కంగారేం లేదులెండి. ఆల్రెడీ అన్నిటిమీదా నేనూ సంతకం పెట్టేశాగా..
జంభులింగం : ఈ పుస్తకం నే చదవలేకపోతున్నా లైబ్రేరియన్ : ఎందుకని? జంభులింగం : ఇందులో వేల పాత్రలున్నాయి, అస్సలు అర్ధం కావట్లేదు, లైబ్రేరియన్ : ఓహో ఐతే నిన్న ఫోన్ డైరెక్టరీ తీసుకెళ్ళింది నువ్వేన్నమాట
భర్తకోసం ఆఫీసుకు ఫోన్ చేసి వాళ్ళయని పిలవమని ఆపరేటర్ని అడిగింది మంగతాయారు. ఇంతలో ఆపరేటర్, 'నెంబర్ ప్లీజ్' అనడిగింది. మంగతాయారికి చిర్రెత్తి, నంబరేంటి, నీ బొంద, నాకేమన్న పదిమంది మొగుళ్ళున్నారనుకున్నావా? అంటూ కయ్యిమంటుంది.