Wednesday, November 2, 2016

సంతోషం

నేను నా స్నేహితుడ్ని అడిగా, నీ వైవాహిక జీవితం ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటి? అని.

అతను చెప్పాడు, "బాధ్యతల్ని ఇద్దరు సమానంగా, ప్రేమ గౌరవం తో పంచుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా ఏ సమస్య ఉండదు.

"కాస్త వివరంగాచెప్పు" అని అడిగాను.

అతను చెప్పాడు "మా ఇంట్లో పెద్ద పెద్ద సమస్యలకి నేను నిర్ణయం తీసుకుంటాను, చిన్న చిన్న సమస్యలకి మా ఆవిడ నిర్ణయం తీసుకుంటుంది. ఒకరి నిర్ణయాలలో ఒకరం తలదూర్చం".

అయినప్పటికీ నా మనసు అంగీకరించలేదు. "కొన్ని ఉదాహరణలు ఇవ్వు" అని మళ్ళీ అడిగాను.

అతను చెప్పాడు "చిన్న సమస్యలు అంటే ఏ కారు కొనాలి, ఎంత డబ్బు దాయాలి, షాపింగ్, సూపర్ మార్కెట్ కు ఎప్పుడువెళ్ళాలి, సెలవులకి ఎక్కడికెళ్ళాలి, ఎప్పుడువెళ్ళాలి, ఏ సోఫా, ఏసి, ఫ్రిడ్జ్ కొనాలి, నెల ఖర్చులు, పనిమనిషిని ఉంచాలా లేదా, మొదలైన అన్ని నిర్ణయాలు మా ఆవిడ తీసుకుంటుంది. నేను దానికి ఒప్పుకుంటాను.

"మరి నీ పాత్రేమిటి?" అని అడిగాను.

అతను చెప్పాడు "నేను పెద్ద పెద్ద సమస్యలకు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాను. అవి, భారత్ పాకిస్థాన్ తో యుద్ధం చేయాలా వద్దా, ఇరాన్ మీద అమెరికా యుద్ధం చేయాలా వద్దా, బలూచిస్తాన్ స్వాతంత్ర్య దేశంగా ఏర్పడాలా వద్దా, ధోని క్రికెట్ నుంచి ఎప్పుడు రిటైర్ కావాలి, సల్మాన్ ఖాన్ ఎవరిని పెళ్ళి చేసుకోవాలి మొదలైనవి.
నీకు తెలుసా! ఈ నా నిర్ణయాలను  నా భార్య ఎప్పుడూ వ్యతిరేకించదు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version