ఓ రోజు భర్త తన బెస్ట్ ఫ్రెండ్ ని భోజనానికని ఇంటికి తీసుకొచ్చాడు. వాళ్ళు ఇంటి కొచ్చాక గాని తెలీదు భార్యకీ విషయం..
దాంతో గట్టిగా అరిచింది భర్త పై "ఎవరి నైనా డిన్నర్ కి పిలిస్తే నాకు ముందుగా చెప్పాలి గదా, నన్ను చుడండి నైటీ లో పనిమనిషిలా వున్నాను, ఇల్లంతా చిందర వందరగా బాయ్స్ హాస్టల్ రూంలా వుంది, కూరలు లేవు, అసలు మీకు బుద్దున్దా అని అడుగుతున్నాను"
దానికి భర్త తాపీగా "వాడికి వచ్చే వారమే పెళ్లి, ఇవన్నీ తెలుసు కుంటాడనే పిలిచానే, నువ్వేం కంగారుపడకు, ఉప్మా చేసి పడేయ్ తెలిసొస్తుంది వెదవకి పెళ్లంటే ఏంటో"l
No comments:
Post a Comment