Friday, March 31, 2017

మొదటి మహిళ

టీచర్ః--భారత దేశం నుంచి మొదటిసారిగా విదేశం వెళ్ళిన మహిళ ఎవరు?’’
విద్యార్ధిః--సీత టీచర్. శ్రీలంక వెళ్ళింది.’’

టీచరు ఇంకా కోమా నుండి బయటకి రాలేదు.

Thursday, March 30, 2017

పులి

🐅మేనేజర్ కి అసిస్టెంట్ కి మద్య సరదా సంభాషణ ..
అసిస్టెంట్ :- సార్ మీరు ఆఫీస్ లో పులిలాగా ఉంటారు మరి ఇంట్లో ?
మేనేజర్ :- పిచ్చోడ పులి ఎక్కడ ఉన్నా పులే రా ...కాకపోతే ఇంట్లో పులి మీద దుర్గా మాత కూర్చొని ఉంటది.
🐅

Friday, March 24, 2017

గొడవ

కుమార్ : మా ఆవిడ నాతో గత నెల రోజులుగా గొడవపడడం లేదు. (ఆనందంగా చెప్పాడు).

రమేష్ : ఆమెతో ఏమన్నావేమిటి?

కుమార్ : నువ్వు కోప్పడినప్పుడల్లా నీ ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయని అన్నానంతే.. (మరింత ఆనందంగా చెప్పాడు)

Wednesday, March 22, 2017

విటమిన్ ‘SHE’

పేషంట్ః ‘’ డాక్టరు గారూ,నేనుఎప్పుడూ అతి సంతోషంతో ఉంటాను.నిద్ర బ్రహ్మాండంగా పడుతుంది.అన్ని పనులూ చాలా శ్రధ్ధగా మనసు పెట్టి చేస్తుంటాను. మిగతా వాళ్ళను చూస్తుంటాను.అందరూ ఏ పని చెయ్యాలన్నా ఎంతో ఆదుర్దా పడిపోతుంటారు.అనవసర భయాలు పడుతుంటారు. నేను మాత్రం ఎటువంటి ఆందోళనా పడను. ఎంతో ఉత్సాహంగా ఉంటాను. నేనే ఎందుకలా ఉంటాను?ఇదేమీ జబ్బు కాదు కదా? ‘’
డాక్టరుః’’మీ పరిస్థితి అర్ధం చేసుకున్నాను.మీకు జీవితంలో విటమిన్ ‘’SHE’’ తక్కువైంది. అది పడితే మీరూ మిగతావాళ్లలాగే నార్మల్ అయిపోతారు.
😂😂😂😂😂😂

Thursday, March 16, 2017

మెతుకు

మనం తినే ప్రతి మెతుకునూ భగవంతుడు నిర్ణయిస్తాడు . . .
.
.
.
.
కానీ . . .
ఆ మెతుకు బిర్యానీ మెతుకా . .
సద్దన్నమ్ మెతుకా అనేది భార్య decide చేస్తుంది . .😛😀

చింత పిక్క

ఊర్లో ఉండేటపుడు టౌను గురించి భలే చెప్పేవాళ్ళు. సినిమా హాళ్ళని, కార్లని బస్సులని, పార్క్ లని, ఇలా సెప్తుంటే ఇని నేను కూడా బుజాన తుండుగుడ్డేసుకొని బయలుదేరా.కానీ పల్లెటూరోళ్ళని మోసం చేస్తారని కూడా బాగా చెప్పేటోళ్ళు.

సిటీ అంతా తిరిగి తిరిగి సూసి కాళ్ళ నొప్పులొచ్చాయి. ఆకలేసి టిఫెన్ బండి దగ్గరకెళ్ళా.

