Sunday, December 25, 2016

జ్ఞాన బోధ

ఒక సారి 15 - 20 మంది సాధువులు కలిసి, హిమాలయాలకు వెళ్తున్నారు...

ఇంతలో ఒక పత్రికా విలేఖరి వాళ్ళని కలిసి అడిగాడు...

" బాబా అందరూ ఎక్కడకి వెళ్తున్నారు?"

" అందరం కలిసి సజీవ సమాధి అవుదాం అని వెళ్తున్నాం..."

" అవునా? ఎందుకలా?"

" ఎప్పుడైతే ఈ ఫేస్ బుక్, వాట్సాప్ మొదలైనాయో .. ప్రతి ఒక్కడూ జ్ఞాన బోధ చేసేస్తున్నాడు.. ఇహ ఈ ప్రపంచానికి మా అవసరం లేకుండా పోయింది నాయనా!!!!

Sunday, December 18, 2016

అలక

తండ్రి : బాబు ఒక కూల్ డ్రింక్ తీసుకురా  
బాబు : పెప్సీనా స్ప్రైటా
తండ్రి : పెప్సీ
బాబు : ప్లాస్టిక్ క్బాటిల్ లోనా గ్లాస్ బాటిలా 
తండ్రి : ప్లాస్టిక్
బాబు : చిన్నదా పెద్దదా
తండ్రి : వద్దులేరా కొన్ని నీళ్ళు తీసుకురా చాలు

బాబు : మామూలు వాటరా మినరల్ వాటరా
తండ్రి : మామూలే 
బాబు : చల్లగానా వేడిగానా
తండ్రి : ఒరేయ్ వెళ్ళిపో ముందు  లేకపోతె కొడతాను
బాబు : చెప్పుతోనా కర్రతోనా 
తండ్రి ; ఛి ఛి .జంతువు లా తయారయ్యావు 

బాబు : కుక్క లానా కోతిలా నా
తండ్రి ; నా ముందునుండి వెళ్ళిపో
టాబు : మేల్లిగానా ఫాస్ట్ గానా 
తండ్రి : నా చేతుల్లో చస్తావు
బాబు : కత్తితోనా గన్నుతోనా
 తండ్రి : కత్తితో
బాబు : బాగా హింసించి చంపుతావా డైరెక్ట్ గా చంపుతావా
తండ్రి : ఒరేయ్ నాకు BP పెరిగిపోతుంది ఇక్కడ
బాబు : డాక్టర్ ని పిలవమంటావా మనమే డాక్టర్ దగ్గరికి వెళ్దామా 

 తండ్రి మూర్చపోయాడు 

బాబు : పాపం నాన్నఅలిగాడెమో 

Saturday, December 17, 2016

మా ఆయన బంగారం

భార్య భర్తకు ఫోన్ చేసింది... ఏమండీ తొమ్మిదైంది... ఇంకా ఇల్లు చేరలేదేం...?
ఓ ముఖ్యమైన ప్రయోగంలో ఉన్నాం డియర్ అన్నాడు భర్త...
ఏమిటదీ అనడిగింది భార్య ఆసక్తిగా, అనుమానంగా.... C2H5OH ద్రావణానికి కాస్త H2O, మరికాస్త CO2 కలిపాం, దాన్ని ఘనీభవించిన H2Oతో బాగా శీతలీకరించాం, ఇంకా కొన్ని ప్రొటీన్లు రావల్సి ఉంది, ఈలోపు నికోటిన్ మండిస్తున్నాం డియర్... ఇప్పటికి అయిదారు రౌండ్లు ప్రయోగాలైపోయాయి... అందుకని లేటవుతున్నది అని వివరించాడు
భర్త... అందుకేనండీ, మిమ్మల్ని చూస్తే నాకు గర్వం... మా ఆయన బంగారం...

Friday, December 16, 2016

అందమైన భార్య

భార్య..... ఏమండీ, మన పక్కింటోళ్లు 50 ఇంచు ఎల్ఈడీ టీవీ కొన్నారు, మనమూ కొనుక్కుందామండీ...
భర్త..... ఎందుకు డార్లింగ్..? నీలాంటి అందమైన భార్య ఉంటే, ఆ ఫాల్తూ టీవీ చూస్తూ, టైమ్ ఎందుకు వేస్ట్ చేస్తారు చెప్పు...?
భార్య.... ఊఁ, మీరు మరీనూ... ఉండండి, మీకు పకోడీ తీసుకొస్తా...

Friday, December 9, 2016

పద్యం

Teachers . నిన్న నేర్పిన పద్యం చెప్పు\
Student- తుమ్ సోజా మాఁ, మై జ్యోతి కే  ఘర్ జా ఊంగా
Teacher-  ఒరేయ్ గాడిద! అది......           " తమసోమా జ్యోతీర్గమయా" రా

Thursday, December 8, 2016

తాయెత్తు

పెళ్ళైన మరుసటి రోజే మొగుడు తన భార్యను ఎడా పెడా కొడుతున్నాడు...👊✊

.
ఆ అమ్మాయ్ నీ ఎందుకలా చావగొడుతున్నావు అని ఇరుగు పొరుగు వారు అడిగారు👱‍♀👱💂‍♀👳‍♀💁‍♂🙎

.
అతను ఇలా జవాబిచ్చాడు... ఈమే నన్ను వశపరచుకోవాలని నా టీ కప్పులో "తాయెత్తు" వేసింది!😂😂😂
ఈమె నన్ను మా అమ్మ నుండి దూరం చెయ్యాలని చూస్తుంది😝😝

 .
అతని భార్య ఏడుస్తు ఇలా సమాధానం ఇచ్చింది కోపంగా😡

.
అది "తాయెత్తు" కాదు Tea Bag రా మూర్ఖుడా😆😆😆

Sunday, November 27, 2016

వెర్రి ప్రేమికుడు

"చూడు బాబూ, మీ అక్కయ్య తలవెంట్రుక ఒకటి తెచ్చిస్తావా, నీకు ఒక చాక్లెట్ కొనిస్తాను" అంటాడు. 
అంతలో ఆ కుర్రాడు "ఓ, నాకు డబ్బాడు చాక్లెట్స్ కొనిస్తే, ఒకటేంటి, మొత్తం సవరమే తెచ్చిస్తా. 

Saturday, November 26, 2016

సమోసా

అమ్మాయి: McDonald's  వెళ్దామా?
అబ్బాయి: నువ్వు spelling చెబితే తీసుకెల్తా.
అమ్మాయి: ఐతే KFC వెళ్దాం.
అబ్బాయి: అలానా, ఐతే KFC Fullform చెప్పు.
అమ్మాయి: వద్దురా బాబు, ఈ సమోసానే తిందాంలె. 

Friday, November 25, 2016

కారణం

ఒక కోళ్ళఫారం యాజమాని మహా శాడిష్టు.
ఒక రోజు వాడు కోళ్ళతో ఇలా అన్నాడు, "రేపటికి ఒక్కొక్క కోడి రెండేసి గుడ్లు పెట్టకపోతే కోసుకు తినేస్తా"

పాపం భయంతో కోళ్ళన్నీ ఎలాగోలా కష్టపడి రెండేసి గుడ్లు పెట్టాయి. ఒక్కటి మాత్రం ఒక గుడ్డే చూపించింది.

యజమాని కోపంగా కారణం అడిగాడు.
దానికి ఆ కోడి, " నీ అయ్య నీ మీద భయానికి ఈ ఒక్కటైనా పెట్టాను, నిజానికి నేను పుంజుని., నన్నొదిలెయ్ రా నీకు దన్నం బెడతా...

Wednesday, November 23, 2016

మ్యారేజ్ సర్టిఫికేట్

తమ మ్యారేజ్ సర్టిఫికేట్ ను దాదాపు
గంటనుండి తదేకంగా చూస్తున్న
భర్త ను అడిగింది ఆండాళ్ళు..

🙍
ఏంటండీ? గంటనుండి మన
మ్యారేజ్ సర్టిఫికేట్ ను అలా
చూస్తున్నారు?

భర్త :Expire Date ఏమన్నా రాసి ఉంటే
కనబడుతుందేమోనని చూస్తున్నా,
రాసినట్టు లేడు యదవ.
😒😖😖😖

Tuesday, November 22, 2016

రిజల్ట్స్

రమేష్ : హలో...ఆరెయ్ మామ ఎగ్జాం రిజల్ట్స్ వచ్చాయట వెళ్లి చూసుకుందాం రారా...
సురేష్ : ఆరెయ్ మామ నేను మా డాడి తో ఉన్నాను. నువ్వు వెళ్లి చూడు. ఒక వేళ ఒక్క 
సబ్జెక్ట్ పోతే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పంపించు రెండు పోతేగుడ్ మార్నింగ్ టు యు & యువర్ డాడి అని పంపించు
..
..
..
..
కొంతసేపటికి
..
..
..
సురేష్ కు అందిన మెసేజ్

గుడ్ మార్నింగ్ టు U & యువర్ Family..

