Friday, September 29, 2017

అండర్ స్టాండింగ్

🤣🤣🤣🤣🤣🤣🤣
పెళ్లి అయి 25ఏళ్లు అయిన సందర్భంగా బెంగుళూరులో ఒక జంట పెద్ద విందు ఏర్పాటు చేసింది. జాతీయ మీడియా ప్రతినిధులు కూడా దానికి హాజరయ్యారు. ప్రెస్‌ వాళ్లు రావాల్సిన అంత విశేషం ఏముంది అంటే వారిరువురు పాతికేళ్లలో ఒక్కసారి కూడా ఘర్షణ పడలేదు. జాతీయ మీడియాను కూడా ఈ పాయింటు ఆకర్షించింది. మొత్తానికి విందుకు వచ్చిన విలేకరులు ఆ భర్తను పదేపదే ప్రశ్నలు అడిగారు..ఒక్కసారైనా గొడవ పడకుండా ఎలా ఉండగలిగారు? ఆ రహస్యం ఏదో ప్రజలకు చెబితే సుఖసంతోషాలతో వర్థిల్లుతారు కదా అని అడిగారు. మొదట చెప్పటానికి నిరాకరించిన భర్త మొత్తం మీద ఒక ఛానెల్‌ విలేకరి వత్తిడిని భరించలేక పక్కకి తీసుకెళ్లి రహస్యం ఏంటో చెప్పసాగాడు..
.
.
పాతికేళ్ల క్రితం, మా పెళ్లయిన కొత్తలో..హనిమూన్‌కు ఒక హిల్‌ సెంటర్‌కి వెళ్లాము.
నా భార్య గుర్రం ఎక్కుతా అని ముచ్చటపడింది. ఇద్దరం చెరో గుర్రం ఎక్కాం. మా ఆవిడ ఎక్కిన గుర్రం ఎందుకో భయపడి కొద్ది దూరం వెళ్లాకా ఆమెను కిందపడేసింది. ఖంగుతిన్న నా భార్య గుర్రంకేసి వేలు పెట్టి చూపిస్తూ "ఫస్ట్‌ టైమ్‌" అంది. నా గుర్రం సాఫీగానే వెళ్తోంది.
ఓ ఫర్లాంగు వెళ్లగానే మళ్లీ ఆ పెంకి గుర్రం నా శ్రీమతిని ఒక్క ఉదుటున కిందకి తోసేసింది.
కోపంతో ఆమె గుర్రం కేసి చూపుడు వేలు చూపిస్తూ "సెకండ్‌ టైమ్‌" అంది. ఇంక హోటల్‌కి కిలోమీటరు దూరంలో ఉన్నాం..10నిముషాల్లో వెళ్లిపోతాం అనగా మరోమారు ఒక్క గెంతు గెంతిని గుర్రం మా ఆవిడ్ని కిందకి విసిరేసింది. ఆవేశంతో ఊగిపోయిన నా భార్య "థర్డ్‌ టైమ్‌" అంటూ పర్సులో నుంచి తుపాకి తీసి దానిపై బులెట్ల వర్షం కురింపించి చంపేసింది.
అది చూసి నా మతిపోయింది. ఎంతైనా మూగజీవం కదా! దానికేం తెలుస్తుంది. కోపం వచ్చి నా భార్యను "నీకేమైనా మెంటాలా? సైకోవా నువ్వేమైనా? కొద్దిగ కూడా కనికరం లేదా నీకు యూ ఫూల్‌" అని తిట్టేశాను.
వెంటనే నా భార్య తన చూపుడు వేలు నాకేసి తిప్పి ఫస్ట్ టైం అంది...
అప్పటి నుండి మామధ్య అండర్ స్టాండింగ్ కుదిరింది...
😜😜😜😜😜😜😜

Saturday, September 23, 2017

వ్రతాలు

...:
భార్య : గత 4 సంవత్సరాలుగా నేను వ్రతాలు ఏవీ చేయడం లేదు..😐😐

భర్త : పోన్లే..ఇప్పుడేమైంది..🤔🤔

భార్య : అయినా మీరు ఆరోగ్యంగా ఉన్నారు..!!😓😓

భర్త : అవును..నేను ఆరోగ్యం పై చాలా శ్రద్ధ తీసుకుంటుంటాను.😊😊

భార్య : నేనేం వెర్రి దానిలా కనిపిస్తున్నానా..తిన్నగా నిజం చెప్పు..ఎవర్తది..నీ ఆరోగ్యం కోసం పూజలు,వ్రతాలూ చేస్తున్నది.?😠😡😈

వామ్మో...భర్త వెర్రి చూపులు చూస్తున్నాడు..

😫😫😛😛😛😄😆😜😝🤑🤐

Tuesday, September 19, 2017

వైన్

విమాన ప్రయాణంలో ఇండియన్సకి వైన్ ఇవ్వడం నిషేధించారు...
ఎందుకంటే .... తాగిన తర్వాత మిగతా దేశాలవాళ్ల ప్రవర్తనకూ మన వాళ్ల ప్రవర్తనకూ మధ్య చాలా తేడా ఉంటోందట...

బ్రిటిషర్‌ : నేను పడుకుంటా  లైట్ ఆఫ్ చేయండి...

అమెరికన్: నేను ఇంటర్నెట్‌లో పనిచేసుకుంటా..!

జర్మన్: నేను మ్యూజిక్‌ వింటా...!

చైనీస్‌: నేను సినిమా చూస్తా..!

