అడుక్కునే వాడు ఫ్లాట్ బెల్ కొట్టాడు.
ఆవిడ తలుపు తీసింది భిక్షమేయడానికి.
కొద్దిగా బయటకు వచ్చి వేయండి అన్నాడు.
ఆమె బయటకు రాగానే....
అహ్హహ నేను భిక్షగాడిని కాదు.. రావణుడిని నిన్ను ఎత్తుకుపోవడానికి వచ్చాను అన్నాడు.
ఆమె...
అంతకంటే గట్టిగా నవ్వి ,
నేను సీతను కాదు పనమ్మాయిని అన్నది.
అయితే ఇంకా మంచిది..
సీత అయితే నా మండొదరి ఏడుస్తుంది.
నువ్వైతే దాసిని తెచ్చానని సంబురపడుతుంది అన్నాడు.
నీ మొహం..
సీత అయితే రాముడు ఒక్కడే నిన్ను చంపడానికి వస్తాడు.
నన్ను తీసుకెళ్తే అపార్ట్మెంట్ వాళ్లందరూ వెతుక్కుంటూ వచ్చి మరీ చంపేస్తారు ....
😂😂😂😂😂😂😂
No comments:
Post a Comment