మరక

ఎలెక్షన్స్ లో వోటు వేసిన తరువాత సుబ్బారావు ఎలెక్షన్ ఆఫీసర్ ని అడిగాడు.

"చేతి మీద ఇంకు మరక, నీళ్ళతో కడిగితే పోతుందా?"
"పోదు!"
"షాంపూతో కడిగిన పోదా? "
" పోదు" అన్నాడు క్యాషియర్.
"ఎన్ని రోజుల వరకు మరక పోకుండా ఉంటుంది? "
ఎలెక్షన్ ఆఫీసర్ చిరాగ్గా "సంవత్సరమైనా పోదయ్యా!"

సుబ్బారావు ఆనందంగా, ఆశగా,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,
'
'
'
'
'
'
'
'
'
'
'
'
"సారూ,
అయితే, కొంచెం నా జుట్టుక్కూడా పూయండి. ఎంత డై రాసుకున్నా వారం రోజులకే జుట్టు తెల్ల బడుతుంది సారూ!"

ఎలెక్షన్ ఆఫీసర్ కింద పడి కొట్టుకొని స్పృహ తప్పాడు

Monday, November 7, 2016

మౌనం

భార్య: ఏమండీ నా జుట్టు కొంచెం క‌త్తిరించుకోవాలా..?

భ‌ర్త: క‌త్తిరించుకో..

భార్య: ఎంత‌క‌ష్ట‌ప‌డి పెంచుకున్నానో..

భ‌ర్త: అయితే క‌త్తిరించుకోకు..

భార్య: ఇప్పుడు అ‍ంద‌రూ క‌త్తిరించుకుంటున్నారు..అదే ఫ్యాష‌న్

భ‌ర్త: అయితే క‌త్తిరించుకో..

భార్య: నేను క‌త్తిరించుకున్నాక‌ ఫ్యాష‌న్ మారిపోతే..

భ‌ర్త: అయితే క‌త్తిరించుకోకు..

భార్య: మా ఫ్రెండ్స్ అంద‌రూ అంటుంటారు..నాకు చిన్న‌ జ‌డ‌నే బాగుంటుంది అని..

భ‌ర్త: అయితే క‌త్తిరించుకో..

భార్య: నాచిన్న‌ ఫేస్ కి చిన్న‌ జడ‌ బాగుండ‌దేమో అనిపిస్తుంది

భ‌ర్త: అయితే క‌త్తిరించుకోకు..

భార్య: చిన్న‌ జ‌డ‌యితే దువ్వుకోవ‌డం తేలిక‌.

భ‌ర్త: అయితే క‌త్తిరించుకో..

భార్య: పెద్ద‌ జ‌డ‌ని క‌ట్ చేస్తే పూలు పెట్టుకొవ‌డం కుద‌ర‌నిపిస్తూంది..

భ‌ర్త: అయితే క‌త్తిరించుకోకు..

భార్య: ఒక‌సారి experment చేసి చూడాలా..?

భ‌ర్త: అయితే క‌త్తిరించుకో..

భార్య: మ‌ళ్ళీ వెంట్రుక‌లు పెర‌గాలంటే చాలా టైం ప‌ట్టుద్ది..

భ‌ర్త: అయితే క‌త్తిరించుకోకు..

భార్య: లేక‌పోతే ఒక‌సారి క‌ట్ చేయించుకొని చూడాలా..?

భ‌ర్త: అయితే క‌త్తిరించుకో..

భార్య: ఒక‌వేళ‌ క‌ట్ చేయించుకున్నాక‌ బాలేక‌పోతే..?

భ‌ర్త: అయితే క‌త్తిరించుకోకు..

:

:
:
:
:
:
:
:
:
ప్ర‌స్తుతం ఆభ‌ర్త‌ ఎర్ర‌గ‌డ్డ‌ మాన‌సిక‌ వైద్య‌శాల‌లో చికిత్స‌ పొందుతున్నాడు..
:
అయితే క‌త్తిరించుకో..
:
అయితే క‌త్తిరించుకోకు..
:
అయితే క‌త్తిరించుకో..
:
అయితే క‌త్తిరించుకోకు..
:
:అయితే క‌త్తిరించుకో..
:
అయితే క‌త్తిరించుకోకు..
:
అయితే క‌త్తిరించుకో..
:
అయితే క‌త్తిరించుకోకు..
:
అయితే క‌త్తిరించుకో..
:
అయితే క‌త్తిరించుకోకు..
:
:అయితే క‌త్తిరించుకో..
:
అయితే క‌త్తిరించుకోకు..
:

డాక్ట‌ర్ల‌కి ఇప్ప‌టికీ అంతుచిక్క‌డం లేదు దేన్ని క‌త్తిరించ‌మంటున్నాడు..అంత‌లోనే వ‌ద్ద‌ని ఎందుకంటున్నాడ‌ని..
:
:
:
అత‌నిపై విదేశీ వైద్య‌బ్ర్రుందం యొక్క‌ ప‌రిశోధ‌న‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి..

నీతి: ఒక్కోసారి మౌనం కూడా చాలా స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రిస్తుంది..

*ప్ర‌జాప్ర‌యోజ‌నార్థం జారీ చేయ‌బ‌డింది..

😜😜😜

Saturday, November 5, 2016

విచిత్రమైన ప్రశ్నలు

కొంత మంది వివిధ సందర్భాలలో కలసినపుడు వేసే విచిత్రమైన ప్రశ్నలు..వాటికి సరదా జవాబులు.😅

 1. సినిమా హాల్లో:
 "మీరు కూడా సినిమాకే వచ్చారా?"
నేను: "లేదు పాప్ కార్న్ అమ్ముకోవటానికి వచ్చాను"

 2. సిటీ బస్సులో కాలు తొక్కి:
 "Sorry .. నొప్పిగా ఉందా ?"
 నేను: "అబ్బే లేదండీ.. anesthesia తీసుకుని వచ్చాను, కావలంటే మళ్ళీ తొక్కండి!!"


 3. అర్ధరాత్రి ఫోన్ చేసి: "పడుకున్నారా?"
 నేను: "లేదు ఆఫ్రికా కోతుల మీద రీసర్చ్ చేస్తున్నాను.. మీ చుట్టాల వివరాలు తెలిసాయి" 😴

 💇💇💇💇💇💇💇💇
 4. బార్బర్ షాప్ నుండి వస్తుంటే: "ఏంటి హేర్ కటింగ్ చేయించుకున్నారా?"
 నేను: "శరత్కాలం కదా రాలిపోయింది!"

☎☎☎☎☎☎☎
 5. ఇంట్లో Land-line కి ఫోన్ చేసి: "ఎక్కడున్నారు?"
నేను: "ఫోన్ మెళ్ళో వేసుకుని, మార్కెట్లో కూరగాయలు కొంటున్నా !!"

 🚘🚘🚘🚘🚘🚘🚘🚘
 6. కారు కడుగుతున్నప్పుడు ప్రక్కింటాయన: "సార్ !! కారు కడుగుతున్నారా??"
నేను: "లేదండీ, నీరు పోస్తున్నాను. ఇది పెరిగి పెద్దదై బస్సంతవ్వాలని.. 

😄😄😄😉😉😉        

.. 😊😊😊😊😊😊😊😊...

Thursday, November 3, 2016

వాట్సప్

అప్పుడే స్నానం చేసి బెడ్ రూం లోకి వచ్చాడు భర్త.
మంచం మీద తాపీగా కూర్చుని వున్న భార్య ని చూసి... 

భర్త:- యేమిటీ! ఇంత ఆనందంగా వున్నావ్?

భార్య:- తీసేసానండీ. (నవ్వుతూ) 

భర్త:- ఏమి తీసేసావ్?

భార్య:-మీ సెల్ ఫోన్ వాట్సప్ లో మిమ్మల్ని "వైరస్" గ్రూప్ నుంచి తీసేసాను.

భర్త:- నీ బొంద అది “VIRUS” గ్రూప్ కాదే “VIRA’S” గ్రూప్. వీర రాఘవయ్య స్కూల్. అది మా టెంత్ క్లాస్ బ్యాచ్ మేట్స్ గ్రూప్. 

భార్య:-ఏమో నాకేమి తెలుసు? మొబైల్ లో వైరస్ వుండకూడదు కదా! అందుకని తీసేసాను.

భర్త:-ఇంకా ఏమి తీసేసావ్?

భార్య:- “N.V.” గ్రూప్ నుంచి కూడా తీసేసాను.

భర్త:- ఓసి నీ మొఖం మండా !!! “N.V.” అంటే “నూకల వెంకటరత్నం కాలేజ్”. అది మా ఇంటర్ బ్యాచ్.

భార్య:-ఏమో నాకేమి తెలుసు? నాన్ వెజ్ జోకులు వుండకూడదు కదా! అందుకని తీసేసాను.

