అప్పుడే ప్రసవం అయి...
మెలకువ వచ్చింది ఆమెకు...
పక్కన తడిమి చూసుకుంది ... లేదు...
చేతికి ఏమీ తగలలేదు....
హయ్యో...ఎక్కడ??
ఆదుర్దా... మొదలయ్యింది
మనసంతా అలజడి...
ఇంతకీ ఏమయిందీ???
మంచం పక్కన .. కిందా ..
వూహూ ... ఎక్కడా లేదు..
దృష్టి సారించి ... కళ్లతోనే
చుట్టూ వెదికింది.
లాభం లేదు. ఏమైవుంటుందీ?
మనసు నిలవడం లేదు.
దూరాన మసక మసకగా కనిపిస్తోంది నర్స్...
ఓపిక తెచ్చుకొని ....
రమ్మని సైగ చేసింది....
పరుగు పరుగున వచ్చింది నర్స్..
ఉన్న శక్తి అంతా కూడ గట్టుకొని అడిగింది ...
ఎక్కడా ... ఒక్కసారి ఇవ్వండి .... ప్లీజ్
పాపం బాలింత కంగారుపడుతోంది ...
అనుకుని ... నర్స్ ... పరుగున పాపను అందించింది..
నర్స్ (ఆనందంగా) : " ఇదిగో తీసుకో ... ..ఇక నీ ఆదుర్దా ఆపుకుని ... మనసారా చూసుకో నీ పాపాయిని ... "
బాలింత: " హయ్యో ! నేను అడిగింది నా మొబైల్ ఫోన్..." 😜
No comments:
Post a Comment