Saturday, June 4, 2016

మెసేజ్

ఒకబ్బాయి ప్రేమలో పడ్డాడు ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పడానికి అతనికి ధైర్యం చాల్లేదు. 

ఒకరోజు ధైర్యం చేసి, I Love You అని టైప్ చేసి reply కోసం Wait చేస్తున్నాను అని రాసి మెసేజ్ పెట్టాడు. 

వెంటనే మొబైల్ కి మెసేజ్ వచ్చింది. 

ఆ అబ్బాయి మెసేజ్ చూడ్డానికి చాల Tension పడ్డాడు. ఈ Tensionలో ఇప్పుడు చూడ్డం ఎందుకు, పొద్దున్నే లేచి చూద్దామని పడుకున్నాడు. 

పొద్దున్నే లేచాడు, స్నానం చేసి, టిఫిన్ తిన్నాడు, కాఫీ తాగాడు. దేవున్ని ప్రార్ధించాడు. message తనకు అనుకూలంగా ఉండాలని కోరుకున్నాడు. ఫోన్ తీసి మెసేజ్ చదివాడు. 

అ మెసేజ్ ఇలా ఉంది. 'Dear Customer you have insufficient balance to send this message. Please recharge your account and try again'  

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version