భర్త:-అంతేనా ఇంకా ఏమన్నా తీసేసావా?

భార్య:-"గాలి" గ్రూప్ నుంచి కూడా తీసేసాను. 

భర్త:- ఓసి నీ అయ్యా అది !!! “గాలి చిన వెంకటేశ్వర్లు కాలేజ్”. అది మా ఇంజినీరింగ్ బ్యాచ్. 

భార్య:-ఏమో నాకేమి తెలుసు? గాలి కబుర్లు చెప్పుకోకూడదు కదా! అందుకని తీసేసాను. 

భర్త:-ఓసి నీ సిగ తరగా!!! అసలు ఇవన్నీ చేయటానికి నీకు నా మొబైల్ పాస్ వర్డ్ ఎలా దొరికింది? 

భార్య:-మీ పేరు పెట్టా, నా పేరు పెట్టా, మీ అమ్మ పేరు పెట్టా, మీ నాన్న పేరు పెట్టా, మన అమ్మాయి పేరు పెట్టా, ఎన్ని ట్రై చేసినా కుదరలేదు.

భర్త:- మరి ఎలా తెరిచావే తల్లీ?

భార్య:-చివరి ప్రయత్నంగా మన పని మనిషి "సుందరి" పేరు నొక్కా!!! దెబ్బకి తెరుచుకుంది రా సచ్చినోడా ..

Wednesday, November 2, 2016

సంతోషం

నేను నా స్నేహితుడ్ని అడిగా, నీ వైవాహిక జీవితం ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటి? అని.

అతను చెప్పాడు, "బాధ్యతల్ని ఇద్దరు సమానంగా, ప్రేమ గౌరవం తో పంచుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా ఏ సమస్య ఉండదు.

"కాస్త వివరంగాచెప్పు" అని అడిగాను.

అతను చెప్పాడు "మా ఇంట్లో పెద్ద పెద్ద సమస్యలకి నేను నిర్ణయం తీసుకుంటాను, చిన్న చిన్న సమస్యలకి మా ఆవిడ నిర్ణయం తీసుకుంటుంది. ఒకరి నిర్ణయాలలో ఒకరం తలదూర్చం".

అయినప్పటికీ నా మనసు అంగీకరించలేదు. "కొన్ని ఉదాహరణలు ఇవ్వు" అని మళ్ళీ అడిగాను.

అతను చెప్పాడు "చిన్న సమస్యలు అంటే ఏ కారు కొనాలి, ఎంత డబ్బు దాయాలి, షాపింగ్, సూపర్ మార్కెట్ కు ఎప్పుడువెళ్ళాలి, సెలవులకి ఎక్కడికెళ్ళాలి, ఎప్పుడువెళ్ళాలి, ఏ సోఫా, ఏసి, ఫ్రిడ్జ్ కొనాలి, నెల ఖర్చులు, పనిమనిషిని ఉంచాలా లేదా, మొదలైన అన్ని నిర్ణయాలు మా ఆవిడ తీసుకుంటుంది. నేను దానికి ఒప్పుకుంటాను.

"మరి నీ పాత్రేమిటి?" అని అడిగాను.

అతను చెప్పాడు "నేను పెద్ద పెద్ద సమస్యలకు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాను. అవి, భారత్ పాకిస్థాన్ తో యుద్ధం చేయాలా వద్దా, ఇరాన్ మీద అమెరికా యుద్ధం చేయాలా వద్దా, బలూచిస్తాన్ స్వాతంత్ర్య దేశంగా ఏర్పడాలా వద్దా, ధోని క్రికెట్ నుంచి ఎప్పుడు రిటైర్ కావాలి, సల్మాన్ ఖాన్ ఎవరిని పెళ్ళి చేసుకోవాలి మొదలైనవి.
నీకు తెలుసా! ఈ నా నిర్ణయాలను  నా భార్య ఎప్పుడూ వ్యతిరేకించదు.

Tuesday, November 1, 2016

పెళ్ళి - జైలు

శ్రీలత అర్ధరాత్రి మెలుకువచ్చి చూస్తే, భర్త రవి పక్కనలేడు, ఆందోళనగా అన్నీ గదులూj😴 చూసి, చివరకు వంటగదిలో కి వెళితే, ఆక్కడ దిగులుగా, శున్యంలోకి చూస్తూ కంట్లో కన్నీరుతో కనిపించాడు.
శ్రీ భయపడి, రవిని పలకరించింది..
శ్రీ : ఏమండి? ఏమైంది?
రవి : శ్రీ, 7 యేళ్ళ క్రితం, మనిద్దరం పార్కులో ప్రేమించుకొంటుంటే, మీ అన్న చూసి, మీనాన్నకు చెప్పాడు..
శ్రీ : అవునండీ, నాకు జ్ఞాపకం ఉంది.
రవి : అది తెలిసిన మీనాన్న, కత్తి పట్టుకొచ్చి, మా అమ్మాయిని చేసుకుంటావా, లేక పోలిసులతో   చెప్పి జైలుకు పంపించనా అని అడిగాడు.
శ్రీ : అవునండీ..అయితే?
రవి : జైలు అనేసరికి భయముతో నిన్ను చేసుకున్నాను, అదే జైలు కెళ్ళుంటె, ఈరోజుతో నాకు విడుదల అయ్యేది కదా.....అని భోరున ఏడ్చాడు.
శ్రీ : ఆ!...

Tuesday, October 25, 2016

దీపావళి

భార్య : కారణం లేకుండా తాగను అన్నారు కదండీ.. మరి ఏ కారణం ఉందని ఈరోజు తాగి వచ్చారు... ??
భర్త : దీపావళి వస్తుంది కదా.. అందుకే తాగాను... 
భార్య : అయితే దానికి  తాగడానికి సంబంధం ఏంటి (కోపంగా )
భర్త : పిల్లలు రాకెట్ కాల్చడానికి సీసా మీ బాబు తెచ్చిస్తడా

Thursday, October 20, 2016

లోను

ఒక భారతీయుడు లోను కోసం అమెరికన్ బ్యాంకు
లోకి వెళతాడు.... 


తనకు చాలా అత్యవసరంగా ఐదు వేల డాలర్లు అవసరముందని తాను అన్ని ప్రదేశాలలో
మిత్రుల దగ్గరా అడిగానని ఫలితం లేకుండా పోయిందనీ.... 


తన కోటి రూపాయల "ఫెరారీ " కారును తాకట్టు పెట్టుకుని
తనకు ఆ
అయిదు వేలు ఇప్పించవలసిందిగా కేవలం వారం
రోజుల్లో తిరిగి తీరుస్తానని హామీ ఇచ్చాడు...

I am going to other state 

I will return after 5 days 
Then
Immediatly I will pay



ఈ బ్యాంకు వారికి చాలా ఆశ్చర్యం వేసింది
అస్సలు వీడికేమైనా పిచ్చి లేసిందా.. 


కోటి రూపాయల
కారును అంత ఛీప్ గా మరీ
ఐదువేలకు తకట్టు పెడుతున్నాడేంటి అని చాలా
సార్లు తర్జనభర్జనలు పడ్డారంట. సరే ఏమైతే అదైందిలే...



వీడు తీర్చలేకపొతే కారు మనదవుతుంది కదా అనుకుని...


మేనేజర్ కార్ తాళాలు తీసుకుని జాగ్రత్తగా పార్కింగ్ చేసి


సార్
మీరప్పుడైనా వచ్చి డబ్బు కట్టి మీకారు
తీసుకుపోవచ్చని
చెపుతాడు....



ఒక వారం గడుస్తుంది... ఆ భారతీయుడు తిరిగి
బ్యాంకుకు వచ్చి ఐదువేల డాలర్లకు వడ్డి $15.41
డాలర్లు కట్టి కారును తీసుకువెళ్ళేందు
కు సిద్ధమవుతాడు... 



ఇంతలో ఆ యువ బ్యాంకు
మేనేజర్
ఆసక్తి చంపుకోలేక “ సార్! మీరు కోటి యాభైలక్షల
కారు ను తాకట్టు పెట్టి కేవలం ఐదువేల డాలర్లు అప్పు తీసుకున్నారు...  

మీరు గట్టిగా
ప్రయత్నిస్తే తప్పక దొరికేవి కదా.. దీనిలో మర్మమేంటి" అని
అడిగాడు...



అప్పుడు మన భారతీయుడు... 



"సార్! విమానాశ్రయంలో
పార్కింగ్ కు దాదాపు ఈ వారం రోజులకు
ఐదువందల
డాలర్లు కట్టవలసి వచ్చేది.. ..



But



నేను ఇక్కడ
మీకు కేవలం $15.41 డాలర్లు మాత్రమే చెల్లించి
వారం రోజులు కారును చాలా జాగ్రత్తగా
ఉంచుకున్నాను...



విమానాశ్రయంలొ అయితే కొంచెం భద్రత/శుభ్రత
కూడా తక్కువ... 

