ఒక వ్యక్తి హాస్పటల్ బెడ్ మీద చావు బ్రతుకుల మధ్య తన భార్యని పిలిచి ఇలా చెబుతాడు.
'నువ్వు కూకట్ పల్లి లో ఉన్న పది అపార్ట్ మెంట్స్ తీసుకో',
పెద్దకొడుకుని పిలిచి 'నువ్వు దిల్ షుఖ్ నగర్ లోని మూడు షాపింగ్ మాల్స్, ఒక గుడి తీసుకో',
రెండో కొడుకుతో 'నువ్వు మెహదీ పట్నంలోని రెండు టెంపుల్స్ తీసుకో '
చిన్నోడిని పిలిచి 'ఒరేయ్ నువ్వు లకడికపూల్ లోని రెండు కాలనీలు తీసుకో',
కూతుర్ని పిలిచి 'నువ్వు శ్రీ నగర్ లోని రెండు స్వీట్ షాప్స్ తీసుకో' అని చెప్పి చనిపోతాడు.
ఇంతలో ఇవన్నీ పక్కనే ఉండి వింటున్న నర్స్ అంటుంది 'మీ వారు చాలా గొప్పవారు కదా, పోతూ పోతూ బోలెడు ఆస్తి సంపాదించడమే కాకుండా
బాధ్యతగా పంచిపెట్టి మరీ పోయారు ',
'ఆస్తా పాడా మాది పాల వ్యాపారం, పాల ఖాతాలు అప్పచెప్పి పోయాడు సచ్చినోడు ' అని వాపోతుంది.
No comments:
Post a Comment