Sunday, November 27, 2016

వెర్రి ప్రేమికుడు

"చూడు బాబూ, మీ అక్కయ్య తలవెంట్రుక ఒకటి తెచ్చిస్తావా, నీకు ఒక చాక్లెట్ కొనిస్తాను" అంటాడు. 
అంతలో ఆ కుర్రాడు "ఓ, నాకు డబ్బాడు చాక్లెట్స్ కొనిస్తే, ఒకటేంటి, మొత్తం సవరమే తెచ్చిస్తా. 

Saturday, November 26, 2016

సమోసా

అమ్మాయి: McDonald's  వెళ్దామా?
అబ్బాయి: నువ్వు spelling చెబితే తీసుకెల్తా.
అమ్మాయి: ఐతే KFC వెళ్దాం.
అబ్బాయి: అలానా, ఐతే KFC Fullform చెప్పు.
అమ్మాయి: వద్దురా బాబు, ఈ సమోసానే తిందాంలె. 

Friday, November 25, 2016

కారణం

ఒక కోళ్ళఫారం యాజమాని మహా శాడిష్టు.
ఒక రోజు వాడు కోళ్ళతో ఇలా అన్నాడు, "రేపటికి ఒక్కొక్క కోడి రెండేసి గుడ్లు పెట్టకపోతే కోసుకు తినేస్తా"

పాపం భయంతో కోళ్ళన్నీ ఎలాగోలా కష్టపడి రెండేసి గుడ్లు పెట్టాయి. ఒక్కటి మాత్రం ఒక గుడ్డే చూపించింది.

యజమాని కోపంగా కారణం అడిగాడు.
దానికి ఆ కోడి, " నీ అయ్య నీ మీద భయానికి ఈ ఒక్కటైనా పెట్టాను, నిజానికి నేను పుంజుని., నన్నొదిలెయ్ రా నీకు దన్నం బెడతా...

Wednesday, November 23, 2016

మ్యారేజ్ సర్టిఫికేట్

తమ మ్యారేజ్ సర్టిఫికేట్ ను దాదాపు
గంటనుండి తదేకంగా చూస్తున్న
భర్త ను అడిగింది ఆండాళ్ళు..

🙍
ఏంటండీ? గంటనుండి మన
మ్యారేజ్ సర్టిఫికేట్ ను అలా
చూస్తున్నారు?

భర్త :Expire Date ఏమన్నా రాసి ఉంటే
కనబడుతుందేమోనని చూస్తున్నా,
రాసినట్టు లేడు యదవ.
😒😖😖😖

Tuesday, November 22, 2016

రిజల్ట్స్

రమేష్ : హలో...ఆరెయ్ మామ ఎగ్జాం రిజల్ట్స్ వచ్చాయట వెళ్లి చూసుకుందాం రారా...
సురేష్ : ఆరెయ్ మామ నేను మా డాడి తో ఉన్నాను. నువ్వు వెళ్లి చూడు. ఒక వేళ ఒక్క 
సబ్జెక్ట్ పోతే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పంపించు రెండు పోతేగుడ్ మార్నింగ్ టు యు & యువర్ డాడి అని పంపించు
..
..
..
..
కొంతసేపటికి
..
..
..
సురేష్ కు అందిన మెసేజ్

గుడ్ మార్నింగ్ టు U & యువర్ Family..

మరక

ఎలెక్షన్స్ లో వోటు వేసిన తరువాత సుబ్బారావు ఎలెక్షన్ ఆఫీసర్ ని అడిగాడు.

"చేతి మీద ఇంకు మరక, నీళ్ళతో కడిగితే పోతుందా?"
"పోదు!"
"షాంపూతో కడిగిన పోదా? "
" పోదు" అన్నాడు క్యాషియర్.
"ఎన్ని రోజుల వరకు మరక పోకుండా ఉంటుంది? "
ఎలెక్షన్ ఆఫీసర్ చిరాగ్గా "సంవత్సరమైనా పోదయ్యా!"

సుబ్బారావు ఆనందంగా, ఆశగా,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,
'
'
'
'
'
'
'
'
'
'
'
'
"సారూ,
అయితే, కొంచెం నా జుట్టుక్కూడా పూయండి. ఎంత డై రాసుకున్నా వారం రోజులకే జుట్టు తెల్ల బడుతుంది సారూ!"

