నేను నా జీవితంలో..
ఎన్ని సార్లు పడ్డానో లెక్కేలేదు..
ఎన్ని దెబ్బలు తగిలాయో కూడా లెక్కేలేదు.
ఈ ప్రపంచం నన్ను కనీసం..
పూచిక పుల్లలాగా కూడా చూడలేదు.
నన్నసలు లెక్కించలేదు.
పడిన ప్రతిసారీ పకపకా నవ్వింది..
వీడి పని అయిపోయిందని గేలి చేసింది..
అయినా..
ప్రతిసారీ నన్ను నేను నిభాయించుకుని..
అతికష్టం మీద నా అంతట నేనే లేచి..
నా కాళ్ళమీద నేను నిలబడ్డాను...
నిలదొక్కుకుని..
అందరూ విస్తుపోయేలా...
ఈ ప్రపంచం దిమ్మ తిరిగేలా..
చాలా స్పష్టంగా..
ఒకే ఒక్కమాట అనేవాడిని..
...
...
....
....
....
"వెయిటర్..!! ఇంకో పెగ్గు తీసుకురా..!!".. అని.
😇😇😇
No comments:
Post a Comment