పెళ్లి అనేది APSRTC లాగా
.
.
చాలా సేపు wait చేసి చేసి ఎర్ర బస్సు ఎక్కుతం.. టికెట్ తీసుకుని తీరా వెనుక చూస్తే ...
.. deluxe లు, luxury లు వస్తాయి... 😀😀
పెళ్లి అనేది APSRTC లాగా
.
.
చాలా సేపు wait చేసి చేసి ఎర్ర బస్సు ఎక్కుతం.. టికెట్ తీసుకుని తీరా వెనుక చూస్తే ...
.. deluxe లు, luxury లు వస్తాయి... 😀😀
భర్త: అదేమిటి? కదలకుండా అలా కూర్చున్నావ్?
భార్య:మీరేగా! రాయిలా కూర్చోమన్నారు!
భర్త:ఒసేయ్! రాయిలా కూర్చోమనలేదే! రా...యిలా....కూర్చో...అన్నానే!
భారత దేశం లో ఎక్కడ ఉన్నామో గుర్తించడం ఎలా
సీన్ 1 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు మూడో వాడు వచ్చి చూసి వెళ్ళిపోతే అది "ముంబై"
సీన్ 2 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు మూడో వాడు వచ్చి గొడవ ఆపుదాం అనుకుని మిగిలిన ఇద్దరి చేత తన్నించుకుంటే అది "చెన్నై"
సీన్ 3 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు మూడో వాడు ఒక కేస్ బీర్లు తెచ్చి అందరూ కలిపి తాగి చివరికి ఫ్రెండ్స్ ఐపోయి ఇంటికి వెళ్లిపోతే అది "గోవా"
సీన్ 4 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు ఒకడు వచ్చి మా ఇంటి ముందు కొట్టుకోకన్డి దూరం గా వెళ్ళండి అంటే అది "బెంగళూరు"
సీన్ 5 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇద్దరు చేతిలో ఉన్న ఫోన్ తీసి కాల్ చేస్తారు అప్పుడు ఇద్దరి తో ఇంకొక 50 మంది కొట్టుకుంటే అది "పంజాబ్"
సీన్ 6 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు మూడో వాడు వచ్చి ఇద్దరిని తుపాకీ తో కాల్చేస్తే అది "బీహార్"
సీన్ 7 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు మిగతా వాళ్ళు వచ్చి వాడి కులం ఏంటి అని వేరే కులం వాడ్ని కొడితే అది "ఆంధ్ర ప్రదేశ్"
ఇది అల్టిమేట్
సీన్ 8 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు.....జనాలు అందరూ గుమిగూడారు.... ఒకడు సైలెంట్ గా టీ స్టాల్ ఓపెన్ చేస్తే అది "కేరళ"
చలపాయి కోపంతో: నీకు ఎన్నిసార్లు చెప్పాలి Mobile చూస్తూ వంట చెయ్యొద్దు అని. చారులో ఉప్పు పులుపు ఏమీలేదు..
😡😡😡😡
కాంతం: మీకు ఎన్నిసార్లు చెప్పాలి తినేటప్పుడు
Mobile చూడొద్దు అని. మీరు అన్నం లో కలుపు కున్నది చారు కాదు, నీళ్ళు..
😜😜😜😜
షాప్ కీపర్ : " ఎం కావాలి సర్ ? "
కష్టమర్ : " నాకు ఆత్మవిశ్వాసం కావాలి. ఈ ప్రపంచాన్ని ఎదుర్కోడానికి గుండెధైర్యం. ఎదురులేని జీవితానికి కావల్సినంత బలం. ఈ కౄరమైన ప్రపంచాన్ని బరించేంత సహనం, ఓర్పూ, సత్తువా కావాలి."
షాప్ కీపర్ : " అరే రామూ !! ఇతనికి ... ఒక క్వార్టర్ ఓల్డ్ మాంక్ .... ఒక వేరుసెనగ పప్పు పేకెట్ ఇవ్వూ " 😜
హతవిధీ!!
"ఏవండి మూర్తిగారు! మీ ఇంట్లో విచిత్రంగా ఎలకని చూసి, పిల్లి భయపడి పరిగెడుతున్నాది?"
"పిల్లిని నేను పెంచాను. ఎలకని మా ఆవిడి పెంచింది. అంతే!"
🤣🤣🤣🤣🤣🤣
●అంబాని: నేను ఉదయాన్నే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే నా ఎస్టేట్ సగం దాటేటప్పటికే చీకటిపడుతుంది...
●విశ్వనాథం: నాకు కూడా ఇంతకు ముందు అలాంటి పనికిమాలిన కారే ఉండేది.. అమ్మేసా..😜
ఒక ఇంటిలో పెళ్ళిచూపులవుతున్నాయి ..
అమ్మాయి తండ్రి : - మా అమ్మాయి " ఇంకా చదువుకుంటాను " అంటూంది..
పెళ్ళికొడుకు : - పర్వాలేదు చదువుకోమనండి .. మేం ఒక గంట తరువాత వస్తాం.😜😝
పెళ్లి జరిగిపోయింది..
అప్పగింతలు జరుగుతున్నాయి..
