Wednesday, April 26, 2017

సాఫ్ట్వెర్ క్షాత్రపరీక్ష

ఏమంటివి!!...
ఏమంటివి!!...

బగ్గు నెపమున ఈ మృదుపరికరణ నిపుణుని (software professional) కి ఇందు పని చేయుటకు అర్హత లేదందువా?

ఎంత మాటా!!...
ఎంత మాటా!!...

ఇది యూనిట్ టెస్టింగే (Unit Testing) ఏ కానీ యూజరాక్సెప్టన్స్ (Useracceptance Testing) కాదే..!!
కాదూ కాకూడదూ,
ఇందు బగ్స్ రాకూడదూ అందువా....??

అయిన ఈ ప్రాజెక్ట్ లీడ్ కోడింగ్ ఎట్టిది?
అతి జుగుప్సాకరమైన
నీ కోడింగ్ ఎట్టిది?
గూగుల్ లో కాపీ కొట్టితివి కదా హా..హా..హా
నీది ఏమి కోడింగు??

అంత ఏల మన కంపెనీ పితామహుడు , సాఫ్ట్ వేర్ లో కురువృధ్ధుడు అయిన మన సిఈఓ(CEO) బగ్గు ఫిక్సు చెయ్యలేక పాత కంపెనీ నుండి పారిపోయి రాలేదా?? ఆయనదే కోడింగు..??

నాతో చెప్పింతువేమయ్యా..!!
ఈ కోడింగు మొదలుపెట్టిన నువ్వు...
వర్షన్ 1.1 ని...
దాన్ని రివ్యూ చేసిన నీ టియల్ (TL) వర్షన్ 1.2 ని....
అందులో బగ్గు ఫిక్స్ చేసిన నీ పియల్(PL) వర్షన్ 1.3 ని.... తయారు చెయ్యలేదా...??

సందర్భావసరాల బట్టి .. కాస్టు కటింగు (Cost Cutting) ప్రాధాన్యంతో.. తయారయిన మన కోడ్ ఏనాడో బగ్సుపరమైనది.
కాగా నేడు బగ్గు.. బగ్గు.. అని ఈ వ్యర్ధవాదనెందులకు?

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version