Monday, January 30, 2017

సున్నాలేసేవాడ

స్టూడెంట్ : మాస్టారండీ మాస్టరండీ సాయంత్రం మీరు మా ఇంటికి రావాలండి.
టీచర్ : ఎందుకు రా?
స్టూడెంట్ : మా నాన్నసాయంత్రం బడి నుంచి వచ్చేదప్పుడు సున్నాలేసేవాడిని తీసుకు రమ్మన్నాడండి. మరి మీరే కదండి మాకు సున్నాలేస్తారు...00000
������������

Sunday, January 29, 2017

టిప్స్

మహిళల కోసం కొన్ని టిప్స్..
1.... నూనె మరిగేటప్పుడు కొన్ని చుక్కల విస్కీ అందులో కలిపితే, నూనె మాడదు...
2... పిండి కలిపేటప్పుడు, కొన్ని చుక్కల బీర్ కలిపితే, చపతీలు చక్కగా బంగారు రంగులో వస్తాయి..
3... కొన్ని చుక్కల వోడ్కా పనీర్ లోకలిపితే, వేసవి కలం లో పనీర్ పాడవకుండా ఉంటుంది..
4... పప్పులో red wine కొన్ని చుక్కలు కలిపితే, పప్పు యమ రుచిగా ఉంటుంది..
ఇన్ని రకాలుగా మేనేజ్ చేయడం కష్టం అనుకుంటే......
నాలుగు పెగ్గులు మీ ఆయన నోట్లో పోయండి... వంట ఎలా ఉన్నా, కిమ్మనకుండా తినేస్తాడు...

Saturday, January 28, 2017

లవ్ స్టోరీ


ఒక మూసలోడు వచ్చాడు ... వెంట ముసళ్డాన్ని కూడా తెచ్చాడు ....
.
.
.
హోటెల్ కి వెళ్లారు.... వేటర్ ని పిలిచారు..... ఇద్దరు ఆర్డర్స్ చెప్పారు.....
.
.
.
ముందు మూసలోడు తిన్నాడు..... ముసల్ది బిల్ పే చేసింది.....
.
.
.
తర్వాత ముసల్ది తిన్నది.... మూసలోడు బిల్ పే చేసాడు ....
.
.
.
ఇది చూసిన వేటర్ కి పిచ్చి లేచింది..... దగ్గర్కి వెళ్లాడు అడిగాడు....!!!
.
.
.
మీ ఇద్దర్‌లో చాలా ప్రేమ ఉంది.... కదా......??? కానీ ఒకటేసరి కలిసి ఎందుకు తిన్లేదు మీరు....
మూసలోడు ఆన్సర్ చెప్పాడు....
.
.
."ప్రేమ చాలా ఉంది కాని పళ్ళ సెట్ ఒకటే ఉంది".....
😂😂😂😂😂😂😂

Tuesday, January 24, 2017

ముగ్గురు స్త్రీలు

గణిత టీచర్ : ఒక స్త్రీ గంటలో  యాభై చపాతీలు చేయగలదు
ముగ్గురు స్త్రీలు కలసి గంటలో ఎన్ని చపాతీలు చేయగలరు

స్టూడెంట్ : సున్నా

టీచర్ : అదేంట్రా జఫా నీకు లెక్కలు రావా (అని నాలుగు పీకుతుంది)

స్టూడెంట్ : (ఏడుస్తూ)
ముగ్గురు స్త్రీలు ఓ చోట ఉంటే ముచ్చట్లకే టైమ్ చాలదు
ఇంక చపాతీలెక్కడ చేస్తారు టీచర్

Monday, January 23, 2017

చీరలు

భార్యభర్తలు అలా వెళుతూ ఉంటే, దారిలో భార్యకు ఒక బోర్డ్ కనిపించింది..
.
.
బనారస్ చీర రూ.లు. 10-00,
నైలాన్ చీర రూ.లు. 8-00,
కాటన్ చీర రూ.లు. 6-00.
అది చూసి భార్య భర్తతో ఒక 500 రూ.లు ఇవ్వండి,
50 బనారస్ చీరలు కొనుక్కుంటా అని .....
.
.
భర్త భార్యతో, అది ఇస్త్రీ షాపే, సరిగ్గా చూడు...!!

