"వాట్సాప్", "ఫేస్ బుక్" లలో కష్టపడుతున్న శ్రామికులందరికీ
"మే డే" (May Day) శుభాకాంక్షలు....!
సెలవు పత్రము
తేదీ 27.04.2017
గౌరవనీయులైన సీఈవో గారికి,
విషయం : విడుదల రోజు బాహుబలి-2 సినిమా చూడడానికి శుక్రవారం సెలవు గురించి.
నేను మీ కంపెనీలో పనిచేసే సగటు ఉద్యోగిని. నాకు ఈ శుక్రవారం సెలవు కావాలి. ఎందుకంటే నా ఫ్యామిలీకి బాహుబలి సినిమా చూపించడం కోసం. సినిమా చూడడానికి సెలవెందుకు అని మీరడగవచ్చు. కానీ ఈ సినిమా చూపించకపోతే నా ఫ్యామిలీ నాకు దక్కేట్టు లేదు.
•నా కొడుకు గడికోసారి నేనెవర్నీ…. నేనెవర్నీ… అని అరుస్తున్నాడు.
•నా కూతురు జై మాయుష్మతీ అంటూ నిద్రలో కలవరిస్తుంది.
•నా భార్య అయితే మాటిమాటికీ మాయిష్మతికి మకిలి పట్టిందీ…. రక్తంతో కడిగేయ్… అంటూ దిక్కులు పెక్కటిల్లేలా అరుస్తుంది.
• నాకేమో భల్లాల దేవ కల్లోకి వస్తున్నాడు… అప్పుడప్పుడు అవంతిక డ్రీమ్స్ లోకి వచ్చి టెంప్ట్ చేస్తుందనుకోండి (ఇది పర్సనల్)
•నిన్న రాత్రి మా ముసలామె యాక్షన్, కెమెరా అంటూ ఆగమాగం చేసింది. ఓసేయ్ ముసలి ఏమయ్యిందే నీకు అంటే …అరెేయ్ నన్ను డిస్టర్బ్ జేయకు నేను రాజమౌళి ని అంటూ మల్లీ యాక్షన్, కెమెరా, స్టార్ట్ అంటుంది.
•సినిమా చూడగానే ప్రతి ఒక్కడు వచ్చి “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో చెప్పేస్తుంటారు..” అది విని నేను సహించలేను. సో..నేనే తెలుసుకుంటా!
•దేవసేన మహారాణి (అనుష్క) ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది (ఇది పర్సనల్)
సార్ ఇక నా వల్ల కాదు….ఆ మోషన్ పిక్చర్ చూపించకపోతే మావాళ్లు నాకు మోషన్స్ తెప్పించేలా ఉన్నారు. మూడు సంవత్సరాలు సినిమా షూటింగ్ అయ్యేదాకా ఆగారు. కానీ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాక మూడు నిమిషాలు కూడా ఆగేలా లేరు నా ఫ్యామిలీ మెంబర్స్.
కాబట్టి పై విషయాలను దృష్టిలో ఉంచుకుని నాకు శుక్రవారం సెలవు ఇవ్వగలరని నా మనవి.
కృతజ్ఞతాభినందనలతో…
మీ విధేయుడు అమరేంద్ర బాహుబలి
సారీ… సర్సినిమా సీను
ఏమంటివి!!...
ఏమంటివి!!...
బగ్గు నెపమున ఈ మృదుపరికరణ నిపుణుని (software professional) కి ఇందు పని చేయుటకు అర్హత లేదందువా?
ఎంత మాటా!!...
ఎంత మాటా!!...
ఇది యూనిట్ టెస్టింగే (Unit Testing) ఏ కానీ యూజరాక్సెప్టన్స్ (Useracceptance Testing) కాదే..!!
కాదూ కాకూడదూ,
ఇందు బగ్స్ రాకూడదూ అందువా....??
అయిన ఈ ప్రాజెక్ట్ లీడ్ కోడింగ్ ఎట్టిది?
అతి జుగుప్సాకరమైన
నీ కోడింగ్ ఎట్టిది?
గూగుల్ లో కాపీ కొట్టితివి కదా హా..హా..హా
నీది ఏమి కోడింగు??
అంత ఏల మన కంపెనీ పితామహుడు , సాఫ్ట్ వేర్ లో కురువృధ్ధుడు అయిన మన సిఈఓ(CEO) బగ్గు ఫిక్సు చెయ్యలేక పాత కంపెనీ నుండి పారిపోయి రాలేదా?? ఆయనదే కోడింగు..??
నాతో చెప్పింతువేమయ్యా..!!
ఈ కోడింగు మొదలుపెట్టిన నువ్వు...
వర్షన్ 1.1 ని...
దాన్ని రివ్యూ చేసిన నీ టియల్ (TL) వర్షన్ 1.2 ని....
అందులో బగ్గు ఫిక్స్ చేసిన నీ పియల్(PL) వర్షన్ 1.3 ని.... తయారు చెయ్యలేదా...??
సందర్భావసరాల బట్టి .. కాస్టు కటింగు (Cost Cutting) ప్రాధాన్యంతో.. తయారయిన మన కోడ్ ఏనాడో బగ్సుపరమైనది.
కాగా నేడు బగ్గు.. బగ్గు.. అని ఈ వ్యర్ధవాదనెందులకు?
_లాలీ...లాలీ...లాలి లాలి_
_లాలీ...లాలీ...లాలి లాలి_
_వటపత్రశాయికి WhatsApp లాలి_
_రాజీవ నేత్రునికి Redmi లాలి_
_మురిపాల కృష్ణునికి Microsoft లాలి_
_జగమేలు స్వామికి Java లాలి_
_కల్యాణరామునికి Candy Crush లాలి_
_యదువింశ విభునికి YouTube లాలి_
_కరిరాజ ముఖునికి Talking Tom లాలి_
_పరమాంశభవునికి Paytm లాలి_
_అలమేలు పతికి Amazon లాలి_
_కోదండరామునికి Cricbuzz లాలి_
_శ్యామలాంగునికి SHAREit లాలి_
_ఆగమనుతినికి Android లాలి_
_లాలీ...లాలీ...లాలి లాలి_
_లాలీ...లాలీ...లాలి లాలి_
ఓ రోజు భర్త తన బెస్ట్ ఫ్రెండ్ ని భోజనానికని ఇంటికి తీసుకొచ్చాడు. వాళ్ళు ఇంటి కొచ్చాక గాని తెలీదు భార్యకీ విషయం..
దాంతో గట్టిగా అరిచింది భర్త పై "ఎవరి నైనా డిన్నర్ కి పిలిస్తే నాకు ముందుగా చెప్పాలి గదా, నన్ను చుడండి నైటీ లో పనిమనిషిలా వున్నాను, ఇల్లంతా చిందర వందరగా బాయ్స్ హాస్టల్ రూంలా వుంది, కూరలు లేవు, అసలు మీకు బుద్దున్దా అని అడుగుతున్నాను"
దానికి భర్త తాపీగా "వాడికి వచ్చే వారమే పెళ్లి, ఇవన్నీ తెలుసు కుంటాడనే పిలిచానే, నువ్వేం కంగారుపడకు, ఉప్మా చేసి పడేయ్ తెలిసొస్తుంది వెదవకి పెళ్లంటే ఏంటో"l