"అన్నా ఇడ్లీ ఉందా"

" లేదు"

"దోశ ఉందా అన్నా"

"లేదయ్యా"

"సరే, ఆకలవుతుంది యేది ఉంటే అదివ్వు"

"గుడ్డుంది. ఆమ్లేట్ వేసివ్వమంటావా"

"సరే కానీయవయ్యా, నాకు అదే రాసుందేమో ప్రాణాలు పోయేలా ఉన్నాయ్ తినకపోతే"

అమ్లేట్ వేసిచ్చాడు. తిని చేయి కడుకున్నా.

"అన్నా థాంక్స్ అన్నా ఆమ్లేట్ ఎంత?"

" అరవై రూపాయలన్నా"

"అన్నోయ్ యవ్వారం ఎట్టుంది. నా గురించి నీకు తెలిసినట్టు లేదు. కరెక్టుగా చెప్పు"

" ఒరేయ్ తింగరోడా, గుడ్డు పగలగొట్టి ఆమ్లేట్ యేసిచ్చానుగా నీకోసం"

" అవును నిజమే"

"మరి. అదే గుడ్డు పగలగొట్టకుండా అలాగే ఉంచి ఉంటే తర్వాత పుంజో పెట్టో అయ్యేది. దాన్ని సికెన్ సేత్తే నూటా అరవై వస్తాయ్. పల్లెటూరి నుంచి వచ్చినోడివని నిన్ను అరవై ఇమ్మంటే దీర్ఘాలు తీస్తున్నావేంట్రా, ఇవ్వు అరవై రూపాయలు."

"కరెష్టే అన్నో ..సికెన్ చేసుంటే ఎక్కువ డబ్బులొచ్చేయి నీకు. నీ డబ్బులు నాకెందుకులే అన్నా ఇచ్చేస్తా"

(హోటల్ వాడి మనసులో ఆనందం. అప్పనంగా అరవై దొబ్బుతున్నాడని)

" ఇదిగో. మిగతా చిల్లర ఇవ్వు"

"యేంటిది. సింత పిక్క ఇస్తే సిల్లర ఇవ్వాలా "

" ఈ చింత పిక్క నాటితే చెట్టయి ప్రతీ సంవత్సరం చింతపండు ఇస్తది అది అమ్మితే పెతీ యేడాది మూడు వేలొస్తయి. నేను అంత అడగకుండా ఒక యేడాది పంట డబ్బు ఇయ్యమంటున్నా. అంతే మూడు వేలల్లో అరవై తీసుకొని మిగతా సిల్లర ఇయ్యి. నేను పోవాల"

"ఇదన్నాయం"

"అన్నాయం యేందిరా అన్నాయం నువ్ సెప్పిన గుడ్డు కథేరా ఇది కూడా. పల్లెటూరు వారు అంటే తమాషా అనుకుంటున్నావా యదవన్నర యదవ. యటకారంతో సంపెత్తారు జాగ్రత్త."
😁 😁 😁 😁 😁

Wednesday, March 15, 2017

భర్త

కాల్చబడిన' బంగారాన్ని- ఆభరణం అంటారు
'కొట్టబడిన' రాగిని- తీగ అంటారు
'అణచబడిన' కార్బన్ని- డైమండ్ అంటారు
'కాల్చబడిన,కొట్టబడిన,అణచబడిన మగవాణ్ణి
"భర్త"  అంటారు😜😜😜😜

Tuesday, March 14, 2017

లేటెస్ట్ ఫాషన్

అమ్మ:- నెత్తిన జుట్టు అంతలా పెరిగింది ట్రిమ్ చేయించుకోరా...
కుమారుడు:- ఇది లేటెస్ట్ ఫాషన్ మా
అమ్మ:- ఇవ్వాళ నీ చెల్లి పెళ్లిచూపులుకి వచ్చిన అబ్బాయికి నువ్వు నచ్చావంటరా సచ్చినోడా
😜😂😂😂😂😂

Monday, March 13, 2017

వ్యాపారం

భార్య : ఏమండీ ? పక్కింటాయన  వాళ్ళ ఆవిడని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడంటా !                       భర్త : ఆయనది పూల వ్యాపారమే...నాది కారం పొడి వ్యాపారం...తీసుకు రమ్మంటావా ?

