తల్లి అట్లు వేస్తుంటే చంటి వచ్చి అడిగింది అమ్మని. చంటి: అమ్మ మొదటి అట్టు నాకే వేయి. అమ్మ: మొదటి అట్టు ఎప్పుడూ నాన్నగారికి పెట్టాలమ్మ. ఇంటికి పెద్దవారు కదా! నాన్న: పెద్దరికమా పాడా! మొదట అట్టు సరిగా వచ్చి చావదుగా. అందుకని నాకు.
ఇంటి అల్లుడు.... వయస్సు లో చిన్న వాడే అయినా.... "అల్లుడు గారు" అనే పిలుస్తారు !! ఎందుకంటే.... మన దేశం లో .... ఇతరుల కోసం , .... తన జీవితాన్ని త్యాగం చేసేవాళ్ళని.......... గౌరవించటం అనాది గా వస్తున్న ... ఆచారం!!
మీ అబ్బాయి ఏమి చేస్తూ ఉంటాడు. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్. అవునా ఏమి బిజినెస్?? వాట్స్ ఆప్ లో వచ్చినవి ఫెస్బుక్ కి, ఫెస్బుక్ లో వచ్చినవి వాట్స్ ఆప్ కి పంపుతూ ఉంటాడు
భార్య: మీకసలు పేకాటలో డబ్బులు రావుగా, మరి రాత్రేంటి అంత డబ్బుతెచ్చారు..?? భర్త::కాంతం,అంతా కోల్పోయి ధర్మరాజులాగా నా "భార్య" ని పణంగా పెడుతున్నా అన్నా.దాంతో యదవలు గెలిచిన డబ్బంతా వదిలి పారిపోయారు..
డాక్టర్ ఒకడికి చెప్పేసాడు ఈరాత్రే నీకు ఆఖరి రాత్రని.
భార్య తో అన్ని విషయాలు మాట్లాడే యాలని , ఇద్దరు చాలా రాత్రి వరకు మాట్లాడుతూనే వున్నారు .
భార్యి నిద్ర లోకి జారుకుంది , ఆపుకోలేక.
ఓయ్ నిద్ర పోతున్నావా " భర్త అడిగాడు.
" అవునండీ , మీరయితే ఉదయాన్నే ఇంక లేవక్కర్లేదు, నేను లేవాలి కదా
ముత్యాలరావు(సుబ్బారావుతో):"ఆ డాక్టర్ నిజంగా దేవుడే! మా ఆవిడ బద్దకాన్ని, ఆయాసాన్నిచిటికెలో పోగొట్టాడు తెలుసా?" అన్నాడు ముత్యాల రావు. సుబ్బారావు:ఎలా? ముత్యాలరావు: "వయసు పెరుగుతోంది కదమ్మా అన్నాడు. అంతే ఆ మరుసటి రోజు నుండే చకచక అన్ని పనులు చేస్తోంది."