😆😆😆😆😆
కొత్తగా మంత్రి అయిన ఓ పెద్దాయన కొడుకు "ఇన్స్పెక్టర్ " ఉద్యోగానికి ఇంటర్వ్యూ కెళ్ళాడు. నీకేం పర్లే , సెగెట్రీ చూసుకుంటాడు, దయిర్నంగా ఎలిపోయోచ్చేయ్, అని తండ్రి అభయ హస్తమిస్తే, ఈయన గారు ఇంటర్వ్యూ కొచ్చేడు!.
పెద్దాయన పంపాడు, ఏం కొంపలు మునుగు థాయో అనుకుని, ఇంటర్వ్యూ గాళ్ళు (చే సే వాళ్ళన్న మాట)
" నిన్ను ఒకే ప్రశ్నఅడుగుతాం, సమాధానం చెప్పు సారూ", అన్నారు.నీళ్ళు నములుతూ, "
ఒకే!" అన్నాడు పెద్దాయన చిన్న గుంటడు.
" ... గాంధీజీ ని ఎవరు చంపారు?" అని పాపం అడగ లేక అడగలేక, అడిగారు .
వీడు, "రేపు చెబుతా.. బై !" హని ఇంటికొచ్చేసాడు!
....
....
....
"ఎరా , ఎలా చేసావ్?" (తండ్రి )
"అదరగొట్టేసానయ్యా, నువ్ నమ్మవ్ గానీ, అప్పుడే నాకో మర్డర్ కేసు కూడా అప్పజెప్పీసీరు, (???) మనమంటే ఏటనుకున్నావ్!
😆😆😆😅😅