ఇక్కడ మీరు చాలా బాగా చూసు
కున్నారు..
ధన్యవాదములు".. 
అని చెప్పాడు...


బ్యాంకు మేనేజర్ కు నోట మాటరాలేదు..

Monday, October 17, 2016

దొరకడు

భర్త భార్యతో : నేను పోయినతరువాత నాలాంటివాడు నీకు దొరకడు తెలుసా?
.

భార్య: అప్పుడు కుడా మీలాంటి వాడు ఎందుకు లెండి.

Friday, October 14, 2016

పెళ్ళి జరగదు

ఇక మన పెళ్ళి జరగదు 
నిన్న మీ ఇంటికి వెళ్ళా... అప్పుడే అర్దమైంది ఇక మన పెళ్ళి జరగదని..
ఎమైంది. మానాన్నని కలిసావా ?
.

లేదు. మీ చెల్లిని చూసా. కత్తిలా ఉంది.

Wednesday, October 12, 2016

ఫస్ట్ నైట్

దోమకు చీమ కి పెళ్లి అయింది,
ఫస్ట్ నైట్ రోజున దోమ బయట కూర్చున్నది,
ఆ దారంట వెళ్తున్న ఏనుగు ఏంటి కొత్తగా పెళ్లి చేసుకొని బయట కూర్చున్నావేంటీ?
దోమ : దొంగ ముండ ఆల్ ఔట్ ఆన్ చేసి పడుకుంది సార్ ..

Monday, October 10, 2016

బంధువులు

(చింతామణి, వరహాల రావు భార్యాభర్తలు)
ఇద్దరు ఒక సాయంత్రం నడుస్తుండగా గాడిద ఎదురొచ్చింది.
వరహాల రావుని ఆట పట్టించాలనుకున్న చింతామణి "ఏమండీ మీ బంధువొస్తోంది...పలకరించండి"
అంది నవ్వుతూ.
వరహాల రావు: "నమస్తే అత్త గారు..............బాగున్నారా?"
నేను మీ అమ్మాయి "Evening Walk" కి బయలుదేరామండి" అని
పలకరించాడు వరహాల రావు.

Sunday, October 9, 2016

శాంపిల్

చింతామణి:(అప్పారావు తో): ఏమండీ శాంపిల్ అంటే ఏమిటి?
అప్పారావు: పెళ్లి చూపుల్లో నువ్వు చూపిన వినయం లాటింది!

Saturday, October 8, 2016

ఉప్మా

ఉప్మా కనిపెట్టిన వాడ్ని ఉరికే వదలకూడదు 😣😣...
ఊరూరా ఊరేగించి ఉప్పు నీళ్ళలో ఊరబెట్టి😎😎..
ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమా ఒక వంద సార్లు చూపించి ఉరితీయ్యాలి😂😂...
ఎవరి ఇంటికి పోయినా త్వరగా అయిపోతుందని చేస్తారో🐒🐒కసి తీర కడుపులో మంట చల్లార్చుకోడానికి చేస్తారో తెలీదు 😰😰..
కమ్మటి కాఫీ ఇచ్చి పంపిస్తే హాయిగా ఉండదు🐺🐺...
వుండండి వుండండి అంటూ😛😛 వంటింట్లో నుంచి ఏ పూరి నో పొంగలో తెస్తారనుకుంటే🙆.ఉట్టిపుణ్యం గా ఊడి పడుతుంది ప్లేట్ లో ఈ ఉప్మా🙇🙇..
ఒక రెండు స్పూన్ ల వరకు బాగానే వుంటుంది👸...
తరువాత చూడండి జ్వరమొచ్చినప్పుడు మాత్రలు మింగినట్టు🙅🙅స్పూన్ స్పూన్ కి ఒక గ్లాస్ నీళ్ళు తాగుతున్న మన కష్టాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా👶👶..
ఇంకాస్త పెట్టమంటారా అంటే😳....
ఆ స్పూన్ తో తల మీద గట్టిగ కొట్టుకొని వెర్రి గా నవ్వాలనిపిస్తుంది💣💣💣...
ఈ దరిద్రానికి మళ్లీ రకాలు💥💥.
గోధుమ రవ్వ,,బొంబాయి రవ్వ అంటూ👂👂..బొంబాయి ముంబై అయినా..
ఈ ఉప్మా ఇంకా బొంబాయి రవ్వగానే చెలామణి అవుతాంది😛😛...
జీడిపప్పు వేస్తే జీడిపప్పు ఉప్మా🐇🐇...
ఉల్లిపాయలేస్తే ఉల్లిపాయుప్మ🐓🐓..
టమాట వేస్తే టమేటా బాత్ 🍅🍅🍅....
ఉప్మా చేయి అంటే చాలు చిటికెలో చేతిలో ఉప్మా ప్లేట్ తో ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చేస్తారు🎅🎅....
శనివారం అయిందంటే చాలు ఎదో రూపం లో తగులుకుంటుంది🙇🙇..
ఈ మంతెన గారు ఊరుకోక గోధుమ రవ ఉప్మా మంచిది అని చెప్పారు💪💪..
ఇక చూడండి👈..వారోత్సవాలు...👈బ్రహ్మోత్సవాలు జరుగుతూంటాయి☝....
తప్పు మీది కాదు సర్👐👐.ధైర్యం చేసి ఉదయన్నే నాలుగు గంటలకి మీ ప్రోగ్రాం చూపించామ్ కదా✊✊...చేసిన పాపం ఉరికే పోదు👎👎..
ఇది తినడం ఒక ఎత్తు అయితే తిన్నాక లోపల కి వెళ్లి ఇది చేసే హంగామ అంతా ఇంతా కాదు🏃🏃🏃...
పడుకుంటే కడుపు లో షేర్ ఆటో లు తిరుగుతునట్టు ఒకటే గోల 🚆🚆🚆....
అర స్పూన్ తింటే ,,.అరిగించుకోటానికి ఆరు గంటలు పడుతుంది🎠🎠🎠...
ఉప్మా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే🎭🎭...మా రామ్ దేవ్ బాబా గురూ గారు మహత్తరమైన ఉపాయం చెప్పారు😜😝😜...
ఉప్మా కాశి లో వదిలేసాను అని చెప్పమన్నాడు 😛😛...
ఎప్పుడైనా ఎవరైనా పెట్టినప్పుడు ఈ మాట చెప్పి తప్పించుకుంటున్నా అని చెప్పాడు 😌😌....
నేను అదే చేస్తా లాభం లేదు😫😫...
ఇంతకీ ఎంతమంది ఇవాళ ఉప్మా తిన్నారో 😊😊...
అదే లే తినాల్సివచ్చిందో చెప్పండి😆😆...
ఎదో మనిషి కి మనిషి సహాయం😜😜...మీకోసం ప్రార్థన చేస్తా..కడుపులో పడిన ఉప్మా త్వరగా కరగాలని...
😃😃జై ఊప్మాఁ..జై జై ఊప్మాఁ..

Source:WhatsApp

Tuesday, October 4, 2016

పగ

(అమ్ములు వాళ్ళ నాన్నా వెంకటప్పతో )
అమ్ములు:"మన కుటుంబానికి ఇంత అన్యాయము చేసిన ఆ చంటిగాడిని 
చంపి పగ తీర్చుకుంటా నాన్నా!" పిడికిలి బిగించి శపథం చేసింది 
అమ్ములు వాళ్ళ నాన్నాతో.
వెంకటప్ప:"ఒకేసారి చంపకు.........పెళ్ళిచేసుకో............
.ప్రతిక్షణం కుళ్ళి కుళ్ళి చావాలివాడు" చెప్పాడు వాళ్ళ నాన్న 

Monday, October 3, 2016

బంగారం

బంటి (చంటి తో) : పెళ్లిచూపులకు వెళితే తన్ని పంపించారురా.
చంటి : ఎందుకు?
బంటి : మా అమ్మాయి బంగారం అన్నారురా , అయితే తాకట్టు పెట్టుకోవచ్చా అని అడిగానంతే.

Sunday, October 2, 2016

నిద్ర

సరసు(డాక్టర్ తో): మా వారు రాత్రిళ్ళు నిద్ర పోకుండా ఒకటే మాటలాడుతున్నారండి.
డాక్టర్: మీ వారికి పగలు మాటలాడే అవకాశం ఇవ్వమ్మా.

Saturday, October 1, 2016

సతీ సావిత్రి

టీచర్ : సతీ సావిత్రి కధ లో  నువ్వు  తెలుసుకున్నది  ఏమిటి? చెప్పరా.

స్టూడెంట్  : భార్య నుండి  భర్తను  ఆ  యముడు కూడా  కాపాడలేడని!!

Friday, September 30, 2016

తాళం

ఏమండీ..!నేను పాడతాను మీరు తాళం వేస్తారా.
ఓ అలాగే మొదలెట్టు అని ఆవిడ పాట అన్దుకోగానే లేచి గది బయట  తాళం వేసి వెళ్ళిపోయాడు భర్త.

