నాన్న: ఏరా లెక్కల్లో మార్కులు వందకు ఫైనే వచ్చాయన్నావు? మరి రెండు మార్కులు వచ్చాయి ఏంటిరా?
చింటు : అవును నాన్నా! ఆ రెండు ఎక్కడ వేశారో చూడు. వందకు ఫైనే కదా!
Monday, October 15, 2012
Saturday, October 13, 2012
పెద్ద అబద్దం
ఇద్దరు కుర్రాళ్ళు గొడవ పడుతుండగా వాళ్ళ unlce గదిలోకి అడుగు పెడుతాడు.
Uncle : మీరెందుకు గొడవ పడుతున్నారు?
మొదటి కుర్రాడు : మాకు వంద రూపాయల నోట్ దొరికింది. ఎవరైతే అతి పెద్ద అబద్దం ఆడితే వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నాం..
Uncle: సిగ్గులేదు , అబద్దాలమీద పందాలా? మీ వయసున్నప్పుడు నాకసలు అబద్దమంటే తెలియదు తెలుసా.....
వెంటనే ఇద్దరూ ఏకగ్రీవంగా
"ఈ వందనోట్ మీరే తీసుకోండి Uncle"
Friday, October 12, 2012
ఫన్నీ సమాధానాలు
ఈ క్రింది కొన్ని ప్రశ్నలకు హాస్యభరితమైన సమధానలను గమనించండి. కొన్నిసార్లు మనకు కూడా ఇటువంటి సమాధానాలు తారసపడుతుంటాయి...
Thursday, October 11, 2012
చేతి వ్రేలు
పేషంట్: డాక్టర్, నేనెక్కడ ముట్టుకుంటే అక్కడ నొప్పిగా ఉంటుంది."
డాక్టర్: ఏమంటున్నావ్?
పేషంట్: అవును డాక్టర్. నేను నా భుజం పట్టుకుంటే అక్కడ నొప్పిగా ఉంటుంది. మోకాలు టచ్ చేస్తే అక్కడా నొప్పిగా ఉంటుంది. ఓహ్ నా నుదురు పట్టుకున్నప్పుడు కూడా... చాలా యిబ్బంది పెడుతుంది డాక్టర్....
డాక్టర్: OK, నాకిప్పుడు అర్ధమైంది. నీ చేతి వ్రేలు విరిగింది.
Wednesday, October 10, 2012
negligence
జంభులింగం: డాక్టర్, మీరే నాకు సహాయం చెయ్యాలి. నేను మాట్లాడుతుంటే ఎవ్వరూ నా మాట వినట్లేదు. నా మాటంటే ఎవ్వరికీ లెఖ్ఖ లేకుండా పోతుంది. ఏం చెయ్యాలో తెలియడం లేదు.. అసలు .....
డాక్టర్: Next, ప్లీజ్ ...
Tuesday, October 9, 2012
Monday, October 8, 2012
wrong number
ఒక టీనేజ్ గర్ల్ ఫోన్లో అరగంట మాట్లాడి పెట్టేస్తుంది. అది చూసి వాళ్ళ నాన్న
"గ్రేట్! చాలా తొందరగా పెట్టేశావ్? నువ్వు సాధారణంగా రెండు గంటలు తక్కువ మాట్లాడవు కదా!"
"హా ! అది wrong number మరి. "
Subscribe to:
Posts (Atom)