ఎలెక్షన్ ఆఫీసర్ కింద పడి కొట్టుకొని స్పృహ తప్పాడు

Monday, November 7, 2016

మౌనం

భార్య: ఏమండీ నా జుట్టు కొంచెం క‌త్తిరించుకోవాలా..?

భ‌ర్త: క‌త్తిరించుకో..

భార్య: ఎంత‌క‌ష్ట‌ప‌డి పెంచుకున్నానో..

భ‌ర్త: అయితే క‌త్తిరించుకోకు..

భార్య: ఇప్పుడు అ‍ంద‌రూ క‌త్తిరించుకుంటున్నారు..అదే ఫ్యాష‌న్

భ‌ర్త: అయితే క‌త్తిరించుకో..

భార్య: నేను క‌త్తిరించుకున్నాక‌ ఫ్యాష‌న్ మారిపోతే..

భ‌ర్త: అయితే క‌త్తిరించుకోకు..

భార్య: మా ఫ్రెండ్స్ అంద‌రూ అంటుంటారు..నాకు చిన్న‌ జ‌డ‌నే బాగుంటుంది అని..

భ‌ర్త: అయితే క‌త్తిరించుకో..

భార్య: నాచిన్న‌ ఫేస్ కి చిన్న‌ జడ‌ బాగుండ‌దేమో అనిపిస్తుంది

భ‌ర్త: అయితే క‌త్తిరించుకోకు..

భార్య: చిన్న‌ జ‌డ‌యితే దువ్వుకోవ‌డం తేలిక‌.

భ‌ర్త: అయితే క‌త్తిరించుకో..

భార్య: పెద్ద‌ జ‌డ‌ని క‌ట్ చేస్తే పూలు పెట్టుకొవ‌డం కుద‌ర‌నిపిస్తూంది..

భ‌ర్త: అయితే క‌త్తిరించుకోకు..

భార్య: ఒక‌సారి experment చేసి చూడాలా..?

భ‌ర్త: అయితే క‌త్తిరించుకో..

భార్య: మ‌ళ్ళీ వెంట్రుక‌లు పెర‌గాలంటే చాలా టైం ప‌ట్టుద్ది..

భ‌ర్త: అయితే క‌త్తిరించుకోకు..

భార్య: లేక‌పోతే ఒక‌సారి క‌ట్ చేయించుకొని చూడాలా..?

భ‌ర్త: అయితే క‌త్తిరించుకో..

భార్య: ఒక‌వేళ‌ క‌ట్ చేయించుకున్నాక‌ బాలేక‌పోతే..?

భ‌ర్త: అయితే క‌త్తిరించుకోకు..

:

:
:
:
:
:
:
:
:
ప్ర‌స్తుతం ఆభ‌ర్త‌ ఎర్ర‌గ‌డ్డ‌ మాన‌సిక‌ వైద్య‌శాల‌లో చికిత్స‌ పొందుతున్నాడు..
:
అయితే క‌త్తిరించుకో..
:
అయితే క‌త్తిరించుకోకు..
:
అయితే క‌త్తిరించుకో..
:
అయితే క‌త్తిరించుకోకు..
:
:అయితే క‌త్తిరించుకో..
:
అయితే క‌త్తిరించుకోకు..
:
అయితే క‌త్తిరించుకో..
:
అయితే క‌త్తిరించుకోకు..
:
అయితే క‌త్తిరించుకో..
:
అయితే క‌త్తిరించుకోకు..
:
:అయితే క‌త్తిరించుకో..
:
అయితే క‌త్తిరించుకోకు..
:

డాక్ట‌ర్ల‌కి ఇప్ప‌టికీ అంతుచిక్క‌డం లేదు దేన్ని క‌త్తిరించ‌మంటున్నాడు..అంత‌లోనే వ‌ద్ద‌ని ఎందుకంటున్నాడ‌ని..
:
:
:
అత‌నిపై విదేశీ వైద్య‌బ్ర్రుందం యొక్క‌ ప‌రిశోధ‌న‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి..

నీతి: ఒక్కోసారి మౌనం కూడా చాలా స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రిస్తుంది..

*ప్ర‌జాప్ర‌యోజ‌నార్థం జారీ చేయ‌బ‌డింది..

