Sunday, December 25, 2016

జ్ఞాన బోధ

ఒక సారి 15 - 20 మంది సాధువులు కలిసి, హిమాలయాలకు వెళ్తున్నారు...

ఇంతలో ఒక పత్రికా విలేఖరి వాళ్ళని కలిసి అడిగాడు...

" బాబా అందరూ ఎక్కడకి వెళ్తున్నారు?"

" అందరం కలిసి సజీవ సమాధి అవుదాం అని వెళ్తున్నాం..."

" అవునా? ఎందుకలా?"

" ఎప్పుడైతే ఈ ఫేస్ బుక్, వాట్సాప్ మొదలైనాయో .. ప్రతి ఒక్కడూ జ్ఞాన బోధ చేసేస్తున్నాడు.. ఇహ ఈ ప్రపంచానికి మా అవసరం లేకుండా పోయింది నాయనా!!!!

Sunday, December 18, 2016

అలక

తండ్రి : బాబు ఒక కూల్ డ్రింక్ తీసుకురా  
బాబు : పెప్సీనా స్ప్రైటా
తండ్రి : పెప్సీ
బాబు : ప్లాస్టిక్ క్బాటిల్ లోనా గ్లాస్ బాటిలా 
తండ్రి : ప్లాస్టిక్
బాబు : చిన్నదా పెద్దదా
తండ్రి : వద్దులేరా కొన్ని నీళ్ళు తీసుకురా చాలు

బాబు : మామూలు వాటరా మినరల్ వాటరా
తండ్రి : మామూలే 
బాబు : చల్లగానా వేడిగానా
తండ్రి : ఒరేయ్ వెళ్ళిపో ముందు  లేకపోతె కొడతాను
బాబు : చెప్పుతోనా కర్రతోనా 
తండ్రి ; ఛి ఛి .జంతువు లా తయారయ్యావు 

బాబు : కుక్క లానా కోతిలా నా
తండ్రి ; నా ముందునుండి వెళ్ళిపో
టాబు : మేల్లిగానా ఫాస్ట్ గానా 
తండ్రి : నా చేతుల్లో చస్తావు
బాబు : కత్తితోనా గన్నుతోనా
 తండ్రి : కత్తితో
బాబు : బాగా హింసించి చంపుతావా డైరెక్ట్ గా చంపుతావా
తండ్రి : ఒరేయ్ నాకు BP పెరిగిపోతుంది ఇక్కడ
బాబు : డాక్టర్ ని పిలవమంటావా మనమే డాక్టర్ దగ్గరికి వెళ్దామా 

 తండ్రి మూర్చపోయాడు 

బాబు : పాపం నాన్నఅలిగాడెమో 

Saturday, December 17, 2016

మా ఆయన బంగారం

భార్య భర్తకు ఫోన్ చేసింది... ఏమండీ తొమ్మిదైంది... ఇంకా ఇల్లు చేరలేదేం...?
ఓ ముఖ్యమైన ప్రయోగంలో ఉన్నాం డియర్ అన్నాడు భర్త...
ఏమిటదీ అనడిగింది భార్య ఆసక్తిగా, అనుమానంగా.... C2H5OH ద్రావణానికి కాస్త H2O, మరికాస్త CO2 కలిపాం, దాన్ని ఘనీభవించిన H2Oతో బాగా శీతలీకరించాం, ఇంకా కొన్ని ప్రొటీన్లు రావల్సి ఉంది, ఈలోపు నికోటిన్ మండిస్తున్నాం డియర్... ఇప్పటికి అయిదారు రౌండ్లు ప్రయోగాలైపోయాయి... అందుకని లేటవుతున్నది అని వివరించాడు
భర్త... అందుకేనండీ, మిమ్మల్ని చూస్తే నాకు గర్వం... మా ఆయన బంగారం...

Friday, December 16, 2016

అందమైన భార్య

భార్య..... ఏమండీ, మన పక్కింటోళ్లు 50 ఇంచు ఎల్ఈడీ టీవీ కొన్నారు, మనమూ కొనుక్కుందామండీ...
భర్త..... ఎందుకు డార్లింగ్..? నీలాంటి అందమైన భార్య ఉంటే, ఆ ఫాల్తూ టీవీ చూస్తూ, టైమ్ ఎందుకు వేస్ట్ చేస్తారు చెప్పు...?
భార్య.... ఊఁ, మీరు మరీనూ... ఉండండి, మీకు పకోడీ తీసుకొస్తా...

Friday, December 9, 2016

పద్యం

Teachers . నిన్న నేర్పిన పద్యం చెప్పు\
Student- తుమ్ సోజా మాఁ, మై జ్యోతి కే  ఘర్ జా ఊంగా
Teacher-  ఒరేయ్ గాడిద! అది......           " తమసోమా జ్యోతీర్గమయా" రా

Thursday, December 8, 2016

తాయెత్తు

పెళ్ళైన మరుసటి రోజే మొగుడు తన భార్యను ఎడా పెడా కొడుతున్నాడు...👊✊

.
ఆ అమ్మాయ్ నీ ఎందుకలా చావగొడుతున్నావు అని ఇరుగు పొరుగు వారు అడిగారు👱‍♀👱💂‍♀👳‍♀💁‍♂🙎

.
అతను ఇలా జవాబిచ్చాడు... ఈమే నన్ను వశపరచుకోవాలని నా టీ కప్పులో "తాయెత్తు" వేసింది!😂😂😂
ఈమె నన్ను మా అమ్మ నుండి దూరం చెయ్యాలని చూస్తుంది😝😝

 .
అతని భార్య ఏడుస్తు ఇలా సమాధానం ఇచ్చింది కోపంగా😡

.
అది "తాయెత్తు" కాదు Tea Bag రా మూర్ఖుడా😆😆😆
Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version