Wednesday, March 1, 2017

కూరగాయల emotions

దోసకాయకి ఆహం ఎక్కువ.. ఎందుకంటే తాను భూలోకవాసినని..

పోట్లకాయకి పోగరు ఎక్కువ.. ఎందుకంటే ఐదడుగులు ఎత్తు అని..

చిక్కుడుకు చికాకు ఎక్కువ.. ఎందుకంటే తనని గోరుతో గోకుతారని..

కందకి... వెటకారం ఎక్కువ.. ఎందుకంటే తనకి లేని దురద కత్తిపీటకి వచ్చిందని.

వంకాయ కి గర్వమెక్కువ .. కూరగాయలన్నీంటికీ తనే రారాజునని.. 

బెండకాయ ఆనందమెక్కువ .. తనను మగువల చేతివేళ్ళతో పోలుస్తారని

దొండకాయకా ఆందోళనెక్కువ .. కాకి ఎక్కడ తనను ముక్కున పెట్టుకుంటదోనని..

కాకరకాయకి శాంతమెక్కువ .. ఎవరూ ఇష్టపడకపోయినా అందరికీ ఆరోగ్యానిస్తుందిగా ..

బంగాళాదుంపకి సహనమెక్కువ ... కూరలకైనా , చిరుతిండ్లకైనా , పూరీకైనా , పానీపూరీకైనా అన్నీంటికీ తానే దిక్కు మరి..

గుమ్మడి కాయకి గాంభీర్యమెక్కువ కూరగాయలన్నీంటినీ కలిపినా కూడా తన బరువుకు తూగలేవుగా ..

ఉల్లిపాయకి టెక్కు ఎక్కున ..తాను లేనిదే  ఆ కూరగాయలకి రుచి ఎక్కడిది ..

మిర్చికి కోపమెక్కువ ..ముందు నోటినీ , తరువాత కడుపుని మండించేస్తుంది.

 కరివేపాకు కి మిడిసిపాటు ఎక్కువ. తాను కొంచెమైనా కూర సువాసనకి తానేఅని ...

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version