Thursday, March 9, 2017

లెక్క

పదివేలు-పాతికవేలు పోసి కొనే టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, ఓవెన్, వాషింగ్ మిషన్ లను అంత జాగ్రత్తగా చూసుకుంటారు...? పిల్లల్ని కూడా హ్యాండిల్ చేయనివ్వరు....
అలాంటిది,
లక్షలు పెట్టి కొన్న భర్తను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి...?
డబ్బంటే లెక్క లేదు ఆడవాళ్ళకు
😜

Tuesday, March 7, 2017

ఆత్మహత్య

భార్య :  ఎక్కడికి వెళ్తున్నారు?’

భర్త : ఆత్మహత్య చేసుకోడానికి.

భార్య :  ఒక సంచీ కూడా పట్టుకెళ్ళకూడదూ?

భర్త :  అదెందుకు?




భార్య : ఒకవేళ మీ నిర్ణయం మార్చుకుంటే వచ్చేప్పుడు ఒక కేజీ టమేటాలూ,అరకేజీ చింతపండూ తెస్తారని.

తోడల్లుడు

కొడుకు :  తోడల్లుడు అంటే  ఎవరు  నాన్న  ?
తండ్రి :  ఒకే   company వల్ల  మోసపోయిన   ఇద్దరు  కస్టమర్లు

Saturday, March 4, 2017

స్మార్ట్ ఫోన్

అప్పారావు దీనంగా ఇంటి బయట కూర్చున్నాడు ....😔😔😔😔
ఆ దారిన పోతున్న సుబ్బారావు: ఏరా అప్పారావు డల్ గా ఉన్నావ్
అప్పారావు: నా కొడుకు 3 నెలల నుండి స్కూల్ కి వెల్లట్లేదురా...
సుబ్బారావు: రెండు తగిలించకపోయావా!!!
అప్పారావు: ఎంత కొట్టినా వేస్ట్ రా.. తప్పు నా కొడుకుది కాదు
సుబ్బారావు: మరి ఎవరిదీ???? 😳😳😳😳అసలు ఎం జరిగింది
అప్పారావు: మూడు నెలల క్రితం మావాడు తప్పిపోయాడురా.. స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని వెంటనే ఫేసుబుక్, వాట్సాప్ లో నా కొడుకు మిస్సింగ్ అని  వాడి ఫోటో, మా ఇంటి అడ్రెస్ పెట్టాను ...
సుబ్బారావు: దొరికాడా😳😳😳😳
అప్పారావు: అరగంట లో దొరికిపోయాడు
సుబ్బారావు: 😊😊 మరింకేం హ్యాపీయే కదా..
అప్పారావు: ఏం హ్యాపీ రా బాబూ.... నేను పంపిన మిస్సింగ్ మెస్సేజ్ ఇంకా అందరు ఫార్వర్డ్ చేసుకుంటూనే ఉన్నారు ... ఆ రోజు నుండి నా కొడుకు స్కూల్ కి బయల్దేరి వెళ్లిన అరగంటలోపే ఎవడో ఒక దరిద్రుడు వాడిని ఇంట్లో పడేసి పోతున్నాడు ..😩😩😩😩😩😩

కన్నడవాసి

ఒక కన్నడవాసి హైదరాబాద్
హోటల్ మినర్వా కి వచ్చాడు
"ఏం గావాలె సర్ "
" అన్నం మాడు .పప్పు మాడు
..కర్రీ మాడు సాంబారు మాడు "
పది నిముషాల తర్వాత
" ఎన్న ఇది ..నల్లగా ఉంది "
" అన్నీ మాడ్చా సర్ ..సాంబార్
ఒక్కటి ఎంత జేశ్నా మాడలేదు "😆😆😆😆😆
(Note: కన్నడంలో మాడు అనగా చెయ్యి అని అర్ధం )

