Friday, October 13, 2017

పెళ్ళి

పెళ్లి జరిగిపోయింది..
అప్పగింతలు జరుగుతున్నాయి..

అమ్మాయిని సాగనంపుతూ అందరూ మూడీగా ఉన్న సమయంలో..

పెళ్ళికూతురు ... పెళ్ళికొడుకు చేయి విడిపించుకుని
తండ్రి దగ్గరకు వచ్చి ... కౌగలించుకుని ... ప్రేమగా ... ఒక ముద్దు పెట్టింది ...

ఆ దృశ్యాన్ని చూసినా అక్కడున్న వారందరి హృదయాలూ ... ఆర్తితో బరువెక్కాయి. కళ్లు చెమర్చాయి.

ఎమిటీ .. ఈ చిత్ర విచిత్ర భవభందాలూ అనుకునేంతలో .....

పెళ్ళికూతురు ... తండ్రి చేతిలో ఒక వస్తువు పెట్టి ...
కళ్ళు తుడుచుకుంటూ  ... " ఇక దీని భాద్యత నీదే డాడీ !! దీని అవసరం ...  నాకిక లేదు"
అని చెపుతూ వెనుతిరిగింది

చెమర్చిన కళ్ళతో..
ఈ దృశ్యాన్ని చూస్తున్న బంధువులు..
తండ్రికేమిచ్చిందా అని ఆసక్తిగా చూసారు..

తండ్రి కూడా కుతూహలంగా తన గుప్పెట చూసుకుని ...
మరుక్షణం ఎంతో సంతోషంగా ...

తండ్రి : " "ఇది నా జీవితంలో ఆనందకరమైన రోజు .. నా కూతురు ...  వెళ్ళిపోతూ నేను మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది ... ఇరవై రెండేళ్లుగా నేను కనీసం కంటితో చూడలేకపోయిన నా వస్తువును, ఇక ఎన్నటికీ నాకు దక్కదు అనుకున్న దాన్ని ...  నాకు తిరిగిచ్చేసింది."

చాలా కుతూహలంగా, ఉత్సుకతతో వింటున్నారు .... అందరూ

తండ్రి : " ఇంతకీ అదేంటో తెలుసా..! నా క్రెడిట్ కార్డు..!!"

అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు..

ఒక్క బిక్క మొహం పెళ్ళికొడుకు తప్ప ...

🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version