Thursday, May 11, 2017

బాహుబలి -2

1. అమరేంద్ర బాహుబలి తండ్రి ఎలా ఎందుకు చనిపోయాడు? దాని గురించిన వివరణ మాకు కావాలి.
2. కట్టప్ప కుటుంబం ఎందుకు మాహిష్మతి సింహాసానికి కట్టుబానిసలుగా మారారు? మాకు తెలియాలి.
3. భల్లాల దేవుడి భార్య ఎవరు? రుద్ర ఎలా పుట్టాడు? దీనిపై వివరణ కావాలి.
4. తమన్నా ప్రతీకారం తీర్చుకోడానికి ఉన్న బలమైన కారణం ఏమిటి?
5. ఊ అంటే ఆ అంటే కాలకేయులు వస్తూంటారు ఎందుకు? మొదటి పార్టులో మిగిలిన ముక్కలు తగిలించే ప్రయత్నమా?
6. అవంతీ మహేంద్ర బాహుబలిల వివాహము మేము చూడాలనుకుంటున్నాము.
7. శివగామి కుంపటి నెత్తిన పెట్టుకుని వెడుతూండగా ఏనుగులు ఓవర్ యాక్షన్ చేసిన సందర్భంలో రధాలున్న గదితో అమరేంద్ర బాహుబలి ఏం చేస్తున్నాడు? అది కూడా చూపించాలి.
8. ఏనుగులు రియాక్షన్ వెనుక ఉన్న కారణం ఏమిటి?
9. దేవసేన ఏరిన పుల్లలకు మూలమేమిటి? అవి ఎక్కడ నుంచీ వచ్చాయి? ఆ ప్రాంతంలో పెద్దగా చెట్లు ఉన్నట్టు కనిపించదు … దానిపై కూడా వివరణాత్మకంగా చెప్పాలి.
10. ఇలా … కొన్ని వేల సందేహాలు ఉన్నాయి కనుక వీటన్నిటినీ తీర్చడానికి తప్పనిసరిగా రాజమౌళి బాహుబలి సినిమా కనీసం వంద భాగాలైనా తీయాల్సి ఉంటుంది. ఒక వేళ రాజమౌళి వంద చాలవనుకుంటే వెయ్యి అయినా తీసుకోవాలి.  దీనికి ముందుగా హామీ ఇవ్వాలి. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి.
11. రాజమౌళి ఇకపై బాహుబలి సినిమా విషయమై ఉన్న అన్ని సందేహాలు నివృత్తి అయ్యేవరకు మరో సినిమా చేయకూడదు. అలా తీయకుండా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
12. తప్పుచేశావు శివగామీ అని కట్టప్ప అంత చొరవగా అనగలగడానికి కారణం ఏమిటి?
13. బాహుబలి సినిమా సందేహాలు నివృత్తి చేయకుండా ఎన్నికలు పెడితే మోడీనైనా చంద్రబాబునైనా కెసీఆరునైనా సరే ఓడిస్తాం … బాహుబలి సందేహాలు తీరే వరకు ఈ దేశంలో ఎన్నికలు రద్దు చేసేలా రాజ్యాంగ సవరణ జరిపించాలి. అది యాభై ఏళ్లు పట్టొచ్చు … వందేళ్లు పట్టొచ్చు…
14. అసలు సుబ్రహ్మణ్య స్వామి ఈ విషయమై ఇంత వరకు పిల్ ఎందుకు వేయలేదు?

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version