బిజినెస్స్ వొమన్ !!
నేనూ మా అత్తగారు బజారుకెళ్లాము, అరటి పళ్లు కొందామని.
"ఎంత బాబూ అరటి పండు ?" అన్నాను.
"రూపాయి కి ఒకటి" అన్నాడు. మా అత్తగారు వుండగా, బేరం చెయ్యకుండా కొంటే అంతే సంగతులు.
"60 పైసల కి ఇస్తావా?" అన్నాను, మొహమాట పడుతూనే !!
"60 పైసలకి తొక్క వస్తుంది" అన్నాడు చికాకుగా
" ఇదిగో అబ్బాయ్ ...ఈ 40 పైసలు తీసుకుని మాకు పండు ఇవ్వు...తొక్క నువ్వే వుంచుకో !!" అంది మా అత్తగారు!! నేను నోరెళ్ళబెడిితిని..
No comments:
Post a Comment