ఊర్లో ఉండేటపుడు టౌను గురించి భలే చెప్పేవాళ్ళు. సినిమా హాళ్ళని, కార్లని బస్సులని, పార్క్ లని, ఇలా సెప్తుంటే ఇని నేను కూడా బుజాన తుండుగుడ్డేసుకొని బయలుదేరా.కానీ పల్లెటూరోళ్ళని మోసం చేస్తారని కూడా బాగా చెప్పేటోళ్ళు.
సిటీ అంతా తిరిగి తిరిగి సూసి కాళ్ళ నొప్పులొచ్చాయి. ఆకలేసి టిఫెన్ బండి దగ్గరకెళ్ళా.
"అన్నా ఇడ్లీ ఉందా"
" లేదు"
"దోశ ఉందా అన్నా"
"లేదయ్యా"
"సరే, ఆకలవుతుంది యేది ఉంటే అదివ్వు"
"గుడ్డుంది. ఆమ్లేట్ వేసివ్వమంటావా"
"సరే కానీయవయ్యా, నాకు అదే రాసుందేమో ప్రాణాలు పోయేలా ఉన్నాయ్ తినకపోతే"
అమ్లేట్ వేసిచ్చాడు. తిని చేయి కడుకున్నా.
"అన్నా థాంక్స్ అన్నా ఆమ్లేట్ ఎంత?"
" అరవై రూపాయలన్నా"
"అన్నోయ్ యవ్వారం ఎట్టుంది. నా గురించి నీకు తెలిసినట్టు లేదు. కరెక్టుగా చెప్పు"
" ఒరేయ్ తింగరోడా, గుడ్డు పగలగొట్టి ఆమ్లేట్ యేసిచ్చానుగా నీకోసం"
" అవును నిజమే"
"మరి. అదే గుడ్డు పగలగొట్టకుండా అలాగే ఉంచి ఉంటే తర్వాత పుంజో పెట్టో అయ్యేది. దాన్ని సికెన్ సేత్తే నూటా అరవై వస్తాయ్. పల్లెటూరి నుంచి వచ్చినోడివని నిన్ను అరవై ఇమ్మంటే దీర్ఘాలు తీస్తున్నావేంట్రా, ఇవ్వు అరవై రూపాయలు."
"కరెష్టే అన్నో ..సికెన్ చేసుంటే ఎక్కువ డబ్బులొచ్చేయి నీకు. నీ డబ్బులు నాకెందుకులే అన్నా ఇచ్చేస్తా"
(హోటల్ వాడి మనసులో ఆనందం. అప్పనంగా అరవై దొబ్బుతున్నాడని)
" ఇదిగో. మిగతా చిల్లర ఇవ్వు"
"యేంటిది. సింత పిక్క ఇస్తే సిల్లర ఇవ్వాలా "
" ఈ చింత పిక్క నాటితే చెట్టయి ప్రతీ సంవత్సరం చింతపండు ఇస్తది అది అమ్మితే పెతీ యేడాది మూడు వేలొస్తయి. నేను అంత అడగకుండా ఒక యేడాది పంట డబ్బు ఇయ్యమంటున్నా. అంతే మూడు వేలల్లో అరవై తీసుకొని మిగతా సిల్లర ఇయ్యి. నేను పోవాల"
"ఇదన్నాయం"
"అన్నాయం యేందిరా అన్నాయం నువ్ సెప్పిన గుడ్డు కథేరా ఇది కూడా. పల్లెటూరు వారు అంటే తమాషా అనుకుంటున్నావా యదవన్నర యదవ. యటకారంతో సంపెత్తారు జాగ్రత్త."
😁 😁 😁 😁 😁

No comments:
Post a Comment