ఒక వ్యక్తి తన కారు ని ఇంటిముందు భద్రంగా పెట్టుకొని పడుకున్నాడు.తెల్లవారు ఝామున చూస్తే కారు లేదు..లబోదిబో మన్నాడు...వెదికేడు..Police complaint ఇచ్చేడు.
*****
రెండు రోజుల తర్వాత తన కారు యధాస్థానానం లో భద్రంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు.
కారు డోరు తెరిచి చూసేడు..అందులో ఒక లేఖ ఉంది.
*సార్* నన్ను క్షమించండి. మీ కారు మీకు చెప్పకుండా తీసుకెళ్ళి నందుకు..రెండు రోజుల క్రిందట మా అమ్మ కి తీవ్ర అనారోగ్యం చేసింది ..ఆ సమయంలో ఎక్కడా ఆటోకానీ cab కానీ దొరకలేదు ..గత్యంతరము లేక మీ కారు తీసుకుని వెళ్ళాల్సి వచ్చింది.
ఇప్పుడు మా అమ్మ క్షేమంగా ఉంది.
మీ కారు భద్రంగా మీకు ఇస్తున్నాను..ఇందులో ముందు ఎంత పెట్రోలు ఉండేదో అంతా ఉంది..
కానీ మిమ్మల్ని అడగకుండా కారు తీస్కెళ్ళినందుకు ప్రత్యామ్నాయంగా ఈరోజు Second Show కోసం
*బాహుబలి* 2 సినిమా టిక్కెట్లు
5 కార్లో పెట్టి ఉంచేను..
మీరు నా మీద ఆగ్రహించకుండా..మీ కుటుంబం తో సినిమా చూసి ఆనందించి రండి..ఇది నా ప్రార్థన. 🙏🙏
...
మొత్తం ఉత్తరం చదివి..అర్ధం చేస్కుని...తన కారు భద్రంగావచ్చేసిందని ఆనందించి.
Police complaint వాపసు తీస్కున్నాడు..రాత్రి Second Show కి *బాహుబలి 2* సినిమాకి కుటుంబంతో వెళ్ళి వచ్చేడు.
...
ఇంటికొచ్చేసరికి ఇంటితాళం.బద్దలై ఉంది...పరుగున లోపలికి వెళ్ళిచూసేసరికి 25-30 లక్షల విలువైన బంగారం మిగిలిన ఆస్తులు మాయం అయాయి...
అక్కడ ఒక చీటీ లో ఇలా రాసి ఉంది...
*ఇప్పుడు అర్ధం అయిందా కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపేడో* అని..
😝😝😝😝😝😝😝😝😝😝
......
No comments:
Post a Comment