అమ్మాయిని సాగనంపుతూ అందరూ మూడీగా ఉన్న సమయంలో..
పెళ్ళికూతురు ... పెళ్ళికొడుకు చేయి విడిపించుకుని
తండ్రి దగ్గరకు వచ్చి ... కౌగలించుకుని ... ప్రేమగా ... ఒక ముద్దు పెట్టింది ...
ఆ దృశ్యాన్ని చూసినా అక్కడున్న వారందరి హృదయాలూ ... ఆర్తితో బరువెక్కాయి. కళ్లు చెమర్చాయి.
ఎమిటీ .. ఈ చిత్ర విచిత్ర భవభందాలూ అనుకునేంతలో .....
పెళ్ళికూతురు ... తండ్రి చేతిలో ఒక వస్తువు పెట్టి ...
కళ్ళు తుడుచుకుంటూ ... " ఇక దీని భాద్యత నీదే డాడీ !! దీని అవసరం ... నాకిక లేదు"
అని చెపుతూ వెనుతిరిగింది
చెమర్చిన కళ్ళతో..
ఈ దృశ్యాన్ని చూస్తున్న బంధువులు..
తండ్రికేమిచ్చిందా అని ఆసక్తిగా చూసారు..
తండ్రి కూడా కుతూహలంగా తన గుప్పెట చూసుకుని ...
మరుక్షణం ఎంతో సంతోషంగా ...
తండ్రి : " "ఇది నా జీవితంలో ఆనందకరమైన రోజు .. నా కూతురు ... వెళ్ళిపోతూ నేను మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది ... ఇరవై రెండేళ్లుగా నేను కనీసం కంటితో చూడలేకపోయిన నా వస్తువును, ఇక ఎన్నటికీ నాకు దక్కదు అనుకున్న దాన్ని ... నాకు తిరిగిచ్చేసింది."
చాలా కుతూహలంగా, ఉత్సుకతతో వింటున్నారు .... అందరూ
తండ్రి : " ఇంతకీ అదేంటో తెలుసా..! నా క్రెడిట్ కార్డు..!!"
అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు..
ఒక్క బిక్క మొహం పెళ్ళికొడుకు తప్ప ...
🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄
వెంకట్రావ్ : ఏంటి మీ ఇంట్లో అందరూ కార్టూన్ చానల్స్ మాత్రమే చూస్తున్నారు ? వేరే చానల్స్ రావా ?
సుబ్బారావు : అదేం కాదు...ఈ కార్టూన్ చానల్స్ లో మాత్రమే ఆ లలిత జ్యూయలర్స్ గుండుగాడు రాడు అందుకని !
లెక్కలతో పిచ్చెక్కి.. ఫ్రస్ట్రేషన్ లో ఒక విద్యార్థి..క్లాస్ లో టీచర్ ని అడిగాడు..
"సర్..సున్నా (0) ని కనుక్కున్నది ఆర్యభట్టు ..ఆర్యభట్టు పుట్టినది కలియుగంలో..అయితే అంతకన్నా చాలా ముందే..రావణుడి 10 తలలు.,100 మంది కౌరవులు కౌంట్ ఎలా చేశారు."
టీచర్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని..సమాధానం వెదికే పనిలో పడ్డాడు.
మొన్నామద్య సాయంత్రం వేళ సరిగ్గా ఒక స్కూల్ గేటు ముందే బైక్ పంచర్ అయింది. పరిక్షించి చూడగా మేకు దిగబడి ఉంది ఎలాగూ ట్యూబ్ పనికిరాదని గుర్తించి ట్యూబ్ తోసహా రమ్మని మెకానిక్ కి ఫోన్ చేసి అక్కడే నిల్చున్నాను ....ఆ స్కూల్ వాచ్మెన్ నన్ను చూసి గుర్తుపట్టి కూర్చోమన్నాడు.
అప్పటికే స్కూల్ వదిలేసారు లోపల కొద్ది మంది పిల్లలు ఉన్నారు పేరెంట్స్ కోసం వేచి చూస్తూ..!
పక్కనే ఒంటరిగా బెంచ్ మీద కూర్చున్న నాలుగేళ్ల బుడ్డోడు నన్ను ఆకర్షించాడు ..... వెళ్లి పక్కన కూర్చుని " ఏమ్మా ఇంకా అమ్మ రాలేదా తీసుకెళ్ళడానికి "? అని అడిగాను ...
" అమ్మలేదు " అన్నాడు అదోలా... నాకు మనసు చివుక్కుమంది..
" ఓహ్ నాన్న వస్తారా అయితే నిన్ను తీసుకెళ్ళడానికి " అనడిగా..
" నాన్న లేడు" అన్నాడు అదే భావంతో ...
నా మనసనే కడలి కల్లోలమై కన్నీరు కెరటాల్లా రాబోతుండగా .." మరి ఎవరు తీస్కేల్తారు "అని అడిగా .....
బేలగా చూస్తూ " మమ్మీ గానీ డాడీ గానీ వస్తారు" అన్నాడు వాడు టక్కున.
దీనమ్మ జీవితం... తెలుగు కు ఇంత దరిద్రం పట్టిందా అని అనుకున్నా...