నువ్వన్నదే

కొడుకుః ‘’ నాన్నా, రేపు నువ్వు మా స్కూలుకొచ్చి మా క్లాస్ టీచరుని కలవాలి.’’
తండ్రిః ‘’ ఏం , ఏమైంది?’’
కొడుకుః ‘’ఈ రోజు నన్ను 9x6 ఎంత అనడిగారు.నేను 54 అని చెప్పాను.మళ్ళీ నన్నే 6 x 9 ఎంత అనడిగారు.’’
తండ్రిః ‘’ ఒరే పనికిమాలిన వెధవా, అదీ అంతేగదరా?’’
కొడుకుః ‘’ ఔను నాన్నా.నేనూ నువ్వన్నదే అన్నాను.’’😂😂😂😂

Friday, March 3, 2017

హరి ఓం

అమెరికాలో ఉన్న ఒక భారతీయుడికి హార్ట్ ఎటేక్ వచ్చి, అంబులెన్స్ లో తీసుకెళ్ళ్తున్నారు. భక్తుడైన అతను దారిలో ‘’ హరి ఓం, హరి ఓం’’ అని హరి నామ స్మరణ చేస్తున్నాడు.అంబులెన్స్ ఇంటికి వచ్చేసరికి ,ఆ వ్యక్తి భార్య గుండెలు బాదుకుంటూ అంబులెన్స్ హాస్పటలు కి కాకుండా ఇంటికెందుకు తీసుకొచ్చారు అని అంబులెన్స్ సిబ్బంది మీద మండిపడింది.దాని కి వాళ్ళు’’ , “ఏం చెయ్యం మేడమ్, దారి పొడుగుతా మీ ఆయన ‘Hurry home, Hurry home, Hurry home అంటూనే ఉన్నాడు!'”😅😅😅😅😅

Thursday, March 2, 2017

ఇంగ్లిష్

భర్త : ఏమైందోయ్ మన ఇంటి ముందు ఇంత మంది జనం ఉన్నారు🤔🤔🤔
భార్య : ఏంలే దం డి మన   అల్లు డు  ముంబై  నుండి  వస్తున్నాడు అని ఎదురింటి పిన్ని కి వినిపించేలా చెప్పాను  అంతే 😒😒😒😒
భర్త : ఆలా చెప్తే ఇంత మంది ఎందుకు వస్తారు. ఏమన్నావో కాస్త వివరంగా చెప్పు😣😣😣

భార్య :  ఎంలేదండీ ఈ మధ్య నేను  ఇంగ్లిష్ నేర్చుకుంటున్నాను కదా  అదే ఇంగ్లిష్ లో చెప్పా.                       
భర్త: అదేంటో ఎడువు 😖😖😖
భార్య : "టుడే సన్నీ లియోన్ ఈస్ కమ్మింగ్ టు మై హోం ఫ్రామ్ ముంబై"😚😚😚
భర్త: నీ ఇంగ్లీష్ తగలెయ్య 😫😫😫
అది సన్నీలియోన్ కాదే ... సన్ ఇన్ లా'...
😍😍😍😜😜😜

