Wednesday, October 11, 2017

దరిద్రం

మొన్నామద్య సాయంత్రం వేళ సరిగ్గా ఒక స్కూల్ గేటు ముందే బైక్ పంచర్ అయింది. పరిక్షించి చూడగా మేకు దిగబడి ఉంది ఎలాగూ ట్యూబ్ పనికిరాదని గుర్తించి ట్యూబ్ తోసహా రమ్మని మెకానిక్ కి ఫోన్ చేసి అక్కడే నిల్చున్నాను ....ఆ స్కూల్ వాచ్మెన్ నన్ను చూసి గుర్తుపట్టి కూర్చోమన్నాడు.
అప్పటికే స్కూల్ వదిలేసారు లోపల కొద్ది మంది పిల్లలు ఉన్నారు పేరెంట్స్ కోసం వేచి చూస్తూ..!
పక్కనే ఒంటరిగా బెంచ్ మీద కూర్చున్న నాలుగేళ్ల బుడ్డోడు నన్ను ఆకర్షించాడు ..... వెళ్లి పక్కన కూర్చుని " ఏమ్మా ఇంకా అమ్మ రాలేదా తీసుకెళ్ళడానికి "? అని అడిగాను ...
" అమ్మలేదు " అన్నాడు అదోలా... నాకు మనసు చివుక్కుమంది..
" ఓహ్ నాన్న వస్తారా అయితే నిన్ను తీసుకెళ్ళడానికి " అనడిగా..
" నాన్న లేడు" అన్నాడు అదే భావంతో ...
నా మనసనే కడలి కల్లోలమై కన్నీరు కెరటాల్లా రాబోతుండగా .." మరి ఎవరు తీస్కేల్తారు "అని అడిగా .....
బేలగా చూస్తూ " మమ్మీ గానీ డాడీ గానీ వస్తారు" అన్నాడు వాడు టక్కున.
దీనమ్మ జీవితం... తెలుగు కు ఇంత దరిద్రం పట్టిందా అని అనుకున్నా...

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version