Sunday, January 22, 2017

వాట్స్ ప్

భర్త : " ఒహ్ ...‌ డార్లింగ్! ఇల్లంతా నీట్ గా వుంది. వాట్స్ ప్ ..... పనిచెయ్యటం లేదా ఏంటీ ? "
భార్య : " అదేం కాదు లెండి "
భర్త ( ఆశ్చర్యం గా ) : " మరి "
భార్య : " నా మొబైల్‌ చార్జెర్ కనిపించలేదు ..... దాని కోసం వెదుకుతూ ..... ఇల్లంతా సర్దేసాను అంతే "

Saturday, January 21, 2017

సెలెబ్రేట్

సునీల్ కోపంతో రగిలిపోతూ ...... పోలిస్ స్టేషన్‌కి వచ్చాడు.
ఎస్సై : " ఎమైంది ? "
సునీల్ : " మా పక్కింటోడి భార్య కనిపించటం లేదు సర్ ? "
ఎస్సై : " ఆయన భార్య గురించి నువ్వెందుకు కంప్లైంట్ చేస్తున్నావ్ ? "
సునీల్ : " ఆయన సంతోషాన్ని నేను భరించలేక పోతున్నాను సర్ !!! అయన రోజూ పార్టీ చేసుకుని ..... మరీ  సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు "
😂😂😂😂

Thursday, January 19, 2017

పట్టుదల

భర్త : స్వామి..! భార్యాభర్తల గొడవలలో ఎక్కువగా భర్తలే సర్దుకుపోతారు ఎందుకు స్వామీ.....?
సన్యాసి : తప్పదు నాయనా...! లేకపోతే భార్యలు బట్టలు సర్దుకు పోతారు....
భర్త : అంటే ఈ విషయం లో పట్టుదల గా ఉండే భర్తలే ఉండరా స్వామీ......?
సన్యాసి : నేను లేనా నాయనా...! నా లాంటి వాళ్ళందరూ ఒకప్పటి పట్టుదల కల్గిన భర్తలే......!😛

Wednesday, January 18, 2017

ప్రిస్క్రిప్షన్

ఒక మందులషాప్ లో సేల్స్ గర్ల్ కష్టమర్ తో గొడవ పడుతున్నది
ఇంతలో అక్కడకి ఓనర్ వచ్చాడు..
ఓనర్:   ఏంటమ్మా, కష్టమర్స్ తో అలా గొడవపడకూడదు.. ఆయనకి ఇంతకీ ఏం కావాలంట
సేల్స్ గర్ల్ :   చూడండి సార్ వీడు నన్ను, ఆంటీ బయటికి రా అంటున్నాడు
కస్టమర్: చూడండి సార్ ఈ prescription లో ఆంటీ బయటికి అనే వుంది
ఓనర్: ఓరేయ్ వెదవ అక్కడ రాసింది "ఆంటీ బయటికి" కాదురా, "యాంటీబయాటిక్ "

పొంగల్

😅" శీనయ్యా మీ అల్లుడు పొంగల్(సంక్రాంతి)కి వస్తున్నాడా.."
" చద్దన్నానికి పిలిచినా కూడా వస్తాడు. పొంగల్ కి రాకుండా ఉంటాడా..? "😜😝

Thursday, January 12, 2017

అందం

ఒక రోజు అడవిలో ఒక చిరుత పులి సిగిరెట్ తాగుతుంది...
ఇంతలో అక్కడికి ఒక చిట్టెలుక వచ్చి, " సోదరా ఇలాంటి
అలవాట్లు మానెయ్. పద మన అడవి ఎంత అందంగా
ఉంటుందో చూపిస్తాను ".
సరే అని చిరుత సిగరెట్ పక్కన పడేసి దాని వెంట వెళ్ళింది.
కొంత దూరం వెళ్ళాక ఒక ఏనుగు గంజాయి
తీసుకుంటూ కనిపించింది. దానికి కూడా అలానే చెప్పి
వెంట తీసుకు వెళ్ళింది చిట్టెలుక.
ఇంకొంత దూరం వెళ్ళాక ఒక సింహం విస్కీ తాగుతూ
కనిపించింది. ఆ సింహానికి కూడా అదే మాట చెప్పింది.
సింహం తన చేతిలో ఉన్న గ్లాస్ పక్కన పెట్టి ఆ చిట్టెలుకని
నాలుగు పీకింది..
అది చూసి ఏనుగుకి కోపం వచ్చింది.. " ఎందుకు
పాపం దాన్ని అలా కొడతావ్? "
" ఇది నిన్న కూడా ఇలానే ' ' తాగి వచ్చి నన్ను 3 గంటలు
అడవి అంతా తిప్పింది...