బెగ్గర్

😜😎😄😝😁
  సుబ్బారావు బస్ కోసం వెయిట్ చేస్తూ బస్టాండ్లో నిలుచున్నాడు.
ఇంతలో ఓ బెగ్గర్ వచ్చి బిచ్చం అడిగాడు.
టెన్ రుపీస్ ప్లీజ్ ఫుడ్డు లేదు.
బీరు కొడతావా?
అడిగాడు సుబ్బారావు.
బిత్తర పోయిన బిచ్చగాడు లేదు సార్ నేను తాగను అన్నాడు.
ఓ కే సిగరెట్ తీసి దమ్ము కొట్టు అన్నాడు సుబ్బారావు.
అలవాటు లేదు సార్ చెప్పాడు బెగ్గర్.
పోనీ పేకాడదాం వస్తావా నీ పెట్టుబడి కూడా నేనే పెడతాను.
  నో నాకసలు పేకాడ్డమే రాదు.
సరే నీకో గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తాను రా! అన్నాడు సుబ్బారావు.
ఛీ ..  నా కలాంటివి గిట్టవు.
ఐ లవ్ మై వైఫ్ అన్నాడు.
సరే నువ్ మా ఇంటికి రావాలి అన్నాడు సుబ్బారావు.
ఎందుకు? ఆశ్చర్యంతో అడిగాడు బెగ్గర్.
నిన్ను మా ఆవిడకు చూపెట్టాలి.
మందు కొట్టనోడు..
సిగరెట్ తాగకుండా..
పేకాట ఆడకుండా..
గర్ల్ ఫ్రెండ్ లేకుండా..
కేవలం భార్యని మాత్రమే ప్రేమించే వాడి గతి ఏమవుతుందో నా పెళ్లానికి చూపెట్టాలి.!!
ప్లీజ్....!
😜😎😁😄😜😛😂😇😲😋😊😃

Wednesday, March 1, 2017

కూరగాయల emotions

దోసకాయకి ఆహం ఎక్కువ.. ఎందుకంటే తాను భూలోకవాసినని..

పోట్లకాయకి పోగరు ఎక్కువ.. ఎందుకంటే ఐదడుగులు ఎత్తు అని..

చిక్కుడుకు చికాకు ఎక్కువ.. ఎందుకంటే తనని గోరుతో గోకుతారని..

కందకి... వెటకారం ఎక్కువ.. ఎందుకంటే తనకి లేని దురద కత్తిపీటకి వచ్చిందని.

వంకాయ కి గర్వమెక్కువ .. కూరగాయలన్నీంటికీ తనే రారాజునని.. 

బెండకాయ ఆనందమెక్కువ .. తనను మగువల చేతివేళ్ళతో పోలుస్తారని

దొండకాయకా ఆందోళనెక్కువ .. కాకి ఎక్కడ తనను ముక్కున పెట్టుకుంటదోనని..

కాకరకాయకి శాంతమెక్కువ .. ఎవరూ ఇష్టపడకపోయినా అందరికీ ఆరోగ్యానిస్తుందిగా ..

బంగాళాదుంపకి సహనమెక్కువ ... కూరలకైనా , చిరుతిండ్లకైనా , పూరీకైనా , పానీపూరీకైనా అన్నీంటికీ తానే దిక్కు మరి..

గుమ్మడి కాయకి గాంభీర్యమెక్కువ కూరగాయలన్నీంటినీ కలిపినా కూడా తన బరువుకు తూగలేవుగా ..

ఉల్లిపాయకి టెక్కు ఎక్కున ..తాను లేనిదే  ఆ కూరగాయలకి రుచి ఎక్కడిది ..

మిర్చికి కోపమెక్కువ ..ముందు నోటినీ , తరువాత కడుపుని మండించేస్తుంది.

 కరివేపాకు కి మిడిసిపాటు ఎక్కువ. తాను కొంచెమైనా కూర సువాసనకి తానేఅని ...

సిటీ అమ్మాయి

సిటీ లో పుట్టి పెరిగిన అమ్మాయి కి ఒక పల్లెటూరి అబ్బాయ్ తో పెళ్ళి జరిగింది.
అత్తారింటికి వెళ్ళిన మొదటి రోజు గేదెకి గడ్డి వేయమని పంపింది అత్త గారు. గేదె నోట్లో నురగ చూసి వెనక్కి వచ్చేసింది.
అత్త     : ఏమయింది అమ్మా ? గడ్డి వేయలేదే ?
కోడలు : అది ఇంకా బ్రష్ చేసుకుంటుంది అత్తయ్యా..!!
😜😜😝😝
Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version