Wednesday, February 28, 2018

పులి

Funny...😉

ఒక పెద్ద పులి పెళ్ళి చేసుకుంటుంది..!

పెళ్లి చూడటానికి  జంతువులు హాజరయ్యాయి..!

జంతువులన్నీ పులికి దూరంగా నిలబడి శుభాకాంక్షలు చెప్తున్నాయి..!

ఒక పిల్లి మాత్రం పెళ్ళి స్టేజి మేదకి దూకి దాని స్టైల్లో డాన్స్ చేసి పులికి షేక్ హ్యాండ్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పింది..!

పులి కోపంగా "ఎంత ధైర్యం నీకు..! చివరకు చిరుతపులి కూడా  దూరంగా నిలబడి శుభాకాంక్షలు చెప్పింది... నువ్వు స్టేజీ మేదకు వస్తావా...!? 😡

అపుడు పిల్లి చెప్పిన సమాధానం విని పులి ని‌ర్ఘాంతపోయింది..!

పిల్లి ఏమని సమాధానం చెప్పి ఉంటుంది..!?

Guess చేయండీ....!??
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
ఏం చెప్పిందంటే..." ఓసోస్...! పెళ్ళికాక ముందు నేను కూడా పులినే.." 😜😜😜

Saturday, November 4, 2017

Planning

భార్య:    ఏమండీ.. మనం
     సోమవారం షాపింగ్,
     మంగళవారం హోటల్,
     బుధవారం ఔటింగ్,
     గురువారం డిన్నర్
     శుక్రవారం సినిమాకు
     శనివారం పిక్నిక్
వెళ్తే ఎలా ఉంటుంది... సూపర్ కదా!

భర్త:     ఇవన్నీ జరిగితే మనం ఆదివారం గుడికి వెళ్ళాలి
భార్య:  ఎందుకు?..
భర్త:     అడుక్కోవటానికి..😜🤡🤡

Thursday, November 2, 2017

తేడా

😜😜😜😆😆😆😆😜

ఒక భర్త తన భార్యను రిసీవ్ చేసుకోవటానికి రైల్వే స్టేషన్ కు వెళ్తాడు...

భార్య ట్రైన్ దిగుతుంది... భర్త ఏమీ మాట్లాడకుండా సీరియస్ గా నడవటం భార్యకు నచ్చలేదు..

''కాస్త నవ్వచ్చుగా...!! ఫేస్ ఎందుకు అంత సీరియస్ గా పెట్టారు...అదిగో ఆ జంటను చూడండీ ఎంత సంతోషం గా నవ్వుతూ ఉన్నారో"...

ఏదీ వాళ్ళ గురించేనా..!? వాడికీ నాకు తేడా ఉందిలే..!

ఏంటో అది...?

వాడేమో వాడి భార్యకు Send off ఇవ్వటానికి వచ్చాడు.. నేను నిన్ను Receive చేసుకోవటానికి వచ్చా...😜😜😜
😆😆😆😆

Saturday, October 28, 2017

పెళ్ళి

పెళ్లి అనేది APSRTC లాగా
.
.
చాలా సేపు  wait చేసి చేసి ఎర్ర బస్సు ఎక్కుతం.. టికెట్ తీసుకుని తీరా వెనుక చూస్తే ...

.. deluxe లు, luxury లు వస్తాయి... 😀😀

రాయి

భర్త:  అదేమిటి? కదలకుండా అలా కూర్చున్నావ్?

భార్య:మీరేగా!  రాయిలా కూర్చోమన్నారు!

భర్త:ఒసేయ్! రాయిలా కూర్చోమనలేదే! రా...యిలా....కూర్చో...అన్నానే!

గొడవ

భారత దేశం లో ఎక్కడ ఉన్నామో గుర్తించడం ఎలా

సీన్ 1 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు మూడో వాడు వచ్చి చూసి వెళ్ళిపోతే అది "ముంబై"

సీన్ 2 :-  ఇద్దరు కొట్టుకుంటున్నారు మూడో వాడు వచ్చి గొడవ ఆపుదాం అనుకుని మిగిలిన ఇద్దరి చేత తన్నించుకుంటే అది "చెన్నై"

సీన్ 3 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు మూడో వాడు ఒక కేస్ బీర్లు తెచ్చి అందరూ కలిపి తాగి చివరికి ఫ్రెండ్స్ ఐపోయి ఇంటికి వెళ్లిపోతే అది "గోవా"

సీన్ 4 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు ఒకడు వచ్చి మా ఇంటి ముందు కొట్టుకోకన్డి దూరం గా వెళ్ళండి అంటే అది "బెంగళూరు"

సీన్ 5 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇద్దరు చేతిలో ఉన్న ఫోన్ తీసి కాల్ చేస్తారు అప్పుడు ఇద్దరి తో  ఇంకొక 50 మంది కొట్టుకుంటే అది "పంజాబ్"

సీన్ 6 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు మూడో వాడు వచ్చి ఇద్దరిని తుపాకీ తో కాల్చేస్తే  అది "బీహార్"

సీన్ 7 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు మిగతా వాళ్ళు వచ్చి వాడి కులం ఏంటి అని వేరే కులం వాడ్ని కొడితే అది "ఆంధ్ర ప్రదేశ్"

ఇది అల్టిమేట్

సీన్ 8 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు.....జనాలు అందరూ గుమిగూడారు.... ఒకడు సైలెంట్ గా టీ స్టాల్ ఓపెన్ చేస్తే అది "కేరళ"

Tuesday, October 24, 2017

మొబైల్

చలపాయి కోపంతో: నీకు ఎన్నిసార్లు చెప్పాలి  Mobile చూస్తూ వంట చెయ్యొద్దు అని. చారులో ఉప్పు పులుపు ఏమీలేదు..
😡😡😡😡
కాంతం: మీకు ఎన్నిసార్లు చెప్పాలి తినేటప్పుడు
Mobile చూడొద్దు  అని.  మీరు అన్నం లో కలుపు కున్నది చారు కాదు, నీళ్ళు..
😜😜😜😜

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version