Monday, March 30, 2015

సూపర్ మాన్

ఒకసారి తమిళనాడు నుండి AnanthaRaman Subbaramanyam అమెరికా వెళ్ళడానికి airportలో clearance కోసం wait చేస్తూ ఉంటాడు. ఎంతకీ తన పేరు రాకపోయేసరికి కౌంటర్ దగ్గరకి వెళ్ళి 'నా పేరు ఇంకా పిలవడం లేదెందుకని 'అడుగుతాడు . 
దానికా ఆఫీసర్ , చాలా సేపటినుంచి మీ పేరు పిలుస్తున్నాం, ఎక్కడికెళ్ళారు మీరు అనడుగుతాడు. ఇంతలో ఎనౌన్స్ మెంట్ వస్తుందిలా 
'final call for Mr. 'Anotherman Superman' please board the plane.

Sunday, March 29, 2015

ప్రశ్న

 టీచర్ : నా తరువాతి ప్రశ్నకు ఎవరైతే సమాధానం చెబుతారో వాళ్ళు ఇంటికి వెళ్ళచ్చు. 
(ఇంతలో ఒక కుర్రాడు కిటికీ నుండి బాగ్ ని బయటకు విసిరేస్తాడు.)
టీచర్ : ఎవర్రా అది, బాగ్ విసిరేసింది. 
కుర్రాడు : నేనే టీచర్. నేను ఇక ఇంటికి బయలుదేరుతున్నా 

Saturday, March 28, 2015

108

జంభులింగం, శంభులింగం ఒకరోజు వేటకు వెళ్తారు. అక్కడ శంభులింగం అకస్మాత్తుగా క్రింద పడిపోతాడు. జంభులింగం శ్వాస చూస్తాడు, ఊపిరి కూడా ఆడకపోయేసరికి కంగారుపడి 108 కి కాల్ చేస్తాడు. 
జంభులింగం : హెల్లో, మా ఫ్రెండ్ చనిపోయాడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి? 
ఆపరేటర్ : కంగారు పడకండి. calm down. First, మీ ఫ్రెండ్ నిజంగా చనిపోయాడో లేదో confirm చేసుకుందాం. 
(ఇంతలో కొంత నిశ్శబ్దం. అవతలినుంచి ఏదో గన్ షాట్ వినబడింది.)
జంబులింగం : హా, తరువాత?  

Thursday, March 26, 2015

నిజం

పిల్లాడు : అమ్మా, గాంధీ తాత తలమీద వెంట్రుకలుండవు ఎందుకని?
అమ్మ : ఎందుకంటే అతను ఎప్పుడూ నిజమే మాట్లాడుతాడు గనుక.
పిల్లాడు : ఒహో, ఇప్పుడర్ధమైంది. ఆడాళ్ళందరి జుట్టు ఎందుకంత పెద్దగా ఉంటుందో.

Monday, March 16, 2015

దేవత

ఒక భర్త తన భార్యకు ఇలా SMS చేశాడు
నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినందుకు, నా జీవితంలో ఒక భాగమైనందుకు నీకు కృతజ్ఞతలు. ఇప్పుడు నేనీస్థితిలో ఉన్నానంటే దానికి నువ్వే కారణం.  నువ్వు నా దేవతవి.
 నా జీవితంలోకి వచ్చినందుకు చాలా థాంక్స్. 
నువ్వు చాలా మంచిదానివి 

భర్త SMS చదివి భార్య ఇలా reply ఇచ్చింది
తాగడం అయిందా, 
ఇంక SMSలు ఆపు, 
నోరుమూసుకొని ఇంటికి రా. 
భయపడకు నిన్నేమీ అనను. 

ఇది చదివిన భర్త : 
థాంక్స్, నేను ఇంటి బయటే ఉన్న. 
దయచేసి తలుపు తియ్. 

Sunday, March 15, 2015

పేరు

ఒక పిల్ల కోడి తల్లికోడితో ఇలా అంటుంది. 
పిల్ల కోడి : అమ్మా, మనుషులు పుట్టగానే పేరు పెట్టుకుంటారు కదా, మరి మనకెందుకు పుట్టగానే పేర్లుండవు? 
తల్లి కోడి : మనక్కూడా ఉంటాయే కాకపోతే మనుషులకు పుట్టగానే ఉంటాయి, మనకు చచ్చిపోయాక ఉంటాయి, చికెన్ టిక్క, చికెన్ చిల్లీ, చికెన్ తందూరి, చికెన్ మలై , చికెన్ కడాయి etc...  

