Monday, May 30, 2016

నిరుద్యోగం

సురేష్ ఇంజనీరింగ్ Complete చేశాడు. తాను కంప్లీట్ చేసిన కోర్స్ కి తగిన ఉద్యోగం కోసం ఎన్నో Interviews కి Attend అయ్యాడు ఐనా కూడా ఏ ఒక్క జాబ్ లో కూడా Select అవ్వలేదు.
.
.
.
.
.
ఇలా కాదని ఏదైనా పని చేస్తు తనకు అవసరమైన నిత్యవసరాలకు, భోజనానికి సరిపడా ఖర్చుల కోసం ఏ పనినైనా చేయాలని నిశ్ఛయించుకున్నాడు.
.
.
.
.
ఒక సర్కస్ కంపెనీని చూశాడు. అందులోకి వెళ్ళి నాకు ఏదైన ఉద్యోగం కావాలి అని అడిగాడు.. అతని పరిస్థితి చూసి జాలిపడి.. కాని ఇక్కడ పనిచేయాలంటే తగిన అనుభవం ఉండాలి అంటే దానికి అతను ఒక కోతిలా హావా భావాలు పలికించి వారిని Impress చేశాడు. శభాష్.. చాలా బాగా చేశావ్ ఇదిగో ఈ చింపాజి డ్రెస్ వేసుకో.. ఇక రేపటి నుండి చింపాజి డ్రెస్ వేసుకుని నువ్వొక నిజమైన చింపాంజిలానే నటిస్తు ప్రేక్షకులందరిని నవ్వించాలి'చెప్పాడు.
.
.
.
.
.
ఇక ప్రతిరోజు చింపాంజిలా డ్రస్ వేసుకొని ఆ చేష్టలతో ప్రేక్షకులను నవ్వించడం మొదలు పెట్టారు. కాని ఒకరోజు ప్రమాదవశాత్తు సింహం ఉన్న పెద్ద బోనులో పడిపోయాడు.. అక్కడున్న ప్రేక్షకులందరు ఆశ్ఛర్యానికి లోనయి ఉత్కంఠగా గమనిస్తున్నారు. అక్కడున్న ఎవ్వరికి తెలియదు చింపాంజి వేషంలో ఒక మనిషి ఉన్నాడు అని.. సురేష్ కి చచ్చేంత భయం పట్టుకుంది సరైన ఉద్యోగం దొరకక పోవడం వల్ల ఇలా ఈరోజు నా ప్రాణాలు పోతున్నాయనమాట అని ఆ సింహం ముందు వణుకుతు, ఏడుస్తు కూర్చున్నాడు.
.
.
.
.
.
ఆ సింహం నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చింది కాని ఇంకా దాడి చేయలేదు.. కళ్ళు మూసుకొని భయంతో చెమటలు కక్కుతూ ఉండగా ఆ సింహం అతనికి చాలా దగ్గరికి వచ్చి…
.
.
..
.
అరే సురేష్ గా భయపడకు నేను రమేష్ గాడ్ని 2012 మెకానికల్ బాచ్…

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version