Thursday, September 22, 2016

పెద్దరికం

తల్లి అట్లు వేస్తుంటే చంటి వచ్చి అడిగింది అమ్మని.

చంటి: అమ్మ మొదటి అట్టు నాకే వేయి.

అమ్మ: మొదటి అట్టు ఎప్పుడూ నాన్నగారికి పెట్టాలమ్మ. ఇంటికి పెద్దవారు కదా!

నాన్న: పెద్దరికమా పాడా! మొదట అట్టు సరిగా వచ్చి చావదుగా. అందుకని నాకు.

Tuesday, September 20, 2016

అడవే మేలు

టీచర్ : సీత రాముడితో అడవికి ఎందుకు వెళ్ళింది ? 

మధు : ఇంట్లో ముగ్గురు అత్తలున్నప్పుడు...... " అడవే మేలని వెళ్లుంటుందేమో టీచర్ "

Monday, September 19, 2016

ఆచారం

ఇంటి అల్లుడు....
వయస్సు లో చిన్న వాడే అయినా....
"అల్లుడు గారు" అనే పిలుస్తారు !!
ఎందుకంటే....
మన దేశం లో ....
ఇతరుల కోసం , ....
తన జీవితాన్ని  త్యాగం చేసేవాళ్ళని..........
గౌరవించటం అనాది గా వస్తున్న ...
ఆచారం!!

బ్రహ్మచారి

రాము: బ్రహ్మచారికి మరియు పెళ్ళైనవాడికి తేడా ఏమిటి?!

సోము: బ్రహ్మచారి 'ఏదిపడితే' అది తింటాడు.
పెళ్ళైనవాడు 'ఏదిపెడితే' అదే తింటాడు

Sunday, September 18, 2016

బిజినెస్

మీ అబ్బాయి ఏమి చేస్తూ ఉంటాడు.

ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్.

అవునా ఏమి బిజినెస్??

వాట్స్ ఆప్ లో వచ్చినవి  ఫెస్బుక్ కి,  ఫెస్బుక్ లో వచ్చినవి వాట్స్ ఆప్ కి పంపుతూ ఉంటాడు

పేకాట

భార్య: మీకసలు పేకాటలో డబ్బులు రావుగా, మరి రాత్రేంటి అంత డబ్బుతెచ్చారు..??

భర్త::కాంతం,అంతా కోల్పోయి ధర్మరాజులాగా నా "భార్య" ని పణంగా పెడుతున్నా అన్నా.దాంతో యదవలు గెలిచిన డబ్బంతా వదిలి పారిపోయారు..

Saturday, September 17, 2016

లక్షాధికారి

ప్రశ్న : ఆడది మగాడిని
 లక్షాధికారిని చెయ్యగలదా ?? 

సమాధానం :
ఖచ్చితంగా చెయ్యగలదు... 
కాకపొతే వాడు కోటేశ్వరుడై ఉండాలి.

Wednesday, September 14, 2016

ఆఖరి రాత్రి

డాక్టర్ ఒకడికి చెప్పేసాడు ఈరాత్రే నీకు ఆఖరి రాత్రని.
భార్య తో అన్ని విషయాలు మాట్లాడే యాలని , ఇద్దరు చాలా రాత్రి వరకు మాట్లాడుతూనే వున్నారు .
భార్యి నిద్ర లోకి జారుకుంది , ఆపుకోలేక.
ఓయ్ నిద్ర పోతున్నావా " భర్త అడిగాడు.
" అవునండీ , మీరయితే ఉదయాన్నే ఇంక లేవక్కర్లేదు, నేను లేవాలి కదా 

Monday, September 12, 2016

Lovers

అప్పారావు:-- "ఇలా మనం పార్కులో కబుర్లు చెబుతూ ఈ చిప్స్ తింటుంటే నీకే మనిపిస్తోంది?"
.
ఐశ్వర్య :-- నువ్వే ఎక్కువ తింటున్నావనిపిస్తోంది!

Thursday, September 8, 2016

దేవుడు

ముత్యాలరావు(సుబ్బారావుతో):"ఆ డాక్టర్ నిజంగా దేవుడే! మా ఆవిడ బద్దకాన్ని, ఆయాసాన్నిచిటికెలో పోగొట్టాడు తెలుసా?" అన్నాడు ముత్యాల రావు.
సుబ్బారావు:ఎలా?
ముత్యాలరావు: "వయసు పెరుగుతోంది కదమ్మా అన్నాడు. అంతే ఆ మరుసటి రోజు నుండే చకచక అన్ని పనులు చేస్తోంది."

Tuesday, August 30, 2016

బియ్యం డబ్బులు

మన సింధు అంత కష్టపడి పతకం సాధిస్తే, అంత దూరం నుంచి వచ్చి సచిన్ బియ్యం డబ్బులు ఇచ్చి పోతాడా?

Friday, August 26, 2016

నాయకత్వ లక్షణాలు

Manager : నీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయా?
Employee :   ఉన్నాయి సార్.
Manager: అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు?
Employee: ఏడాదిన్నరగా రెండు వాట్సప్ గ్రూపులకు అడ్మిన్ గా ఉన్నా సార్. 

Thursday, August 4, 2016

సహాయం

తెల్లవారు జామున మూడుగంటలు..
జోరుగా వర్షం కురుస్తూ ఉంది...

పార్క్ ఎదురుగా ఉండే ఒక ఇంట్లో
భార్యాభర్తలు నిద్రపోతున్నారు..

అప్పుడు తలుపు తట్టిన శబ్దం విని భర్త మాత్రం లేచి వచ్చి తలుపు తీశాడు..
తలుపు తీసిన వెంటనే అక్కడొక వ్యక్తి నిలబడి ఉన్నాడు. కొంచెం తాగినట్లున్నాడు..

" సార్ , ఒక సహాయం చేస్తారా... కొంచెం అక్కడికి వచ్చి తోస్తారా ప్లీజ్? " అని అడిగాడు..

" కుదరనే కుదరదు. ఏమయ్యా తెల్లవారుజాము మూడుగంటలకి ఎందుకయ్యా డిస్టర్బ్ చేస్తావు. " అని తలుపు మూసి వెళ్ళి పడుకున్నాడు ఆ భర్త..

" ఎవరండి" అని అతని భార్య అడిగింది భర్తని...

" ఎవరో ఒక తాగుబోతులా ఉన్నాడు. వచ్చి కారో, ఇంకేదో తొయ్యగలరా అని అడిగాడు."

" మీరు సహాయం చేశారా..."

" చేయలేదు. తెల్లవారుజాము మూడైంది. బయట వర్షం జోరుగా కురుస్తుంది. ఎవరెల్తారులే.."

" 3 నెలల ముందు మన కారు రిపేరయ్యి రోడ్లో ఆగిపోయినపుడు ఇద్దరు వచ్చి సహాయం చేశారే? ఆ రోజు వారు కూడా తాగి ఉన్నారుగా. ఇప్పుడు మీరు సహాయం చేయకపోతే ఎలా? దేవుడు తాగుబోతులని కూడా ప్రేమిస్తాడు.." అని అతని భార్య చెప్పింది..

భార్య మాట విన్న భర్తకి ఆ రోజు జరిగినదంతా కళ్ళముందు కదిలి కళ్ళు చెమర్చాయి.
భర్త లేచి టార్చ్ వేసుకుని వర్షంలో తడుచుకుంటూ బయటికి వెళ్లాడు..

చీకటి పైగా వర్షంలో యేమీ సరిగ్గా తెలియడం లేదు.. గట్టిగా ఇలా అన్నాడు..

" హలో,  మీరింకా ఉన్నారా. "

" అవును సార్ . ఉన్నాను.. " అని పక్కనుంచి సమాధానం..

" ఏదో తొయ్యడానికి సహాయం కావాలన్నారు. ఇప్పుడు సహాయం చేయచ్చా?"

" అవును సార్ కొంచెం తోస్తే నాకు తృప్తిగా ఉంటుంది.."

" సరే, , ఎక్కడున్నారు..? "

" ఇక్కడే పార్క్ లోని ఉయ్యాలలో కూర్చొని ఉన్నాను. వచ్చి తోయండి సార్ ప్లీజ్.."

Sunday, July 31, 2016

ఆధార్ అట్ట

ఆధార్ అట్ట(కార్డ్) వలన ఫ్యూచర్ లో మన పరిస్థితి..!!!

2020 సంవత్సరం లో జరగబోయే సంఘటన..

పిజ్జా హట్ కి ఫోన్ సంభాషణ..

ఆపరేటర్ : " హలో... పిజ్జా హట్..."

కస్టమర్ : " ఒక ఆర్డర్ తీసుకోండి ప్లీజ్..? "

ఆపరేటర్ : " మొదట మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి సార్"

కస్టమర్ : " ఒక నిమిషం... నా ఆధార్ నెంబర్ 889861356102049998-45-54610.."

