Wednesday, May 31, 2017

తాగుబోతు

🙄
ఓ తాగుబోతు ఉదయం నిద్ర లేవగానే భార్యతో  గతరాత్రి జరిగిన గొడవ  గుర్తుకొచ్చి బాధ ఫీల్ అయ్యాడు. తాగి పడేసిన బీర్ బాటీల్స్ ని చూసి అసలు గొడవ అంతటికీ ఇవే కదా కారణం అని -
-ఆ బాటిల్స్ అన్నీటినీ బయటికి తీసుకొచ్చి, ఒకొక్క బాటిల్ ని పగలగొట్టాడు.

-మొదటి బాటిల్‌ని‌ పగలగొట్టి " నా భార్యతో గొడవ పడడానికి కారణం నువ్వే "

-రెండో బాటిల్‌ని‌ పగలగొట్టి " నా పిల్లలకి నేను దూరం కావడానికి కారణం నువ్వే"

-మూడో బాటిల్‌ని‌ పగలగొట్టి "నేను ఇంగితం  మర్చిపోవడానికి కారణం నువ్వే"

-నాలుగో బాటిల్ చేతిలోకి తీసుకొని గమనించాడు, ఆ బాటిల్ ఇంకా ఫుల్లుగా వుంది, సీల్‌ కూడా తీయలేదు. "నువ్వు పక్కనుండు, రాత్రి జరిగిన గోడవకీ నీకూ కనెక్షన్ లేదు"                          *స్క్*😊

Tuesday, May 30, 2017

కిక్

భర్తతో గొడవ పడిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆరునెలలైనా ఆమె తిరిగి రాలేదు.
దాంతో భర్త మళ్లీమళ్లీ పోన్ చేస్తున్నాడు.
భర్త: మా ఆవిడ...! ! ! !??
అత్తమ్మ: కోపంగా😡 మా అమ్మాయి నీ మీద కోపంగా ఉంది. నీ ఇంటికి రానంటోంది.👩
భర్త: అవ్ నా…🤔
అత్తమ్మ: అయినా రాదు రాదు అని ఎన్నిసార్లు చెప్పినా మళ్లీ మళ్లీ ఎందుకు ఫోన్ చేస్తున్నావ్👋👊
భర్త: అదేంటో.. ఆ మాటలు వింటే ఆనందం😆😆 కలుగుతోంది.. మందు తాగకుండానే.. మాంచి కిక్ వస్తోంది. అందుకే మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తున్నా…పదె పదె వినటం కోసం!!  అత్తమ్మ:😬😬😷 😜🤣😂👻👻

ధర్నా

పాల  వాళ్ళు ధర్నా చేస్తే పాలు రోడ్ మీద పార పోస్తారు ..

కూరగాయల వాళ్ళు ధర్నా చేస్తే కూరగాయలు  అన్ని  తెచ్చి రోడ్ మీద పడేస్తారు

ఈ బ్యాంక్  వాళ్ళకు ఎప్పుడూ బుద్ది వస్తుందో  .. ఉట్టి ధర్నాలు మత్రమే చేస్తారు......😜

Monday, May 29, 2017

మందు బాటిల్

👴🏼 మందుబాటిల్ కొనుక్కుని బైక్ ఎక్కబోతుండగా అనుమానం వాచ్చింది .... ఒకవేళ బైక్ మీదినుండి పడిపోతే బాటిల్ పగులుతుందేమోనని ''

అందుకని బైక్ స్టాండ్ వేసి ఆ మందుబాటిల్ అక్కడే ముగించి ఇంటికి బయలుదేరాడు .

