Tuesday, April 28, 2015

అబద్దం

చింటు: అమ్మా, నాతో అబద్దం ఎందుకు చెప్పావు? 
అమ్మ  : I have already told you, whenever you speak, speak in English. 
చింటు  : Ok mom, why did you lie to me? 
అమ్మ  : When my son?
చింటు : You said, my younger sister is an angel. 
అమ్మ  : Yes, she is.
చింటు : Then, why didn't she fly when I threw her from our balcony. 
అమ్మ  : ఒరేయ్ దున్నపోతా, సచ్చినోడా తలకుమాసిన వెధవ, ఎక్కడ పడేసావురా దాన్ని. నెల తక్కువ వెధవ. 
చింటు: Mom, speak in English please.  

Monday, April 27, 2015

పులికి మేకకీ తేడా

టీచర్ : రాజూ, పులికి మేకకీ తేడా ఏంటి? 
రాజు : ఒకటి క్రూర జంతువు, మరొకటి కూర జంతువు. 

Thursday, April 23, 2015

బర్డ్ ఫ్లూ నివారణ


లైట్

కుర్రాడు : మమ్మీ, నిన్న రాత్రి టాయిలెట్ కని తలుపు తీస్తే లైట్ దానికదే ఆన్ అయింది. 
మమ్మీ : ఓరి వెధవా, నీకెన్ని సార్లు చెప్పాను, ఫ్రిజ్ లో టాయిలెట్ వెళ్ళొద్దని. 

Sunday, April 19, 2015

కష్టమర్ కేర్

హలో కష్టమర్ కేరా? 
అవును చెప్పండి సార్, నేను మీకెలాగ ఉపయోగపడగలను?
సార్! మావాడు SIM కార్డ్ మింగేశాడండీ...
అయ్యో! కానీ దానికి నేనేం చేయగలనండీ...
ఆ SIM కార్డులో వంద రూపాయలు బాలన్స్ ఉంది. 
ఐతే నేనేం చేయగలనో చెప్పండి సార్
ఏం లేదు, వాడు మాట్లాడుతుంటే బాలన్స్ కట్ అవుతుందా? 
????

Saturday, April 18, 2015

అఖిల భారత తాగుబోతుల సంఘం

డిమాండ్లు
1. వికలాంగులకు భేషరుతుగా ఇంటికే మందు  పంపించాలి
2. తెల్ల రేషన్ కార్డ్ ఉన్న వాల్లకు సగం ధరకే  మందు అందించాలి
3. తాగి పడిపోయిన తాగుబోతులను ప్రభుత్వ  అంబులెన్స్ ద్వారా ఇంటికి చేర్చాలి
4. తాగుబోతులకు సమాజం లో తగిన గౌరవం ఇవ్వాలి   ఇంట్లో భార్యలు తన్నకుండా చూడాలి
5. వైన్ షాప్ ల్లో  క్వాటర్ కొంటే   గ్లాసులు  నీల్లు    చెనిగపప్పు పొట్లాలు ప్రీగా  ఇవ్వాలి
6. మా డబ్బుతోనే ప్రభుత్వం నడుస్తుంది గనుక   మాకు తాగి బండ్లు నడుపుకునే  అవకాశం  ఇవ్వాలి 
7. తాగి  తాగి  ఎవడైన చని పోతే ప్రభుత్వమే బాధ్యత వహించి  వారి దశదిన ఖర్మకు   తగిన మందు ఉచితంగా సప్లయిచేయాలి
8. మద్యం పైన ఏ రాష్ట్రమైనా నిషేదం విదించాలన్నా ముందు  మాతో సంప్రదింపులు జరుపాలి

జై తాగుబోతు సంఘం
జై జై  తాగుబోతు సంఘం  

Friday, April 17, 2015

జంధ్యాల కవిత

నువ్వులేని ఈ జీవితం ఎందుకు నేస్తం,
గడ్డం గీసుకోడానికా?
గోర్లు కొరుక్కోవడానికా?
పిప్పరమెంట్లు చప్పరించడానికా?
పాడె మీద పేలాలు ఏరుకోడానికా?
పెంట మీద చెత్త తియ్యడానికా?
ఎంగిలి ఆకులు ఎత్తుకోడానికా?
ఒకే ఒక్క కారణం చెప్పు నేను ఒప్పుకుంటాను ,
నేస్తం ఓ నా ప్రియ నేస్తం

Thursday, April 16, 2015

దేశం బాగుపడుతుంది

మమతా, మాయా, జయలలిత మరియు సోనియా (నలుగురు అమ్మలు) విమానంలో ప్రయాణిస్తున్నారు.

మమత : 100 నోటు క్రిందకు విసిరేసి "ఈ నోటు దొరికినవాడు ఆనందపడతాడు..నా ఈ పని వలన ఒక్కడైన సంతోషపడతాడు.."

మయావతి : రెండు 50 నోట్లు క్రిందకి వేసి "ఈ రెండూ నోట్లూ దొరికినవారు ఆనందపడతారు..నా ఈ పని వలన ఒక్కరు కాదు ఇద్దరు సంతోషపడతారు.."