😜😜😜

Saturday, November 5, 2016

విచిత్రమైన ప్రశ్నలు

కొంత మంది వివిధ సందర్భాలలో కలసినపుడు వేసే విచిత్రమైన ప్రశ్నలు..వాటికి సరదా జవాబులు.😅

 1. సినిమా హాల్లో:
 "మీరు కూడా సినిమాకే వచ్చారా?"
నేను: "లేదు పాప్ కార్న్ అమ్ముకోవటానికి వచ్చాను"

 2. సిటీ బస్సులో కాలు తొక్కి:
 "Sorry .. నొప్పిగా ఉందా ?"
 నేను: "అబ్బే లేదండీ.. anesthesia తీసుకుని వచ్చాను, కావలంటే మళ్ళీ తొక్కండి!!"


 3. అర్ధరాత్రి ఫోన్ చేసి: "పడుకున్నారా?"
 నేను: "లేదు ఆఫ్రికా కోతుల మీద రీసర్చ్ చేస్తున్నాను.. మీ చుట్టాల వివరాలు తెలిసాయి" 😴

 💇💇💇💇💇💇💇💇
 4. బార్బర్ షాప్ నుండి వస్తుంటే: "ఏంటి హేర్ కటింగ్ చేయించుకున్నారా?"
 నేను: "శరత్కాలం కదా రాలిపోయింది!"

☎☎☎☎☎☎☎
 5. ఇంట్లో Land-line కి ఫోన్ చేసి: "ఎక్కడున్నారు?"
నేను: "ఫోన్ మెళ్ళో వేసుకుని, మార్కెట్లో కూరగాయలు కొంటున్నా !!"

 🚘🚘🚘🚘🚘🚘🚘🚘
 6. కారు కడుగుతున్నప్పుడు ప్రక్కింటాయన: "సార్ !! కారు కడుగుతున్నారా??"
నేను: "లేదండీ, నీరు పోస్తున్నాను. ఇది పెరిగి పెద్దదై బస్సంతవ్వాలని.. 

😄😄😄😉😉😉        

.. 😊😊😊😊😊😊😊😊...

Thursday, November 3, 2016

వాట్సప్

అప్పుడే స్నానం చేసి బెడ్ రూం లోకి వచ్చాడు భర్త.
మంచం మీద తాపీగా కూర్చుని వున్న భార్య ని చూసి... 

భర్త:- యేమిటీ! ఇంత ఆనందంగా వున్నావ్?

భార్య:- తీసేసానండీ. (నవ్వుతూ) 

భర్త:- ఏమి తీసేసావ్?

భార్య:-మీ సెల్ ఫోన్ వాట్సప్ లో మిమ్మల్ని "వైరస్" గ్రూప్ నుంచి తీసేసాను.

భర్త:- నీ బొంద అది “VIRUS” గ్రూప్ కాదే “VIRA’S” గ్రూప్. వీర రాఘవయ్య స్కూల్. అది మా టెంత్ క్లాస్ బ్యాచ్ మేట్స్ గ్రూప్. 

భార్య:-ఏమో నాకేమి తెలుసు? మొబైల్ లో వైరస్ వుండకూడదు కదా! అందుకని తీసేసాను.

భర్త:-ఇంకా ఏమి తీసేసావ్?

భార్య:- “N.V.” గ్రూప్ నుంచి కూడా తీసేసాను.

భర్త:- ఓసి నీ మొఖం మండా !!! “N.V.” అంటే “నూకల వెంకటరత్నం కాలేజ్”. అది మా ఇంటర్ బ్యాచ్.

భార్య:-ఏమో నాకేమి తెలుసు? నాన్ వెజ్ జోకులు వుండకూడదు కదా! అందుకని తీసేసాను.

భర్త:-అంతేనా ఇంకా ఏమన్నా తీసేసావా?

భార్య:-"గాలి" గ్రూప్ నుంచి కూడా తీసేసాను. 

భర్త:- ఓసి నీ అయ్యా అది !!! “గాలి చిన వెంకటేశ్వర్లు కాలేజ్”. అది మా ఇంజినీరింగ్ బ్యాచ్. 

భార్య:-ఏమో నాకేమి తెలుసు? గాలి కబుర్లు చెప్పుకోకూడదు కదా! అందుకని తీసేసాను. 

భర్త:-ఓసి నీ సిగ తరగా!!! అసలు ఇవన్నీ చేయటానికి నీకు నా మొబైల్ పాస్ వర్డ్ ఎలా దొరికింది? 

భార్య:-మీ పేరు పెట్టా, నా పేరు పెట్టా, మీ అమ్మ పేరు పెట్టా, మీ నాన్న పేరు పెట్టా, మన అమ్మాయి పేరు పెట్టా, ఎన్ని ట్రై చేసినా కుదరలేదు.