Monday, March 9, 2015

మైక్రోసాఫ్ట్

టీచర్ : రాజూ! మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు కొన్ని చెప్పు. 
రాజు : MS Excel, MS word, MS powerpoint 
టీచర్ : జంభూ నువ్వు కొన్ని చెప్పు. 
జంభులింగం : (తీవ్రంగా ఆలోచించి) MS DHONI టీచర్.  

Sunday, March 8, 2015

తెల్లెంట్రుకలు

పిల్లాడు : నాన్నా! ఎందుకు నీకు తెల్లెంట్రుకలు వస్తున్నాయి.
నాన్న: నువ్వు ఒక్కో తప్పు చేసినప్పుడల్లా ఒక్కో తెల్లెంట్రుక వస్తుంది.
పిల్లాడు కొద్దిసేపు దీర్ఘంగా ఆలోచించి.
"ఒహో ఇప్పుడర్ధమైంది, తాతయ్య తలంతా తెల్లెంట్రులుంటాయో."

Saturday, March 7, 2015

Desiginer peace.

ఒక భార్యా, భర్తా వాకింగ్ కని అలా వెళ్తుంటారు. ఇంతలో అకస్మాత్తుగా భర్త కాలికి రాయి తగిలి రక్తం వస్తుంది. వెంటనే తను తన భార్య పైట వైపు చూస్తుంటాడు, తను పైట చించి కట్టు కడుతుందేమోనని. అప్పుడామె 'కల్లోకూడా ఆ ఆలోచన రానీకండి. ఇది Desiginer peace. 

Friday, March 6, 2015

దేవుడు చూస్తున్నాడు

నర్సరీ స్కూల్ కాంటీన్ లో ఒకచోట యాపిల్ బుట్టతో పాటు ఇలా రాసి ఉంటుంది. 
"ఒక యాపిల్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు. దేవుడు చూస్తున్నాడు". 

పక్కనే ఇంకో కౌంటర్ దగ్గర చాక్లెట్స్ బాక్స్ ఉంటుంది. అది చూసి ఒక పిల్లాడు ఇలా రాస్తాడు. 
"మీకు కావల్సినన్ని చాక్లెట్స్ తీసుకోండి. దేవుడు యాపిల్స్ చూడటంలో బిజీగా ఉన్నాడు."  

Thursday, March 5, 2015

తమాషా

భార్య : నాకు ఒంట్లో బాగోలేదండీ!
భర్త : అయ్యో, నేను నిన్ను షాపింగ్ కి తీసుకెళ్దామనుకున్నానే!
భార్య: అరె, నేను తమాషాకి చెప్పానండీ
భర్త : నేనూ తమషాకే చెప్పా. ఇక లేచి వంట చెయ్యి.

Wednesday, March 4, 2015

Beautiful

అర్దరాత్రి Beep Sound విని మెలుకువవచ్చిన మొగుడు తన భార్య మొబైల్ చెక్ చేసి కోపంతో తన భార్యను లేపాడు. భర్త : (కోపంతో) ఎవడు వీడు నీకు ఈ టైమ్ లోBEAUTIFUL అని మెసేజ్ చేశాడు (ఒక్కసారి గా గాబరపడిన భార్య మొబైల్ చూసి మొగుడి ని మింగేసేల కోపంతో చూస్తూ) . . . . . . భార్య: మొదట మీరు మీ కంటిఅద్దాలు పెట్టుకుని చావండి అది BEAUTYFUL కాదు BATTERYFULL .

Sunday, March 1, 2015

సంతోషం

జంభులింగం : సార్! మా ఆవిడ తప్పిపోయింది. 
Postman : ఇది Post office, Police station కాదు. 
జంభులింగం : దీనమ్మ జీవితం. సంతోషంలో ఎక్కడికెళ్ళాలో కూడా తెలియట్లేదు. 
Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version