Wednesday, January 11, 2017

గృహ శాంతి కి మంత్రము

 ~నువ్వు చాలా అందంగా ఉంటావు సుమా....
~ ఇంట్లో పనులన్నీ ఎంత కష్టపడి బాగా చేస్తావు...
~నువ్వు ఈ మధ్య బాగా చిక్కిపోతున్నావు బంగారం....
~మరీ ఎక్కువ పని చేస్తే అలసిపోతావు నాన్నా....
~నీ ఆరోగ్యం పట్ల కూడా నీవు జాగ్రత్త పడాలిగా 
~మీ అమ్మ ,నాన్నా ఇంకా మీ తరపున వాళ్ళు ఎంత మంచోళ్ళు..
      ఈ మంత్రము ప్రతి రోజూ ఇంట్లో కనీసం మూడు లేదా నాలుగు మార్లు పఠించే వారిల్లు సుఖ శాంతులతో వర్దిల్లుతుంది. 
NB:ఇలాంటి అబద్దాలు చెప్పినప్పటికీ సదరు భర్తగారికి ఎటువంటి పాపములు అంటవు

Tuesday, January 10, 2017

నాదేం ఉంది

_*����మొగుడు*_ : *ఏమేవ్ నీకు పండగకి చీర కావాలా లేక చుడీదార్ కావాలా..*

_*����పెళ్ళాం*_ :  *నాదేం ఉంది మీకు ఏది ఉతకడానికి సులువుగా ఉంటుందో అదే కొనివ్వండి, సరేనా..!*

_*����మొగుడు*_ : ������

Monday, January 9, 2017

మహిమ

స్వామీ! రాత్రుళ్ళు నా భార్య ముఖం నుండి తెల్లటి కాంతి వస్తుంది, దుప్పటి కప్పుకొని ఉన్నా వచ్చే కాంతి తో ముఖం వెలిగిపోతూ ఉంటుంది, నా భార్య కు ఏమైనా మహిమలున్నాయంటారా స్వామీ?
.
.నాయనా!
రాత్రి పడుకునే ముందు నీ సెల్ ఫోన్ లాక్ చేసుకో, నీకు తెలియకుండా నీ భార్య నీ ఛాటింగు లన్నీ దుప్పటి కప్పుకొని మరీ చదువుతుంది, ఆ సెల్ ఫోన్ కాంతే నాయనా అది..

భర్తగా బ్రతకడం కష్టం

భర్త  ::  నేను  నిన్న స్కూల్  కి చేరుకోగానే, నా బార్య కాల్ చేసింది,.... " ఇవ్వాల డేట్ ఎంత" ????" .. 
🤔🤔😨😰🤒
నేను ఆశ్చర్యంగా ఆలోచిస్తూ చెప్పాను 11వ తారీఖు అని...

కాల్ కట్ అయ్యాక ఆలోచనలో పడ్డాను
 (భయం కూడా కలిగింది.. 😰😥😨)..
తన పుట్టిన రోజా ఊహు?...........కాదు
......నా పుట్టినరోజు  కాదు ..(😬😬😝)
.....పెళ్లి రోజు..ఊహు  ....  అదీ కాదు 
అమ్మాయి పుట్టిన రోజా  ... అదీకాదు
పోనీ బామర్దుల పుట్టినరోజులు కాని పెళ్లి రోజులు .. ఊహు 
గాస్ బుకింగ్ ........ చేసేసాను
కరెంటు బిల్లు ........ కట్టేసాను 

వాళ్ళ అమ్మ నాన్నలు వస్తామన్నారా  అది కాదు 
పోనీ ఏదైనా కొనిపెడతానని మాటిచ్చానా .. లేదే..??

మరి ఎందుకు !? 

డేట్ ఎందుకు ???

ఇవే ప్రశ్నలు మదిలో ఆలోచిస్తూ  లంచ్ అయ్యింది,  సాయంత్రం స్కూల్ అయిపోయింది 
...🙇🏼🙇🏼🤔🤔
ఇంటికి చేరుకున్నాను...

పాప తన బొమ్మలతో ఆడుకుంటుంది ...
అడిగాను ....
కిచెన్ లో వాతావరణం ఎలా ఉంది?
తుఫానా.. సునామినా???

పాప చెప్పింది అంత మామూలే నాన్న ఏమైంది ఎందుకు ?"

"మీ అమ్మ ఈరోజు పొద్దునే ఈ రోజు డేట్ ఎంత అని అడిగిందే ఎందుకంటావు?"

పాప నవ్వుతూ  చెప్పింది ...