మద్యలో బైక్ మీదినుంచి పడి దెబ్బలు తగిలి హాస్పటల్ లో చేరి మంచంమీద పడుకొని ఆలోచిస్తున్నాడిలా....
*అక్కడేమందుకొట్టటం మంచిదైంది లేకపోతే బాటిల్ పగిలి పోయేది* 😱😱

Sunday, May 28, 2017

నెమలి

ఉపాద్యాయుడు: అరే రాజేష్ నెమలిని ఇంగ్లీషులో ఏమంటారు.
రాజేష్: తెలియదు సార్.
ఉపాద్యాయుడు: ఇంత చిన్న విషయం తెలియదా, ఉండు నీ సంగతి చెప్తా అని జుట్టు పీకసాగాడు.
రాజేష్: పీకక్ సార్ పీకక్ సార్ అని అరిచాడు
అప్పుడు ఉపాద్యాయుడు: Peacock అనుకోని వెరీ గుడ్ అని జుత్తు వదిలేసాడు

Friday, May 26, 2017

వరం

భగవంతుడు : నీ ప్రార్ధనలు నన్ను కదిలించేసాయ్. నీకు ఏంకావాలో కోరుకో నాయనా!

భక్తుడు : అమెరికా - ఇండియా కి మధ్య _ఒక రోడ్ వెయ్యాలి

భగవంతుడు : అది అసాధ్యం. వివిధ దేశాల పైనుంచి సముద్రాల మీదుగా .... రోడ్ వెయ్యటం సాధ్యం కాదు.
కనుక ఎంకేదైనా సరే కోరుకో.

భక్తుడు : అయితే దయచేసి నేనేం చెప్పినా నా మాటే నా భార్య వినేటట్లు చెయ్యు స్వామీ.

భగవంతుడు : ఇంతకీ సింగిల్ రోడ్డూ కావాలా? డబుల్ రోడ్డు కావాలా?

😂😂😂😂😂

CCE విధానం

‘‘పార్వతీదేవి శివుడిని భర్తగా ఎందుకు ఎంచుకుందో నాలుగు కారణాలు రాయండి’’ అని CCE విధానంలో ప్రశ్న అడిగారు.
ఒక విద్యార్థి ఇలా రాశాడు.
‘‘శివుడు జింక చర్మం ధరిస్తాడు కాబట్టి పార్వతికి బట్టలుతికే పని ఉండదు.
తలపై గంగ ఉంటుంది కాబట్టి బిందె పట్టుకుని నీళ్లకు బయటకి వెళ్లనక్కర్లేదు.
చంద్రవంక ఉంటుంది కాబట్టి కరెంటు ప్రాబ్లమ్‌ లేదు.
కందమూలాలు తింటాడు కాబట్టి వంట వండే అవసరం అసలే ఉండదు ..
ఈ కారణముల చేత పార్వతి శివుడిని వరించెను’’. 😜😜
*CCE నా మజాకా...*

Tuesday, May 23, 2017

తర్కం

😊😊😁భార్య ఉద్దేశ్యం---భర్త తర్కం(logic)

భార్య : మార్కెట్ కు వెళ్ళి ఒక పాకెట్ పాలు తీసుకుని రండి..ఒక వేళ అక్కడ గుడ్లు ఉన్నట్లైతే, 6 తీసుకురండి.

కొద్ది సేపటికి భర్త 6 ప్యాకెట్ల పాలతో ఇంటికి వచ్చాడు.

భార్య : ఏందుకు 6 పాకెట్ల పాలు తెచ్చావు.

భర్త : అక్కడ గుడ్లు ఉన్నాయ్...😜😜

(నాకు తెలుసు మీరు దీన్ని మళ్ళీ చదువుతారని..)

పెళ్ళి తర్వాత సమస్యలు ఇలానే మొదలవుతాయ్...😜😜😜

Tuesday, May 16, 2017

చీర

రాజు : నిన్న చాలా బాధగా ఉన్నావు, కారణం ఏంటి?
రాము : నిన్న మా ఆవిడ 5000 పెట్టి చీర కొనిపించింది,
రాజు : మరి ఇవాళ ఇంత హ్యాపీగా ఉన్నావే?
రాము : ఇవాళ ఆ చీర కట్టుకుని మీ ఆవిడను కలవడానికి వెళ్లింది😂
ఎక్స్టెన్షన్ -