ఆపరేటేర్ : " సో.., మీరు మిష్టర్ Velpuri Vivekanand   .. నెంబర్ 17, గాంధీ రోడ్, శ్రీనగర్ కాలనీ తెనాలి  నుండి మాట్లాడుతున్నారు. మీ ఇంటి ఫోన్ నెంబర్ 408423666, ఆఫీస్ నెంబర్ 76452302, మొబైల్ నెంబర్ 0142662566. ఇప్పుడు మీరు మీ మొబైల్ నుండి మాకు కాల్ చేశారు..."

కస్టమర్ : " వావ్.. ఇన్ని నెంబర్లు ఎలా సార్ తెలుసుకున్నారు..? "

ఆపరేటర్ : " మేము మెయిన్ సిస్టమ్ తో కనెక్ట్ అయ్యున్నాం సార్...."

కస్టమర్ : " గుడ్.. నాకు ఒక రాయల్ పిజ్జా ఆర్డర్ తీసుకుంటారా..? "

ఆపరేటర్ : " సార్ .. నాకు తెలిసినంత వరకు అది వద్దనే చెప్తాను సార్.."

కస్టమర్ : " వ్వాట్..? ఎందుకని..? "

ఆపరేటర్ : " మీ మెడికల్ రిపోర్ట్స్ ని బట్టి మీకు హై బిపీ ఉంది... అంతే కాకుండా మీ కొలెస్ట్రాల్ లెవల్ కూడా ఎక్కువగా ఉంది.."

కస్టమర్ : " వ్వాట్..? అప్పుడు నేను ఏమి తినాలి..? "

ఆపరేటర్ : " మా దగ్గర ఉండే Low fat హెగ్గియన్ మీ పిజ్జా ట్రై చేసి చూడండి సార్.. అది బాగా నచ్చుతుంది.."

కస్టమర్ : " నాకు నచ్చుతుంది అని మీకు ఎలా తెలుసు.."

ఆపరేటర్ : " పోయిన వారం మీరు నేషనల్ లైబ్రరీ నుండి పాపులర్ హెగ్గియన్ వంటలు అనే పుస్తకం తీసుకున్నారు సార్.."

కస్టమర్ : " మై గాడ్.. చాలు సామీ చాలు.. మీరు చెప్పిన పిజ్జానే మూడు పిజ్జా ఫ్యామిలీ సైజ్ లో ఇవ్వండి.."

ఆపరేటర్ : " ఖచ్చితంగా సార్... పది మంది ఉన్న మీ కుటుంబానికి అది ఖచ్చితంగా సరిపోతుంది. బిల్ అమౌంటు 2350 రూపాయలు సార్.."

కస్టమర్ : " నా కార్డ్ లో నేను pay చేయచ్చా..? "

ఆపరేటర్ : " లేదు సార్.. మీరు క్యాష్ రూపంలోనే చెల్లించాలి. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ మీరు క్రాస్ చేసి ఉన్నారు. అదీకాకుండా జనవరిలో మీరు 1,50,648 రూపాయలు క్రెడిట్ కార్డ్ బాకీ పెట్టి ఉన్నారు. ... దానిలో మీరు కట్టకుండా ఉన్న హౌసింగ్ లోన్ నేను చేర్చలేదు. "

కస్టమర్ : " సరి. అలా అయితే మీ పిజ్జాబాయ్ వచ్చే లోపు పక్కన ఉన్న ఏటియమ్ కి వెళ్ళి క్యాష్ తీసుకొస్తాను.."

ఆపరేటర్ : " అది కూడా కుదరదు సార్.  మా రికార్డుల ప్రకారం మీ ఏటియమ్ ఓవర్ డ్రాఫ్ట్ లెవల్ మీరు దాటేశారు సార్.."

కస్టమర్ : " నేను ఎలాగైనా క్యాష్ రెడీ చేస్తాను. మీరు పిజ్జా పంపండి. ఎంత టైమ్వపడుతుంది..? "

ఆపరేటర్ : " 45 నిమిషాలు పడుతుంది సార్.. అంతసేపు మీరు వెయిట్ చేయలేకపోతే మీ బైక్ లో వచ్చి మీరే తీసుకెళ్ళచ్చు సార్.."

కస్టమర్ : " వ్వాట్..? "

ఆపరేటర్ : " మా సిస్టం లో ఉన్నదాని ప్రకారం మీ దగ్గర ఒక బైక్ ఉంది. దాని నెంబరు 1122.."
(కస్టమర్ తన మనసులో : ఈ యదవ నా బైక్ నెంబర్ కూడా తెలుసుకుని ఉన్నాడే!!)
" వేరే ఏదైనా కావాలా సార్..? "

కస్టమర్ : " ఇంకేమీ వద్దు సామీ.. మీరు ప్రకటన లో చెప్పిన విధంగా ఆ మూడు ఫ్రీ కోక్ బాటిల్స్ కలిపి పంపండి చాలు... "

ఆపరేటర్ : " నార్మల్ గా ఇస్తాం సార్. అయితే మీ మెడికల్ రిపోర్ట్ ప్రకారం మీ ఆరోగ్యాన్ని దృష్ఠిలో ఉంచుకుని మీకు ఆ ఫ్రీ ని ఇవ్వలేం సార్.."

కస్టమర్ : *%&$%%### You $##$%%@!))) (ఇక్కడ రాయలేని బూతులు)

ఆపరేటర్ : " సార్ .. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి సార్.. ఇలానే ఒక పోలీస్ దగ్గర బూతులు తిట్టినందుకు 2017 మార్చిలో మీకు రెండు నెలల జైలు శిక్ష మరియు అయిదువేల రూపాయల జరిమానా విధించింది మర్చిపోయినట్లున్నారు. "

కస్టమర్ : 😱 😱
( కళ్ళు తిరిగి కింద పడిపోయాడు)

Wednesday, July 13, 2016

ఫ్రిజ్

కుర్రాడు : మమ్మీ, నిన్న రాత్రి టాయిలెట్ కని తలుపు తీస్తే లైట్ దానికదే ఆన్ అయింది.
మమ్మీ : ఓరి వెధవా, నీకెన్ని సార్లు చెప్పాను, ఫ్రిజ్ లో టాయిలెట్ వెళ్ళొద్దని.

Thursday, June 30, 2016

భార్యలు

ఈ భార్యలు మన మనసులో విషయం ఎలా కనిపెట్టేస్తారో కదా....

భర్త: ఏమోయ్.... బయట వర్షం పడుతుంది....

భార్య: ఇంట్లో శనగపిండి లేదు. ఉల్లి ధర కొండెక్కి కూర్చుంది.. పనమ్మాయ్ రాలేదు...గిన్నెలన్నీ అలానే ఉన్నాయ్..అసలు ఇప్పుడు పకోడీ చేసే ఓపికే లేదు....

భర్త: హూ... సరేలే....

భార్య: ఇంకో విషయం... ఐస్ ఇవ్వమని అస్సలు అడగద్దు... పిల్లలు పెద్దాళ్ళు అయ్యారు.. ఈ మందు తాగడం లాంటివన్ని ఇంట్లో పెట్టారంటే ఒప్పుకునేదే లేదు...
భర్త: అలానె...దేవుడా.. అసలు మన మనసులో మాట వీళ్ళు ఎలా కనిపెట్టేస్తారో ఏమో...

Sunday, June 26, 2016

దెయ్యాలు

ఒక ఆక్సిడెంట్ లో భార్యా భర్తా ఇద్దరూ చనిపోయి దెయ్యాలయిపోయారు. చాలా కాలం తర్వాత అటూ ఇటూ తిరుగుతూ ఇద్దరూ కలుసుకున్నారు.

భార్య: అయ్యో చాలా కాలం తర్వాత కనిపించారే. పూర్తిగా మారిపోయారు. దయ్యం లా మారిపోయి ఇలా తిరుగుతున్నారు. హహ్హ...😈

భర్త: నువ్వు అస్సలు మారలేదు సుమీ. అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడూ అలానే ఉన్నావ్

Thursday, June 23, 2016

లెక్క

ఉదయం:మంత్రి గారు వచ్చారు, మొక్కను నాటారు

మధ్యాహ్నం:మేక వచ్చింది, మొక్కను తినేసింది

రాత్రి: మంత్రి గారు వచ్చారు, మేకను తిన్నారు


పర్యావరణదినం ముగిసింది, లెక్క సరిపోయింది

లావు

"లావు తగ్గాలని డైటీషియన్‌ని కలిసాడు సంజీవ్. ఆ డాక్టర్ అదో టైపు. 
.
సంజీవ్ :- సన్నబడాలంటే మాంసం తగ్గించి, ఆకు కూరలు, ధాన్యాలు బాగా తినాలంటారు .. నిజమేనా?
.
డాక్టర్:- ఏమక్కరలేదు, మేకలు, గొర్రెలు తినేదేమిటి. ఆకులు, గడ్డే కదా. కోళ్ళకు దాణానే కదా వేస్తున్నాం. మాంసం తింటున్నామంటే పరోక్షంగా ఆకుకూరలు, ధాన్యాలు తింటున్నట్లే !!
.
సంజీవ్:- వేపుళ్ళు మంచివి కావంటుంటారు..
.
డాక్టర్:- ఎందుక్కావు? నూనె ఎక్కడినుండి వచ్చింది?
.
సంజీవ్:- వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు.
.
డాక్టర్:- అంటే ధాన్యాల నుంచే కదా, మరి నీ ఒంటికి అవి ఎందుకు మంచివి కావో చెప్పు?

