Thursday, July 27, 2017

టెన్షన్

బాగా పొద్దుపోయాక భార్య భర్తలు మొబైల్ లో ఇలా మాట్లాడుకుంటున్నారు..

భార్య :ఎక్కడున్నారు..!? ఎందుకు టెన్సన్ గా మాట్లాడుతున్నా‌రు..?

భర్త :నేను కారులో ఉన్నా...! కారు స్టీరింగ్, క్లచ్, బ్రేకు, యాక్సలరేటర్ అన్నీ దొంగలెత్తుకు పోయారు..ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావ్...?

భార్య: మందు తాగావా..? 😠😠

భర్త :కొద్దిగా తీసుకున్నా..😊 ఐనా నేను కారు గురించి మాట్లాడుతుంటే నువ్వు మందు గురించి మాట్లాడతావేంటి..?

భార్య : ఆ వెనుక సీట్లోనుంచి ముందు సీట్లోకిరా..అన్నీ కనిపిస్తాయి..👿👿

Tuesday, July 25, 2017

టొమాటో పప్పు

భార్య : మీ అవినీతి సొమ్మంతా చాలా పకడ్బందీగానే దాచాము గదండీ ! నేను నగలు కూడా వేసుకొను, మనం కారు కూడా కొనుక్కోలేదు, చిన్న ఇంట్లోనే ఉంటున్నాము, అయినా ACB వాళ్ళు ఎలా పసిగట్టారు ?
భర్త : "టొమాటో పప్పు" చెయ్య వద్దే అంటే విన్నావా ? (లబో దిబో)

Monday, July 24, 2017

విషం

ఒకతనికి ఎడమ కాలు బ్లూ కలర్ లోకి మారింది..
గాబరా పడి .. డాక్టరు కి చూపించాడు..
.
..డాక్టరు : కాలు మొత్తం విషం తో నిండి పోయింది..

ఆ విషం .. మొత్తం శరీరానికి పాకే అవకాశం ఉంది.. కనుక..
వెంటనే ఆపరేషన్ చేసి కాలు తీసేయాలి.... అన్నాడు..

..ఆపరేషన్ చేసి కొత్త కృత్రిమ కాలు అమర్చారు..

..కొద్ది రోజుల తర్వాత కుడి కాలు కూడా .. నీలం రంగు లోకి మారింది..

డాక్టరు  : వెంటనే ఆపరేషన్ చేసి.. కుడి కాలు కూడా తీసేయాలి.. అన్నాడు..
.
..కుడికాలు కూడా తీసేసి కృత్రిమ కాలు అమర్చారు...

..కొద్ది రోజుల తర్వాత .. కృత్రిమ కాళ్ళు రెండూ.. బ్లూ కలర్ లోకి మారిపోయాయి ..
.. వెంటనే డాక్టరు దగ్గరికి వెళ్ళాడు .. పేషెంటు..

..అప్పుడు డాక్టరు బాగా పరిశీలించి ... ఇలా అన్నాడు....
.
.
.
.
.
.
...... నాకిప్పుడు అర్థమైంది మీ ప్రాబ్లం...

మీ లుంగీ.. రంగు వదులుతుంది..... ఏం గాభరా పడకండి.. నిశ్చింతగా ఉండండి..!
😳😳

Thursday, July 20, 2017

తాగుబోతు

సుబ్బు: రాత్రి తాగి, లేటుగా వెళ్లినందుకు
మా ఆవిడ తలుపు తీయలేదు
దాంతో రోడ్డు మీదనే పడుకున్నా
చింటూ: మరి తెల్లారిన తర్వాత తీసిందా?
సుబ్బు: లేదురా.. తాగింది దిగింది
అప్పుడే గుర్తుకు వచ్చింది

..
..
..
.. నాకసలు పెళ్లికాలేదని.. తాళం నా జేబులోనే ఉందని
😘🤣😛😇😘🤣😛😇😘🤣😛😇😘🤣😛😇😘🤣😛😇

Friday, July 14, 2017

వాటర్ బాటిల్

పెళ్ళాం: నిన్నటి నుండి నన్ను ఒకడు 
ఫాలో అవుతున్నాడు. భయంగా ఉంది 

భర్త: దాని కి అంత భయం ఎందుకు? 
నీ బ్యాగులో వాటర్ బాటిల్ ఉందా? 

పెళ్ళాం: ఉంది 

భర్త: ఈ సారి వాడు నీ వెంట పడితే 
వాటర్ బాటిల్‌తో...

..

..

..

..

..

..


..

..

..

...

...

.....


....

....



.....


....

....


....


....

.

...



నీ మొహం కడుక్కో.. మేకప్ పోయిన తర్వాత చూసి భయపడిఛస్తాడు  వెధవ..
😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣

Thursday, July 6, 2017

ప్రసవానంతర వేదన

అప్పుడే ప్రసవం అయి...
మెలకువ వచ్చింది ఆమెకు...
పక్కన తడిమి చూసుకుంది ... లేదు...
చేతికి ఏమీ తగలలేదు....

హయ్యో...ఎక్కడ??
ఆదుర్దా... మొదలయ్యింది
మనసంతా అలజడి...
ఇంతకీ ఏమయిందీ???

మంచం పక్కన ..  కిందా ..
వూహూ ...  ఎక్కడా లేదు..