రాజు: అహ్హహ్హహ్హ ...
రాము: ఏంటలా నవ్వుతున్నావ్?
రాజు: పిచ్చివాడా-
మా ఆవిడ నిన్న కొన్న చీర చూసే మీ ఆవిడ ఇవాళ ఆ చీర కొన్నది.
: ఆ -నిజంగానా ?
రా: అంతేకాదు -ఇవాళ మా ఆవిడ పాతిక వేలు పెట్టి ఇంకో చీర కొంది .అది ఇప్పుడు మీ ఆవిడ చూస్తుంది.
రా : ఆ?

Friday, May 12, 2017

తేడా

"సన్యాసికి సంసారికి తేడా ఏంటో తెలుసా?" అడిగాడు రాంబాబు.
"పులి తోలుపై నిద్రించేవాడు సన్యాసి- పులితోనే నిద్రించేవాడు సంసారి..!" అసలు విషయం చెప్పాడు సుందర్.

Thursday, May 11, 2017

బాహుబలి -2

1. అమరేంద్ర బాహుబలి తండ్రి ఎలా ఎందుకు చనిపోయాడు? దాని గురించిన వివరణ మాకు కావాలి.
2. కట్టప్ప కుటుంబం ఎందుకు మాహిష్మతి సింహాసానికి కట్టుబానిసలుగా మారారు? మాకు తెలియాలి.
3. భల్లాల దేవుడి భార్య ఎవరు? రుద్ర ఎలా పుట్టాడు? దీనిపై వివరణ కావాలి.
4. తమన్నా ప్రతీకారం తీర్చుకోడానికి ఉన్న బలమైన కారణం ఏమిటి?
5. ఊ అంటే ఆ అంటే కాలకేయులు వస్తూంటారు ఎందుకు? మొదటి పార్టులో మిగిలిన ముక్కలు తగిలించే ప్రయత్నమా?
6. అవంతీ మహేంద్ర బాహుబలిల వివాహము మేము చూడాలనుకుంటున్నాము.
7. శివగామి కుంపటి నెత్తిన పెట్టుకుని వెడుతూండగా ఏనుగులు ఓవర్ యాక్షన్ చేసిన సందర్భంలో రధాలున్న గదితో అమరేంద్ర బాహుబలి ఏం చేస్తున్నాడు? అది కూడా చూపించాలి.
8. ఏనుగులు రియాక్షన్ వెనుక ఉన్న కారణం ఏమిటి?
9. దేవసేన ఏరిన పుల్లలకు మూలమేమిటి? అవి ఎక్కడ నుంచీ వచ్చాయి? ఆ ప్రాంతంలో పెద్దగా చెట్లు ఉన్నట్టు కనిపించదు … దానిపై కూడా వివరణాత్మకంగా చెప్పాలి.
10. ఇలా … కొన్ని వేల సందేహాలు ఉన్నాయి కనుక వీటన్నిటినీ తీర్చడానికి తప్పనిసరిగా రాజమౌళి బాహుబలి సినిమా కనీసం వంద భాగాలైనా తీయాల్సి ఉంటుంది. ఒక వేళ రాజమౌళి వంద చాలవనుకుంటే వెయ్యి అయినా తీసుకోవాలి.  దీనికి ముందుగా హామీ ఇవ్వాలి. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి.
11. రాజమౌళి ఇకపై బాహుబలి సినిమా విషయమై ఉన్న అన్ని సందేహాలు నివృత్తి అయ్యేవరకు మరో సినిమా చేయకూడదు. అలా తీయకుండా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
12. తప్పుచేశావు శివగామీ అని కట్టప్ప అంత చొరవగా అనగలగడానికి కారణం ఏమిటి?
13. బాహుబలి సినిమా సందేహాలు నివృత్తి చేయకుండా ఎన్నికలు పెడితే మోడీనైనా చంద్రబాబునైనా కెసీఆరునైనా సరే ఓడిస్తాం … బాహుబలి సందేహాలు తీరే వరకు ఈ దేశంలో ఎన్నికలు రద్దు చేసేలా రాజ్యాంగ సవరణ జరిపించాలి. అది యాభై ఏళ్లు పట్టొచ్చు … వందేళ్లు పట్టొచ్చు…
14. అసలు సుబ్రహ్మణ్య స్వామి ఈ విషయమై ఇంత వరకు పిల్ ఎందుకు వేయలేదు?

