Sunday, May 31, 2015

గొడవ

మీ ఆవిడా, మీ అమ్మా గొడవపడినప్పుడు, నువ్వు ఏ పక్కన నుంచుంటావ్?
జంభులింగం : గోడపక్క

Thursday, May 28, 2015

యాద్గిరీ

టీచర్ : ఒరేయ్ యాద్గిరీ ,  Fast, Faster, Fastest ని తెలుగులో చెప్పు.
యాద్గిరీ : ఒహో , ఇది చాలా ఈజీ టీచర్. ఉర్కు, జల్దీ ఉర్కు , దీంతల్లి  ఉర్కు  

Monday, May 25, 2015

బెదిరింపు కాల్స్


జంభులింగం పోలిస్ స్టేషన్ కి వెళ్ళి
జంభులింగం : సార్, నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.
యస్సై : ఏమని?
జంభులింగం : రీచార్జ్ చేయించుకోపోతే కనెక్షన్ కట్ చేస్తామని

Sunday, May 24, 2015

సైకిల్ రేస్

జంభులింగం ఒకసారి సైకిల్ రేస్ లో పాల్గొంటాడు... బాగా తొక్కాడు గానీ ఓడిపోయాడు.
శంభులింగం : అంతబాగా తొక్కితే ఎలా ఓడిపోయావ్ రా?
జంభులింగం : ఎవడో సైకిల్ కి స్టాండ్ వేశాడ్రా.

Friday, May 22, 2015

పెట్రోల్ కారు

జంభులింగం : ఒరేయ్ శంభూ నీ కారు పేరేంటి?
శంభులింగం : అదేంటోరా, సరిగ్గా గుర్తులేదు, ఏదో 'T' తో స్టార్తౌతుంది.
జంబులింగం : వావ్, టీ తోనా , నువ్వు లక్కీరా, నా కారు పెట్రోల్ తో స్టార్తౌతుంది.

ధర్మ సందేహం

బాపూగారి బొమ్మలా అందంగా ఉండీ,  తెలివైనదై ఉండీ, చాలా చురుకైనదై ఉండీ, భర్తతో ఎప్పుడూ పోట్లాడని స్త్రీని ఏమంటారు స్వామీ"? అని శిష్యుడు అడిగాడు

'భ్రమ' అంటారు నాయనా అని గురూజీ బదులిచ్చాడు.

Wednesday, May 20, 2015

చిల్లు

జంభులింగం : డాక్టరుగారూ,డాక్టర్ గారూ, కొంచెం ఈ బకెట్ కి చిల్లు పడింది, కొంచెం రిపేర్ చేస్తారా? 
డాక్టర్ : స్టుపిడ్, బకెట్ కి చిల్లు పూడ్చాలా, నేనెవరో తెలుసా? 
జంభులింగం : భలేవారే, నాకెందుకు తెలీదు, మీరు పేరు పొందిన ప్లాస్టిక్ సర్జన్ కదా. 

Monday, May 18, 2015

గర్ల్ ఫ్రెండ్

బిక్షగాడు : అయ్యా, పది రూపాయలుంటే దానం చెయ్యండయ్యా, టీ తాగాలి. 
అవతలి వ్యక్తి : పది రూపాయల, ఐనా టీ తాగడానికి 5 రూపాయలే కదా? 
బిక్షగాడు : అవునయ్యా, కానీ టీ నాకు నా గర్ల్ ఫ్రెండ్ కూ ..
అవతలి వ్యక్తి : బిక్షగాడికి గర్ల్ ఫ్రెండా . 
బిక్షగాడు : లేదయ్యా, గర్ల్ ఫ్రెండ్ వచ్చాకే బిక్షగాడినయ్యా 

Sunday, May 10, 2015

అప్పిగాడు

హెల్లో ఫ్రెండ్స్, నేను మార్కెట్లోకి వచ్చిన అసలు సిసలైన అంధ్రా అప్పడాన్ని. తెలుగు హాస్యాన్ని మరింత మధురం చేయడానికి మా ఫ్యామిలీతో పాటు వస్తున్నా. నన్ను స్వాగతిస్తారనే ఆశతో ముందుకు సాగుతున్నా. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ, అప్పిగాడు.

Like me here :  

Thursday, May 7, 2015

Salary increment

ఉద్యోగి : సార్, నాకు Salary increment కావాలి. మూడు కంపనీలు నా వెంట పడుతున్నాయి తెలుసా.
యజమాని : మూడు కంపనీలా, ఏంటవి?
ఉద్యోగి : Electricity, mobil and Credit Card. 

Wednesday, May 6, 2015

కార్పోరేట్ ఆఫీస్

ఒక కార్పోరేట్ ఆఫీస్ లో బాస్ ఒక జోక్ చెప్తాడు. తన క్రింది ఉద్యోగులందరూ నవ్వుతారు. ఒకతను మాత్రం నవ్వకుండా చూస్తూ ఉంటాడు. అప్పుడాయజమాని ఇల అడుగుతాడు. 
యజమాని : ఏం, నీకు నవ్వు రాలేదా? 
ఉద్యోగి : లేదు సార్, నాకు వేరే కంపెనీ లో confirm అయింది. 
Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version