ఇండియన్: మామా! నువ్వు తప్పుకో. ఫ్లైట్‌ను నేను నడుపుతా....

Friday, September 15, 2017

దేవుడు

అమృతం తాగిన వాడిని " దేవుడు " అంటారు.
విషం తాగిన వాడిని " మహా దేవుడు " అంటారు.
విషం తాగి కూడా, అమృతం తాగినట్లు ఆనందం నటించే వాడినే " పతి దేవుడు " అంటారు..😜😁🤣😀

Saturday, September 2, 2017

అతిథి

💐సరదాగా నవ్వుకుందాం.💐

ఒక తల్లికి నలుగురు కుాతుళ్లు ఉండేవారు....
  👧        💇      🙆      🙅

అందులో 👧 మెుదటి అమ్మాయి పేరు......
      ........... విరిగిన.........

💇 రెండవ అమ్మాయి పేరు......
              ........... చిరిగిన......

🙆మూడవ అమ్మాయి పేరు..........
          ...........పాడైపోయిన......

🙅నాలుగవ అమ్మాయి పేరు.......
          ..... చనిపోయిన....

ఇలా ఈ విధంగా ఆ తల్లి తన
కుాతుళ్లకు పేర్లు పెట్టుకుంది ......

.......... ఒక రోజు వీరి ఇంటికి ఒక అతిథి వస్తాడు... 👤👤

అతనితో తల్లి ఇలా అడుగుతుంది :-''మీరు కుర్చీలో కూర్చుంటారా..? లేకా చాప మీద కూర్చుంటారా''...?

👤అతిథి :-'' కుర్చీ మీద కూర్చుంటాను ''..

తల్లి :- ''విరిగిన....👧! కుర్చీ తీసుకోనిరా''.. !

👤అతిథి :-'' వద్దులేండి..! నేను చాప మీద కుార్చుంటాను''..!

తల్లి :- '' చిరిగిన..💇!  చాప తీసుకోని రా''..!

👤అతిథి :- '' ఉండనివ్వండి.. నేను కింద నేలపైనే.  కుర్చుంటాను..

............. అలా ఆ అతిథి నేలమీద కూర్చుంటాడు.....
  ......  కొద్దిసేపు తర్వాత......

తల్లి :- '' మీరు టీ తీసుకుంటారా...?
  లేక పాలు తీసుకుంటారా ''. ..?

👤అతిథి:- '' టీ ''

తల్లి :- '' పాడయిపొయిన...🙆!
                  టీ తీసుకోని రామ్మా ...''

👤అతిథి :- '' వద్దు, వద్దులేండి..
                   నేను పాలు తీసుకుంటాను... ''

తల్లి :-  '' చనిపోయిన...🙅!
                ఆవు పాలు తీసుకుని రామ్మా.. ''
                         
........    ఈ మాటలు విన్న 👤అతిథి ఏమీ తోచకా అక్కడి నుండి పారిపోయాడు........ 🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃
మీరు నవ్వుతూ, నలుగురిని నవ్విస్తూ బతకండి 😁😁😁😁😁😁😁😀😀😀

ఇంగ్లీష్ తగలెయ్య

భర్త : ఏమైందోయ్ మన ఇంటి ముందు
ఇంత మంది జనం ఉన్నారు🤔🤔🤔
భార్య : ఏంలేదండి మన అల్లుడు 
ముంబై నుండి వస్తున్నాడు అని
ఎదురింటి పిన్నికి వినిపించేలా
చెప్పాను అంతే 😒😒😒😒
భర్త: ఆలా చెప్తే ఇంత మంది ఎందుకు వస్తారు
ఏమన్నావో కాస్త వివరంగా చెప్పు😣😣😣
భార్య : ఏంలేదండీ ఈ మధ్య నేను
ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను కదా 
అదే ఇంగ్లిష్ లో చెప్పా                    
భర్త: అదేంటో ఏడువు 😖😖😖
భార్య: "టుడే సన్నీ లియోన్ ఈస్ కమ్మింగ్
టు మై హోం ఫ్రామ్ ముంబై"😚😚😚
భర్త: నీ ఇంగ్లీష్ తగలెయ్య 😫😫😫
అది సన్నీలియోన్ కాదే ...
సన్ ఇన్ లా'...😀

పనమ్మాయిని


అడుక్కునే వాడు ఫ్లాట్ బెల్ కొట్టాడు.
ఆవిడ తలుపు తీసింది భిక్షమేయడానికి.
కొద్దిగా బయటకు వచ్చి వేయండి అన్నాడు.
ఆమె బయటకు రాగానే....
అహ్హహ నేను భిక్షగాడిని కాదు.. రావణుడిని నిన్ను ఎత్తుకుపోవడానికి వచ్చాను అన్నాడు.
ఆమె...
అంతకంటే గట్టిగా నవ్వి ,
నేను సీతను కాదు పనమ్మాయిని అన్నది.
అయితే ఇంకా మంచిది..
సీత అయితే నా మండొదరి ఏడుస్తుంది.
నువ్వైతే దాసిని తెచ్చానని సంబురపడుతుంది అన్నాడు.
నీ మొహం..
సీత అయితే రాముడు ఒక్కడే నిన్ను చంపడానికి వస్తాడు.
నన్ను తీసుకెళ్తే అపార్ట్మెంట్ వాళ్లందరూ వెతుక్కుంటూ వచ్చి మరీ చంపేస్తారు ....

😂😂😂😂😂😂😂

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version