"ఓహ్ అదా నాన్న నేను పొద్దున్న క్యాలెండర్ లోని ఒక పేజి చింపా...

అందుకే అడిగిందేమో.."

😳😳😳🙄🙄🙄🤔🤗😄😁

భర్తగా బ్రతకడం కష్టంరా బాబోయ్..

Sunday, January 8, 2017

చీమ

చీమను చంపడం ఎలా? 10 మార్కులు
కొంచెం కారం పొడి, పంచదార కలిపి చీమల పుట్ట దగ్గర పెట్టాలి. అది తిన్న తరువాత చీమకు దాహం వేస్తుంది. అది నీళ్ళకోసం వస్తుంది. వెనకాలే వెళ్ళి దాన్ని నీళ్ళలోకి తోసేయాలి. అది తడిసిపోతుంది. దానికి చలి వెయ్యడం వల్ల మంట దగ్గరకు వెళ్తుంది. అప్పుడూ ఆ మంట మీద మనం పెట్రోలు పోసెయ్యాలి. దాని ఒళ్ళు కాలిపోతుంది. అప్పుడు 108కి పోన్ చేసి దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. దాన్ని అత్యవసర విభాగంలో చేర్చాలి.ఆక్సిజన్ ఒక పైపు ద్వార ఐందిస్తారు. చీమ నిద్రపోయాక ఆ పైపు తీసెయ్యడం వల్ల ఆ చీమ చనిపోతుంది. 

పిల్లల్తొ పెట్టుకోకండి. మార్కులకోసం వాళ్ళు ఎంతైనా వ్రాసేస్తారు. 

Thursday, January 5, 2017

అతిథి

ఒక తల్లికి నలుగురు కూతుళ్లు వుండేవారు.
అందులో మొదటి అమ్మాయి పేరు విరిగిన,
రెండవ అమ్మాయి పేరు చిరిగిన,
మూడవ అమ్మాయి పేరు పాడయిపోయిన,
నాలుగవ అమ్మాయి పేరు చనిపోయిన...
ఇలా ఈ విధంగా ఆ తల్లి తన
కూతుళ్లకు పేర్లు పెట్టుకుంది.
.
ఒకరోజు వీరి ఇంటికి ఒక అతిథి వస్తాడు.
.
అతనితో తల్లి అడుగుతూ... ‘‘మీరు కుర్చీలో
కూర్చుంటారా లేక చాప మీద కూర్చుంటారా?’’
.
అతిథి : ‘‘కుర్చీ మీద కూర్చుంటాను’’
.
తల్లి : ‘‘విరిగిన..! కుర్చీ తీసుకుని రా’’!
.
అతిథి : ‘‘వద్దులేండీ..! నేను చాపమీదే
కూర్చుంటాను’’
.
తల్లి : ‘‘చిరిగిన..! చాప తీసుకుని రా’’
.
అతిథి : ‘‘ఉండనివ్వండి... నేను కింద నేలపైనే
కూర్చుంటాను’’
.
అలా అని ఆ అతిథి నేలమీద కూర్చుంటాడు.
.
కొద్దిసేపు తరువాత....
.
తల్లి : ‘‘మీరు టీ తీసుకుంటారా..
పాలు తీసుకుంటారా?’’
.
అతిథి : ‘‘టీ’’
.
తల్లి : ‘‘పాడయిపోయిన...! టీ తీసుకుని రామ్మా..’’
.
అతిథి : ‘‘వద్దు వద్దులెండి..
.
నేను పాలు తీసుకుంటాను’’
.
తల్లి : ‘‘చనిపోయిన..! ఆవు పాలు తీసుకుని
రామ్మా’’
.
ఈ మాటలు విన్న అతిథి ఏమీ తోచక అక్కడి నుంచి
పారిపోతాడు........😆😆😆😆

Wednesday, January 4, 2017

టికెట్లు

పట్నంలో సినిమా చూడడానికి వచ్చాడు పల్లెటూరి పోలయ్య-కౌంటర్ కు పోయి మాటి మాటికీ టికెట్లు కొంటున్నాడు- చివరికి కౌంటర్ గుమాస్తా గుర్తుపట్టి ఎందుకన్ని సార్లు  టికెట్లు కొంటున్నావని అడిగాడు.
దానికి పోలయ్య చెప్పాడు జవాబు :" ఏమి చెయ్యమంటారు? నేను ఎన్ని సార్లు టికెట్ తీసుకొని  గేటు దగ్గరకి వెళ్ళినా వాడెవడో చింపేస్తున్నాడు"!
Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version