జయలలిత : పది 10 నోట్లు క్రిందకి వేసి "ఈ పది నోట్లూ దొరికినవారు ఆనందపడతారు..నా ఈ పని వలన పది మంది సంతోషపడతారు.."

సోనియా : వంద 1రూ. బిళ్ళలు క్రిందకి వేసి "ఈ బిళ్ళలు దొరికినవారు ఆనందపడతారు..నా ఈ పని వలన చాలా మంది సంతోషపడతారు.."

పైలెట్ : నేను చేసే పని వలన మొత్తం భారత దేశం సంతోష పడుతుంది... అంటూ ప్యారాచుట్ కట్టుకొని క్రిందకి దూకేసాడు... 

ఆడాళ్ళ మజాకా

బిచ్చగత్తె : బాబు, అన్నం తిని మూడు రోజులైంది. ఒక రూపాయ్ ఉంతే దానం చెయ్యి బాబు. 
జంభులింగం : మూడు రోజులనుండి తిన్లేదంటున్నావ్. ఒక రూపాయ్ తో ఏమొస్తుందేంటి. 
బిచ్చగత్తె : Weight చూసుకుంట అయ్య, ఎంత తగ్గానో ఏమో. 
జంభులింగం : ఆ( ఆడాళ్ళ మజాకా 

Wednesday, April 15, 2015

భయం

ఒక క్రూరుడైన కోళ్ళ ఫారం యజమాని ఒకరోజు ఆ కోళ్ళని యిలా హెచ్చరించాడు. 
'రేపొద్దుటికల్లా తలా రెండు గుడ్లు పెట్టకపోతే మిమ్మల్ని కోసుకుతింటా' అని. 
తర్వాతిరోజు అన్నీ రెండు రెండు గుడ్లు పెట్టాయి, ఒకటి మాత్రం ఒకటే పెట్టింది. 
యజమాని కోపంతో గుర్రుగా చూస్తూ 'ఏమే ఒకటే గుడ్డు పెట్టావేం ' అని గద్దిస్తాడు. 

దానికా కోడి భయంతో వణుకుతూ 
'ఒరేయ్, అదికూడా కోసుకొని తింటావని పెట్టా, నేనసలు పుంజున్రా!' అని వాపోతుంది. 

Thursday, April 9, 2015

మిక్సీ సాక్ష్యం

భార్య : ఎక్కడున్నావ్? 
భర్త : ఇంట్లోనే డార్లింగ్
భార్య : Are you sure?
భర్త : హా, Sure. 
భార్య : మిక్సీ ఆన్ చెయ్.  
భర్త : (మిక్సీ ఆన్ చేస్తాడు). డుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్......
భార్య : Ok, డియర్, Love you, bye .

ఇంకో రోజు...
భార్య : ఎక్కడున్నావ్? 
భర్త : ఇంట్లోనే డార్లింగ్
భార్య : Are you sure?
భర్త : హా, Sure. 
భార్య : మిక్సీ ఆన్ చెయ్.   
భర్త : (మిక్సీ ఆన్ చేస్తాడు). డుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్......
భార్య : Ok, డియర్, Love you, bye .

తరువాత రోజు, భార్య ఫోన్ చెయ్యకుండా Direct గా ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళబ్బాయి ఒంటరిగా ఆడుకుంటుంటే ఇలా అడుగుతుంది " చిన్నూ, డాడీ ఎక్కడ?"

కొడుకు : "ఏమో మమ్మీ, పొద్దునే మిక్సీ పట్టుకొని బయటకెళ్ళాడు"    

Wednesday, April 8, 2015

అసలు విషయం

MMTS లో ఒక ముసలావిడ రోజూ ఒక కాలేజ్ కుర్రాడికి రోజూ 4-5 Dry fruits ఇస్తూ ఉంటుంది. ఆ కుర్రాడుకూడా వాటిని తింటూ ఎంజాయ్ చేస్తూ Travel చేసేవాడు. 

ఒక రోజు ఆ కుర్రాడికి బాగా ఉత్సుకత పెరిగి, రోజూ ఇలా Dry Fruits ఎందుకిస్తున్నావని ఆ ముసలావిడని అడిగాడు. 

అందుకావిడ కొంచెం ఎమోషనల్ గా మొహం పెట్టి
'నాకు Cadbury Dry fruits చాక్లెట్స్ అంటే బాగా ఇష్టం కానీ వాటిని నమలాలంటే  నాకేమో పళ్ళన్నీ ఊడిపోయాయి. అందుకే చాక్లెట్ చీకేసి నీకు Dry fruits ఇస్తాను ' అంటూ చల్లగా అసలు విషయం బయట పెట్టింది.  

Wednesday, April 1, 2015

Bad News - Worse News

డాక్టర్ పేషంట్ తో
డాక్టర్ : నీకొక Bad news, ఒక Worse news చెప్పాలి. 
పేషంట్ : Bad news ఏంటి? 
డాక్టర్ : నువ్వింకా 24 గంటలే బ్రతుకుతావ్. 
పేషంట్ :  Oh my God, ఇంతకన్నా Worse news ఏముంటుంది డాక్టర్  
డాక్టర్ : నీకీ విషయం చెప్పాలని నిన్నటినుండి నీకోసం వెతుకుతున్నా. 
Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version