సంజీవ్:- పోనీ మద్యం మానేయాలంటారా?
డాక్టర్:- ఎవరయ్యా నీ బుర్ర పాడు చేసింది? వైన్ వచ్చేది పళ్ళ నుంచి కాదా ? బీరు బార్లీ నుంచే కదా! దర్జాగా తాగు. పళ్ళు తిన్నంత ఆరోగ్యం.

సంజీవ్:- మరి ఐస్‌క్రీమ్‌స్, చాక్‌లెట్లు..
డాక్టర్:- లాభం లేదయ్యా! నేను చెప్పేది నీకు అర్ధం కావట్ళేదు. అవీ పాలు, కూరగాయల బై ప్రోడక్ట్సే కదా!

సంజీవ్:- వ్యాయామం చేస్తే ఎక్కువకాలం బ్రతుకుతారంటారు. నిజమేనా?
డాక్టర్:-ఎవరు నీకు చెప్పింది? కసరత్తు చేస్తే గుండె వేగం పెరుగుతుంది. వేగం పెరిగితే ఆయుస్షు ఎలాపెరుగుతుందయ్యా.ఇదెలా ఉందంటే, వేగంగా నడిపితే కారు మన్నిక ఎక్కువ కాలం ఉంటుందన్నట్లుంది !!

సంజీవ్:- అది కాదు. సిట్ అప్స్ చేస్తే, పొట్ట తగ్గుతుందంటారు ..
డాక్టర్:- చూడు.. వ్యాయామం చేయిస్తే చేతికండరాలు పెరుగుతాయి కదా. అలాంటాప్పుడు సిట్ అప్స్ చేస్తే పొట్ట పెరగదా? కోరి కోరి లావు అవుతానంటావేమయ్యా!

సంజీవ్:- పోనీ మంచి ఫిగర్ కోసం ఈత కొట్టొచ్చా?
.
డాక్టర్:- ఈత కొడితే నాజూగ్గా అవుతారనేది తప్పుడు ప్రచారం. అదే నిజమైతే తిమింగలాలు ఎందుకు అంత సైజున్నాయో చెప్పు?
.
సంజీవ్:- మరి బాడీకి ఓ షేప్ ఎలా వస్తుందో చెప్పండి?
.
డాక్టర్:- రౌండుగా ఉండడం మాత్రం షేపు కాదా? ఎవరా మాట అన్నది?

Wednesday, June 22, 2016

హెడ్ & షోల్డర్స్

ఒక రోజున జంభులింగం తలస్నానం చేస్తూ షాంపూను తలతో పాటు భుజాలకు కూడా రాస్కుంటున్నాడు, అది చూసిన అతని భార్య : "ఏమండీ షాంపూను తలకే రాస్కోవాలి ఒంటికి కాదు"
జంభులింగం :"ఒసేయ్ తింగరిదానా మీ ఆడవారకి మెదడు మోకాలిలో ఉంటుంది. మీ మట్టి బుర్రలకి ఏదీ చెప్తే గానీ అర్థం కాదు. ఇది ఏమైనా మామూలు షాంపూ అనుకున్నవా, ఇది హెడ్ & షోల్డర్స్  

గాడిద

ఇద్దరు టెర్రరిస్టులు ..... ఒక బార్లో ....  మందుకొడుతూ మెల్లగా  మాట్లాడుకుంటున్నారు

టెర్రరిస్టు : "  మేము పద్నాలుగు వేల మందిని ఇంకా  వాళ్లతోపాటూ ఒక గాడిదని కూడా .... చంపడానికి ప్లానింగ్ చేస్తున్నాము ...   "

వీళ్లు అతి మెల్లగా మాట్లాడుకోవటం చూసి .... ఒక వెయిటర్ ... కుతూహలంతో ... వీరి మాటలను దూరంనుండి  వింటున్నాడు ........ వీళ్లు మనుషులతొ పాటూ గాడిదను ఎందుకు చంపాలనుకుంటున్నారో ? ఆత్రుత ఆపుకోలేక.....

వెయిటర్ : " గాడిదనెందుకు చంపాలనుకుంటున్నారు ? "

టెర్రరిస్ట్ (వేరే వాడితో ): " నేను ముందే చెప్పానా‌! పద్నాలుగు వేల మందిని చంపినా కూడా .....  ఎవడూ పట్టించుకోరని "

Friday, June 17, 2016

చిల్లర

బస్సు కండక్టరుకు చిర్రొత్తుకొచ్చేదెప్పుడు? 
బస్సు నీళ్ళలో పడిపోయినప్పుడు, ప్రయాణికుడు, ఈదుకుంటూ వచ్చి చిల్లర ఆడిగినప్పుడు .

Thursday, June 16, 2016

గొడవ

మొగుడు పెళ్ళాలకు గొడవైంది. భర్త సాయంత్రం ఆఫీస్ నుండి పోన్ చేసి ఆడుగుతాడు. 
భర్త : వంటేం చేసావు? 
భార్య : గన్నేరు పప్పు
భర్త : సరే, నాకు లేట్ అవుతుంది గానీ, నువ్వు తినేసి పడుకో. 

Wednesday, June 15, 2016

లెక్క

ఉదయం:మంత్రి గారు వచ్చారు, మొక్కను నాటారు

మధ్యాహ్నం:మేక వచ్చింది, మొక్కను తినేసింది

రాత్రి: మంత్రి గారు వచ్చారు, మేకను తిన్నారు


పర్యావరణదినం ముగిసింది, లెక్క సరిపోయింది

Thursday, June 9, 2016

అప్పు

సుబ్బు హోటల్ లోకి వెళ్ళాడు.ఎడమవైపు వెజ్,కుడివైపు 
నాన్ వెజ్ బోర్డులు చూసి కుడివైపు తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు. అక్కడ మళ్ళీ రెండు బోర్డులున్నాయి.
ఒకటి సర్వింగ్, రెండోది బఫే అని.
బఫే బాగుంటుందని ఆ సెక్షన్ లోకి అడుగుపెడితే అక్కడ ఒక తలుపుమీద'క్యాష్', మరో తలుపుమీద 'అప్పు'అని రాసివుంది. ఇదేదో బాగుందని అప్పు అని రాసున్న తలుపు తీసుకుని వెళ్ళిచూస్తే హోటల్ లోనుండి బయట రోడ్డు మీదకి చేరాడు

Saturday, June 4, 2016

మెసేజ్

ఒకబ్బాయి ప్రేమలో పడ్డాడు ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పడానికి అతనికి ధైర్యం చాల్లేదు. 

ఒకరోజు ధైర్యం చేసి, I Love You అని టైప్ చేసి reply కోసం Wait చేస్తున్నాను అని రాసి మెసేజ్ పెట్టాడు. 

వెంటనే మొబైల్ కి మెసేజ్ వచ్చింది. 

ఆ అబ్బాయి మెసేజ్ చూడ్డానికి చాల Tension పడ్డాడు. ఈ Tensionలో ఇప్పుడు చూడ్డం ఎందుకు, పొద్దున్నే లేచి చూద్దామని పడుకున్నాడు. 

పొద్దున్నే లేచాడు, స్నానం చేసి, టిఫిన్ తిన్నాడు, కాఫీ తాగాడు. దేవున్ని ప్రార్ధించాడు. message తనకు అనుకూలంగా ఉండాలని కోరుకున్నాడు. ఫోన్ తీసి మెసేజ్ చదివాడు. 

