Monday, June 30, 2014

జూ కి దారి

A: Excuse me. మీకు జూ కి దారి తెలుసా?
B: సారీ అండీ, నాకు తెలియదు....
A: సర్లెండి. ఇక్కడినుండి తిన్నగా పదడుగులు ముందుకేసి కుడి పక్కకు తిరిగితే ఎడమవైపుండేదే zoo.
B: :-?

. ఫేస్ బుక్ పిచ్చి

భర్త : డార్లింగ్, నిన్న వాల్ మీద పిక్చర్ మార్చాను. ఎలా ఉందో చెప్పలేదే?
భార్య : అదేంటి? నాకేమీ ఫేస్ బుక్ లో నొటిఫికేషన్ రాలేదే?
భర్య : నీ పిచ్చి మండా. ఫేస్ బుక్ లో కాదే, మన బెడ్రూములో

Sunday, June 29, 2014

వర్ష సూచిక

శంభులింగం : ఒరేయ్ జంభూ, నీ గొడుక్కి మధ్యలో రంధ్రం ఎందుకు చేశావురా?
జంభులింగం : అదా! వర్షం హఠాత్తుగా ఆగిపోతే తెలియడం కోసం లేరా...

Saturday, June 28, 2014

మోసం

హాస్టల్ స్టూడెంట్: దారునమైన మోసం జరిగిపోయింది బావా!!
స్నేహితుడు : ఏమైందిరా?
స్టూడెంట్ : ఇంటిదగ్గరనుండి పుస్తకాలు కొనుక్కోవాలి డబ్బులు పంపమంటే, ఏకంగా పుస్తకాలే కొని పంపిచారు బావో
స్నేహితుడు : ఆ!!

గిల్టీ

ఒకరోజు ఒక భర్త తన 5 ఏళ్ళ పిల్లాడు నిద్రపోతుండగా తన భార్యను చంపుతాడు.
దారుణం ఏమిటంటే మూడురోజులు పోయినా వాళ్ళమ్మ గురించి ఒక చిన్నమాటైనా అడగడు.
ఆ తండ్రికి కొంత గిల్టీగా అనిపించి ఒకరోజు తన కొడుకుని పిలిచి ఇలా అడుగుతాడు.
తండ్రి: నువ్వు నన్నేమైనా అడగాలనుకుంటున్నావా?
పిల్లాడు : హా, మూడు రోజుల్నుంచి అమ్మ ఎప్పుడు నీ వెనుక నిలబడటం కొంచెం వింతగా ఉంది!!!.  
Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version