Wednesday, May 10, 2017

రియాల్టీ తిట్లు

*పైలెట్ భార్య :* నా దగ్గర మరీ అంతలా ఎగరకండి.. 
*డాక్టర్ భార్య :* ఎవరి రోగం ఎలా కుదర్చాలో నాకూ తెలుసు..
*టీచర్ భార్య :* నాకేం క్లాసులు పీకక్కర్లేదు..
*జడ్జి భార్య :* ఇది చెప్పడానికి వాయిదాలెందుకు,
నేను చెప్పేదే ఫైనల్..
*న్యాయవాది భార్య :* ఆధారాలు నా చేతికి వచ్చాక మీకుంటాది..
*యాక్టర్ భార్య :* ఈ మాత్రం  యాక్షన్ మాకూ వచ్చు..
*ఇంజనీర్ భార్య :* ప్లాన్లు వేయడం మాకూ తెలుసు..
*సాఫ్ట్ వేర్ ఉద్యోగి భార్య :* మీ ఆఫీస్ లో ఉన్న ఏంటి వైరస్ కి ఏ సాఫ్ట్ వేర్ వాడాలో నాకు బాగా తెలుసు..
*పొలిటీషియన్ భార్య :* మీ అధిక ప్రసంగం ఆపకపోతే, మా అమ్మ నాన్నలతో అత్యవసర సమావేశం పెట్టి మీ భర్త పదవికి ఉద్వాసన పలుకుతా..
*వ్యాపారి భార్య :* మీ పత్తేపారం బయట చూపించండి, నాకాడ కాదు..
*జర్నలిస్ట్ భార్య :* మీ కవరేజులు మీ ఛానెల్ లో చూపించుకోండి, ఎక్స్ ట్రాలు చేస్తే ఇంట్లో మీ లైవ్ కవరేజ్ ని నేను వీధిలో చూపించాల్సి ఉంటాది..

Tuesday, May 9, 2017

పచ్చడి

👍అసలు మగాడంటేనే,' మిర్చి ' లాగా ఘాటుగా, కారంగా ఉండాలి గురువుగారూ..

శిష్య: నిజమే కానీ, ఎంత ఘాటుగా, కారంగా ఉన్న మిర్చినయినా ఈ ఆడాళ్ళు ' పచ్చడి ' చేయకుండా ఉండరు కద రా 😒
😄😄😝😝😂😂

Monday, May 8, 2017

హోటల్

ఈరోజు మధ్యాహ్నం
భార్య భర్తలిద్దరూ
భోజనం చేయగానే,
భర్త తినడం అయిపోయాక 
నల్ల దెగ్గరికి వెళ్లి
ప్లేట్ కడుగుతుండగా....
.
#భార్య😡 :: నా ఇజ్జత్ తియ్యకు నువ్వు🔥
మనమున్నది ఇంట్లో కాదు హోటల్ లో😡
😂😂😂😂😂😂🅾

Sunday, May 7, 2017

పెళ్ళిచూపులు

రఘు పెళ్ళిచూపులు కు వెళ్ళాడు. అందరి ముందు  అమ్మాయిని ఎంత వరకు చదివావు అని అడిగాడు.
అమ్మాయి: TF IAS.
రఘుకి అర్థం కాలేదు, మళ్ళీ అడిగితే ఇది కూడా తెలియదా అని ఎక్కడ హేళన చేస్తారో అని మిన్నకుండీ పోయాడు. సంబంధం ఖాయం చేసుకొని ఓ మంచి ముహూర్తాన పెళ్ళి అయింది. తర్వాత ఒక రోజు  రఘు అమ్మాయి తో: TF IAS అంటే ఏమిటి?
అమ్మాయి: టెన్త్ ఫేయిల్  ఇన్ ఆల్ సబ్జక్ట్స్.