అ మెసేజ్ ఇలా ఉంది. 'Dear Customer you have insufficient balance to send this message. Please recharge your account and try again'  

Wednesday, June 1, 2016

అత్త

ఓఅత్త కి ముగ్గురు అల్లుళ్ళు...... వాళ్ళలో ఏ అల్లుడు మంచోడో తెలుసుకోవాలి అనుకుంది.....
మొదటి రోజు పెద్ద అల్లుడు ను తీసుకుని సముద్రం కి వెళ్లింది....
అక్కడ అత్త సముద్రంలో పడిపోయింది...
పెద్ద అల్లుడు కాపాడతాడు....
అత్త నా అల్లుడు చాలా మంచి వాడు అని కార్ కొని ఇచ్చింది.....
రెండో రోజు రెండో అల్లుడును అదే చోటుకు తీసుకెళ్ళి మళ్లి సముద్రంలో పడింది­...
రెండో అల్లుడు కూడా కాపాడతాడు.....
అత్త రెండో అల్లుడు కూడా మంచోడు అని బైక్ కొని ఇచ్చింది.....
మూడో ...రోజు మూడో అల్లుడి నీ తీసుకెళ్ళింది.. ­...
అత్త మళ్ళి సముద్రం లో పడిపోయింది..... ­.
మూడో అల్లుడు బాగాఆలోచించాడు.....
మొదటి అల్లుడి కీ కార్ ఇచ్చింది...
రెండో వాడికి బైక్ ఇచ్చింది.......
ఇక మిగిలింది కేవలం సైకిల్ మాత్రమే...ఇప్పుడు అత్తను రక్షిస్తే అదే ఇస్తుంది ....అది నేను ఏం చేసుకుంటాను అని అత్తను సముద్రంలోవదిలేసాడు.....
ఇంటికి వచ్చేసాడు......
ఆశ్చర్యం......తర్వాత రోజు చూస్తే ఇంటి ముందు BMW కారు .......కానుకగావచ్చింది....
ఎలా....???
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
వాళ్ళ మామ ఇచ్చాడు

Monday, May 30, 2016

జర్నీ

ఒక ఆసామి బసెక్కి ప్రయాణిస్తున్నాడు.  కండక్టర్ రాగానే నెల్లూరుకి టికెట్ తీకున్నాడు.  నెల్లూరు  రాగానే ఒంగోలుకి టికెట్తీ తీసు కున్నాడు,  ఒంగోలు రాగానే గుంటూరుకు టికెట్తీసుకున్నాడు,  గుంటూరు రాగానే విజయవాడకు టికెట్ అడిగాడు. కండక్టర్ కోపోమొచ్చి, ఏమయ్యా ! నీకు పిచ్చా ఇలా టికెట్లు  తీసుకొని విసిగిస్తావు, నీకూ  డబల్ ఛార్జ్ అయింది అని విసుక్కున్నాడు. అందుకు ఆ ఆసామీ  నింపాదిగా ఆ సంగతి నాకు తెలుసు. నాఆరోగ్యం బాగులేదు,  డాక్టర్ గారు నన్ను లాంగ్ జర్నీ    చెయ్యవద్దన్నారు,  అందుకే ఇలా  షార్ట్  జుర్నీ చేస్తున్నా అన్నాడు.

నిరుద్యోగం

సురేష్ ఇంజనీరింగ్ Complete చేశాడు. తాను కంప్లీట్ చేసిన కోర్స్ కి తగిన ఉద్యోగం కోసం ఎన్నో Interviews కి Attend అయ్యాడు ఐనా కూడా ఏ ఒక్క జాబ్ లో కూడా Select అవ్వలేదు.
.
.
.
.
.
ఇలా కాదని ఏదైనా పని చేస్తు తనకు అవసరమైన నిత్యవసరాలకు, భోజనానికి సరిపడా ఖర్చుల కోసం ఏ పనినైనా చేయాలని నిశ్ఛయించుకున్నాడు.
.
.
.
.
ఒక సర్కస్ కంపెనీని చూశాడు. అందులోకి వెళ్ళి నాకు ఏదైన ఉద్యోగం కావాలి అని అడిగాడు.. అతని పరిస్థితి చూసి జాలిపడి.. కాని ఇక్కడ పనిచేయాలంటే తగిన అనుభవం ఉండాలి అంటే దానికి అతను ఒక కోతిలా హావా భావాలు పలికించి వారిని Impress చేశాడు. శభాష్.. చాలా బాగా చేశావ్ ఇదిగో ఈ చింపాజి డ్రెస్ వేసుకో.. ఇక రేపటి నుండి చింపాజి డ్రెస్ వేసుకుని నువ్వొక నిజమైన చింపాంజిలానే నటిస్తు ప్రేక్షకులందరిని నవ్వించాలి'చెప్పాడు.
.
.
.
.
.
ఇక ప్రతిరోజు చింపాంజిలా డ్రస్ వేసుకొని ఆ చేష్టలతో ప్రేక్షకులను నవ్వించడం మొదలు పెట్టారు. కాని ఒకరోజు ప్రమాదవశాత్తు సింహం ఉన్న పెద్ద బోనులో పడిపోయాడు.. అక్కడున్న ప్రేక్షకులందరు ఆశ్ఛర్యానికి లోనయి ఉత్కంఠగా గమనిస్తున్నారు. అక్కడున్న ఎవ్వరికి తెలియదు చింపాంజి వేషంలో ఒక మనిషి ఉన్నాడు అని.. సురేష్ కి చచ్చేంత భయం పట్టుకుంది సరైన ఉద్యోగం దొరకక పోవడం వల్ల ఇలా ఈరోజు నా ప్రాణాలు పోతున్నాయనమాట అని ఆ సింహం ముందు వణుకుతు, ఏడుస్తు కూర్చున్నాడు.
.
.
.
.
.
ఆ సింహం నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చింది కాని ఇంకా దాడి చేయలేదు.. కళ్ళు మూసుకొని భయంతో చెమటలు కక్కుతూ ఉండగా ఆ సింహం అతనికి చాలా దగ్గరికి వచ్చి…
.
.
..
.
అరే సురేష్ గా భయపడకు నేను రమేష్ గాడ్ని 2012 మెకానికల్ బాచ్…

Sunday, May 29, 2016

అందం

భార్య:
ఎందుకు అనవసరంగా తాగి డబ్బులు ఖర్చు చేస్తున్నారు?

భర్త:
నువ్వు మాత్రం అనవసరంగా బ్యూటీ పార్లర్ కి వెళ్ళి నీ మేకప్ కోసం డబ్బులు తగలెయ్యడం లేదా?

భార్య:
అది నాకోసం కాదు, మీ కోసమే.
మీకు అందంగా కనపడాలనీ....

భర్త:
ఓసి పిచ్చిదానా!
నేను తాగేది కూడా అందుకేనే!!
నువ్వు నాకు అందంగా కనపడాలనే.......!!!

Thursday, May 26, 2016

బిచ్చగాడు

బిచ్చగాడు 1 : అన్నా, పేపర్ వేసినోడ్ని, పేపరోడు అంటారు, పాలు వేసినోడ్ని పాలోడు అంటారు, మరి బిచ్చమేసినోడ్ని బిచ్చగాడు అనకుండా మనల్ని బిచ్చగాడు అంటారేందన్నా?
బిచ్చగాడు 2 : ఆఆఆ!!!

Tuesday, April 12, 2016

Fits

అమ్మ:- బాబూ ఇలా రా రా.. పక్కింటి అమ్మాయికి Fits వచ్చినట్టుంది... ముఖం ఓ వైపు తిరిగిపోయింది, నోరూ పెదాలూ సొట్టబోయాయి, నాలుక బయటకి వచ్చేసింది... త్వరగా రా రా...
కొడుకు:- అయ్యో అమ్మా,, అది Fits కాదు, ఆ అమ్మాయి SELFIE తీసుకుంటోంది...

Thursday, January 21, 2016

కొత్త కోడలు

కొత్త కోడలు మొదటి సారి వంట చెయదలచె....  

వంటల పుస్తకము చదువుతూ వంట మొదలు పెట్టె......

గుడి నుండి అత్త తిరిగి వచ్చే...
ఫ్రిజ్జు తెరచి చూచే...
అచ్చెరువందే....

కోడలింజూచి అడిగె.....

"పూజ గది నుండి ఈ గంట ఫ్రిజ్జ్ లో కెట్ల వచ్చే.?..."

కోడలు : "అత్తమ్మా.... పుస్తకము లో వ్రాసి ఉండె..... మిశ్రమంను బాగుగా కలిపి తర్వాత ఒక 'గంట' ఫ్రిజ్జ్ లో పెట్టవలెనని......

Wednesday, January 13, 2016

అధ్బుతము

అప్పయ్య పొద్దున్నే పేపర్ తెరిచాడు.

 రొటీన్ వార్తలు
 బోర్ కొట్టడo తో ......

ప్రకటనలు చదవడం ప్రారంబిoచాడు.

 అందులో ఓ ప్రకటన అప్పయ్య ని తెగ ఆకర్షిoచిoది

ఆ ప్రకటన ఇలా....:

కొన్ని వందల సంవత్సరాల ముoదు కనిపెట్టబడిన అధ్బుతము

 అదృశ్యవీక్షణి ఇది ధరించిన వారు ఇతరులని తాము చూడగలరు కానీ ఇతరులకు తాము కనపడరు  ఆలశిoచిన ఆశాభంగం వెల కేవలం 5 వేలు.  

ఉరుకులు పరుగుల మీద ఆ ఐదు వేలు చెల్లిచి కొరియర్ లో ఆ సామాను తెప్పిచుకున్నాడు.

 రాగానే పూజ చేసి
.
పసుపు పెట్టి
.
తెరచి చూస్తే .......
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

" బురఖా"
Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version