Friday, October 5, 2012

జంధ్యాల మోడెర్న్ తిట్లు


కాకి నోట్లోంచి బ్రెడ్ ముక్క లాక్కొనే అంట్ల కాకి ఎధవా...
ATMలో పాన్ కార్డ్ పెట్టే తింగర సన్నాసీ....
108 వెహికిల్ ని ఆపి లిఫ్ట్  అడిగి తిట్లు తినే తింగరి ఎధవా...
సెకండ్ ఫ్లోర్ లో పెట్రోల్ బంక్ పెట్టి దివాళా తీసే ఫేసూ నువ్వూ ....
తిని పారేసిన యిస్తరాకులు కడిగి అమ్ముకునే కక్కుర్తి ఎధవా..
బూట్ పాలిష్ కుర్రాడితో బేరమాడి 50% డిస్కౌంట్ కి చేయించుకునే పీనాసి నాయాల
నల్ల కూలింగ్ గ్లాస్ వేసుకొని నల్ల అద్దంలో చూసుకుంటూ మాడిపోయిన మసాలా దోశను అమాస రాత్రి కరెంట్ పోయిన టైంలో తినే కక్కుర్తి ఎధవా...
విమానంలో  సీటు కర్చీపు వేసు సీటూ ఆపుకోడానికి పారాచూట్ వేసుకెళ్ళే యాబ్రాసీ  
ఆదివారం రాత్రి పబ్ కి వెళ్ళి వేడి వేడి గా ఉప్మా ఉందా అనే తింగరి ముఖమా..
కుక్కవెంట పడుతుంటే వొడాఫోన్ sim తీసి పడేసే అక్కుపక్షి...
శవం మీద మరమరాలు ఏరుకొని భేల్‌పురి చేసుకొని తినే పెంట మొహమా....
అక్షయ పాత్రలో అడుక్కుతినే ఎదవా..
అష్ట దరిద్రమైన శని గ్రహానికి పౌడర్ పూసి, బొట్టు పెట్టినట్టున్న మొహమూ నువ్వూ...
ఎక్వేరియంలో చేపలు పట్టే యాబ్రాసీ ...
ఎండ్రిన్ డబ్బాలో ఏరుశనక్కాయలు దాచుకునే ఎర్రి పీనుగా..
ఆఫీస్ బాత్రూంలో కలరా బిళ్ళలు దొంగతనం చేసే కక్కుర్తి ఎదవా..

3 comments:

  1. ఇవన్నీ నందమూరి ఫాన్స్ వెబ్‌సైట్‌లో గతంలో నేను చదివిన తిట్లే.

    ReplyDelete
    Replies
    1. కావచ్చు. నాకు mail చేసినవారు source పంపలేదు. దానికి కొన్ని కలిపి post చేశాను.

      Delete
    2. ఏమైతేనేం! అన్నీ అచ్చం అన్నీ జంధ్యాల మార్కు
      తిట్లుగానే వున్నాయ్ ... బాగున్నాయ్ ...

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version