గర్ల్ ఫ్రెండ్

ఒక సారి నేను రెస్టారెంట్ కి వెళ్ళాను.
అది ఫుల్ అయిపోయి వుంది.
ఎక్కడ చూసినా జంటలు కూర్చుని ఉన్నారు.
నేను కూర్చోడానికి ప్లేస్ లేదు.
నేను నా ఫ్రెండ్ కి ఫోన్ చేసి గట్టిగా......
*"అరేయ్ మామ నీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ ఎవడి తోనో ఉంది రా"* ........
అన్నా ..అంతే వన్ మినిట్  లో 10 మంది అమ్మాయిలు జంప్.
😝😝😝😝😝😝😝😝

Wednesday, May 3, 2017

ఏకలవ్యుడు

*Teacher:-* "ఏకలవ్యుడికి, మీకు తేడా ఏంట్రా ?"
*Student:-* "మేము వేలుపోసి చదువుకుంటున్నాం."
"ఏకలవ్యుడు వేలుకోసి చదువుకున్నాడు...."

కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు

ఒక వ్యక్తి తన  కారు ని ఇంటిముందు భద్రంగా పెట్టుకొని పడుకున్నాడు.తెల్లవారు ఝామున చూస్తే కారు లేదు..లబోదిబో మన్నాడు...వెదికేడు..Police complaint ఇచ్చేడు.
*****
రెండు రోజుల తర్వాత తన కారు యధాస్థానానం లో భద్రంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు.
కారు డోరు తెరిచి చూసేడు..అందులో ఒక లేఖ ఉంది.
*సార్* నన్ను క్షమించండి. మీ కారు మీకు చెప్పకుండా తీసుకెళ్ళి నందుకు..రెండు రోజుల క్రిందట మా అమ్మ కి తీవ్ర అనారోగ్యం చేసింది ..ఆ సమయంలో ఎక్కడా ఆటోకానీ cab కానీ దొరకలేదు ..గత్యంతరము లేక మీ కారు తీసుకుని వెళ్ళాల్సి వచ్చింది.
ఇప్పుడు మా అమ్మ క్షేమంగా ఉంది.
మీ కారు భద్రంగా మీకు ఇస్తున్నాను..ఇందులో ముందు ఎంత పెట్రోలు ఉండేదో అంతా ఉంది..
కానీ మిమ్మల్ని అడగకుండా కారు తీస్కెళ్ళినందుకు ప్రత్యామ్నాయంగా ఈరోజు  Second Show కోసం
*బాహుబలి* 2 సినిమా టిక్కెట్లు
5 కార్లో పెట్టి ఉంచేను..
మీరు నా మీద ఆగ్రహించకుండా..మీ కుటుంబం తో సినిమా చూసి ఆనందించి రండి..ఇది నా ప్రార్థన. 🙏🙏
...
మొత్తం ఉత్తరం చదివి..అర్ధం చేస్కుని...తన కారు భద్రంగావచ్చేసిందని ఆనందించి.
Police complaint వాపసు తీస్కున్నాడు..రాత్రి Second Show కి *బాహుబలి 2* సినిమాకి కుటుంబంతో వెళ్ళి వచ్చేడు.
...
ఇంటికొచ్చేసరికి ఇంటితాళం.బద్దలై ఉంది...పరుగున లోపలికి వెళ్ళిచూసేసరికి 25-30 లక్షల విలువైన బంగారం మిగిలిన ఆస్తులు మాయం అయాయి...
అక్కడ ఒక చీటీ లో ఇలా రాసి ఉంది...

*ఇప్పుడు అర్ధం అయిందా కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపేడో* అని..
😝😝😝😝😝😝😝😝😝😝
......

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version