Sunday, November 11, 2012

Punishment


స్టూడెంట్: టీచర్! మనం చెయ్యని దానికి శిక్ష పడుతుందా?
టీచర్: Ofcourse! పడదు. ఏం, ఎందుకలా అడిగావ్?
స్టూడెంట్: "అమ్మయ్య! నేను ఇవ్వాళ homework చెయ్యలేదు. అందుకని..."

Monday, October 15, 2012

వందకు ఫైనే

నాన్న: ఏరా లెక్కల్లో మార్కులు వందకు ఫైనే వచ్చాయన్నావు? మరి రెండు మార్కులు వచ్చాయి ఏంటిరా?
చింటు : అవును నాన్నా! ఆ రెండు ఎక్కడ వేశారో చూడు. వందకు ఫైనే కదా!

Saturday, October 13, 2012

పెద్ద అబద్దం


ఇద్దరు కుర్రాళ్ళు గొడవ పడుతుండగా వాళ్ళ unlce గదిలోకి అడుగు పెడుతాడు.
Uncle : మీరెందుకు గొడవ పడుతున్నారు?
మొదటి కుర్రాడు  : మాకు వంద రూపాయల నోట్ దొరికింది. ఎవరైతే అతి పెద్ద అబద్దం ఆడితే వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నాం..
Uncle: సిగ్గులేదు , అబద్దాలమీద పందాలా? మీ వయసున్నప్పుడు నాకసలు అబద్దమంటే తెలియదు తెలుసా.....
వెంటనే ఇద్దరూ ఏకగ్రీవంగా
"ఈ వందనోట్  మీరే తీసుకోండి Uncle" 

డాక్టర్ల సమ్మె


Friday, October 12, 2012

ఫన్నీ సమాధానాలు

ఈ క్రింది కొన్ని ప్రశ్నలకు హాస్యభరితమైన సమధానలను గమనించండి. కొన్నిసార్లు మనకు కూడా ఇటువంటి సమాధానాలు తారసపడుతుంటాయి...











టీవీ సీరియల్స్


Thursday, October 11, 2012

చేతి వ్రేలు


పేషంట్: డాక్టర్, నేనెక్కడ ముట్టుకుంటే అక్కడ నొప్పిగా ఉంటుంది."
డాక్టర్: ఏమంటున్నావ్?
పేషంట్: అవును డాక్టర్. నేను నా భుజం పట్టుకుంటే అక్కడ నొప్పిగా ఉంటుంది. మోకాలు టచ్ చేస్తే అక్కడా నొప్పిగా ఉంటుంది. ఓహ్ నా నుదురు పట్టుకున్నప్పుడు కూడా... చాలా యిబ్బంది పెడుతుంది డాక్టర్....
డాక్టర్: OK, నాకిప్పుడు అర్ధమైంది.  నీ చేతి వ్రేలు విరిగింది.

Wednesday, October 10, 2012

negligence


జంభులింగం: డాక్టర్, మీరే నాకు సహాయం చెయ్యాలి. నేను మాట్లాడుతుంటే ఎవ్వరూ నా మాట వినట్లేదు. నా మాటంటే ఎవ్వరికీ  లెఖ్ఖ లేకుండా పోతుంది.  ఏం చెయ్యాలో తెలియడం లేదు.. అసలు .....
డాక్టర్: Next, ప్లీజ్ ...
Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version