భర్త:- మరి ఎలా తెరిచావే తల్లీ?

భార్య:-చివరి ప్రయత్నంగా మన పని మనిషి "సుందరి" పేరు నొక్కా!!! దెబ్బకి తెరుచుకుంది రా సచ్చినోడా ..

Wednesday, November 2, 2016

సంతోషం

నేను నా స్నేహితుడ్ని అడిగా, నీ వైవాహిక జీవితం ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటి? అని.

అతను చెప్పాడు, "బాధ్యతల్ని ఇద్దరు సమానంగా, ప్రేమ గౌరవం తో పంచుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా ఏ సమస్య ఉండదు.

"కాస్త వివరంగాచెప్పు" అని అడిగాను.

అతను చెప్పాడు "మా ఇంట్లో పెద్ద పెద్ద సమస్యలకి నేను నిర్ణయం తీసుకుంటాను, చిన్న చిన్న సమస్యలకి మా ఆవిడ నిర్ణయం తీసుకుంటుంది. ఒకరి నిర్ణయాలలో ఒకరం తలదూర్చం".

అయినప్పటికీ నా మనసు అంగీకరించలేదు. "కొన్ని ఉదాహరణలు ఇవ్వు" అని మళ్ళీ అడిగాను.

అతను చెప్పాడు "చిన్న సమస్యలు అంటే ఏ కారు కొనాలి, ఎంత డబ్బు దాయాలి, షాపింగ్, సూపర్ మార్కెట్ కు ఎప్పుడువెళ్ళాలి, సెలవులకి ఎక్కడికెళ్ళాలి, ఎప్పుడువెళ్ళాలి, ఏ సోఫా, ఏసి, ఫ్రిడ్జ్ కొనాలి, నెల ఖర్చులు, పనిమనిషిని ఉంచాలా లేదా, మొదలైన అన్ని నిర్ణయాలు మా ఆవిడ తీసుకుంటుంది. నేను దానికి ఒప్పుకుంటాను.

"మరి నీ పాత్రేమిటి?" అని అడిగాను.

అతను చెప్పాడు "నేను పెద్ద పెద్ద సమస్యలకు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాను. అవి, భారత్ పాకిస్థాన్ తో యుద్ధం చేయాలా వద్దా, ఇరాన్ మీద అమెరికా యుద్ధం చేయాలా వద్దా, బలూచిస్తాన్ స్వాతంత్ర్య దేశంగా ఏర్పడాలా వద్దా, ధోని క్రికెట్ నుంచి ఎప్పుడు రిటైర్ కావాలి, సల్మాన్ ఖాన్ ఎవరిని పెళ్ళి చేసుకోవాలి మొదలైనవి.
నీకు తెలుసా! ఈ నా నిర్ణయాలను  నా భార్య ఎప్పుడూ వ్యతిరేకించదు.

Tuesday, November 1, 2016

పెళ్ళి - జైలు

శ్రీలత అర్ధరాత్రి మెలుకువచ్చి చూస్తే, భర్త రవి పక్కనలేడు, ఆందోళనగా అన్నీ గదులూj😴 చూసి, చివరకు వంటగదిలో కి వెళితే, ఆక్కడ దిగులుగా, శున్యంలోకి చూస్తూ కంట్లో కన్నీరుతో కనిపించాడు.
శ్రీ భయపడి, రవిని పలకరించింది..
శ్రీ : ఏమండి? ఏమైంది?
రవి : శ్రీ, 7 యేళ్ళ క్రితం, మనిద్దరం పార్కులో ప్రేమించుకొంటుంటే, మీ అన్న చూసి, మీనాన్నకు చెప్పాడు..
శ్రీ : అవునండీ, నాకు జ్ఞాపకం ఉంది.
రవి : అది తెలిసిన మీనాన్న, కత్తి పట్టుకొచ్చి, మా అమ్మాయిని చేసుకుంటావా, లేక పోలిసులతో   చెప్పి జైలుకు పంపించనా అని అడిగాడు.
శ్రీ : అవునండీ..అయితే?
రవి : జైలు అనేసరికి భయముతో నిన్ను చేసుకున్నాను, అదే జైలు కెళ్ళుంటె, ఈరోజుతో నాకు విడుదల అయ్యేది కదా.....అని భోరున ఏడ్చాడు.
శ్రీ : ఆ!...
Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version