దృష్టి సారించి ... కళ్లతోనే
చుట్టూ వెదికింది.
లాభం లేదు. ఏమైవుంటుందీ?
మనసు నిలవడం లేదు.

దూరాన మసక మసకగా కనిపిస్తోంది నర్స్...

ఓపిక తెచ్చుకొని ....
రమ్మని సైగ చేసింది....
పరుగు పరుగున వచ్చింది నర్స్..

ఉన్న శక్తి అంతా కూడ గట్టుకొని అడిగింది ...
ఎక్కడా ... ఒక్కసారి ఇవ్వండి .... ప్లీజ్

పాపం బాలింత కంగారుపడుతోంది ...
అనుకుని ... నర్స్  ... పరుగున పాపను అందించింది..

నర్స్ (ఆనందంగా) : " ఇదిగో తీసుకో ... ..ఇక నీ ఆదుర్దా ఆపుకుని ... మనసారా చూసుకో నీ పాపాయిని ... "

బాలింత: "  హయ్యో ! నేను అడిగింది నా మొబైల్ ఫోన్..." 😜

Wednesday, July 5, 2017

అడ్జస్ట్

" మా అమ్మాయిని మేము అల్లారు ముద్దుగా పెంచాం.  అందుకని అమ్మాయికి వంట చేయడం రాదండి. కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోండి బావగారు... "

" అయ్యో ఎంత మాట బావగారు.. పర్లేదు ... మా అబ్బాయిని కూడా మేము అల్లారుముద్దుగా పెంచాం. సంపాయించడం రాదు అందుకని మీరు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి బావగారు... "

# మీకు వస్తే రక్తం .. మాకొస్తే టమోట రసమా????😅😅

Saturday, July 1, 2017

కిచిడి

అప్పటిదాకా క్రికెట్టు మాచ్, హైలైట్స్ విశ్లేషణలు చూసి వచ్చి
"ఇవాళ్ళ లంచ్ లోకి ఏమి వండావు ??"
అని వేపిన కందులు విసురుకుంటున్న ఇల్లాలిని అడిగాడాయన.
..
సర్రుమంది ఆమెకి. వివేకవంతురాలు కాబట్టి ..
గొంతులోకి వీలయినంత సౌమ్యం తెచ్చి పెట్టుకుని
"ఇవాల్టికి ఊరు వెళ్ళానను కొని మీరే వండుకోండి" అంది.
...
తమిళ తంబి లాగా లుంగీ ఎగ్గట్టి వంటింట్లోకి నడిచాడు....
..
రైస్ కుక్కర్లో బియ్యం ఎసరు, చేతికొచ్చిన కూరగాయలు తరిగి ..
వాటి ముక్కలు, ఉప్పు కారం కొద్దిగా డాల్డా వేసి స్విచ్ వేశాడు.

..
ఆకలి వల్ల 'కిచిడి' అద్బుతంగా అనిపించి గిన్నె ఖాళీ చేశాడు...
..
చేతిలో పని పూర్తి చేసుకుని ఇంట్లో కొచ్చింది ఆవిడ.
"నాకేది ?" అంది ఖాళీ గిన్నె చూసి .
***
"నువ్వు ఊరినుండి ఎప్పుడొచ్చావు ?" అడిగాడాయన. ..

దారుణం

జడ్జి: విడాకులు ఎందుకు కోరుకుంటున్నావు? 

భర్త: నా భార్య నాతో వెల్లుల్లి వలిపిస్తుంది. ఉల్లిపాయలు కోయిస్తుంది. అంట్లు తొమిస్తుంది. 

జడ్జి: వీటిలో అంత కష్టం ఏముంది? వెల్లుల్లిని వేడి నీటిలో వేస్తే సులువుగా వలవ్వొచ్చు. ఉల్లిపాయలు ఫ్రిడ్జ్ లో కాసేపు ఉంచి అప్పుడు కట్ చేస్తే కళ్ళు మండవు. గిన్నెలు కాసేపు నీటిలో నానబెట్టి కడిగితే సులువుగా శుభ్రపడతాయి. బట్టలు ఉతికే ముందు ఒక అరగంట సర్ఫ్ నీళ్లలో నాన పెడితే సులువుగా ఉతక వచ్చు. చేతులూ పాడవ్వవు.  

భర్త: అర్ధం అయ్యింది. నా కేస్ వాపస్ తీసుకుంటాను. 

జడ్జి: ఏమి అర్ధం అయ్యింది?!!!  

భర్త: మీ పరిస్థితి నా కన్నా దారుణంగా ఉందని😡

GST

శ్రీ భగవానువాచ

   🤔 ఓ అర్జునా 
మార్పు అనేది ప్రకృతి నియమము
నాడు sales tax  అనేది  నేడు vat tax  రేపటి GST గా మారనున్నది.

చింతించాల్సిన అవసరం లేదు.

నీవు ఏది పొందినా custemer దగ్గరనుండే పొందావు.

నీవు ఎంత పొందినా govt  కి కడుతూనే  ఉన్నావు.  మిగిలినది మాత్రమే  నీ wife కి ఇచ్చుచున్నావు.

నీ దంటూ ఏమున్నది

ఎందుకు GST గురించి  భయపడుచున్నావు.

అనివార్యమగు  ఈ  విషయం గురించి చింతించతగదు. 😜

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version