Saturday, July 1, 2017

కిచిడి

అప్పటిదాకా క్రికెట్టు మాచ్, హైలైట్స్ విశ్లేషణలు చూసి వచ్చి
"ఇవాళ్ళ లంచ్ లోకి ఏమి వండావు ??"
అని వేపిన కందులు విసురుకుంటున్న ఇల్లాలిని అడిగాడాయన.
..
సర్రుమంది ఆమెకి. వివేకవంతురాలు కాబట్టి ..
గొంతులోకి వీలయినంత సౌమ్యం తెచ్చి పెట్టుకుని
"ఇవాల్టికి ఊరు వెళ్ళానను కొని మీరే వండుకోండి" అంది.
...
తమిళ తంబి లాగా లుంగీ ఎగ్గట్టి వంటింట్లోకి నడిచాడు....
..
రైస్ కుక్కర్లో బియ్యం ఎసరు, చేతికొచ్చిన కూరగాయలు తరిగి ..
వాటి ముక్కలు, ఉప్పు కారం కొద్దిగా డాల్డా వేసి స్విచ్ వేశాడు.

..
ఆకలి వల్ల 'కిచిడి' అద్బుతంగా అనిపించి గిన్నె ఖాళీ చేశాడు...
..
చేతిలో పని పూర్తి చేసుకుని ఇంట్లో కొచ్చింది ఆవిడ.
"నాకేది ?" అంది ఖాళీ గిన్నె చూసి .
***
"నువ్వు ఊరినుండి ఎప్పుడొచ్చావు ?" అడిగాడాయన. ..

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version